Menu

కాలసర్పయోగ ( దోష ) ఫలములు

Kalasarpadosham

#కాలసర్పయోగ ( దోష ) ఫలములు పూర్తి వివరణ

1. జ్ఞానదృష్టిలేకపోవటములేకమెదడుసరిగాఎదగకపోవడమువల్లఅవమానాలు ( లేక ) అపార్ధాలుచేసుకోవడము.
2. జన్మించినసంతానమునకుబుధిమాంద్యముకలుగుట.
3. గర్భములోశిశువుమరణించుట .
4. భార్యభర్తలమధ్యసక్యతలేకపోవుట ( లేక ) వైవాహికజీవతంలోఅసంతృప్తి.
5. మరణించినశిశువుకలుగుట.
6. గర్భమునిలవకపోవడము, విచిత్రమయినరోగములుకలగడము.
7. అంగవైకల్యముసంతానముకలగడము, వాహనప్రమాదాలు.
8. శస్త్రచికిచలువిపలము అయిమరణించడంజరుగుతుంది.
9. వృషణములవ్యాధులు , వ్యసనాలకుభానిసలుకావడము.
10. వీర్యకణములునశించుట, నసుపుకత్వముఏర్పడుట.
11. కాన్సర్, సిఫిలిస్ , హెర్నియా , ఎయిడ్స్ , ముత్రసంబందమయినరోగములుకలగడము.
12. వంశవృదిలేకపోవడము, కుటుంబములోప్రేమఅభిమనములుతగిపోవడము.
13. శత్రువులవలనమృతిచెందడము, సంతానముశత్రువులుగామారడము.
14. మానసికశాంతిలేకపోవడము, విషజంతువులవల్ల, జలప్రమాదములవల్లమరణించడం.
15. అవమానాలులేకఅపనిందలవల్లమరణించడం, పరస్రిసంపర్కము.
16. రునగ్రస్థులుఅగుటహామీలుఉండుటజరుగును.
జాతకునిజన్మకుండలిలోరాహుకేతువులమద్యమిగిలినఅన్నిగ్రహాలువచ్చినచొదానినికాలసర్పయోగంఅనిఅంటారు. దీనిలోచాలరకాలువున్నాయి. వాటివాటిస్తితులనుబట్టివాటికిపేర్లునిర్ణయంచెయ్యటంజరుగుతుందిదానిప్రకారమేకాలసర్పయోగంవలనకలిగేఫలితంకూడానిర్ణయంచెయ్యబడుతుంది.
వివిధరకాలకాలసర్పయోగములు
1.)అనంత కాల సర్ప యోగము
2.)గుళికకాలసర్పదోషం
3.)వాసుకికాలసర్పదోషం
4.)శంక పాల కాలసర్పదోషం
5.)పద్మకాలసర్పదోషం
6.)మహాపద్మకాలసర్పదోషం
7.)తక్షకకాలసర్పదోషం
8.)కర్కోటకకాలసర్పదోషం
9.)శంఖచూడకాలసర్పదోషం
10.)ఘటకకాలసర్పదోషం
11.)విషక్త, లేక విష దానకాలసర్పదోషం
12.)శేషనాగకాలసర్పదోషం
అనంత కాల సర్ప యోగము
జన్మ లగ్నము నుండి సప్తమ స్థానము వరకు రాహు కేతు గ్రహముల మధ్య మిగతా గ్రహములు
( రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని ). వుంటేదీనినిఅనంతకాలసర్పయోగముఅంటారు.
ఫలితాలు: కుటుంభసమస్యలు, దీర్గరోగాలు, వైవాహికజీవతంలోఅసంతృప్తి, మానసికశాంతిలేకపోవడము, రునగ్రస్థులుఅగుటహామీలుఉండుటజరుగును.
గుళికకాలసర్పదోషం:
మాములుగాఇదిజాతకచక్రంలోరెండోవ ఇంటప్రారంభంఅయ్యిఎనిమిదొవ ఇంటసంమప్తంఅవుతుంది.
ఫలితాలు:ఆర్ధికమరియుకుటుంభఇబ్బందులు, . భార్యభర్తలమధ్యసక్యతలేకపోవుట ( లేక ) వైవాహికజీవతంలోఅసంతృప్తి, మిత్రులవలన విరోదములు కలుగును.
వాసుకికాలసర్పదోషం:
మూడోవ ఇంటమొదలయితొమ్మిదొవ ఇంటసమాప్తం.
ఫలితాలు: అన్నదమ్ములకలహాలు, సమస్యలు, బందువులవలనసమస్యలుఎకువగావుంటాయి
ఉద్యోగములోబాధలు, పదోనతిలోఆటంకాలు, ఉద్యోగమువుదిపోవటంజరుగును.
శంక పాల కాలసర్పదోషం:
నాలుగోవ ఇంటమొదలయిపదవ ఇంట సమాప్తం.
ఫలితాలు: తల్లివలనలేదాతల్లికిసమస్య, వాహనగన్డం, నివాసస్తలసమస్యలు, విద్యలోఆటంకములు, ఉద్యోగ, వ్యాపారములలోలాబములులేకపోవుట.
పద్మకాలసర్పదోషం:
అయిదోవ ఇంటప్రారంభమయిపదకొండవ ఇంటసమాప్తం.
ఫలితాలు: జీవితభాగస్వామితోకానిపిల్లలతోకానిసమస్యలు విచిత్ర వ్యాదులు రావడము, వ్యసనముల వల్ల భారి నష్టాలు రావడం, భార్య భర్తల మధ్య అనుమానాలు తలేతడం, ధనము ఖర్చుఅగుట, శత్రువుల వలన జైలుకు వెల్లడము, కష్టాలు కలుగును, బాల్యము నుండీ బాధలు కలుగును.
మహాపద్మకాలసర్పదోషం:
ఆరవ ఇంటప్రారంభంఅయ్యిపన్నెండవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఆరోగ్యసమస్య, అప్పులబాధ, శత్రుబాధ, భార్యభర్తలుఅనుకూలముగాలేకపోవడము, జీవితాంతమురోగములవలనబాధనిరాసయకువగాఉండును. వ్రుధాప్యములోకష్టాలుకలగడము, శత్రువులతోపోరాడటం, గృహమునందుఅసంతృప్తికలుగుతుంది.
తక్షకకాలసర్పదోషం:
యేడవ ఇంటప్రారంభంలగ్నము ఇంటసమాప్తం.
ఫలితాలు: వ్యాపారము లో చిక్కులు, పిత్రార్జితం ఖర్చు చేయడము, పుత్ర సంతానము లేదని బాధ పడటము, జీవిత భాగస్వామి తో సమస్యలు, పర శ్రీ సంగమము, శత్రు పీడా, అనారోగ్యం కలుగును.
కర్కోటకకాలసర్పదోషం:
ఎనిమిదొవఇంటప్రారంభంరెండోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: వైవాహికజీవతంలోఅసంతృప్తి, అకాల మరణము, మోసములకు గురికావడము, దీర్గ రోగములు, ఆపరేషన్లు, ఎంత కష్టపడిన పలితము దక్కదు. జీవితములో అన్ని ఆలస్యముగా జరుగుతాయి, మంచి ఉద్యోగము దొరుకుట చాల శ్రమ చేయవలసి వస్తుంది, విపరీత ధన నష్టము జరుగును.
శంఖచూడకాలసర్పదోషం:
తొమ్మిదొవఇంటప్రారంభంవమూడోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: అత్యంతదురదృష్టస్తితి, దేవునియందుభక్తిలేకపోవడము, తండ్రి, గురువులతోవిరోధము, వ్యవసాయమునందుఅధికముగాశ్రమించిననష్టములుకలుగును. అవమానములు, బాధలు, ధనమునందుఅసంతృప్తికలుగును.
ఘటకకాలసర్పదోషం:
పదవఇంటప్రారంభంనాలుగోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: వ్యాపారమరియుఉద్యోగసమస్యలు, తల్లితండ్రులకుదూరముగానివసించదము, మిత్రద్రోహులు , వ్యాపారలావాదేవులలోనష్టము, సంతానదోషములుకలుగును.
విషక్త, లేక విష దానకాలసర్పదోషం:
పదకొండవఇంటప్రారంభంఅయిదోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఆర్ధికమరియువ్యాపారకష్టాలు, నేత్ర సంబంధ రోగములు , సోదరులు , మిత్రులతో తగాదాలు, గృహమును విడచి పరదేశములో నివసించదము, కోర్టు వ్యవహారములలో తల దుర్చడం, రహస్య విషయాలు గోప్యముగా ఉంచడము జరుగును.
శేషనాగకాలసర్పదోషం:
పన్నెండవఇంటప్రారంభంఆరవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఎక్కువఖర్చులు, శత్రుబాధలు కోర్టు వివాదాలు , అవమానాలు, ప్రాణభయము, అధిక ఖర్చులు.
ని సంతానయోగములు
కుజుడు పంచమములొ వుంది ఆ పంచమం శని రాశి గాని శని నవంసము గాని ఆ శనికి సప్తమా ద్రుష్టి కలిగి వుంటే సంతానము కలగదు.
పంచమములొ శని లేక రాహువు వుంది పాప గ్రహ ద్రుష్టి వున్నచొ సంతానము కలగదు.
పుత్ర స్థానమునందు రవి, కుజ రహువులు మరియు శని బలముగా వుంది పుత్ర కరక గ్రాహం బలహీనముగా వున్నా సంతానము కలగదు.
పంచామదిపతి నీచలో వున్నా పంచమ స్థానము కర్కాటక రాశిలో కుజుడు వున్నా సంతానము కలగదు.
పంచామదిపతి ఆస్థాన్గాతుడు అయి వుంది బుధుడు సమ రాశిలో ఉన్తే సంతానము కలగదు.
గురువు, లగ్నాధిపతి , సప్తమాధిపతి, పంచామదిపతి నిబలురు అయిన ఆ జాతకులకు సంతానము కలగదు.
శని షష్టమాదిపతి 6 వ బావమునందు, చంద్రుడు సప్తమ భవమునన్దున్న జాతకులకు సంతానము కలగదు
మేష రాశి లో గురువు మరియు బుధుడు వుంది మేషరాసి పంచమ భావము అయినచో సంతానము కలగదు.
కుజుడు మరియు శని చతుర్ధము లో ఉంటే సంతానము కలగదు.
చంద్రుడు 10 లో శుక్రుడు 7 లో 4 లో పాపులు ఉన్నచో సంతానము నశించును.
లగ్న , పంచమ, నవమదిపతులలో యవరికయినాను కుజ, శనుల సంబంధము, అష్టమాదిపతి సంబందము కుడా ఉన్నచో సంతాన నష్టము కలుగును.
గురువు పంచమదిపతి పాపుల మధ్య నున్నను , సష్ట,వ్యమాది పతులు అప్తంగాతది దోషములు ఉన్నచో సంతానము కలగదు.
వృచిక లగ్నమునందు గురు సుక్రులు లేక శని బుధులు ఉన్నచో సంతానము కలగదు.
పంచమ స్థానము నందు గురువు వుండి ఆ పంచమ స్థానము మేషము , కర్కాటక, మకర మరియు ధనుర్ లగ్నములు అయినచో సంతాన నష్టము కలుగును.
2, 5, 7 పతులు ఎవరయినా 6, 8, 12 స్థానములందు వుండి శత్రు గ్రహ మధ్య గతులయిన, పంచమధిపతి శత్రు, నీచ రాసులు అందుండగా మరియు 9 వ స్థానములో పాపులు వున్నాను సంతానము కలగదు.
సింహ , వ్రుచిక రాశుల వారికీ జన్మ లగ్న మునందు పాప గ్రహములు వుండి గురు, శుక్రులు కలసి వ్యయమునందు వున్నా సంతానము కలగదు
బుధుడు నుండి శని తను , పుత్ర , కళత్ర మరియు వ్యయభవములలొ ఉన్నచో సంతానము కలగదు.
పంచమది పతి వ్యయములో వుండి చతుర్ధ, దశమ భావదిపతులు తో సంబంధము యార్పడితే సంతానము కలగదు.
పంచమ స్థానములో రాహువు ఉంటే అల్ప సంతానము లేక సంతాన నష్టము లేక సంతానము లేకపోవడము జరుగును. శ్రీ సంతానము యకువగా ఉండును, మరియు రాహువు పయ్ పాపుల ద్రుష్టి వున్నా సంతానము కలగదు.
పంచమ స్థానములో కేతువు వున్నా పయ్ పలితములు కలుగును.
శ్రీ జన్మ రాశికి పంచమ రాశి లో పురుషుడు జన్మించిన సంతాన నష్టము.
పంచమదిపతి చంద్రుడు బుదునితో వ్యయము నందు గురువు అష్టమము నందు వున్నా సంతానము కలగదు.
అష్టమము నందు శని వుండి వాని దశ వచినపుడు పుత్ర నష్టము కలుగును.
పంచమదిపతి శని, రవితో కలసి మేషము నందుండి పంచమము కుజుని ద్రుష్టి కలిగిన సంతానము కలగదు.
సంతానము కలుగుట
పంచమదిపతి లగ్నది పతి సుభులతో కూడిన కేంద్రములందు వుండి ధనాధిపతి బలము కలిగి ఉంటే పుత్ర సంతానము కలుగును.
లగ్నది పతి పంచమము భావములో వుండి నవమదిపతి సప్తమ స్థానములో వుండి ద్వితీయ అధిపతి మరియు ధనాధిపతి లగ్నములో ఉంటే పుత్ర సంతానము కలుగును.
నవములో గురువు, గురునికి కేంద్రమున శుక్రుడు ఉంటే లగ్నాధిపతి బలముగా ఉంటే చాల ఆలస్యముగా సంతానము కలుగును.
పంచమదిపతి శని అయితే గురు, చంద్ర ద్రుష్టి ఉంటే స్వల్ప సంతానము కలుగును.
పంచమదిపతి పంచమునన్దు గులికుడుంది ఆ స్థానాధిపతి పంచమములొ వున్తెయ్ కవలలు సంతానము కలుగును.
ద్వితీయ , పంచామదిపతులకు కుజ, శని సంబందము ఉంటే సష్తమ స్థానము లందు గురువు ఉంటే శ్రీ సంతానము కలుగును.
రవిగాని , శని గాని సి గ్రహ రాశి అంశాలలో వుండగా బుధ ద్రుష్టి ఉంటే శ్రీ సంతానము కలుగును.
గురుని నవంసదిపతి కేంద్రములలో ఉంటే సంతానము కలుగును.
శని, కుజులు కలసి 4 వ స్థానము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
పంచమ భావము నందు శని, చంద్రుడు శని నవంసము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
లగ్న పంచామదిపతులకు పరస్పర ఒకరి రాశులందు ఒకరు వున్నాను జాతకుని పుత్రులు తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తారు.
పంచమదిపతి , నవమధిపతి కలసి వుండి ధసమధి పతి మహర్ధస జరుగు చున్నపుడు సంతానము కలుగును .
పంచమము కర్కాటకము అయి అందు చంద్ర, గురువులు వున్నా శ్రీ సంతానము ఎకువ .
లగ్న, పంచమది పతి , గురువు ముగ్గురు కేంద్ర కోణములన్దునను జాతకుడికి పుత్ర సంతానము కలుగును..
భాగ్యది పతి , భాగ్య మునందు వున్నాను సంతాన యోగము కలుగును .
పంచమములొ చంద్ర, శుక్రులు వుండి ఆ శుక్రున కు పంచమములొ బుధుడు వున్నా స్త్రీ సంతానము అధికము.
జన్మ లగ్నమునకు పంచమమున గురువు , గురువునకు పంచమమున శని, శనికి పంచమమున రాహువు వున్నాను పుత్ర సంతానము కలుగును
నవమ స్థానములో గురువు వానికి పంచమ స్థానములో రవి ఆ రవికి సప్తమ స్థానములో కుజుడు వున్నా పుత్రా సంతానము కలుగును.
చంద్రునకు పంచమమున గురువు ఆ గురువుకు పంచమమున సాని ఆ సానికి పంచమము నందు రాహువు వున్నా పుత్రా సంతానము కలుగును.
రాహువు కేతువులు సప్త గ్రహములతో కూడిన పలితము
1)రాహువుతో రవి లేక శుక్రులు లగ్నము నుండి ద్వితీయ భావములో ఉన్న లేక రాహువు ఉన్న నేత్ర సంబందమయిన వ్యాదులు కలుగును.
2)ద్వితియములో రాహువు శుక్రులు వుంది అష్టమములో కేతువు శని గ్రహములు ఉన్న రాహువు శుక్రులకు కేతువు, శనుల ద్రుష్టి ఉన్న ముత్ర సంబందమయిన లేక వృషణములు లకు వ్యాదులు మరియు గొంతు సంబందమయిన వ్యాదులు వచును.
3)రాహువు గురువులు కలసియునచో దురాచారములకు లోను అగును. దైవముఫై నమ్మకము ఉండదు. కేతువు గురువు కలసివున్న దైవ బక్తులు అగును.
4)రాహువు అష్టమ బావములో వుంది రాహువుకు రవి, కుజ, మరియు శని వీరిలో ఎవరి ద్రుష్టి తగిలిన వివాహములు ఆలస్యము అగును. బార్య లేక భర్తలలో మృతువు సంభవించును.
5)రాహువు చంద్రునితో కలసి లగ్నమునందు వుండగా పంచమ, నవమ స్థానములు అనగా కొనములలో పాపులు ఉన్నచో మానసిక చంచలత్వము, మంద బుద్ది ఆత్మ హత్యలకు పాల్పడటము జరుగును.
6)జన్మ లగ్నములో శని రహువులు కలసివున్న అనారోగ్యము నాల్గవ స్థానములో ఉన్న మాతృనష్టము, విద్య విగ్నములు కలుగును. ఏడవ స్తనమునందు ఉన్న పితృ సౌక్యము వుండదు. దశమ స్తానములో ఉన్న వృతిరీత్యా చికాకులు కలుగును.
7)పంచమదిపతి అయిన చంద్రుడు శని కుజులతో రాహువు కలసివున్న సంతాన నష్టము కలుగును.
8)శుక్రుడు కేతువు తో కలసి ఉన్న బార్య గయాళి, స్వల్ప సంతతి కలది, బార్య సహోదరులకు నష్టము కలుగును.
9)శని, కేతువులు కలసి కేంద్రములలో ఉన్న రాజయోగము పట్టును.
7 లో శని, కుజ, మరియు రహువులతో కూడిన బ్రంహచార్యము , వివాహము అయిన దాంపత్య జీవితము వుండదు.
రాహువు విద్య స్తానములో ఉన్న విద్యబ్యాస కాలములో రాహువు దాస వచ్చినాచో వైద్య శాస్త్రము అబ్యాసిన్చును.
కేంద్రముల యందు రాహువు పాప గ్రహములతో కూడినను ఆ శిశువు సీగ్రముగా మరణించును.
4 వ అధిపతి రాహువుతో కలసి 6 నందు ఉన్న చోరుల వల్ల మరనింతురు.
6 వ బావము నందు చంద్రుడు లగ్నమునందు రాహువు వున్నాను అపస్మారక రోగము కలుగును.
లగ్నము నందు గురువు, రాహువు ఉన్న దంత రోగములు కలుగును.
కారకాంస లగ్నము నుండి ద్వాదశ భావము నందు కేతువు వున్నాను మరణము అనంతరము బ్రంహా సానిద్యము పొందును.
ద్వితీయ భావములో కేతువు మరియు శుక్రుడు కలసిన పర శ్రీ లతో సంబందము కలిగి వుంటాడు.
కేతువుతో శని మరియు కుజులతో కలసి ద్వితియము లో వుంటే వివాహము ఆలస్యము అగును.
బుధ, కేతువులు 3 భావము లో ఉన్న చెవి వ్యాదులు లేదా ఏదయినా అవయవ లోపము జరుగును.
3 వ భావములో కేతువు, శని కలసిన మంచి ఆరోగ్యము కలిగించును.
కేతువుతో కలసి శని 9 వ స్తానములో ఉంటే తండ్రికి అరిస్టములు కలుగును.
కేతువు, శుక్రులు కలసి 9 వ స్తానములో వుండిన బార్య లేదా భర్తకు నష్టము , స్థిర చర ఆస్తులకు నష్టములు కలుగును.
7 లో కేతువుతో శుక్ర, కుజులు కలసిన వ్యభిచారము చేయును.
7 లో కేతువు తో బుధుడు కలసిన వివాహ విషయములలో మోసము జరుగును.
7 వ భావములో రాహువుతో కుజుడుగాని, రావిగాని, శని గాని చేరిన నీచ శ్రిలతో సంబందము, వ్యభిచారము, భార్యను కోల్పోవడము జరుగును.
7 లో రవి, రహువులు కలసిన సంతాన నష్టము కలుగును.
7 లో రాహువుతో గురు, శుక్రులు కలసిన విధవతో సంగమము జరుగును.
లగ్నము నందు శని పంచమములొ కుజ రహువులు వున్నాను సోదరులు వుండరు.
కుజ రహువులకు 6 వ అధిపతితో సంబందము ఉన్న గాయములు, లేక ఎవరయినా తుపాకితో కాల్చుట లేక కత్తితో పొడుచుట జరుగును.
కుజ రాహువుల కలయిక భు ఆక్రమణలు, కోల్పోవడము జరుగును.
లగ్నమున రవి, రహువులు వున్నాను శిరసు భినముగా ఉండును.
రవితో రాహువు లేక కేతువుతో సంబందము వుండి 8 లో వుంటే అవమానములు కలుగును.
శనితో రాహువు లేక కేతువు వుండి 7 లో ఉన్నచో వ్యభిచారము చేయును.
లగ్నము నందు రవి, 7 లో రాహువు వుంటే భార్య గర్భము ధరించదు.
7 లో రాహువు, 2 లో శని వుండిన ద్వికలత్ర యోగము కలుగును.
రాహు, శుక్రులు కలసిన చాకలి సంగమము జరుగును.

కాల సర్ప యోగము:
రాహు,కేతువుల ప్రభావము మన మీద ఉంటుందా …..
సూర్యుని నించి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి అవి అయ్యా రంగులుగా విడి పోయి సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితము చేస్తుందని, అనగా ఆయా గ్రహాలూ మనమీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రాని ప్రజలకు అందించారు. అంతే కాదు జ్యోతి అనగా కాంతి మనుష్యుల మీద ఎలా ప్రభావితము చూపుతుందో ఛాయ కూడా మానవుని ప్రభావితము చేస్తుందని, రాహు, కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు. ఈ సూక్ష్మము గ్రహించని వారు రాహు, కేతువులు గ్రాహాలే కాదు, అవి ఎలా మనిషి మీద ప్రభావముచూపుతాయి అని వితండ వాదన… అసలు గ్రహాలే ప్రభావము ఉండదని ఇంకో వాదన. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజ్యోతిష్యము, ఫలితాలు, అనేక అంశాలు మానవుని నిత్య జీవితములో అనుభవాలు కాదనలేనివి.
ఇక అసలు విషయము రాహుకేతువులు స్తితి, ప్రతి మనిషి మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి. గ్రహాల గురించిన విషయాలు,వర్ణనలు, పుట్టుకలు శ్లోకాలు, కదల రూపములో రమ్యముగా చెప్పబడినాయి. అప్పటి రోజులలో కంప్యూటర్, ఇల్లంటివి లేవు కదా… నేటి మానవుని కంటే మన మహర్షులు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా చెప్పారు. వాటిని మనము తప్పక ఆచరించి ఫలితాలను అనుభావిచాలేకని వాదనలతో నిరుపించాలేము కదా…
రాహువు పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు, పూర్వ భాద్ర నక్షత్రాన జన్మించాడు. కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన సింహికకి. అమృతము పంచె సమయములో అమృతము విష్ణుమూర్తి ఆజ్ఞ మీరి తాగినందుకు అతని శిరస్సు ఖండిచ బడినది. పాము రూపముగా చెప్పబడే రాహువు అమృత మహిమ వడలన తోక విడిపోయి కేతువుగా అవతరించాడని పురాణ కధనము.
కాల సర్ప యోగము:
కాల సర్ప యోగము అనగా రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహములు ఉండుట వలన ఏర్పడే యోగము. ఇందులో మంచి యోగములు ఉండవచ్చు, చేదు యోగములు ఉండవచ్చు. చెడు యోగము కలిగిన రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఐ మనుష్యులకే కాదు, దేశానికి, రాష్ట్రాలకి కూడా ఉండవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము:-
రాహువు, కేతువులు మిగిలిన గ్రహములకు వ్యతిరేక దిశలో నడచును. ఏడు గ్రహములు రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగము ఏర్పడును. ఇది భారతీయుల సిద్ధాంతము. యురేనస్, నేఫ్ద్తున్, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య వెలుపల ఉన్న కాలసర్ప యోగము ఏర్పడుతుందని పాశ్చాత్యుల సిద్ధాంతము.
కాల సర్ప యోగ దోషములు:
రాహు, కేతులు 1 – 7 స్థానము నందు ఉంటె భార్య, భర్తల మధ్య విరోధము, అశాంతి, మనస్పర్థలు, చురుకు దానము లోపించుట జరుగును. ఒక్కోసారి వివాహ యోగము కూడా ఉండక పోవచ్చుని.
రాహు కేతువుల కాల సర్ప యోగాలు:
యోగ్దము అనేది మంచి, చెడు రెండు వుంటాయి. ఆ సమస్యల స్వరూపము తెలుసుకుందాము:
1 – 7 అనంత కాలసర్ప దోషము దీనివలన దాంపత్య జీవితములో ఇబ్బందులు ఎదురు అవుతాయి.
2 – 8 గుళిక కాలసర్ప దోషము దీనివలన కుటుంబ సమస్యలు, వాక్, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
3 – 9 వాసుకి కాలసర్ప దోషము దీనివలన ఉపయోగము లేని ప్రయాణాలు, బంధువుల వలన బాధలు.
4 -10 శంఖపాల కాలసర్ప దోషము దీనివలన వాహనాలు, గృహ, భూమి సంబంధిత సమస్యలు.
5 -11 పద్మ కాలసర్ప దోషము దీనివలన సంతన సమస్యలు, ఆందోళనలు.
6 -12 మహాపద్మ కాలసర్ప దోషము దీనివలన నిద్ర లేకపోవటాము, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు.
7 -1 తక్షక కాలసర్ప దోషము దీనివలన భార్య, భర్తల మధ్య విభేదాలు, వ్యాపార సమస్యలు.
8 -2 కర్కటక కాలసర్ప దోషము, దీనివలన నష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు జరుగును.
9 -3 శంఖచూడ కాల సర్ప దోషము దీనివలన పూర్వ పుణ్య లోపమువల్ల సమస్యలీ, పెద్దల వల్ల సమస్యలు.
10 -4 ఘటక కాలసర్ప దోషము దీనివలన ఉద్యోగ సమస్యలు, హోదాలలో, గౌరవములలో లోపాలు.
11 -5 విషక్త కాలసర్ప దోషము దీనివలన వ్యాపార లాభాలలో సమస్యలు.
12 -6 శేషనాగ కాలసర్ప దోషము దీనివలన అధిక వ్యయము వలన కలిగే ఇబ్బందులు.
మరి కాలసర్ప యోగము వలన జరిగే మంచి ఏంటి..
ఈ యోగము జాతకుని కష్టించు వానిగాను, దైవ్దభక్తి గల వానిగాను, ధర్మ నిష్ఠ పరునిగాను, మార్చును.
జాతక చక్రములోని ఇతర దోషములు హరించును.
ఇతర గ్రహముల దోషములు కాలసర్ప యోగము వలన నిర్మూలించ బడును.
జాతకుని ముందుకు నడిపించి గొప్పతనము సాధించుటకు కావలసిన శక్తిని కలిగించును. ఎదుటి వారు కలుగ చేయు ఆపదలనుండి తప్పించుత్డకు శక్తిని ఇచ్చును.రాహువుతోగాని, రాహువుకు ముందు కాని గురు చంద్రుల కలయిక వలన మంచి యోగము కలుగును.
సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువునుంచి కేతుగ్రహము వరకు సప్త గ్రహాలు ఉంటె అది సవ్య కాలసర్ప యోగము, కేతువు నుండి మొదలు అయి రహుగ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటె అపసవ్య కాలసర్ప యోగము అందురు.
ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నము ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటె అది లగ్న కాలసర్ప యోగము అందురు.
సర్పదోషము, నాగ దోషము: జోతిష్యములో రాహు, కేతువులను సర్పముగా భావితురు తల రాహువుగాను, తోక కేతువుగాను చెప్పుదురు. ఈ దోషములను నాగదోషముగా చెప్పుదురు. నాగ దోషము ఉన్నప్పుడు తప్పని సరిగా పుట్ట పూజలు, నగెర స్వామి గుడిలో పూజలు దర్శనములు, దానాలు పరిహార క్రియలు చేయాలి. అవి జతకములో గ్రహ స్తితి బట్టి నిర్ణయించాలి. నాగ దోషములు చెప్పబడే కొన్ని గ్రహ స్తితి గతులు:
జాతక చక్రములో లగ్నము నుండి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో రాహువు ఉంటె సర్ప దోషము. ఇతర ఏ యోగాలు లేకుండా ఈ దోషము ఉంటె దుష్కర్మల పట్ల ఆసక్తి, సుఖము లేక పోవుట, ఉద్యోగ సమస్యలు, కొందరికి వివాహము కాక పోవుట జరుగును.
జాతక చక్రములో చంద్రుని నుండి ఎనిమిదవ స్థానములో రాహువు కేతువు ఉంటె సర్ప దోషముగా చెప్పాలి.
జాతక చక్రములో రాహువు నుంచి ఎనిమిదవ స్తానములో రవి ఉంటె సర్ప దోషము.
జాతక చక్రములో లగ్నము నుండి త్రికోణము నందు కాని, కేంద్రము నందు కాని రాహు, కేతువులు ఉంటె సర్ప దోషము.

నాగ శాపం
నాగ దోషానికి పరిహారాలు నాగ ప్రతిష్ట మాత్రమే కాదు.ఈ దోషాన్ని పంబన్ ఘట్ అనే విధానం ద్వారా సరిచేయవచ్చు.కేరాలకి చెందిన నాగ వంశీకులు ఈ దోషాన్ని పరిపూర్ణంగా నిర్మూనించగలరు.త్రయంబకేశ్వర్ ,కుక్కి ,మన్నర్సాల,కౌలాలంపూర్ మున్నగు ప్రదేశాలలో ఈ దోషానికి పరిహారాలు అనగా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది నాగులను నియమించబదిందని సర్ప శాస్త్రం తెలియబరుస్తుంది.మొదటిది ఆశ్లేష బాలి,నవనాగా మండలం,నారాయణ నాగాబలి,మహా సర్ప బలి ఈ నాలుగు రకాల పరిహారలతో తొమ్మిది రోజుల హోమమును చేయటం జరుగుతుంది.నాగ దోషం గల జాతకులు ధరించిన వస్త్రాలను ఉప హోమ గుండములో వేయటం జరుగుతుంది.జాతకుడు పుట్టిన సంఖ్యను బట్టి ఒక రంగు ఉద్దేశం అవుతుంది.ఆ రంగు వస్త్రాలను పూర్నాహుతిలో వేయటం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు జాతకులు శాకాహారం మాత్రమె తీసుకోవాలి.పొట్లకాయ తినరాదు.ప్రతి నిత్యం సర్ప సూక్తం చదవాలి.ఇలా పరిహారాలు చేసుకునే వారికి శీఘ్ర సంతానం కలుగుతుంది.కోర్టు వ్యవహారాలూ,వ్యాపార సమస్యలు,అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
స్వప్నంలో పాములు కలలోకి వస్తే అది సర్ప దోషమని సర్ప శాస్త్రం మనకి తెలియపరుస్తుంది.అలాంటి వారు కూడా దోష పరిహారము చేసుకొనుట మంచిది.
జాతకంలో లగ్నము నుండి 8వ స్తానంలో రాహువు ఉంటే లేదా శని ,రాహువు యొక్క దృష్టి 8వ స్థానం పై పడితే సర్పదోషం ఏర్పడుతుంది .రాహు కేతువుల లగ్నంలో కానీ , 2వ స్థానంలో కానీ ,5 వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ ,8వ స్థానంలో కానీ ఉంటే ఆ జాతకులకు సర్ప దోషం ఉందని గుర్తించాలి.ఏ సర్పదోషం ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వారికి క్రింద వివరించబడిన సమస్యలు ఎదురవుతాయి. సర్పదోషాల వలన ఆయుహ్క్షీనమ్ , సంతానం కలగకపోవటం,సంతానం కలిగినా వెంటనే చనిపోవడం ,భార్య భర్తల మధ్య విభేధాలు ఏర్పడడం ,దంపతులకు విడాకులు తీసుకొనే పరిస్తితి ఏర్పడడం ,అకస్మాత్తు రోడ్డు ప్రమాదాలు జరగడం, గర్భస్రావాలు జరగడం,వివాహం ఆలస్యంగా జరగడం,మాంగల్య దోషం లాంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇదే కాక రాహు కేతుల స్థానాలను బట్టి పన్నెండు రకాల కాల సర్ప యోగాలను జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఈ పన్నెండు రకాల కాల సర్ప యోగాల వలన విభిన్న సమస్యలు ఏర్పడతాయి.ఏ యోగం ఏ జాతకులకు ఉంటుందో క్రింద వివరించబడింది.
జాతక చక్రంలో లగ్నంలో అనగా ఒకటవ స్థానంలో రాహువు మరియు 7వ స్థానం కేతువు ఉన్నట్లైతే ఈ జాతకులకు “ అనంత కాలసర్ప యోగం”గా భావించాలి. ఈ యోగం వలన వీరి దాంపత్య జీవితంలో విబేధాలు ఏర్పడతాయి. తప్పు నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 2వ స్థానంలో రాహువు మరియు 8వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కులిక కాలసర్ప యోగం”గా గుర్తించాలి.దీని వలన వీరికి సంపాదన తక్కువగా ఉంటుంది.అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు మరియు అకాల మరణాలు సంభవిస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 3వ స్థానంలో రాహువు మరియు 9వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “వాసుకి కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు ఆత్మ గౌరవం తగ్గి సంఘం లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు.ఆత్మహత్యలకు పాల్పడతారు.సోదరులతో విబేధాలు ఏర్పడతాయి.విదేశాలకు వెళ్ళుటకు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 4వస్థానంలో రాహువు మరియు 10వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖ పాల కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులు అందరినీ దుర్భాషలడతారు. జాతకుని తల్లికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి.ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటారు.వాస్తు సరిగ్గా లేని ఇంటిలో నివసిస్తూ అధిక సమస్యలకు గురి అవుతారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 5వ స్థానంలో రాహువు మరియు 11వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “పద్మ కాలసర్ప యోగం” వీరికి వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి. స్నేహితుల వలన సమస్యలు వస్తాయి. సంతానంలో కొరత లేదా ఆలస్యం ఏర్పడుతుంది.
జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానంలో రాహువు మరియు 12వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “మహా పద్మ కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు.అనారోగ్యాల పాలవుతు ఉంటారు.ఏకాంతంగా మిగిలిపోవడం,జైలు పాలవడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి.
v జాతక చక్రంలో లగ్నం నుండి 7వ స్థానంలో రాహువు మరియు లగ్నంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “తక్షక కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకుల జీవిత భాగస్వామి చెడు ప్రవర్తన గలవారై ఉంటారు.పరిస్థితులు వీరిని వైరాగ్యానికి గురి చేస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 8వ స్థానంలో రాహువు మరియు 2వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కర్కోటక కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు నిరంతర అనారోగ్యంతో భాదపడతారు.సంపదకు మించి ఖర్చులు పెరిగిపోవడంతో అప్పుల పాలవుతారు .
v జాతక చక్రంలో లగ్నం నుండి 9వ స్థానంలో రాహువు మరియు 3వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖాహూడ కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు అన్నీ రకాల చెడు వ్యసనాలకు అలవాటు పది ఉంటారు.వీరికి ఉన్న ఆస్తి మరియు సంపదను కోల్పోతారు. విదేశాలకు వెళ్ళుట కష్టంగా మారుతుంది.ప్రయాణాలలో సమస్యలు వస్తాయి .
v జాతక చక్రంలో లగ్నం నుండి 10వ స్థానంలో రాహువు మరియు 4వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “ఘాతక కాలసర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకంలో వారు చేసే ఉద్యోగంలో కానీ ,వ్యాపారంలో కానీ సరిగ్గా రాణించలేరు. వీరి కుటుంబ సభ్యులలో ఒకరు మాంత్రికుడిగా మారి క్షుద్ర పూజలు ప్రయోగించి ఇతరులను కష్టాలకు గురి చేస్తారు.
v జాతక చక్రంలో లగ్నం నుండి 11వ స్థానంలో రాహువు మరియు 5వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకి “విశాధర కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు వీరి కన్నా అగ్రజులైనా సోదరి లేక సోదరులతో విబేధాలు ఏర్పడతాయి.స్నేహితుల వలన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.సంధిగ్ధమైన మనస్సు కలిగి ఉండడం వలన వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి.అప్పులు చేసి ఆస్తి పోగొట్టుకొంటారు.
v జాతక చక్రంలో లగ్నం నుండి 12వస్థానంలో రాహువు మరియు 6వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శేషనాగు కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు సంపాదనకు మించి ఖర్చును చేస్తారు.వీరికి వీడని అనారోగ్య సంశ్యాలు ఏర్పడతాయి.జైలు పాలయ్యే అవకాశాలు వస్తాయి.వీరికి తెలియని శత్రువులు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.
జాతక భావంలో ఉన్న ఈ నాగ శాపం,సర్ప దోషం,కాల సర్ప దోషం యొక్క ప్రభావల నుండి వచె సమస్యలు తొలగించుకోడానికి సర్ప శాస్త్ర విధానాన్ని అవలంబించి కేరళలో ఉన్న మన్నర్షాల మరియు పాంబు మెక్కట్టు లో ఆశ్లేష బలి,నారాయణ నాగ బలి,మహా సర్ప బలి,నవనాగ మండలం అను పరిహారాలు జాతకుని ఫోటో,జన్మ నక్ష్త్రమ్,జన్మ లగ్నం,మేనమాల గోత్రం,జాతకులు వాడిన వస్త్రం మొదలగు వాటిని సేకరించి ఈ పరిహారాలు జరుపుతారు.ఈ పరిహారాలు నాలుగు రోజులు జరుగుతాయి.ఈ నాలుగు రోజులు ప్రతి నిత్యం ఏదో ఒక సమయంలో నైనా ఏ ప్రదేశంలో నైనా సర్ప సూక్తాన్ని భక్తి శ్రద్ధలతో చదవాలి.

నాగ దోషం ,కాల సర్ప దోషం నివారనోపాయలు

కాల సర్పం యోగం పట్టినవారు.సప్తమ,అష్ట్టమాల్లో రాహు కేతువులు ఉన్నవారు.పూర్వ జన్మలో పాములను చంపినా వారు లేదా మంత్ర తంత్ర విధి విధానాలతో బంధించినవారు,పాముల పుట్టలను త్ర్రావ్వి ఇండ్లు కట్టిన వారు నాగదోషం కలవారై పుడుతారు.అటువంటి వారు వివాహం,సంతానం,కుటుంబ అభివృద్ధి విషయాల్లో అడ్డంకులు,అవమానాలు పొంది,విరక్తి కలిగి జీవితం అంతం చేసుకొందమనే స్తితికి వస్తారు..
1.నాగదోషం త్రీవ్రమైనది అయితే శుక్ల పౌడ్యమినాడు శ్రీకాళహస్తిలో నిద్రచేసి మరుసటి దినం శివ దర్శనం చేసి పూజలు జరిపించుట వల్ల నివారణ కల్గుతుంది
2.ఆరు ముఖాల రుద్రాఅక్షాలు చెవులకు లేదా గాజులలకు లేదా ఉంగరంగా ధరించుట వల్ల ,ఏనుగు తోక వెంట్రుకలు ఉంగరంగా లేదా చేతికి కడియంగా ధరించుట వల్ల నివారణ పొందగలరు
3.నాగ ప్రతిమకు 27 దినాలు పూజచేసి దేవాలయమునకు దానం చేయవలేయును.
4. రాహు కాలంనందు ప్రతి సోమవారం నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి పూజ చేయాలి. లేదా రాహు కాలంనందు నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుట వల్ల నివారణ కల్గును
5.త్రీవ్ర్రమైన నాగదోషంఉన్న యడల నాగ పంచమి రోజున శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గ, పాతాళ వినాయకుని దర్శించి పూజించటం వల్ల నివారణా కల్గును

—*విశేషించి దోషము నివారణకు హోమమము శుభము *—