did-you-know ?
Nakshathralu – Stars – Online Telugu Astrology
నక్షత్రాలు – వివరము
కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు . వారిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు – అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
నక్షత్ర సంజ్ఞా విధము
1. క్షిప్ర నక్షత్రములు :- అశ్వని, హస్త, పుష్యమి
2. దారుణ నక్షత్రములు :- మూల, ఆరుద్ర, జ్యేష్ట, ఆశ్రేష
3. మృదు నక్షత్రములు :- చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ
4. స్థిర నక్షత్రములు :- రోహిణి, ఉత్తరాషాడ, ఉత్తరా బాద్ర
5. చర నక్షత్రములు :- స్వాతి, పునర్వసు, శ్రవణము, ధనిష్ట, శతతార
6. ఉగ్ర నక్షత్రములు :- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర
నక్షత్రాలు – దేవతలు
అశ్వని – అశ్వని దేవతలు, భరణి – యముడు, కృత్తిక – అగ్ని, రోహిణి – బ్రహ్మ, మృగశిర – చంద్రుడు, ఆరుద్ర – శివుడు, పునర్వసు – అదితి, పుష్యమి – గురుడు, అశ్రేశ – సర్పములు, మఖ – పితృదేవతలు, పుబ్బ – బృగుడు, ఉత్తర – అర్యముడు, హస్త – సూర్యుడు, చిత్త – ఇంద్రుడు, స్వాతి – వాయుడు, విశాఖ – ఇంద్రాగ్నులు, అనూరాధ – మిత్రులు, జ్యేష్ట – దేవేంద్రుడు, మూల – రాక్షసుడు, పూర్వాషాడ – ఉదకములు, ఉత్తరాషాడ – విశ్వేదేవతలు, శ్రవణం – విష్ట్నువు, ధనిష్ట – వసువులు, శతభిషం – వరుణుడు, పూర్వ భాద్ర – అజచరణుడు, ఉత్తరా భాద్ర – ఆహిర్భుద్నుడు, రేవతి – పూషుడు
ఒక్కొక్క నక్షత్ర ప్రమాణము = 360
ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదా లు
నక్షత్రము——సంజ్ఞలు——– జాతి ——–సవ్యఅపసవ్య —భేదము—– ముఖములు
అశ్వని క్షిప్ర శూద్ర సవ్య పురుష తిర్య
భరణి ఉగ్ర వైశ్య సవ్య స్త్రీ అధో
కృత్తిక సాధారణ బ్రాహ్మణ సవ్య స్త్రీ అధో
రోహిణి స్థిర శూద్ర అపసవ్య స్త్రీ ఊర్ద్వ
మృగశిర మృదు క్షత్రియ అపసవ్య నపుంశ తిర్య
ఆరుద్ర దారుణ శూద్ర అపసవ్య స్త్రీ ఊర్ద్వ
పునర్వసు చర బ్రాహ్మణ సవ్య పు తిర్య
పుష్యమి క్షిప్ర వైశ్య సవ్య పు ఊర్ద్వ
అశ్రేష దారుణ చండాల సవ్య స్త్రీ అధో
మఘ ఉగ్ర క్షత్రియ అపసవ్య స్త్రీ అధో
పుబ్బ ఉగ్ర బ్రాహ్మణ అపసవ్య స్త్రీ అధో
ఉత్తర స్థిర క్షత్రియ అపసవ్య స్త్రీ ఊర్ద్వ
హస్త క్షిప్ర వైశ్య సవ్య పు తిర్య
చిత్త మృదు క్షత్రియ సవ్య స్త్రీ తిర్య
స్వాతి చర శూద్ర సవ్య స్త్రీ తిర్య
విశాఖ సాదారణ చండాల అపసవ్య స్త్రీ అధో
అనూరాధ మృదు క్షత్రియ అపసవ్య పు తిర్య
జ్యేష్ట దారుణ చండాల అపసవ్య స్త్రీ తిర్య
మూల దారుణ శూద్ర సవ్య నపుంశ అధో
పూర్వాషాడ ఉగ్ర బ్రాహ్మణ సవ్య స్త్రీ అధో
ఉత్తరాషాడ స్థిర క్షత్రియ సవ్య స్త్రీ ఊర్ద్వ
[అభిజిత్ – పురుష]
శ్రవణం చర చండాల అపసవ్య పు ఊర్ద్వ
ధనిష్ట చర వైశ్య అపసవ్య స్త్రీ ఊర్ద్వ
శతభిషం చర శూద్ర అపసవ్య నపుంశ ఊర్ద్వ
పూర్వబాద్ర ఉగ్ర బ్రాహ్మణ సవ్య పు అధో
ఉత్తరాబద్ర స్థిర క్షత్రియ సవ్య పు ఊర్ద్వ
రేవతి మృదు క్షత్రియ సవ్య స్త్రీ తిర్య
—————————— —————————— —————————
నక్షత్రము —– త్యాజ్యము – – – – అమృత ఘడియలు
ఘ. ———– గం.ని. ఘ. ————- గం.ని.
అశ్వని 50. 20-0. 24. 9-6.
భరణి 24. 9-6. 22. 8-8.
కృత్తిక 0. 12-6. 8. 3-2.
రోహిణి 40. 16-0. 5. 2-0.
మృగశిర 4. 5-6. 24. 9-6.
ఆరుద్ర 21. 8-4. 1. 0-4.
పునర్వసు 3. 12-0. 26. 10-4.
పుష్యమి 20. 8-0. 24. 9-6.
అశ్రేష 32. 12-8. 14. 5-6.
మఘ 30. 12-0. 12. 4-8.
పుబ్బ 20. 8-0. 20. 8-0.
ఉత్తర 18. 7-2. 14. 5-6.
హస్త 20. 8-0. 8. 3-2.
చిత్త 20. 8-0. 8. 3-2.
స్వాతి 14. 5-6. 4. 1-6.
విశాఖ 14. 5-6. 8. 3-2.
అనూరాధ 10. 4-0. 14. 5-6.
జ్యేష్ట 15. 6-0. 14. 5-6.
మూల 56. 22-4. 14. 5-6.
పూర్వాషాడ 24. 9-6. 4. 1-6.
ఉత్తరాషాడ 20. 8-0. 4. 1-6.
శ్రవణం 10. 4-6. 10. 4-0. .
ధనిష్ట 10. 4-0. 18. 7-2
శతభిషం 18. 7-2. 24. 9-6.
పూర్వబాద్ర 16. 6-4. 12. 4-8.
ఉత్తరాబద్ర 24. 9-6. 18. 7-6.
రేవతి 30. 12-0. 30. 12-0.
—————————— ————————
అభిజిత్
అభిజిత్ అనే 28 వ నక్షత్రము ఒకటి కలదు ఆ నక్షత్ర నాలుగు పాదములు
శ్రవణా నక్షత్రమునకే ఆన్వఇంచబడను.అమృతఘడియలు 12. [4గం. 8ని.]
నక్షత్ర సంవత్సరము
అశ్వని నక్షత్రము మొదలుకొని రేవతి వరకూ జరుగు [సంచరించు] కాలము ఒక మాసము, ఇట్టి 12 మాసములను కలిపి ఒక సంవత్సరముగా చెప్పుదురు ఈ పద్ధతి ప్రకారము సంవత్సరమునకు 324 రోజులు మాత్రమే కలిగి నక్షత్ర సంవత్సరముగా పిలువబడును.
నక్షత్ర్హ ప్రమాణము
ఒక నక్షత్రము అనగా ఉదా :- పుష్యమి జనన సమయమునకు రాత్రి 9-45 ని.లకు వరకూ వున్న ముందు నక్షత్రము పునర్వసు 10గం. 6 ని.లకు వున్నది అని అనుకొన్న,
రోజు [దిన]ప్రమాణము 24 గం.00 నిమి
పూర్వ దిన నక్షత్రము 10 గం 06 ని.లు
——————
13 గం 56 ని.లు
ఆరోజు పుష్యమి 9 గం 45 ని.లు
——————-
నక్షత్ర ప్రమాణం 23 గం 39 ని.లు
దీనిని 4 చే భాగించగా 23 గమ్. 39 ని.లు /4 = 5 గం 54 ని.లు 46 సె.
అనగా ఒక్కక్క పాదము 5 గం 54 ని.లు 46 సె.అగును.
ఈ విధముగా నక్షత్ర పాద ప్రమాణమును చూడవచ్చును.
You can get more information about Online Telugu Astrology at Chinta Gopi Sarma.