Menu

Monthly Archives: June 2012

Nava Rathnalu & Rudraksha

 నవరత్నాలు ధరించే విధములు

BIRTH STAR [జన్మ నక్షత్రము]STONE [రత్నము]

ASHVINI [అశ్వని]CAT’S EYE [వైడూర్యము]

BHARANI [భరణి]DIAMOND [వజ్రము]

KRITIKA [కృత్తిక]RUBY [కెంపు]

ROHINI [రోహిణి]PERAL [ముత్యము]

MRIGASIRA [మృగశిర]CORAL [పగడము]

ARUDRA [ఆరుద్ర]SARDONYX [గోమేదికము]

PUNARVASU [పునర్వసు]CARBUNCLE [కనక పుష్యరాగము]

PUSHYAMI [పుష్యమి]SAFIRE [నీలము]

ASLESHA [ఆశ్లేష]GREEN [ఆకుపచ్చ]

MAGHA [మఖ]CAT’S EYE[వైడూర్యము]

PURVAPALGUNI [పుబ్బ]DIAMOND [వజ్రము]

UTTARAPALGUNI [ఉత్తర]RUBY [కెంపు]

HASTA [హస్త]PEARL [ముత్యము]

CHITTA [చిత్త]CORAL [పగడము]

SWATHI [స్వాతి]SARDONYX [గోమేధికము]

VISHAKAH [విశాఖ]CARBUNCLE [కనక పుష్యరాగము]

ANURADHA [అనురాధ]SAFIRE [నీలము]

JESTA [జ్యాస్ట]GREEN [ఆకుపచ్చ]

MOOLA [మూలా]CAT’S EYE[వైడూర్యము]

PURVASHADADIAMOND [వజ్రము]

UTTARASHADA [ఉత్తరాషాడ]RUBY [కెంపు]

SRAVANAM [శ్రవణం]PEARL [ముత్యము]

DHANISHTA [ధనిష్ట]CORAL [పగడము]

SATABHISHAM [శతభిషం]SARDONYX [గోమేధికము]

PURVABHADRA [పూర్వాభాద్ర]CARBUNCLE [కనక పుష్యరాగము]

UTTARABHADRA [ఉత్తరాబాద్ర]SAFIRE [నీలము]

RAVATI [రేవతి]GREEN [ఆకుపచ్చ]

నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది.ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన త ర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.

నవరత్నములు ధారణా లాభములు

నవగ్రహ వైభవం లో చెప్పిన విధంగా మధుమేహము[చెక్కెర వ్యాధి] కలవారు,స్త్రీ లోలురు,రాజకీయవేత్తలు,ఆకర్షణ లోపము వున్నవారు వజ్రము ధరిచుతుపయుక్తము.

నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు. గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి.

పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు. పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిదని జ్యోతిష్కులు చెపుతున్నారు

కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైఢుర్యాలు

rudra

 

శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి.ఋషులు, మునులు, రాక్షసులు మరియు దేవతలు అందరూ వీటిని ధరించువాఋ అనీ పురాణాది ఇతిహాసములలో తెలుయుచున్నది.. ఇప్పటికీ స్వాములు, బ్రాహ్మణులూ, పూజారులు, దైవజ్ఞులు, గురువులు మొదలగువారు వారు వీటిని ధరిస్తూవుంటారు.మరయు పుజగ్రుహములలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ వుంటారు. వీటిలో చాల రకముల రుద్రాక్షలు వున్నాయి ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను కలిగి వుంటాయి. ఇవి ఒకటి నుంచి పదిహేను పద్దెనిమిది రకముల వరకూ వుండు అవకాశమున్నది.

1. ఏఖ ముఖి ఇది అత్యంత విలువ కలిగినది దీనిని ప్రత్యక్ష శివుని రూపముగా భావించుతారు.

2. ద్విముఖి ఇది అర్ధనారిస్వరులు [శివ పార్వతులు] గా భావిస్తారు.

3. త్రి ముఖి దీనిని శివ,విస్ట్నుభ్రహ్మ, రూపముగా భావిస్తారు.

4. చతుర్ ముఖి దీనిని బ్రహ్మ స్వరూపమని కొందరు చతుర్ వేదాల స్వరూపమని కొందరు భావిస్తారు.

5. పంచ ముఖి దీనిని పచముఖ రూపముగా లక్ష్మి స్వరూపముగా భావిస్తారు.

6. షణ్ముఖి ఇది ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు.

7. సప్త ముఖి కామధేను స్వరూపము గా భావిస్తారు.

8. అష్ట ముఖి గణనాధుని[విఘ్నేశ్వర] స్వరూపముగా భావిస్తారు.

9. నవముఖి నవగ్రహస్వరూపముగానె కాక ఉపాసకులకు మంచిదని భావిస్తారు

10.దస ముఖి దీనిని దశావతార రూపముగా విశేసించి స్త్రీలు వీటిని ధరిచుట మంచిదని భావించుట జరుగుతున్నది.

మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి “3”ముఖాల రుద్రాక్ష గాని,”1″,”3″,”5″ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.”పగడంస్టోన్”ధరించవచ్చును.

వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి “6” ముఖాల రుధ్రాక్ష గాని, “4”,”6″,”7″ ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును.”డైమండ్ స్టోన్”ధరించ వచ్చును.

మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి “4” ముఖాల రుధ్రాక్ష గాని,”4′,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును.”ఆకుపచ్చ స్టోన్”ధరించ వచ్చును..కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి “2”ముఖాల రుధ్రాక్ష గాని ,”2″,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును.”ముత్యం స్టోన్”ధరించ వచ్చును.

సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి “1”ముఖం గాని, “1”,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”కెంపు స్టోన్”ధరించ వచ్చును.

కన్యా  లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి “4”ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”ఆకుపచ్చ స్టోన్”ధరించ వచ్చును.

తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి”6″ముఖాల రుధ్రాక్ష గాని ,”4′,’6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును..”డైమండ్ స్టోన్”ధరించ వచ్చును.

వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి “3”ముఖాల రుధ్రాక్ష గాని,”2″,”3″,”5″ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును..”పగడంస్టోన్”ధరించవచ్చును.

థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర,నక్షత్రాల వారికి “5”ముఖాల రుధ్రాక్ష గాని “1”,’3″,”5″ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును.”కనక పుష్యరాగం స్టోన్”ధరించ వచ్చును.

మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి “7”ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”నీలం స్టోన్”ధరించ వచ్చును.

కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి”7″ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”నీలం స్టోన్”ధరించ వచ్చును.

మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి”5″ముఖాల రుధ్రాక్ష గాని,”2″,”3″,”5″రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును. “కనక పుష్యరాగం స్టోన్”ధరించ వచ్చును.

 

Navagraha Dosha Nivaarana

మానవునికివచ్చు నవగ్రహ దోషముల నివారణకు జప తర్పణ హోమ దానములే కాక విశేసించి పూజాది కార్యకమములు
రవి మహాదశ అంతర్దశ
రవి మహాదస లో రవికి రుద్రాబిషేకము
” ” ” చంద్రుడు దుర్గాపూజ
” ” ” కుజుడు సుబ్రహమన్య పూజ
” ” ” రాహువు దుర్గా సంపుటిత మూలమన్త్రము
” ” ” గురుడు రుద్ర నమక పారాయణ
” ” ” శని లింగార్చన
” ” ” భుదుడు విస్ట్ను పూజ
” ” ” కేతువు సూర్య నమస్కారములు
” ” ” శుక్రుడు లక్ష్మి పూజ
చంద్రుడు మహాదశ అంతర్దశ
చంద్రుడు లో చంద్రుడు స్కంద పూజ
” ” కుజుడు ఆదిత్య ఆరదన
” ” రాహువు మృత్యుంజ ఆరాదన
” ” గురుడు ప్రార్దివ లింగార్చన
” ” శని తిలబిషేకము
” ” భుదుడు లక్ష్మి మూలమంత్ర జపము
” ” కేతువు హోమము
” ” శుక్రుడు అష్ట లక్ష్మి పూజ
” ” రవి సూర్య నమస్కారములు
కుజుడు మహాదశ అంతర్దశ
కుజుడు లో కుజుడు అరుణ పారాయణ
” ” రాహువు మృత్యుంజయ జపం
” ” గురుడు లింగార్చన [సహస్ర]
” ” శని తిలభిశకం,మృత్యుంజయ హోమం
” ” భుదుడు సూర్య నమస్కారములు
” ” కేతువు దుర్గా సూక్త పారాయణ జపం
” ” శుక్రుడు అమ్మవారి పూజ
” ” రవి గోపూజ [108] సార్లు ప్రదక్షణ
” ” చంద్రుడు గౌరీ పార్వతి పూజ
భుధ మహాదశ అంతర్దశ
భుధ మహాదస లో భుదుడు అమ్మవారి పూజ
” ” ” కేతువు అగ్ని పూజ
” ” ” శుక్రుడు శ్వేత గణపతి పూజ
” ” ” రవి సూర్య నారాయణ మూర్తి కి అభిషేకం
” ” ” చంద్ర దుర్గా జపం
” ” ” కుజ నాగ పూజ
” ” ” రాహు లింగార్చన
” ” ” గురు త్రయంబక జపం
” ” ” శని తైలాభిషేకం
గురు మహాదశ అంతర్దశ
గురు మహాదస లో గురుడు రుద్ర పారాయణ
” ” ” శని తైలాభిషేకము
” ” ” భుదుడు విస్ట్ను పూజ
” ” ” కేతువు ఏకాదశ రుద్రాభిషేకం
” ” ” శుక్రుడు లలిత,విస్ట్ను సహస్రనామ పారాయణ
” ” ” రవి అరుణ పారాయణ
” ” ” చంద్ర అగ్ని పూజ
” ” ” కుజుడు గ్రహ హవనము
” ” ” రాహువు దుర్గా పూజ
శుక్ర మహాదశ అంతర్దశ
శుక్ర మహాదస లో శుక్రుడు గంగా మాత పూజ
” ” ” రవి సప్తమి భానువారము సూర్య నమస్కారములు
” ” ” చంద్ర శివ గౌరీ పూజ
” ” ” కుజ షణ్ముఖ పూజ
” ” ” రాహు దుర్గా పూజ
” ” ” గురు రుద్ర పారాయణ
” ” ” శని తిలాబిషేకం శనికి
” ” ” భుధ విస్ట్ను పూజ
” ” ” కేతు సువాసిని పూజ
శని మహాదశ అంతర్దశ
శని మహాదస లో శని గోబ్రాహ్మణ పూజ
” ” ” భుదుడు త్రయంబక జపము
” ” ” కేతువు మృత్యుం జయ జపము
” ” ” శుక్రుడు అగ్ని పూజ [తిల హవనము]
” ” ” రవి ఆదిత్య పూజ
” ” ” చంద్ర శ్వేత గోపూజ
” ” ” కుజ దున్నపోతు దానం
” ” ” రాహువు మృత్యుం జయ జపము
” ” ” గురుడు దక్షిణామూర్తి పూజ
రాహు మహాదశ అంతర్దశ
రాహు మహాదశ లో రాహువు స్త్రీ బాల పూజ
” ” ” గురుడు రుద్రాబిషేకం
” ” ” శని లింగార్చన
” ” ” భుదుడు విస్ట్ను పూజ
” ” ” కేతువు సుబ్రహమణ్య పూజ
” ” ” శుక్రుడు దుర్గా సూక్త పూర్వక పూజ
” ” ” రవి అరుణ పారాయణ
” ” ” చంద్రుడు త్రయంబక జపం
” ” ” కుజుడు సర్ప ప్రతిమకు పూజ దానము
కేతు దశ అంతర్దశ
కేతు మహాదశ లో కేతువు గణపతి పూజ
” ” ” శుక్రుడు పార్వతి పూజ
” ” ” రవి మహా లింగార్చన
” ” ” చంద్రుడు త్రయంబక జపం
” ” ” కుజుడు నవ గౌరీ పూజ
” ” ” రాహువు తైలబిషేకం
” ” ” గురుడు శని పూజ
” ” ” శుక్రుడు అప మృత్యు జపం
” ” ” భుదుడు అగ్ని పూజ

Kuja Graha Dosham

జాతకములో వధూవరుల విషయములో ముఖ్యముగా చుస్తునది కుజదోషము,ఎవరికీ అయినా జన్మ లగ్నాత్త్ 2,4,7,8,12, స్థానములలో కుజుడు వున్నా లేదా ఆస్థానమునకు కుజ ద్రుష్టి కలిగినాఅది స్త్రీల సౌభాగ్యానికి పురుషుల కళత్ర భావానికి పీడ కలిగించుటవలన అజాతకములవారికి వివాహము చేయరాదని పెద్దల నిర్ణయము కానీ వధూవరుల ఇద్దరికీ కుజదోషము వుంటే [సమముగా] వివాహముచేయవచ్చునని అన్ని శాస్త్రాలు అన్గికరిస్తునాయి, అంటే కాకుండా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనము, రాసుల వారికీ కుజదోషము వర్తిచాడు అనీ చబుతూ వచ్చాయి .
మేషము, వృశ్చికము, లకు చతుర్ధకుజుడు [౪]
వృషభము, తులకు వ్యయ కుజుడు [౧౨]
మిధునము, కన్యలకు ద్వ్తియకుజుడు [౨]
మకరము, కర్కాటకములకు సప్తమకుజుడు [౭]
ధనుస్సు, మీనములకు అష్టమ కుజుడు [౮]
కుంభము, సిమములకు కుజుడు ఎక్కడవున్న దోషములేదని పూర్వుల అభిప్రాయము [అంగీకారము కూడా]
కానీ చాలామంది కుజుడు సప్తమములో ఉండడము మహాదోషము అనీ విశ్వసిస్తూ వారు భయపడుతూ ఇతరులనుకుడా భయబ్రాంతులకు గురిచేస్తు వుంటారు [దీనికి కారణము మేష,సింహ, వ్రుచిక,కుంభాలలో సప్తమ కుజుడు దోషకరే అనీ బృహత్ జతకాదులు చప్పదము ]
కొన్ని సప్తమ కుజుని సుభాఫల వివరములు ఉదా :-కన్య,కుమ్బలు సప్తమే అక్కడ కుజుడు వున్నావివాహానంతరం,భోగభాగ్యములు కలుగుతాయి.
ఏది ఎమైన మంచి సిద్దాన్తికి చూపించి వివాహముచేసుకోనుట ఉత్తమము —చింతా గోపి శర్మ సిద్ధాంతి