Menu

Kuja Graha Dosham

జాతకములో వధూవరుల విషయములో ముఖ్యముగా చుస్తునది కుజదోషము,ఎవరికీ అయినా జన్మ లగ్నాత్త్ 2,4,7,8,12, స్థానములలో కుజుడు వున్నా లేదా ఆస్థానమునకు కుజ ద్రుష్టి కలిగినాఅది స్త్రీల సౌభాగ్యానికి పురుషుల కళత్ర భావానికి పీడ కలిగించుటవలన అజాతకములవారికి వివాహము చేయరాదని పెద్దల నిర్ణయము కానీ వధూవరుల ఇద్దరికీ కుజదోషము వుంటే [సమముగా] వివాహముచేయవచ్చునని అన్ని శాస్త్రాలు అన్గికరిస్తునాయి, అంటే కాకుండా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనము, రాసుల వారికీ కుజదోషము వర్తిచాడు అనీ చబుతూ వచ్చాయి .
మేషము, వృశ్చికము, లకు చతుర్ధకుజుడు [౪]
వృషభము, తులకు వ్యయ కుజుడు [౧౨]
మిధునము, కన్యలకు ద్వ్తియకుజుడు [౨]
మకరము, కర్కాటకములకు సప్తమకుజుడు [౭]
ధనుస్సు, మీనములకు అష్టమ కుజుడు [౮]
కుంభము, సిమములకు కుజుడు ఎక్కడవున్న దోషములేదని పూర్వుల అభిప్రాయము [అంగీకారము కూడా]
కానీ చాలామంది కుజుడు సప్తమములో ఉండడము మహాదోషము అనీ విశ్వసిస్తూ వారు భయపడుతూ ఇతరులనుకుడా భయబ్రాంతులకు గురిచేస్తు వుంటారు [దీనికి కారణము మేష,సింహ, వ్రుచిక,కుంభాలలో సప్తమ కుజుడు దోషకరే అనీ బృహత్ జతకాదులు చప్పదము ]
కొన్ని సప్తమ కుజుని సుభాఫల వివరములు ఉదా :-కన్య,కుమ్బలు సప్తమే అక్కడ కుజుడు వున్నావివాహానంతరం,భోగభాగ్యములు కలుగుతాయి.
ఏది ఎమైన మంచి సిద్దాన్తికి చూపించి వివాహముచేసుకోనుట ఉత్తమము —చింతా గోపి శర్మ సిద్ధాంతి

Leave a Reply