Menu

Arogyam Kosam Vasthu

ఆరోగ్యం కోసం వాస్తు

ఆరోగ్యం కోసం వాస్తు నియమాలు

గృహ వాస్తులో దోషాలు ఉంటే గృహస్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కొన్న స్థలంలోగాని, ఇంటిలోగాని ఏదైనా భాగం కోత ఏర్పడితే ఒక విధంగా, నీటి సమస్య అయతే మరో విధంగా, ఇంటి కప్పు దోషం అయతే ఇంకో విధంగా, వంటగదుల్లో ఫ్లాట్ ఫాంల అమరికలో దోషాలుంటే వేరే విధంగా, స్థలంలో గాలి, వెలుతురు సరిగా లేకుంటే ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. ఏవైనా దోషాలుంటే వాటిని చక్కగా వాస్తు ప్రకారం నూటికి నూరుశాతం సరిచేయవచ్చు.

గృహం అందంగా ఉండటమేగాకుండా, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తకుండా ఉండాలంటే.. నీరు ఎప్పుడూ తూర్పు వైపు ప్రవహించేలా ఉండాలి. నీటి టాంకర్‌పైన దక్షిణ, పశ్చిమ దిశల మధ్య ఉండాలి. నీటి లీకేజ్‌ వల్ల ధన నష్టం జరుగుతూనే ఉంటుంది. బెడ్రూంలో నీటికి సంబంధించిన చిత్రాలు కృత్రిమ వాటర్‌ ఫాల్స్‌ పెడితే కుటుంబ వివాదాలు, మనస్పర్థలు పెరుగుతాయి.

తలుపులు, కిటికీలు వాస్తు  ప్రకారం పద్దతిగా ఉండాలంటారు. ఇలా  ఉండటం వల్ల ఇంట్లోకి  గాలి,  వెలుతురు ధారాళంగా వస్తుంది. ఎలాపడితే  అలా తలుపులు,  కిటికీలు నిర్మించుకుంటే , గాలి,  వెలుతురూ సరిగ్గా ఇంట్లోకి  ప్రసరించక ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఈశాన్యంలో పడక గదులుంటే వాటిలో సంసారం చేసే భార్యాభర్తలు జీవితాంతం అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇంట్లో వుంటున్న గర్భవతులు పొరపాటున ఓ 10 నిముషాలు కూడా ఈశాన్య బెడ్‌రూంలో రెస్ట్ తీసుకోకండి. ఇలా చేసిన రోజే గర్భం పోయే ప్రమాదం ఉంది. ఆగ్నేయంలో బెడ్‌రూం వాడటం వలన చికాకులు ఎక్కువై, ఫిట్స్‌తో మానసిక వ్యాధుల బారిన పడవచ్చు. ఆగ్నేయ బెడ్ రూంలో వేసుకునే మంచం ఆ గదిలోని టాయ్‌లెట్ గోడకి తగిలే విధంగా కాని, లేదా టాయ్‌లెట్ గోడకి సమంగా కాని వేసుకోవద్దు. అలా చేయటం వలన మీ కుటుంబం మీద దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా పడుతుంది. రాత్రుళ్లు ఉలిక్కి పడటం, నిద్రలో భయాలు, చేతబడి చేశారనే అనుమానాలు మిమ్మల్ని పీక్కుతింటుంటాయి.

ఇంట్లో మీరు వాడే మంచాలు చెక్కతో చేసినవి అయితేనే బెస్ట్. వాటి క్రింద ఎటువంటి సామానులు పెట్టుకునే విధంగా చేయించవద్దు. అలాంటి మంచాలని వాడటం వలన గుండె జబ్బులు, బ్రెయన్ ట్యూమర్, బ్రెయన్ హెమరేజ్ లాంటి అనారోగ్యాల బారిన పడతారు. పడుకునే మంచాల క్రింద ఇనుప సామాన్లు, ఉప్పు, రోకలి, చీపురు, కిరోసిన్, పెట్రోల్, డీజిల్, ఇనుప డబ్బాలు, ఎటువంటి రసాయనిక పదార్ధాలు ఉంచవద్దు. బెడ్‌మీద పడుకున్నప్పుడు తలని ఎప్పుడూ దక్షిణ దిశగానే ఉంచాలి. ఇలా వుంచటం వలన మంచి నిద్రతో ఆరోగ్యం చక్కగా వుంటుంది. తూర్పు దిశ తల ఉంచటం మంచిది, పడమర కాస్త బెటర్. పడుకున్న గది ద్వారానికి కాని, తలుపులకి కాని కాళ్లు తగిలే విధంగా లేదా వాటికి ఎదురుగా పడుకోవటం చేయకండి. ఇలా చేయటం వలన పాదాలు, కాళ్లలో నరాల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బీమ్ క్రింద పడుకోవటం జీవితంలో ఒక్కసారి కూడా చేయకండి. అలా చేయటం వలన శరీరంలో అనారోగ్యానికి బీజం నాటుకున్నట్టే.

ఈశాన్యంలో వంటగది కనుక వుంటే అనారోగ్యపు ఆహారాన్ని వండుకుని తిన్నట్టే. ఇలా వంటగది వున్నట్టయతే ఆ ఇంట్లో నివసించే ఆడవారి మీద అనారోగ్యం ఏ క్షణానన్నా దాడి చేయవచ్చు. ప్రమా దాలు మీ ప్రక్కనే పొంచి వుండవచ్చు. ఆగ్నేయంలో వంటగది వున్నా గ్యాస్ స్టౌ ఉత్తరం వైపుగాని, లేదా ఈశాన్యం వైపున గాని వున్నట్టయతే అనారోగ్య సమస్యలను కావాలని తెచ్చుకున్నట్టే. నైరుతి దిశచూసే విధంగా కాని, దక్షిణ దిశ చూసే విధంగా కాని నుంచోని వంటచేయటం, భోజనం చేయటం, నీరు త్రాగటం చేయకండి. మీరు వంటగదిలో వంటకు గాని, తినేందుకు కాని చేసే ఏ పని అయనా సరే తూర్పు దిక్కులేదా, ఉత్తర దిక్కు చూసేలా ఉండి చేయడం మంచిది. ఇలా చేయటం వలన మీలోని జీర్ణశక్తి పెరుగుతుంది. వండిన పదార్ధాలలో రుచి శాతం బావుంటుంది. వంటగదిలో పొరపాటున కూడా మీ వీపు వెనుక భాగం వంటింటి తలుపువైపును చూసేలా నుంచోని వంట చేయకండి. ఇలా చేయటం వలన చాలా ప్రమాదకరమైన రోగాల బారిన పడే ప్రమాదం వుంది. కాళ్ల నొప్పులు, మోకాలు చిప్పల దగ్గర చెప్పలేనంత బాధ. వెన్ను నొప్పి, భుజాల నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్ మొదలైన రుగ్మతలు మిమ్మల్ని వెన్నాడుతుంటాయి.

ఈశాన్యంలో నీటి నిల్వలు కరక్ట్‌గా చేస్తే అన్ని రకాలుగా బావుంటుంది. కాకపోతే తెలీకుండా చేసే పనుల వల్లే డబ్బును అనుకోకుండా వచ్చే అనారోగ్యాలకు మంచినీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. ఎలాగంటే, భూగర్భంలో కట్టించే సంప్‌లు, వాటర్ ట్యాంక్‌లు భూమిలో సహజసిద్ధంగా వుండే అయస్కాంత శక్తిని చెడగొట్టేదిలా వుండకూడదు. ఈ అయస్కాంత శక్తి నైరుతి దిశనుంచి ఈశాన్య దిశకు ఎదురుగా ప్రవహి స్తుంటుంది. అటువంటి దాన్ని ఈశాన్య బిందు కోణం దగ్గర కట్ చేయకూడదు. అలా చేస్తేనే ఈశాన్యంలో కోత వచ్చినట్టుగా భావించాలి. ఇలా చేసిన చోట పిల్లలలో మానసిక ఎదుగుదల వుండదు. ఇంట్లో వాళ్లు ఇరవైనాలుగ్గంటలూ డిప్రెషన్‌లో ఉంటుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడూ డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వుంటుంది.

ఈశాన్యంలో మెట్లను నిర్మిస్తే హైటెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ లాంటి అనారోగ్యాల పంచన చేరుతారు. ఈ మెట్లని కనుక ఇంటికి మధ్యభాగంలో కాని, ఇంటికి గర్భంలో కాని కడితే చాలా పెద్ద అనారోగ్యం మీ ఇంట్లో తిష్టవేస్తుంది. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మెట్లు కట్టిన తర్వాత వాటి క్రింద ఖాళీ స్థలాన్ని టాయ్‌లెట్స్, బాత్ రూంలు, ఇంట్లో వేస్ట్ సామాన్లు పడేసే చిన్న గదిలా వాడుతుంటారు. ఇలా చేస్తే గుండెకు ఆపరేషన్ జరగటం, నరాల జబ్బులు, లివర్ జబ్బులు తగులుకుంటాయి. ఇంట్లోని మగవారు సంతతిని కోల్పోతారు.

ఇంటి పై కప్పుకి వేసిన కలర్‌నే ఇంటి గోడలకి వేయవద్దు. ఇంటి సింహద్వారానికి ఎదురుగా, ఈశాన్యంలోని కిటికీ దగ్గర ఎటువంటి చెట్టు ఉండరాదు. ఇలా వుంటే నెగెటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా పుడుతుంటాయి. ఇంటి మొత్తానికి ఈశాన్యం మూల బిందువు దగ్గరగా చెత్త కుప్పలు వుండకూడదు.