Menu

వివాహ విషయములో సందేహములు

Marriage Problems

పెండ్లి విషయములో కొన్ని సందేహములు

జ్యేష్టులకు వివాహము చేయవచ్చునా ?

                   వధువు , వరుడు ఇద్దరు జ్యేష్టులు అయినప్పుడు  జ్యేష్ట మాసము లో వివాహము జరిపించ కుండా మిగిలిన మాసములలో జరిపించవచ్చు . త్రి జ్యేష్ట కాకూడదు { అనగా మూడు జ్యేష్ట లు } మరియు వధూ వరులు ఇద్దరు జ్యేష్ట నక్షత్రము అయినపుడు, జ్యేష్ట మాసము లో వివాహము జరిపించరాదు. 

జాతకము ఒకరికి ఉండి మరొకరికి లేనప్పుడు ఏంచెయ్యాలి ?

జాతకములు వదూవరులకు ఇద్దరికీ ఉన్నప్పుడు వారియొక్క జన్మ నక్షత్రముల ప్రకారమే వివాహ ముహూర్తము  లగ్ననిర్ణయము జరగాలి,  వరుని జన్మ నక్షత్రము వధువు నామ నక్షత్రము కలిపి వివాహలగ్నం నిర్ణయం చేయవచ్చు,  నామ నక్షత్రము కూడా సరిపడక పొతే వధువుకు పేరు మార్చి అనుకూలమైన పేరు తో వివాహము చేయవచ్చు, ఎట్టి పరిస్థితులలోనూ వరుని పేరును మార్చరాదు. .
అన్నదమ్ములకు ఒక ముహూర్తములో వివాహము చేయరాదు,కనీసము ఆరు మాసముల తేడా అవసరము,  ఒకే  తల్లికి జన్మించిన అన్న చేల్లిలకు గాని అక్క తమ్ములకు ఈవిధి వర్తిచదు, ముందు కుమార్తె వివాహముచేసి ఆతరువాత కుమారుని వివాహము చేయవచ్చు.

లగ్నం 

ముహూర్తానికి లగ్న బలం ఉండాలి.అష్టమశుద్ధి కూడా ఉండటం మంచిది. కేంద్రములో శుభ గ్రహాలు, 3, 6, 11ఇంట  త్రిషడాయాలలో పాపగ్రహాలుండాలి.ముహూర్త లగ్నాత్ కేంద్రస్థానంలో బుదుడుంటే 500 దోషాలను, శుక్రుడుంటే 5000 దోషాలను, గురుడుంటే 1,00,000 దోషాలను పోగొడతాడు.లాభంలో రవి వున్న మంచిది,లగ్నం పుస్కరాంశ లో వున్నా మంచిది,లగ్నం శుభ షష్ట్యంశలో ఉన్న శుభఫలము, రాశిచక్రంలోను, నవాంశ చక్రంలోను లగ్నం ఒకే రాశిలో ఉంటే లగ్నం వర్గోత్తమం చెందగలదు, లగ్నము నుండి 1,4,7,10 స్థానములు. వీటిని విష్ణుపాదములు అందురు,,లగ్నము నుండి 5,9 స్థానములు వీటిని లక్ష్మీ స్థానములు అందురు.

Reed Moor మీకు తెలుసా

Leave a Reply