Menu

Blue sapphire

 నీలం విశిష్ట‌త‌

నీలం శనిగ్రహానికి సంబంధించిన రత్నము. దీనిని బ్లూ సఫైర్ అంటారు. ఒక కొరండమ్ అల్యూమినియం తాలూకు క్రిస్టలైజ్డ్ ఆక్సైడ్. ఇందులో ఇనుము, టైటానియం కలవడం వలన దీనికి నీలిరంగు వచ్చింది. అలాగే సఫైర్ ఇతరత్రా ఖనిజాలు కలిసినప్పుడు నీల రంగు కాకుండా పసుపు, గులాబి, నారింజ, పచ్చ, వయొలెట్ రంగుల్లోనూ కనిపిస్తాయి. వజ్రం తరువాత నీలం కఠినమైనదిగా చెప్పవచ్చును.

ఎవ‌రు ధ‌రించవ‌చ్చు..?
పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్రాలలో జ‌న్మించిన‌వారు. వృషభ, తుల, మకర, కుంభ లగ్నములలో జ‌న్మించినవారు, ఇంకా… 8, 17, 26 తేదీలలో జన్మించినవారు  ధరించాలి. మయూర నీలం నెమలి కంఠం రంగులో ఉండుట వలన దీనికి ఆ పేరు వచ్చినది. దీనిని ధరించుట వలన జడత్వ బుద్ది నశించి, ఉత్సాహం కలుగును. మకరరాశి జాతకులా..? అయితే నవరత్నాలలో నీలరత్నాన్ని ధరించడం శ్రేష్టం.

నీలరత్నాన్ని ధరించడం ద్వారా ముఖకాంతి, నేత్రకాంతిని పెంపొందింపజేసుకోవచ్చునని శాస్త్రం చెబుతోంది. ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి కావున, ఈ రాశిలో జన్మించిన జాతకులు తప్పకుండా నీలంను ధరించాలి. ఇంద్రనీలం, మయూర నీలం, నీలమణి అనే మూడు రకాల్లో రత్నాల శాస్త్ర నిపుణులను సంప్రదించి మకరరాశి జాతకులు ధరించడం ఎంతో మంచిది.

ఫ‌లితాలు
జ్యోతిష పరంగా అనుకూలమైన వారు ధరించినప్పుడు, ఆ రత్నము వలన సంపద, కీర్తి, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి, మానసిక ప్రశాంతత, మంచి సంతానం, ధరించిన వారికి అందిస్తుంది. దొంగల భయం నుంచి, ప్రమాదాల నుంచి, అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కవచంలా ఉంటుంది. నీలం ధరించడం వలన రక్తశుద్ది జరగడమే కాకుండా.. తలనొప్పి, వాంతులు, కళ్ళుతిరగడం వంటి అనారోగ్యాలు రాకుండా వుంటాయి. గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. నీలమును ధరించుట వల్ల‌ శని గ్రహ ప్ర‌భావంతో కలిగే దోషాలు పోవుటయే కాక సకల సంపదలు సిద్ధించును. అంతేగాకుండా రాత్రిపూట వచ్చే భయంక‌ర‌ కలలను కూడా నివారిస్తుందని వారు చెబుతున్నారు.

ధ‌రించే విధానం
నీలం ర‌త్నాన్ని శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. వెండిలోహముతో పొదిగించుకుని ఎడమచేతి మధ్య వేలుకు ధరించాలి. ధరించేందుకు ముందు పాలులో గానీ, గంగా జలములో గానీ నీలరత్నాన్ని శుద్ధి చేయాలి. అదే విధంగా శనిధ్యాన శ్లోకమును 190 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా దారిద్ర్యాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.