Menu

Anuradha

అనురాధ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో 17వది అనురాధ నక్షత్రము. అనురాధ నక్షత్రాధిపతి శని, ఆధిదేవతలు సూర్యుడు, రాజ్యాధిపతి కుజుడు, ఇది దేవగణ నక్షత్రము, జంతువు మహిషి, రత్నం గోమేధికం.

అనురాధ నక్షత్ర మొదటి పాదము
అనురాధ నక్షత్ర అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం కావడం వల్ల వీరు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకు స్వభావ రీత్య బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. మంచివే అయిన తమ అభిప్రాయాలను సూటిగా తెలియజేస్తారు. తండ్రితో అభిప్రాయభేదాలు కలుగ వచ్చు. తల్లితో ఏకీభవిస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ.ఈ నక్షత్ర జాతకులకు తొలి 17 సంవత్సరాల జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో కాస్త మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధద శ కారణంగా కళాశాల చదువులలో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 41 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.

వీరికి ప్రభుత్వపరమైన కర్మాగారాలు, పరిశ్రమలలో పని చేసే అవకాశాలు ఉంటాయి. అగ్ని సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

అనురాధ నక్షత్ర రెండవ పాదము  

వీరు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరికి బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని ప్రతిఘటిస్తారు. వీరికి మేధో సంబంధమైన వృ త్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వీరికి బుధ దశ అనుకూలించడం వల్ల విద్యలో ఉన్నతిని సాధించగలరు. 13 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా మాధ్యమిక తరగతి నుంచి చదువులలో మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 37 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత జీవితం సౌఖ్యంగా, సాఫీగా కొనసాగుతుంది.

అనురాధ నక్షత్ర మూడవ పాదము
వీరు ప్రజాకర్షణ కలిగి ఉంటారు. తమ అభిప్రాయాలను సూటిగా, ఆకర్షణీయంగా చెప్పగలరు. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరికి బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమించి పూర్తి చేస్తారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని సహించలేరు. కళాత్మకమైన వస్తువులను సేకరించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటారు.

వీరికి బుధ దశ బాగా అనుకులించడం వల్ల విద్యావంతులై ఉన్నత స్థితికి చేరుకుంటారు. 8 సంవత్సరాల వరకు మందకొడిగా సాగే విద్యాభ్యాసం తరువాత వచ్చే సంవత్సరాల  17 సంవత్సరాల బుధ దశ కాలంలో బాగా రాణిస్తుంది. కనుక వీరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. 25 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 32 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 75 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నక్షత్ర జాతకులకు ఇనుము, వెండి, ముత్యం సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. పరిశ్రమలు, కర్మాగారం, విమానాశ్రయాలు.. వంటి వాటిలో పనిచేసే అవకాశాలు ఉంటాయి.

అనూరాధ నక్షత్రము నాలుగో పాదము
ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు.

4 సంవత్సరాల  తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో బాగా రాణిస్తుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఉంది. కేతు దశ అనుకూలిస్తే విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 28 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 71 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.

అనురాధ నక్షత్రము గుణగణాలు

ఇది దేవగణ నక్షత్రము కావడం వల్ల ఈ నక్షత్ర జాతకులు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. పని పూర్తి చేయడంలో బద్ధకం ఉన్నా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని ఇతర విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు.

పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధు వర్గం నుంచి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. తండ్రి వ్యవహార తీరు నచ్చదు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది.