Menu

Monthly Archives: May 2015

శంఖం

shakam

శుభాలను అందించే ‘శంఖం’

భారతీయ సంస్కృతిలో ‘శంఖం’కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.

ఆధ్యాత్మికంగా శంఖం

శంఖం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని దేవదత్తంగానూ, భీముని శంఖం పౌండ్రకం అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని అనంత విజయమనీ, నకులుని శంఖాన్ని సుఘోషనామంతో, సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది. వైరివర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.

లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణు మూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.

నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక, ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు.

శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

పూజ గదిలో దక్షిణావర్త శంఖం
సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి.

ఫలితాలు

శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తు పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి.

దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.

Yellow sapphire

కనక పుష్య‌రాగం  
గురు గ్రహానికి సంబంధించి రత్నం పుష్యరాగము. పుష్యరాగ రత్నాలు బృహస్పతి (గురు) గ్రహానికి విశేషమైన ప్రీతి గలవి. పుష్యరాగం ఏ రంగులోనైనానూ ఉన్నప్పటికీ ఇందులోని 5 రంగుల యొక్క సమిష్టి ప్రభావం కలిగి వుంటుంది. అందువల్లనే ఈ రత్నము సత్కర్మలకు, బ్రహ్మజ్ఞాననిష్ఠులకు ఉపయోగం. ఈ పుష్యరాగంపై ఎలాంటి చారలుండవు. పారదర్శకముగానూ, కాంతివంతముగానూ ఉంటుంది. మేలుర‌కం కనక పుష్యరాగంను ఎండలో ఉంచితే వెలుగు వ్యాప్తి చెందుతుంది.
ఎవ‌రు ధ‌రించ‌వ‌చ్చు..?
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములందు జ‌న్మించిన వారు పుష్యరాగం ధరించవచ్చును. ఇతర నక్షత్రములలో జన్మించిన వారి విషయంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ, నక్షత్రజాతకులు మినహా మిగిలిన అన్నినక్షత్రములవారు పుష్యరాగమును ధరించవచ్చును. మీనం, ధనుస్సు, గురుని రాశులు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర గురు నక్షత్రాల్లో జన్మించినవారు పుష్యరాగంను ధరించవచ్చు. జనన కాలంలో గురుగ్రహం చెడు స్థానాలలోను, దుర్భల రాశులలోను ఉండగా జన్మించినవారు.. గురు మహాదశ నడుస్తున్నవారు కూడా పుష్యరాగం ధరించవచ్చు. అదే విధంగా… ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్య జన్మించిన వృషభరాశి జాతకులు, సెప్టెంబర్ 24 నుంచి, అక్టోబరు 23 మధ్య జన్మించిన తులారాశి జాతకులు వజ్రాన్ని ధరించవచ్చును. శుక్ర దశలో ఉన్న వారు కూడా వజ్రం ధరించడం వల్ల సకల సంపదలు చేరువవుతాయి.
ఫ‌లితాలు
మల్లెపువ్వువంటి తెల్లని రంగు కలిగినవి గానీ, గోగు పువ్వువంటి పసుపు పచ్చని రంగుతో నున్నవి గానీ, పుష్యరాగములను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ధరించిన వారికి విశేష పాండిత్యం వ‌స్తుంది. విద్య‌, ఆర్థిక‌, కుటుంబ సుఖం, వంశాభివృద్ధి, బంధువుల ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. బలమును, వీర్యమును, నేత్రజ్యోతిని పెంచేందుకు కనకపుష్యరాగ ధారణ చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. ఉన్నత విద్య, మంత్రి పదవి, న్యాయ, అధ్యాపక, రాజకీయ వృత్తులకు ఇది అనుకూలం. ఆర్థిక బాధలు తొలగి ఆదాయం పెరగడానికి, సంతాన ప్రాప్తికి పుత్ర సంతానానికి వివిధ శాస్త్రాలలో విజ్ఞానానికి, కీర్తికి, మంత్రసిద్ధికి పుష్యరాగం ధరించడం శుభదాయ‌కం.
ధరించే పద్ధతి
ఏ జాతికి చెందిన పుష్యరాగమైనప్పటికీ దోష రహితంగా చూసి బంగారు ఉంగరంలో ధరించటం మంచిది. వెండిలోనూ ధరించడం రెండవ పక్షం. ఇతర లోహములు పనికి రావు పంచలోహములలోను ఈ ఉంగరం ధరించవచ్చునని కొందరు చెబుతారు. బంగారం లేక వెండితో చేయబడిన ఉంగరము యొక్క పైపీఠము దీర్ఘచతురస్రాకారంగా చేయించి అందు పుష్యరాగ రత్నమును ఇమిడ్చి పూజించి ధరించవలెను. మృగశిర పుష్యమి, ఉత్తర, పూర్వాభద్ర నక్షత్రములు కలిగియున్న గురువారం గానీ లేక పుష్యమీ నక్షత్ర గురు ఆదివారములందుగానీ సంభవించిననాడు గురు హోరకాలమునందు వర్జదుర్ముహుర్తములు లేకుండా చూసి, పుష్యరాగమును ఉంగరమును బిగించాలి. ఆ తర్వాత ఉంగరాన్ని ఒక రోజంతా పంచగవ్యములందుంచి, రెండవ రోజు మంచి గంధపు నీటిలో ఉంచి శుద్ధి చేయాలి. ఆ తదుపరి ఉంగరానికి విధ్యుక్తముగా పూజ జరిపించాలి.
పసుపు రంగులో ఉండే ఈ రత్నమును గురువారం సూర్యోదయానికి ధరించాలి. బంగారంతో పుష్యరాగాన్ని పొదిగించి, గ‌ణపతిని ధ్యానించి “ఓం ఐం శ్రీం హ్రీం క్లీం బృహస్పతయే స్వాహా”అను మంత్రమును 108 పర్యాయములు జపించి ఆ తర్వాత ఉంగరంను మ‌రోసారి కనులకద్దుకొని కుడి చేతి చూపుడు వ్రేలుకిగానీ, ఉంగరపు వేలికిగానీ ధరించవలెను. స్త్రీలు కూడా ఈ పుష్యరాగ ముద్రికను కుడిచేతికి ధరించుటే మంచిది. ఉంగరమునకు అడుగు భాగం రంధ్రంను కలిగి ఉండటం శాస్త్రీయం. అందువల్ల పుష్యరాగమునందలి వివిధకాంతులకు చెందిన కిరణశక్తి శరీరమునందు చొచ్చుకుపోయి అంతర్గత నాడీమండలములందు తమ శక్తిని ప్రభావితము గావించి దివ్యసిద్ధులను సత్ఫలితాలను కలుగ చేయగలదు.

Diamond

వజ్రము 

ఆకాశములో వజ్రం (రవ్వ) తూర్పునకు గానీ, పడమరకు గానీ శుక్రగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనినే చుక్క అని వాడుకలో ఉంది. ఈ చుక్కవలే మరే చుక్క కూడా ప్రకాశించదు. వజ్రం కూడా ఈ చుక్క మాదిరిగా ప్రకాశిస్తూ ఇత‌ర రత్నమునకు లేనట్టి కాంతి ప్రభలతో వెలుగొందుతూ ఉంది కాబ‌ట్టి ఈ వజ్రానికి శుక్ర గ్రహము ఆదిపత్యం వహిస్తున్నాడు. శుక్రుడు స్త్రీజలమై జలతత్వానికి సంబంధించిన వాడగుట వల్ల‌ వజ్రం కూడా స్త్రీజాతి జతతత్వ రత్నమగుటవలన వజ్రాధిపతి శుక్ర గ్రహం.

దీనిని ఆభరణములలోధరించుట పరిపాటి. ఉత్తమమయిన వజ్రాలు, తెల్లని రంగులో, ఉండి కొంచం నీలి రంగు చాయలు వెదజల్లేవిగా ఉంటాయి. ఈ రత్నమును సానబెట్టిన కొద్ది నాణ్యత పెరిగి కాంతులను వెదజల్లుతుంది. ప్రకాశ వంతముగాను, మెరుపు కలిగిన తక్కువ బరువు కలిగిన వజ్రాలు ఉత్తమమైనవి. వజ్రాన్ని సుత్తులతో కొట్టిన, అరగదీసిన, గీతలు గాని చారలు గాని పడదు. అదే జాతివజ్రము.

ఎవ‌రు ధ‌రించవ‌చ్చు..?

ఈ వజ్రాలను ఏప్రిల్ నెలలో పుట్టినవారు, భరణీ పుబ్బ, పూర్వాషాడా నక్షత్రములలో జన్మించినవారూ, ధరించుట మంచిది. జాతకములో శుక్రుని బలము లేకున్నా, దోషమున్న, మహదశా అంతర్దశలలో ఈ రత్నం ధరించాలి. శుక్రుడు శుభస్థితి పొందిననూ ధరించిన మరింత మేలు గలుగును. 5, 14, 23, 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు అనగా అదృష్థ సంఖ్య 5 అయినా 1 అయినా దీని బలం అధికమగును.

శుక్రుని కారకత్వములయిన, కళలు, కళత్రం, సౌఖ్యం, వాహనాలు, సంగీతం, వివాహం.. వంటి విషయములలో జాతకమున దోషమున్న, లేక ఆ జాతకములలో ఈ కారకత్వములకు బలం పెరిగి అభివృద్ధి సాధించాలన్ననూ ఈ రత్నం ధరించాల్సి ఉంటుంది. జాతకమునందుగానీ గోచారమునందుగానీ శుక్రగ్రహము దుష్టస్థానములందుండి, షడ్వర్గ బలం, అష్టక బిందు బలం కలిగి ఉన్నప్పుడు అతని యొక్క మహర్దశ అంతర్దశలు ఇతర యోగ గ్రహముల యొక్క దశలలో ఈతని భుక్తికాలములు, గోచారకాలము విపరీత దుష్పరిణామములు కలిగించగలదు. వ్యసనములకు బానిసలగుట, స్త్రీలోలత్వము వ్యభిచారదోషములు, దంపతులకు నిత్య కలహం, ప్రేమ నశించుట, దరిద్ర బాధలు, కృషి నష్టం, మానసిక అశాంతి, బాధలను సహింపలేకుండుట, స్త్రీకలహం, నష్టకష్టములు, రక్తస్రావం అతిమూత్రవ్యాధి, కార్యవిఘ్నం, వివాహం కాకుండుట, వీర్య నష్టము, సోమరితనం… మొదలైన విపరీత ఫలితాలు కలుగుతాయి. ఈ సమయములందు యోగ్యమయిన వజ్రమును ధరించ‌డం వ‌ల్ల‌ బాధలు అంతరించి ఆయుః ధన సమృద్దిగా లభించగలదు.

ఫ‌లితాలు
ధరించే వ్యక్తి వజ్రం చిన్న దైనప్పటికీ దోషరహితంగా ఉండటం చాలా ముఖ్యం. ఉత్తమ లక్షణములు కలిగిన వజ్రమును ధరించడం వలన శారీరక, మానసిక వైఫల్యాల రీత్యా కలిగే అలజడి అశాంతి నివారింపబడి సుఖ జీవనం లభిస్తుంది. అంతేగాక దరిద్ర బాధలు కష్టనష్టములు తొలగిపోతాయి. సంగీతం, సాహిత్యం, కవిత్వం, నటన నాట్యం, చిత్రలేఖనం వంటి 64 కళలయందు సూక్ష్మ పరిగ్రహణ శక్తి కలిగి బాగా రాణీంచగలరు. సినీ రంగమున ఉన్న‌ వారికి వజ్రధారణ చాలా అవసరం. శుక్రబలం లోపించిన వధూవరులకు వజ్రపుటుంగరమును ధరించడం వ‌ల్ల వారి అన్యోన్య దాంపత్య జీవితం బాగా ఉంటుంది. వివాహ ఆల‌స్యం అవుతున్న వారు వజ్రం ధరించిన తర్వాత పెళ్లి బ‌లం వ‌స్తుంది.

పొడి దగ్గులు, ఉబ్బసం వ్యాధి, మూత్ర పిండాలకు సంబంధించిన దోషాలు అకాల వృద్దాప్యపు లక్షణాలు వెంట్రుకలు చిన్నతనంలోనే తెల్లబడుట, వ్యభిచార దోషాలు సంతాన దోషాలు స్త్రీల విషయంలో బెరుకుతనము, ఆహార అయిష్టత, ఊహా లోకాల్లో విహరిస్తూ సోమరితనంగా ఉండటం వంటి శారీరక, మానసిక వ్యాధుల నుంచి రక్షించి నిత్య యవ్వనులుగా తీర్చిదిద్ది నూతనోత్సాహంతో ఉల్లాసవంతమైన జీవితం గడపడానికి ఈ వజ్ర ధారణ ఉపయోగపడుతుంది. స్

వ‌జ్రాన్ని ధరించే పద్దతి

వజ్రాన్ని వివిధ రూపాల్లో ధరిస్తుంటారు. కొందరు కంఠహారాల్లోను మరికొందరు హస్త కంకణాలలోను(గాజులు)చెవి కమ్మలు, ముక్కుపుడకలు షర్టు గుండీలు.. ఇంకా అనేక ర‌కాలుగా ధరిస్తుంటారు. సర్వసాధారణంగా వజ్రన్ని ఉంగరంలో ఇమిడ్చి ధరించడం ఎక్కువగా చేస్తుంటారు బంగారంతో చేయించిన ఉంగరానికి అడుగున రంధ్రం ఉంచి పైభాగం 5 కోణాలు (నక్షత్రాకారం)గా తీర్చి దిద్ది దాని మధ్య‌లో వజ్రాన్ని బిగించాలి. దీనికి బంగారం మినహా ఇతర లోహాలు పనికిరావు.

భరణి పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారికి వజ్రధారణ చాలా ముఖ్యం. ఇతర నక్షత్రాల వారు వారి జాతక ప్రభావాన్ని అనుసరించి శుక్రగ్రహం బలహీనంగా ఉన్నపుడు మాత్రమే వజ్రాన్ని ధరించాలి. కృత్తిక, రోహిణి, ఉత్తరాషాడ, శ్రవణం ఈ 6 నక్షత్రాలు జన్మ నక్షత్రాలుగా గలవారు వజ్రాన్ని వాడడం అంత మంచిది కాదు. అనూరాధ, ఉత్తరాభాధ్ర నక్షత్రాలు కలిగిన శుక్రవారం రోజునగానీ, రేవతీ నక్షత్రం గల శనివారంగానీ, శుక్రుడు ఉత్తరాభాధ్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే సమయంలో భరణి నక్షత్రంలో గల శుక్రవారం గానీ శుక్ర హోరా కాలం జరిగేటప్పుడు గానీ వజ్ర దుర్ముహుర్తాలు లేకుండా చూసి.. వజ్రాన్ని ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని ఒక రోజంతా పంచగవ్యాలలో నిద్రగావింపజేసి, మరుసటి రోజు గుర్రం మూత్రంనందుంచి, మరొక రోజు పసుపు నీటియందు ఉంచి తిరిగి మంచి నీటితో పంచామృతములతో శుద్ధి గావించాలి. ఈ ప్రకారం పరిశుద్ధమైన వజ్రపుటుంగరము (ఆభరణము)నకు శాస్త్రోక్తముగా పూజ జరిపించి ధూపదీప నైవేద్యముల‌తో శాంతి జరిపించిన త‌ర్వాత ధరించె వారి తారా బలం చంద్రబలం కలిగిన శుభతిదుల యందు, బుధ, శుక్ర, శని వారాములలో మిధున, ధనుర్మీన లగ్నమునందు గల శుభముహుర్తంలో ధరించాలి. ఉంగరాన్ని లేక ఆభరణంను ధరించే ముందుగా దానిని కుడిచేతి హస్తం యందు ఉంచుకొని తూర్పు ముఖంగా నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి “ఓం శీం ఐం హ్రీం శ్రీం భృగుసూనవే శుక్రాయస్వాహా” అను మంత్రంతో గానీ లేక “వర్షంతుతే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహస్తు సర్వ బీజా న్యవ బ్రహ్మద్విషోజహి” అను మంత్రమును గానీ 108 సార్లు పఠించి శుక్రగ్రహమునకు నమస్కరించి కుడి చేతి నడిమి వేలికి ఉంగరంను ధరించవలెను.

అయితే వజ్రంను ఉంగరపు వేలికి ధరించుట పనికిరాదు. కొందరు చిటికెన వ్రేలుకి ధరించు చుండెదరు ఒకే ఉంగరమునందు వజ్రంతో పాటుగా కెంపు ముత్యంను చేర్చి బిగించకూడదు.

Blue sapphire

 నీలం విశిష్ట‌త‌

నీలం శనిగ్రహానికి సంబంధించిన రత్నము. దీనిని బ్లూ సఫైర్ అంటారు. ఒక కొరండమ్ అల్యూమినియం తాలూకు క్రిస్టలైజ్డ్ ఆక్సైడ్. ఇందులో ఇనుము, టైటానియం కలవడం వలన దీనికి నీలిరంగు వచ్చింది. అలాగే సఫైర్ ఇతరత్రా ఖనిజాలు కలిసినప్పుడు నీల రంగు కాకుండా పసుపు, గులాబి, నారింజ, పచ్చ, వయొలెట్ రంగుల్లోనూ కనిపిస్తాయి. వజ్రం తరువాత నీలం కఠినమైనదిగా చెప్పవచ్చును.

ఎవ‌రు ధ‌రించవ‌చ్చు..?
పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్రాలలో జ‌న్మించిన‌వారు. వృషభ, తుల, మకర, కుంభ లగ్నములలో జ‌న్మించినవారు, ఇంకా… 8, 17, 26 తేదీలలో జన్మించినవారు  ధరించాలి. మయూర నీలం నెమలి కంఠం రంగులో ఉండుట వలన దీనికి ఆ పేరు వచ్చినది. దీనిని ధరించుట వలన జడత్వ బుద్ది నశించి, ఉత్సాహం కలుగును. మకరరాశి జాతకులా..? అయితే నవరత్నాలలో నీలరత్నాన్ని ధరించడం శ్రేష్టం.

నీలరత్నాన్ని ధరించడం ద్వారా ముఖకాంతి, నేత్రకాంతిని పెంపొందింపజేసుకోవచ్చునని శాస్త్రం చెబుతోంది. ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి కావున, ఈ రాశిలో జన్మించిన జాతకులు తప్పకుండా నీలంను ధరించాలి. ఇంద్రనీలం, మయూర నీలం, నీలమణి అనే మూడు రకాల్లో రత్నాల శాస్త్ర నిపుణులను సంప్రదించి మకరరాశి జాతకులు ధరించడం ఎంతో మంచిది.

ఫ‌లితాలు
జ్యోతిష పరంగా అనుకూలమైన వారు ధరించినప్పుడు, ఆ రత్నము వలన సంపద, కీర్తి, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి, మానసిక ప్రశాంతత, మంచి సంతానం, ధరించిన వారికి అందిస్తుంది. దొంగల భయం నుంచి, ప్రమాదాల నుంచి, అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కవచంలా ఉంటుంది. నీలం ధరించడం వలన రక్తశుద్ది జరగడమే కాకుండా.. తలనొప్పి, వాంతులు, కళ్ళుతిరగడం వంటి అనారోగ్యాలు రాకుండా వుంటాయి. గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. నీలమును ధరించుట వల్ల‌ శని గ్రహ ప్ర‌భావంతో కలిగే దోషాలు పోవుటయే కాక సకల సంపదలు సిద్ధించును. అంతేగాకుండా రాత్రిపూట వచ్చే భయంక‌ర‌ కలలను కూడా నివారిస్తుందని వారు చెబుతున్నారు.

ధ‌రించే విధానం
నీలం ర‌త్నాన్ని శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. వెండిలోహముతో పొదిగించుకుని ఎడమచేతి మధ్య వేలుకు ధరించాలి. ధరించేందుకు ముందు పాలులో గానీ, గంగా జలములో గానీ నీలరత్నాన్ని శుద్ధి చేయాలి. అదే విధంగా శనిధ్యాన శ్లోకమును 190 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా దారిద్ర్యాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.

Hessonite

 గోమేధిక‌ము విశిష్ట‌త‌

గోమేధిక‌ము రాహు గ్రహానికి సంబంధించిన ర‌త్న‌ము. ఇది ఇన్ ఆర్గానిక్ జెమ్ స్టోన్. ఇవి మంచి తేనె రంగులో మెరిసిపోతుంటాయి. గోమేధికాన్ని ఇంగ్లీషులో ‘హెసోనైట్’ అంటారు. మంచి గోమేధికాలకు శ్రీలంక ప్రసిద్ది. బంగారు రంగులలోనూ గోమేధికాలు దొరుకుతాయి.

రాహు గ్రహానికి ఆది దేవత గోమాతగా వేదములందు పేర్కొన‌బ‌డింది. అట్టి గోమాత యొక్క మూత్రం వంటి రంగు కల్గిన గోమేధికం రాహు సంబంధమనుటలో నిస్సందేహం లేదు. కావున రాహుగ్రహ ప్రీతికరమైన గోమేధికమును ధరించుట వలన జాతక గోచారములందలి రాహు దోషాలు నివారింపబడి సకల శ్రేయోభివృద్ధి క‌లుగుతుంది.

ఎవ‌రు.. ఎప్పుడు ధ‌రించ‌వ‌చ్చు..?
ఆర్ద్ర, స్వాతి, శతభిషం జన్మనక్షత్రాలవారు ఏ సమయమునందైనను గోమేధికమురత్నమును ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములవారు మాత్రం తమ జన్మ సమయమునందలి గ్రహస్థితిననుసరించి, బలవంతుడైన రాహువు దుష్ట స్థానములందున్న దశాంతర్దశ స‌మ‌యంలో మాత్రమే గోమేధికం ధరించడం మంచిది. ఎవరికైనను వారి జన్మ జాతకములందు రాహువు గ్రహము షడ్భలములు అషటకవర్గ బిందుబలము కలిగి జన్మలగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ అధిపతితోకూడుట చూడబడుట, తటస్థించినను, ఆ స్థానమునందు ఇతర పాపగ్రహ దృగ్యోగవేధా సంభంధము కలిగినను రాహువు బహుదోషప్రదుడు, 2-5-7 స్తానములందు పాప గ్రహ సంబంధము కలిగి రాహు ఉన్నను, గురు సంబంధంను కలిగి ధనుర్మీన రాశుల్లో ఉన్నను, గురు సంబంధమును కలిగి రాహువు ఉన్నను, శని కుజుల సంభంధము కలిగి జన్మలగ్నమునందున్నను, అధిక దోషప్రదుడై అపకారముల నొనర్చును, చంద్రుడు బలహీనుడై ఉండగా బలవంతుడైన రాహువు నవమస్థానములో ఉండిన (శుభ దృష్టి లేక )బాలారిష్టంలు కలుగచేయగలడు.

రాహువునకు జాతకమునందలి అశుభ దశాంతర్దశలు ప్రప్తించినప్పుడు, గోచారమునందు రాహువు సంచారము దోషయుక్తమైన కాలమునందు వివిధ రూపములలో కష్టనష్టాలు, ఈతి బాధలు, దారున పరిస్థితులు తటస్థించి దుఃఖ ప్రదముగా ఉండగలదు. అతేకాక దుష్టగ్రహమైన రాహుగ్రహ ఫలికాలంలో కుటుంబకలహాలు, అజన విరోధములు, ఆస్తినష్టము విద్యాభంగము, వ్యాపార నష్టము, కోర్టు చిక్కులు, రోగచోర రుణబాధలు, వృత్తి ప్రతికూలత, ఆర్థిక, సామాజిక బాధలు, దెయ్యములు, ప్రయోగాదిగాగల దుష్టగ్రహ బాధలు, ఉన్మాదము, మతిభ్ర‌మ మొదలగు మానసిక వ్యాధులే గాక కీళ్ళవాతాలు నులి పురుగులు చేరుట, కడుపులో ఏలిక పాములు విరోచనాలు (అతిసారం) లివరు, పశికర్లు, గర్భకోశంలో వాపు, కాన్సర్, కడుపునొప్పి, మలబద్దకము మెదడుకు సంభంధించిన అనేక వ్యాధులు రహస్యముగా ఆచరించే చెడుపనులు, దుష్టుల స్నేహం వలన ఆపదవలు మొదలగు అనేక కష్ట నష్టములు దుఃఖబాధలు సంభవింపగలవు.

ఫ‌లితాలు
ఇది రాహుగ్రహానికి సంబంధించిన రత్నము క‌నుక రాహుగ్రహ దోషములన్నింటినీ పరిహరింపజేయుటమే గాక కుటుంబసౌఖ్యం జనానుకూలత, విధ్యాభివృద్ది, కృషిలో విజయం, ఆర్ధికపుష్టి, వృత్తిలాభం, సమాజంలో గౌరవం, ఆరోగ్యం, స్త్రీమూలక ధనప్రాప్తి, ఆకస్మిక ద్రవ్య లాభము, వారసత్వపు ఆస్తిసంక్రమించుట, రుణబాధలు తీరిపోవుట, సన్మిత్రలాభం, బందువుల ఆదరణ క‌లుగుట, మాతామహ వర్గీయుల ద్వారా ఉపకారం, రాజకీయ, కోర్టు వ్యవహారములందు పరిష్కారము, గంగా స్నానఫలము, దైవభక్తి స్థిరబుద్ది, సన్మానమార్గము ధనాభివృద్ది, ఆకస్మిక ప్రమాదములనుంచి, దుష్టగ్రహ పీడల నుంచి రక్షణ, శతృనాశనము, మిత్రవర్గముల వారి సహాయ సంపత్తి లభించుట, గండములు తోలగిపోవుట, దీర్ఘవ్యాధుల నుండి విముక్తి, సంపూర్ణారోగ్యము, భూగృహక్షేత్ర సంపద కలుగుట, అఖండకీర్తి, జయము క్షేమము, ఉల్లాసము కలుగగలవు.

గోమేధికం ధరించే పద్దతి
దోషములు లేని ఉత్తమ లక్షణంలు గల గోమేధికం బంగారం లేక పంచలోహముల ఉంగరమునందు బిగించి ధరించ‌డం వ‌ల్ల‌ అభీష్టము చేకూరగలదు. వెండి గోమేధికమును బిగించుటకు పనికిరాదు. ఈ రత్నమును బిగించు ఉంగరంపై భాగముపై చేట ఆకారంగా పీఠము ఏర్పాటుగావించి అడుగుభాగం మాత్రం రంద్రము నుంచి గోమేధికంను పీఠం మధ్య భాగంలో బిగించి శుద్ది గావించి ధరించవలెను.

రాహుగ్రహస్తమైన సూర్య లేక చంద్ర గ్రహణములు సంభవించిన కాలమునందుగానీ, ఆదివారము పుష్యమీహస్తా నక్షత్ర యుక్తమైనపుడు కానీ, సప్తమీ ఆదివారము వచ్చినప్పుడుగానీ అదే విధంగా అమావాస్య ఆదివారము నాడు గానీ మకర సంక్రాంతి పుణ్యకలమునందుగానీ సూర్యుని హోరా జరిగే సమయంనందుగానీ శాస్త్రీయంగా తయారు చేయబడిన ఉంగరం నందు గోమేధికమును బిగించాలి. ఆ తదుపరి ఉంగరంను ఒక రోజంతా కాకరాకు పసరయందు, మరుసటిరోజు గోమూత్రము నందు, 3వ రోజును ఆవుపాల యందు నిద్ర గావింపజేసిన పరిశుద్దము కాగలదు. ఆ త‌ర్వాత‌ పంచామృత స్నానం గావింపజేసి శాస్త్రోక్తకంగా షోడశోపచార పూజలు గావింపజేసి శుభముహుర్తమునందు వేలికి ధరించడం మంచిది.

ధరించే వారికి తారాబలం చంద్రబలంలు కలిగియున్న శుభతిధులు కలిగి ఉన్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో మృగశిర, ఉత్తర, చిత్త, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రములయందు వృషభ, మిధున, సింహం కుంభలగ్నములు జరుగు సమయములందు పూజించిన ఉంగరంను ధరించవలెను. ధరింపబోవు సమయంనకు ముందు ఉంగరంను కుడి హస్తమునందు ఉంచుకొని దక్షిణ ముఖంగా తిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి “ఓం భ్రీం ఐం హ్రీం శ్రీం తమోగ్రహాయ స్వాహా” అను మంత్రంను 108 పర్యాయాలు జపించి ఉంగరమును మ‌రోసారి క‌ళ్ల‌కు అద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక) వేలికి ధరించాలి. స్త్రీలు ఎడమ వ్రేలికి ధరించుట ఆచారము ఉంది. నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించు ఉంగరములో గోమేధికముతో బాటుగా ముత్యాలను, వైడూర్యములు చేర్చి ఉంగరమును ధరించకూడదు.

Nvaratnalu2

నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది.ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన త ర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.

నవరత్నములు ధారణా లాభములు

నవగ్రహ వైభవం లో చెప్పిన విధంగా మధుమేహము[చెక్కెర వ్యాధి] కలవారు,స్త్రీ లోలురు,రాజకీయవేత్తలు,ఆకర్షణ లోపము వున్నవారు వజ్రము ధరిచుతుపయుక్తము.

నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు. గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి.

పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు. పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిది.

Navaratnalu

BIRTH STAR [జన్మ నక్షత్రము] STONE [రత్నము]
ASHVINI [అశ్వని] CAT’S EYE [వైడూర్యము]
BHARANI [భరణి] DIAMOND [వజ్రము]
KRITIKA [కృత్తిక] RUBY [కెంపు]
ROHINI [రోహిణి] PERAL [ముత్యము]
MRIGASIRA [మృగశిర] CORAL [పగడము]
ARUDRA [ఆరుద్ర] SARDONYX [గోమేదికము]
PUNARVASU [పునర్వసు] CARBUNCLE [కనక పుష్యరాగము]
PUSHYAMI [పుష్యమి] SAFIRE [నీలము]
ASLESHA [ఆశ్లేష] GREEN [ఆకుపచ్చ]
MAGHA [మఖ] CAT’S EYE[వైడూర్యము]
PURVAPALGUNI [పుబ్బ] DIAMOND [వజ్రము]
UTTARAPALGUNI [ఉత్తర] RUBY [కెంపు]
HASTA [హస్త] PEARL [ముత్యము]
CHITTA [చిత్త] CORAL [పగడము]
SWATHI [స్వాతి] SARDONYX [గోమేధికము]
VISHAKAH [విశాఖ] CARBUNCLE [కనక పుష్యరాగము]
ANURADHA [అనురాధ] SAFIRE [నీలము]
JESTA [జ్యాస్ట] GREEN [ఆకుపచ్చ]
MOOLA [మూలా] CAT’S EYE[వైడూర్యము]
PURVASHADA DIAMOND [వజ్రము]
UTTARASHADA [ఉత్తరాషాడ] RUBY [కెంపు]
SRAVANAM [శ్రవణం] PEARL [ముత్యము]
DHANISHTA [ధనిష్ట] CORAL [పగడము]
SATABHISHAM [శతభిషం] SARDONYX [గోమేధికము]
PURVABHADRA [పూర్వాభాద్ర] CARBUNCLE [కనక పుష్యరాగము]
UTTARABHADRA [ఉత్తరాబాద్ర] SAFIRE [నీలము]
RAVATI [రేవతి] GREEN [ఆకుపచ్చ]

నవరత్నాలు ధరించే విధములు

నవగ్రహాలకు సంబంధించి అంతర్ధశలు ఉన్నట్టే గ్రహ మహర్ధశ ఉంటుంది. అంతర్ధశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్ధశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి.దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్ధశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్ధశ పదహారేళ్ల పాటు ఉంటుంది.ఈ మహర్ధశ కాలంలో గురు జపం చేయించిన త ర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్ధశ ఇరవై ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్ధశ పందొమ్మిదేళ్ల పాటు ఉంటుంది. ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి.రాహు మహర్ధశ పద్దెనిమిదేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్ధశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్ధశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.

నవరత్నములు ధారణా లాభములు

నవగ్రహ వైభవం లో చెప్పిన విధంగా మధుమేహము[చెక్కెర వ్యాధి] కలవారు,స్త్రీ లోలురు,రాజకీయవేత్తలు,ఆకర్షణ లోపము వున్నవారు వజ్రము ధరిచుతుపయుక్తము.

నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దరిద్రముతో బాధపడుచున్న వారు, కీళ్ళ నొప్పులు కలవారు, గ్యాస్ ట్రబుల్, కుసుమ వ్యాధులు కలిగిన వారు దీన్ని ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతాన లోప నివారణకు ఉపయోగించపచ్చు. గోమేధకమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి.

పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే ధరించవచ్చు. పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిది.

నవ రత్నాలు

కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైఢుర్యాలు

Nine Gems Ruby, Pearl, Topaz, Jakarn, Emarald, Dimond, Catys Eye, Saffair, Koral

1. కెంపు

మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులలో పుట్టినవారు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి. దానిమ్మ గింజ రంగులో ఉంటుంది.

2. ముత్యం

వృషభ, కర్కాటక రాశులవారు.రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 2, 11, 20, 29 సంఖ్యలలో జన్మించినవారికి.
3. పగడం మేష,కర్కాటక, ధనుస్సు, వృచ్చిక రాశివారు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 9, 18, 27 తేదీలలో జన్మించినవారికి.

4. పచ్చ

కన్యా రాశివారు. ఆశ్రేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 5, 14, 23 తేదీలలో జన్మించినవారు పచ్చను ధరించాలి.
5. పుష్యరాగం
పునర్వసు, విశాఖ, పూర్వ బాద్ర , నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు కనక పుష్యరాగం ధరించాలి.

6. వజ్రం

భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 6, 14, 24 తేదీలలో జన్మించినవారు వజ్రం ధరించాలి.

7. నీలం

పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్రాలలో పుట్టినవారు. వృషభ, తుల, మకర, కుంభ లగ్నములలో పుట్టినవారు, మరియు 8, 17, 26 తేదీలలో జన్మించినవారు ధరించాలి.
8. గోమేధికం
అరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 4, 13, 22, 31 తేదీలలో జన్మించినవారు ధరించాలి.
9. వైఢూర్యం
అశ్విని, ముఖ, మూల నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 7, 16, 25 తేదీలలో జన్మించినవారుతేదీలలో జన్మించినవారు ధరించాలి.

rudra

శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి.ఋషులు, మునులు, రాక్షసులు మరియు దేవతలు అందరూ వీటిని ధరించువాఋ అనీ పురాణాది ఇతిహాసములలో తెలుయుచున్నది.. ఇప్పటికీ స్వాములు, బ్రాహ్మణులూ, పూజారులు, దైవజ్ఞులు, గురువులు మొదలగువారు వారు వీటిని ధరిస్తూవుంటారు.మరయు పుజగ్రుహములలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ వుంటారు. వీటిలో చాల రకముల రుద్రాక్షలు వున్నాయి ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను కలిగి వుంటాయి. ఇవి ఒకటి నుంచి పదిహేను పద్దెనిమిది రకముల వరకూ వుండు అవకాశమున్నది.
1. ఏఖ ముఖి ఇది అత్యంత విలువ కలిగినది దీనిని ప్రత్యక్ష శివుని రూపముగా భావించుతారు.2. ద్విముఖి ఇది అర్ధనారిస్వరులు [శివ పార్వతులు] గా భావిస్తారు.3. త్రి ముఖి దీనిని శివ,విస్ట్నుభ్రహ్మ, రూపముగా భావిస్తారు.4. చతుర్ ముఖి దీనిని బ్రహ్మ స్వరూపమని కొందరు చతుర్ వేదాల స్వరూపమని కొందరు భావిస్తారు.5. పంచ ముఖి దీనిని పచముఖ రూపముగా లక్ష్మి స్వరూపముగా భావిస్తారు.6. షణ్ముఖి ఇది ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు.7. సప్త ముఖి కామధేను స్వరూపము గా భావిస్తారు.8. అష్ట ముఖి గణనాధుని[విఘ్నేశ్వర] స్వరూపముగా భావిస్తారు.9. నవముఖి నవగ్రహస్వరూపముగానె కాక ఉపాసకులకు మంచిదని భావిస్తారు

10.దస ముఖి దీనిని దశావతార రూపముగా విశేసించి స్త్రీలు వీటిని ధరిచుట మంచిదని భావించుట జరుగుతున్నది.

మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి “3”ముఖాల రుద్రాక్ష గాని,”1″,”3″,”5″ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.”పగడంస్టోన్”ధరించవచ్చును. వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి “6” ముఖాల రుధ్రాక్ష గాని, “4”,”6″,”7″ ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును.”డైమండ్ స్టోన్”ధరించ వచ్చును. మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి “4” ముఖాల రుధ్రాక్ష గాని,”4′,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును.”ఆకుపచ్చ స్టోన్”ధరించ వచ్చును..కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి “2”ముఖాల రుధ్రాక్ష గాని ,”2″,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును.”ముత్యం స్టోన్”ధరించ వచ్చును.
సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి “1”ముఖం గాని, “1”,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”కెంపు స్టోన్”ధరించ వచ్చును. కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి “4”ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”ఆకుపచ్చ స్టోన్”ధరించ వచ్చును..తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి”6″ముఖాల రుధ్రాక్ష గాని ,”4′,’6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును..”డైమండ్ స్టోన్”ధరించ వచ్చును.
వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి “3”ముఖాల రుధ్రాక్ష గాని,”2″,”3″,”5″ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును..”పగడంస్టోన్”ధరించవచ్చును. .థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర,నక్షత్రాల వారికి “5”ముఖాల రుధ్రాక్ష గాని “1”,’3″,”5″ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును.”కనక పుష్యరాగం స్టోన్”ధరించ వచ్చును. మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి “7”ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”నీలం స్టోన్”ధరించ వచ్చును. కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి”7″ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.”నీలం స్టోన్”ధరించ వచ్చును.మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి”5″ముఖాల రుధ్రాక్ష గాని,”2″,”3″,”5″రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును. “కనక పుష్యరాగం స్టోన్”ధరించ వచ్చును.

 

 

Mesham-Lagnam- Grahamulu

Mesham-Lagnam- Grahamulu
మేష లగ్నస్థ గ్రహములు 
మేష‌ల‌గ్న‌స్థ గ్ర‌హ‌ జాత‌కులు చురుకైన తత్వం క‌లిగి ఉంటారు. కోప స్వభావం ఉండును. వీరికి దీర్ఘ‌కాల శత్రువులు ఉంటారు. దైర్యము, ఆశ అధిక‌మే. ఇక వీరు మంచి భోజన ప్రియులు.
మేషలగ్నాధిపతి కుజుడు. కుజుడు లగ్నాధిపతి (లగ్నం అంటే జన్మరాశి చక్రంలో మొద‌టి స్థానం) కాక అష్టమాధిపతి (అంటే జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 8వ స్థానం) కూడా. తృతీయ (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి మూడ‌వ స్థానం) షష్టాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఆర‌వ స్థానం) బుధుడు, ధన (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి రెండ‌వ స్థానం) సప్తమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఏడ‌వ స్థానం) శుక్రుడు, వాహనాధిపతి (అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి నాలుగ‌వ స్థానం) చంద్రుడు, పంచమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఐద‌వ స్థానం) సూర్యుడు, భాగ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి తొమ్మిద‌వ స్థానం) వ్యయాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ప‌న్నెండ‌వ స్థానం) గురువు, రాజ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ప‌ద‌వ స్థానం) లాభాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ప‌ద‌కొండ‌వ స్థానం) శని.
మేష లగ్నములో ఉండే గ్రహములు – ఫలితాలు
సూర్యుడు 
మేషలగ్నానికి సుర్యుడు పంచమాధిపతి.. కనుక సూర్యుడు మేషలగ్నానికి శుభుడు. పంచమాధిపతి లగ్నములో ఉచ్ఛస్థితిలో ఉపస్థితమై ఉండ‌టం వ‌ల్ల ఈ జాత‌కుడు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాడు. విద్యారంగంలో రాణిస్తాడు. ఇక‌ ఆర్ధిక వ్య‌వ‌హారాల పరిస్థితి బాగుంటుంది.  సుర్యుడి ప్రభావం వల్ల‌ సంతాన ప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు తన పూర్ణ దృష్టితో సప్తమ భావమైన తులారాశిని చూస్తాడు కనుక తులారాశి అధిపతి సూర్యుడు. కనుక జీవితభాగస్వామి అందముగా ఉంటారు. జీవిత భగస్వామి సంయోగము లభిస్తుంది. అయితే వైవాహిక జీవితములో ఒడిదుడుకులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.
చంద్రుడు
చంద్రుడు మేషలగ్నానికి సుఖస్థానాధిపతి. ఈ కార‌ణం వ‌ల్ల ఈ జాతకుడు శాంత స్వభావుడిగా క‌నిపిస్తాడు. అయితే కొంటెతనం కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్ట‌ప‌డ‌తారు. వీరికి మాతృమూర్తి నుంచి, మాతృమూర్తి ప‌క్ష‌ము నుంచి స‌హాయం అందుతుంది. అంతేకాదు ప్రభుత్వ పక్షము నుంచి ప్రయోజనాలు అందుతాయి. సప్తమంలో తులారాశి మీద చంద్రుడి దృష్టి పూర్ణముగా ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామి కళాదృష్టి, గుణసంపద కలిగి, సహాయ సహకారాలు అందించే వారై ఉంటారు. ఇక ఈ జాత‌కులు భూమి, భవనము, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. ప్రకృతి ఆరాధన, సౌందర్యపిపాస కలిగి ఉంటారు. శీత‌కాలంలో వీరు ఇబ్బంది ప‌డ‌తారు. ద‌గ్గు, జలుబు వంటి బాధలు బాధిస్తాయి. ఇంకా చలి సంబంధిత వ్యాధుల‌కు అవకాశము క‌ల‌దు.
కుజుడు 
కుజుడు మేషలగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి. లగ్నాధిపత్యము వలన అష్టమాధిపత్య దోషం పోతుంది. కుజుడు లగ్నస్థుడు కనుక ఈ జాతకుడు బ‌ల‌మైన శ‌రీర‌ము క‌లిగి ఉంటారు. సాహ‌స‌వంతులుగాను క‌నిపిస్తారు. కండ బ‌ల‌ముతో పాటు. కఠినమైన పనులను కూడా ఆత్మబలముతో చేయకలిగిన స‌త్తా ఉంటుంది. సమాజంలో  పేరు, ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. బలహీనుల పట్ల వీరి హృదయములో సానుభూతి ఉంటుంది. కుజుడు చతుర్ధ స్థానమును, సప్తమ స్థానమును, అష్టమస్థానమును చూస్తాడు. దీని కారణముగా భూమి, వాహన సౌఖ్యము లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్ప‌డ‌తాయి.
బుధుడు
బుధుడు మేషలగ్నానికి తృతీయ, షష్టమభావాధిపతిగా అశుభము కలిగించును. లగ్నములో ఉన్న బుధుడు వ్యక్తిని జ్ఞానిగా, బుద్ధిమంతుడిగా చేస్తుంది. బుధ దశలలో బంధు మిత్రులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. షష్థమ స్థానాధిపతిగా బుధుడు ఉదర సంబంధమైన వ్యాధులు, మూర్చ వ్యాధి, మతిమరుపు ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. వ్యాపారములో వీరికి సఫలత లభిస్తుంది. బుదుడి సప్తమ దృష్టి కారణంగా సంతాన సంబంధాలలో సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సప్తమమైన తులారాశి మీద బుధుడి దృష్టి కారణముగా జీవిత భాగస్వామి గుణవంతుడుగా ఉంటాడు. వైవాహిక జీవితం సాధారణముగా ఉంటుంది.
గురువు 
మేషలగ్నానికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి. ద్వాదశస్థానాధిపత్యము కారణము వ‌ల్ల‌ గురువు మేషలగ్నానికి అకారణమైన అశుభ ఫలములు ఇస్తాడు. అయినా త్రికోణాధిపత్యంతో అశుభము తొలగిపోతుంది. మేషలగ్న గురువు కారణముగా జాతకుడు మంచి మేద‌స్సు క‌లిగి ఉంటారు, జ్ఞాని అవుతారు. ఉజ్వలమైన ప్రభావవంతమైన వాక్కు వీరి సొంతం. వీరికి ప్రజా సన్మానం, పేరు ప్ర‌ఖ్యాత‌లు కలుగుతాయి. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ భావమును చూస్తాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. శత్రు స్థానమైన తులారాశి మీద గురువు దృష్టి ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామికి మనోకలతలు ఉంటాయి. నమస్థానమైన ధనసు మీద గురువు దృష్టికి కారణంగా తండ్రికి శుభములు కలుగుతాయి.
శుక్రుడు
శుక్రుడు మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి. శుక్రుడు లగ్నస్థము కార‌ణంగా స‌మ‌స్య‌లు కలిగిస్తాడు. ఈ జాత‌కులు అందంగా కనిపించినా ఆరోగ్యసమస్యలను మాత్రం ఎదుర్కొంటారు. శుక్ర దశలో వీరు ఊహించ‌ని కష్టాల‌ను ఎదుర్కొంటారు. లగ్నస్థ శుక్రుడి కారణముగా స్త్రీ పురుషల మద్య ఆకర్షణ ఉంటుంది.
శని 
లగ్నస్థ శని మేషలగ్నముకు దశమాధిపతిగా శుభాలను, ఏకాదశాధిపతిగా అశుభాల‌ను కలిగిస్తాడు. లగ్నస్థ శని కారణంగా ఈ జాతకుడు సన్నముగా పొడవుగా ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, దశమ స్థానాలపై దృష్టి సాగిస్తాడు. కనుక జాతకుడికి బంధుమిత్రుల సహకారము లభించ‌డం క‌ష్ట‌మే. ఉద్యోగ వ్యాపారాలలో నిలకడ ఉండదు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు త‌లెత్తుతాయి.
రాహువు 
మేష లగ్నములో రాహువు న‌మ్మ‌కాన్ని పెంచుతాడు. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. ఉదర సంబంధిత వ్యాదులు ఎదుర్కొంటారు. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో ప‌ట్టుద‌ల‌తో సఫలత సాధిస్తారు. వ్యాపారము చేయాలన్న కోరిక ఉంటుంది. అయితే ఉద్యోగము అధిక సఫలత ఇస్తుంది. రాహువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. వైవాహిక జీవితం బాధిస్తుంది. మిత్రులు, సహోదరులు సహకరిస్తారు.
కేతువు 
మేష లగ్నస్థ కేతువు కారణం వ‌ల్ల శారీరక దాడుర్యం కలిగి ఉంటారు. ఆత్మస్థ‌ర్యం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కనుక వీరి శత్రువులు భయభక్తులతో ఉంటారు. సమాజంలో గౌరవం, ఖ్యాతి లభిస్తుంది. రాజనీతి, చతురత కలిగి ఉంటారు. మాతృ వర్గము నుంచి స‌హ‌య‌స‌హ‌కారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి, సంతానం నుంచి అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వీరికి వ్యాధుల బెడ‌ద ఉండ‌దు.

Vrushabha-Lagnam- Grahamulu

వృషభ లగ్న – ద్వాదశ గ్రహములు – ఫలితాలు 
  వృషభ లగ్నమున జ‌న్మించిన వారు గుణవంతులు-ధనవంతులు. గురు భక్తి కలవారు. ఈ జాత‌కులు ధైర్యశాలిగాను, శౌర్యవంతుడుగాను ఉండును. ఈ జాతకునకు గురు, శుక్ర, చంద్రులు పాపులు అగుదురు. రవి, శనులు శుభులు శని రాజయోగకారకుడు. గురునకు మారక లక్షణములున్నాయి.
సూర్యుడు
సూర్యుడు వృషభరాశికి చతుర్ధాధిపత్యం వహిస్తాడు. కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభంగా మారే గ్రహమై మంచి ఫలితాలను అందిస్తాడు. లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు, ఉత్సాహం అందిస్తాడు. మంచి వాక్చ‌తుర్యం వీరి సొంతం.  ఆకర్షణీయమైన వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలమే. పంచమాధిపతి లగ్నంలో ఉండ‌టంతో సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం అధికం. సూర్యుడి పూర్ణదృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృశ్చిక లగ్నం మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వాముల, మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. భాగస్వాములతో ఉద్రేక పూరిత వాతావరణం ఏర్పడినా విశ్వాస పాత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు.
చంద్రుడు 
వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి. అయితే చంద్రుడు వృషభంలో ఉచ్ఛస్థితిని పొంద‌డంతో చంద్రుడు వృషభ లగ్న జాతకులకు మంచి ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు. జల కారకుడైన శుక్రుడు ఆధిపత్యం వహించే వృషభ లగ్నంలో శీతల స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. వీరికి జలుబు, దగ్గు, ఆయాస సంబంధిత వ్యాధులు రావచ్చు. ఈ జాత‌కులు గుణవంతులుగా, దయాస్వభావులుగా ఉంటారు. విలాసవంతమైన జీవిత‌మంటే ఇష్ట‌ప‌డ‌తారు. తల్లితో సత్సంబంధాలు ఉంటాయి. మాతృవర్గ బంధువులతో సత్సంబంధాలు కొన‌సాగుతాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కళలంటే ఆసక్తి ఎక్కువ. కల్పనా శక్తి అధికం. జలం, నౌకా ప్రయాణం, జల ప్రదేశాలు వీరిని ఆక‌ట్టుకుంటాయి. వీరికి కళాభిమానం ఎక్కువ. కళారంగ సంబంధ వృత్తులలో వీరు రాణిస్తారు.చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమస్థానం.. మిత్ర స్థానమైన వృశ్చికం మీద సారిస్తాడు.. కనుక వీరికి అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు.
కుజుడు 
వృషభ లగ్నానికి కుజుడు సప్తమ, ద్వాదశాధిపతి. కేంద్రాధిపత్యం వహిస్తాడు కనుక కుజుడు వీరికి కారక గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు. వృషభ లగ్నంలో లగ్నాధిపతిగా కుజుడు ఉండ‌టంతో వ్యక్తి ఆకర్షణీయమైన, శ‌క్తివంత‌మైన శరీరం క‌లిగి ఉంటారు. విలాసవంతమైన జీవితం అంటే ఇష్ట‌ప‌డ‌తారు. కోప స్వభావం ఉంటుంది. వ్యవసాయ రంగం మీద మక్కువ చూపుతారు. భూములు కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. సాహసవంతమైన వృత్తులలో రాణిస్తారు. వ్యాపారంలో రాణించడం కష్టం. రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. లగ్నస్థ కుజుడు చతుర్ధ దృష్టిని మిత్ర స్థానం సింహం మీద ప్రసరిస్తాడు కనుక తల్లి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. తల్లి కోపస్వభావం కలిగి ఉంటుంది. లగ్నస్థ కుజుని సప్తమ దృష్టిని వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక కోపస్వభావం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవితభాగ‌స్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. అయితే జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్ప‌డుతాయి. లగ్నస్థ కుజుని అష్టమస్థాన దృష్టి మిత్ర్ స్థానమైన ధనస్సు మీద ప్రసరిస్తాడు… కనుక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భాగస్వాములతో వీరికి అభిప్రాయ బేధాలు వ‌స్తుంటాయి. భాగస్వామ్యం వీరికి సాధారణంగా ఉంటుంది.
బుధుడు
వృషభ లగ్నానికి బుధుడు ధనాధిపత్యం, పంచమాధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపతి లగ్నస్తుడు అవ్వ‌డంతో బుధుడు వృషభ లగ్నానికి కారక గ్రహమై మంచి ఫలితాలు అందిస్తాడు. లగ్నస్థ బుధుని కారణంగా వ్యక్తి బుద్ధికుశలత, సాహసం కలిగి ఉంటాడు. ఈ జాత‌కుల‌కు వ్యాపారం అనుకూలిస్తుంది. ధైర్యస‌హ‌సాలు వీరికి అధికం. సొంత నిర్ణయాలు తీసుకుని మనోబలంతో విజయం సాధిస్తారు. సాహసవంతమైన వృత్తులను స్వీకరించి నైపుణ్యం చూపించగలరు. శిక్షణకు సంబంధించిన ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తారు. బుధుని పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృషభం మీద ఉంటుంది. కనుక బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. స్నేపూరితమైన అందమైన ప్రేమను చూపించే జీవితభాస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయాలు అందుకుంటారు. భాగస్వామ్యం వీరికి అనుకూలం. వీరికి భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.
గురువు
వృషభ లగ్నానికి గురువు అష్టమ, ఏకాదశ స్థానములకు ఆధిపత్యం వహిస్తాడు. లగ్నస్త గురువు ఆకర్షణీయమైన సౌందర్యం ఇస్తాడు.. కనుక వృషభలగ్నానికి  అకారక గ్రహమై చెడు ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం ఇస్తాడు. ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఇస్తాడు. ఈ జాత‌కులు ఉద్యోగాల‌లో రాణిస్తారు. ధర్మగుణం, దయాగుణం కలిగి ఉంటారు. ధర్మకార్యాల పట్ల ఆసక్తులై ఉంటారు. గురువు పంచమ దృష్టి కన్యారాశి మీద ప్రసరిస్తాడు కనుక బుద్ధి కుశలత కలిగి సహాయ సహకారాలు అందించి గౌరాభిమానం చూపించే సంతానం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు సప్తమ స్థానమైన వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక గురువు మిత్రస్థాన దృష్టి జ్ఞానం కలిగిన గౌరవ అభిమానం చూపించి సహాయసహకారాలు చూపించే జీవిత భాగస్వామి లభిస్తుంది. గురువు నవమ స్థాన దృష్టి మకరం మీద ప్రసరిస్తాడు కనుక తండ్రితో సాధారణ సంబంధాలు ఉంటాయి.
శుక్రుడు
వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతిష్టమాధిపతి. లగ్నాధిపతిగా శుక్రుడు కారక గ్రహమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. లగ్నాధిపతిగా శుక్రుడు అందమైన శరీరం ఇస్తాడు. అరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి వ్యాధులు ఉంటాయి. మనోబలం అధికం. జనాకర్షణ కలిగిఉంటారు. కళారంలో వీరు ప్రతిభ చూపగలరు. కళాసంబంధిత వృత్తులలో రాణిస్తారు. వలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి చూపుతారు. సుఖజీవితం కొరకు ఎక్కువగాఖర్చు చేస్తారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలను చేపడతారు. ఆర్ధిక పరిస్థితిబాదా ఉంటుండీ. ధనార్జన బాగా చేస్తారు. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన వృశ్చికం మీద సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి విలాసాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కోపస్వభావం కలిగిన అందమైన ప్రేమించే జీవిత భాగస్వామి లభిస్తుంది. వైవాహిక జీవిత సుఖం సాదారణం. మిత్రులు, భాగస్వాములు ఉద్రేక పూరిత గుణం కలిగి ఉంటారు. భాగస్వామ్యం వీరికి సాదారణ ఫలితాన్ని ఇస్తుంది.
శని
వృషభ లగ్నానికి శని నవమ, దశమ స్థానాధిపత్యం వహిస్తాడు. ధర్మకర్మాధిపత్యం చేసే శని మిత్ర స్థానమైన వృషభ లగ్నానికి శుభుడై మంచి ఫలితాలు అందిస్తాడు. శని లగ్నాధిపత్యం వలన సన్నని ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటాడు. శ్రమించి ఉన్నత కార్యసాధన చేస్తాడు. ఆర్ధిక స్థితి సాధారణం. తల్లితో వీరికి సఖ్యత సాధారణం. సోదరులతో అంత‌గా సఖ్యత ఉండదు. కఠిన స్వభావం కారణంగా ఇతరుల అసహనానికి గురవుతారు. శని తృతీయ దృష్టి కారణంగా సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. సోదరుల సహాయ సహకారం ఉండదు. లగ్నష శని పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక పరుష వాక్కులు పలికి క్రోధ స్వభావం కలిగి, శ్రమించే గుణం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయసహకారాలు అందవు. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. భాగస్వాముల సహకారం లభించదు. మిత్రుల సహకారం ఉండదు. లగ్నస్త శని నవమ స్థాన దృష్టి కారణంగా తండ్రితో సత్సంబంధాలు ఉండవు. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు, సహాయసహకారాలకు దూర‌మ‌వుతారు.
రాహువు  
వృషభ లగ్నస్థ రాహువు వ్యక్తికి రోగరహిత శరీరాన్ని ఇస్తాడు. రాహువు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితం కాస్త స‌మ‌స్య‌గా మారుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం ఉండదు. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
కేతువు
వృషభ లగ్నస్థ కేతువు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆకర్షణ ఉంటుంది. వివాహేతర సంబంధాల వలన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర‌య్యే అవ‌కాశం.
మీ… గోపి శర్మ సిద్ధాంతి
Share చేయండి

Midhunam-Lagnam- Grahamulu

మిధున లగ్నము  – ఫలములు

మిధున లగ్నమున జన్మించిన వారు, నల్లని అందమైన కళ్లు, రింగులు తిరిగిన జుట్టు, ఇతరుల భావములను చూడగానే చెప్పగల నేర్పులై ఉంటారు. సంగీత, నృత్యములలో ఆశక్తి. ఎక్కువకాలము స్వ గృహముననే ఉండువాడు అగును. లగ్నాధిపతి బుధుడు.

సూర్యుడు
మిధున లగ్నానికి సూర్యుడు తృతీయ స్థానాధిపతి. సూర్యుడు లగ్నంలో ఉండ‌టం వ‌ల్ల‌ ముఖవర్ఛస్సు ఉంటుంది. ఈ జాత‌కులు అందం, ఆకర్షణ, ఉదారస్వభావం కలిగి ఉంటారు. సాహసం, ధైర్యం, పురుష లక్షణం ఎక్కువ‌గానే ఉండును.

కుజుడు 
మిధున లగ్నానికి కుజుడు షష్టమ, ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు.. కనుక అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. మిధున లగ్నంలో కుజుడు ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు, శక్తివంతుడు అవుతాడు. అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదుర‌వుతుంది. విహార‌యాత్రలు చేయ‌డ‌మంటే వీరికిష్టం. ఈ జాత‌కులు ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో రాణిస్తారు. తల్లిదండ్రుల నుంచి అంత‌గా సహకారం లభించదు. శత్రువుల వల్ల‌ కష్టాలను చవి చూస్తారు. లగ్నస్థ కుజుని దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కనుక వైవాహిక జీవితంలో కష్టాలు ఎదుర‌వుతాయి.

బుధుడు 
మిధున లగ్నానికి లగ్నాధిపతిగా ఉండే బుధుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో ఉన్న బుధుడు వ్యక్తికి వాక్ధాటి, మంచి జ్ఞాపకశక్తి  క‌లిగి ఉంటారు. ఈ జాత‌కులు వృత్తి, వ్యాపార మెళుకువలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ధన సంపాదనా మార్గాలను మార్చుతుంటారు. ఈ కార‌ణం వ‌ల్ల‌ అర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వీరు రచయితగా, లేఖకునిగా, సంపాదకునిగా సఫలతను పొందుతారు.

గురువు 
మిధున లగ్నంలో గురువు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. ద్వకేంద్రాధిపత్య కారణంగా గురువు అకారక గ్రహంగా అశుభ ఫలితాలను ఇస్తాడు. లగ్నంలో గురువుతో బుధుడి చేరి ఉన్న అశుభ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. గురువు లగ్నంలో ఉండి వ్యక్తికి అందమైన శ్వేత వర్ణం కలిగిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. స్తయ వాక్కు, జ్ఞానం, చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఉంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు లభించును. గురువు తాను నాయ‌కత్వం వహించే విషయాలలో శుభ ఫలితాలు ఇస్తాడు. పుత్ర స్థానం, పంచమ స్థానం అయిన తుల, సప్తమ స్థానమైన ధనసు, నవమ స్థానమైన కుంభం మీద దృష్టిని సారిస్తాడు. ఈ కార‌ణం వ‌ల్ల‌ పుత్రులు, జీవిత భాగస్వామి, తండ్రి నుంచి అనుకూలత లభిస్తుంది.

శుక్రుడు
మిధున లగ్నానికి శుక్రుడు పంచమ, ద్వాదశాధిపతి. త్రికోణాధిపత్యం వహిస్తాడు కనుక శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో మిత్ర స్థాన‌ములో ఉన్న శుక్రుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో శుక్రుడు ఉన్న వ్యక్తి సన్నగా నాజూకుగా అందంగా ఉంటాడు. భౌతిక సుఖాలపట్ల వీరు అత్యంత ఆసక్తులుగా ఉంటారు. సుఖంగా ఉండడానికి ధన వ్యయం అధికంగా చేస్తారు. సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు. కనుక జీవిత భాగస్వామి మీద ప్రేమ కలిగి ఉంటారు. వివాహేతర సంబంధాలు ఉండే అవ‌కాశం.

శని
మిధున లగ్నానికి శని అష్టమ, నవమ స్థానాధిపత్యం వహిస్తాడు. త్రికోణ స్థానాధిపత్యం వలన అష్టమ స్థానాధిపత్య దోషం ఉండదు. దీంతో శని మిధున లగ్నకారులకు శుభ ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని అనారోగ్యానికి గురిచేస్తాడు. వాత, పిత్త, చర్మ రోగములు కలిగిస్తాడు. శని భాగ్య స్థానాధిపతి.. కనుక శనీశ్వరుడి మీద భక్తి కలుగుతుంది. లగ్నస్థ శని తృతీయ స్థానం శతృ స్థానం అయిన సింహం మీద, సప్తమ స్థానంగా ఉండే ధనసు మీద, దశమ స్థానంగా ఉండే మీనం మీద దృష్టిని పెడ‌తాడు కనుక కనిష్ట సోదరులతో విరోధం, కామం అధికంగా ఉండుట, ప్రభుత్వ పరమైన దండన అనుభవించుట కలుగవచ్చు. తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండవు. పరిశ్రమించగల గుణం ఉంటుంది.

రాహువు 
రాహువుకు మిధునం మిత్ర స్థానం. ఈ కారణంగా ఈ జాత‌కుడు మేధ‌స్సు కలిగి ఉంటారు. కుశలతతో కార్యాలను చేపడతారు. ఆరోగ్యం, ఆకర్షణ కలిగిన శ‌రీరం కలుగుతుంది. సాహసం అధికంగా ఉంటుంది. మిధున లగ్న జాతక స్త్రీలకు సంతానం పొందుటలో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. రాహువు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మీద సారిస్తాడు.. కనుక వైవాహిక జీవితంలో కలహాలు చోటు చేసుకుంటాయి.

కేతువు 
మిధున లగ్నంలో కేతువు వ్యక్తికి స్వాభిమానం కలిగిస్తాడు. ఒంటరిగా కార్య‌సాధ‌న‌కు దిగే స‌త్తా ఉండదు. ఇతరులతో క‌లిసి పని చేసేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. వ్యాపారం చేయ‌డంలో కోరిక ఉంటుంది. వీరికి స్వార్ధం కూడా అధికంగా ఉంటుంది. వాత పిత్త రోగాలు బాధిస్తాయి. కామం ఎక్కువ, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వివాహానంతరం కూడా వివాహేతర సంబంధాలు కొనసాగే అవ‌కాశం.