Menu

Balaristaalu Graha Santhi Pooja

 బాలారిష్టములు 

చంద్రాష్టమంచ ధరణీ సుతస్సప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురున్తృపతీయే అర్కస్తు పంచ భృగుషట్క బుధశ్చతుర్దే కేతో వ్యయోస్తు బాలారిష్టానాం’ అని ఎక్కువ వాడకంలో వున్న సూత్రం. జన్మ లగ్నము నుండి అష్టమంలో చంద్రుడు వున్ననూ, కుజుడు సప్తమంలో వున్ననూ, రాహువు నవమంలో వున్ననూ, జన్మంలో శని వున్ననూ, గురువు తృతీయంలో వున్ననూ, రవి పంచమంలో వున్ననూ, శుక్రుడు ఆరవ యింట వున్ననూ, బుధుడు చతుర్ధంలో వున్ననూ, కేతువు వ్యయంలో వున్ననూ బాలారిష్టములుగా వ్యావహరించుదురు.                         
                                                 12వ సంవత్సరం వయసులోపుగా బాలారిష్టములు ఇచ్చే గ్రహముల దశలు అంతర్దశలు కనుక వస్తే అది ఇంకా ప్రమాదముగా చెప్ప వచ్చు .  బాలారిష్టములు వున్నటు వంటి  శిశువుకు 12వ సంవత్సరం వరకు తరచుగా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.  నక్షత్ర శాంతి బాలారిష్ట శాంతి, నవగ్రహ హోమం చేయించడం వాళ్ళ శిశువుకు ఆయురారోగ్యములు లభిమ్చుతాయి.