Menu

Kaarthika Maasa Visistatha

Kartheeka-Maasam-Spl

కార్తిక మాసములో వచ్చే ప్రతి దినము అత్యంత పుణ్య ప్రదముగా చెప్పవచ్చు, ఈ మాసములో ప్రతిరోజూ తెల్ల వారుజామునే లేచి  తల మీదనుంచి స్నానం చేసి శుభ సంప్రదాయ కర దుస్తులు ధరించి  శివ దర్శనము కావించి ధూప దీప నైవేద్యములు సమర్పించి స్వామికి రుద్రాబిషేకం జరిపించిన చేసిన పాపాలుపోయి మోక్ష ప్రాప్తి కలుగును అని కార్తీక పురాణాది ఇతి హాసములు తెలుపుతున్నవి.
ఈ మాసమునందుః శ్రీ మహా విష్టువు  నదులలో, చెరువులలో, నూతి నీటి ల యందు నివాసము ఉండునని అందువల్ల ఈ ఈ ప్రాంతములలో స్నానము శుభము అని పెద్దల వచనము.
పాడ్యమి :- కార్తీక వ్రతం , విదియ :- భగినీ హస్త భోజనం , తదియ :- అమ్మవారి పూజ, చవితి :- నాగులచవితి , పంచమి :-  జ్ఞాన పంచమి నాగ పంచమి,  షష్టి :-  సుభ్రమణ్య ప్రీతిగా బ్రాహ్మణ బ్రహ్మచారి పూజ, సప్తమి :- సూర్యుని ప్రీతిగా  వస్త్ర దానం గోధుమ దానం, అష్టమి :- గోమాత పూజ  నవమి :- త్రిరాత్ర వ్రతం, దశమి :- యాజ్ఞవల్క జయంతి, ఏకాదశి :- మతత్రయ, భోధన ఏకాదశి, ద్వాదశి :- క్షీరాబ్ధి ద్వాదశి,  త్రయోదశి :-  సాలగ్రామ పూజ దానము,  చతుర్దశి :-  షాషాణ చతుర్దశి, పౌర్ణిమ :- జ్వాలా తోరణము పూజ, శివునికి అత్యంత ప్రితికర దినము.

బహుళ పాడ్యమి :- శాక దానము శుభం, విదియ :- చాతుర్మాస విదియ,అశూన్యశయనవ్రతం, తదియ :- తులసి పూజ, చవితి :-  గణపతికి గరిక పూజ, పంచమి :- అన్నదానము శుభము, షష్టి :-  సుబ్రహ్మణ్య పూజ, సప్తమి :- ఈశ్వరునికి జిల్లేడు పువ్వులతో పూజ, అష్టమి :- కాల భైరవునికి పూజ, నవమి :- రజిత, తామ్ర దానం, దశమి :- అన్న సమారాధన, ద్వాదశి :- స్వయంపాక దానము, త్రయోదశి :- నవగ్రహ పూజ, చర్తుర్దసి :- మాసశివరాత్రి శివునికి అభిషేకము పత్రిపూజ అత్యంత ప్రితికరము, అమావాస్య :- వాజసనేయీ అమావాస్య, పిత్రు దేవతలకు స్వయంపాక దానములు

Leave a Reply