Menu

did-you-know ?

మీకు తెలుసా

Astrology In Telugu

 ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు కొత్త ఇంటిని కట్టొచ్చా?

ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం, కట్టడం వంటివి కూడదు.గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణము దుమ్ము, ధూళి వంటి వాటివలన కాలుష్యమౌతుంది కనుక కచ్చితముగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శిశువు పుట్టిన తర్వాతే కట్టడాల నిర్మాణాలు,అలాగే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడటం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లలో గృహస్థలం యొక్క దక్షిణము వైపున ఖాళీస్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరము వైపున ఇల్లు ఉండకుండా చూడాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలనే మాత్రమే గాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయి.మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం తో పాటు సముద్ర ప్రయాణము, భర్త క్షవరము చేయించుకొనుట, శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు.ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు.అలాగే గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదు.

కుంకుమ ధారణ ఎందుకు ?

 కనుబొమల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవడం హైందవ సంప్రదాయం. ఇంటికి వచ్చిన ఏ ముత్తయిదువకైనా బొట్టుపెట్టి పంపడం మన ఆచారం. పాపిడ నడుమ ధరించే ఈ సిందూరం పెళ్లయిందని చప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువల్లనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు.
ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీ శక్తి చిహ్నంగా కూడా సిందూరాన్ని పరిగణిస్తారు. ఎర్రటి రంగు ఆమె ప్రవేశంతో సంపద చేకూర్చుతుందనీ, స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతానాన్ని పరిరక్షిస్తుందని విశ్వాసం.
పురుషులు కూడా నుదుట తిలకం ధరించే సంప్రదాయం ఉంది. ఏదైనా మత సంబంధిత కార్యక్రమాలకు, పెళ్లిళ్లవంటి శుభకార్యాలలో ఈ విధంగా తిలకం ధరిస్తారు. మత సంబంధిత సందర్భాలలో వారు తమ కొలిచే దైవాన్ని అనసరించి తిలకం ఆకృతి ఉంటుంది.
విష్ణు భక్తులు “U” ఆకృతిలో తిలకం పెట్టుకుంటే, శైవ భక్తులు మూడు అడ్డగీతలతో దిద్దుకుంటారు. బొట్టు పెట్టుకునే చోట అగ్యచక్ర లేదా ఆధ్యాత్మిక లేదా మూడో నేత్రం ఉంటుందని చెపుతారు. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకేచోట కేంద్రీకరించే బిందువు ఇది.
ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్ట శక్తులు దరిచేరకుండా సంరక్షిస్తుందని విశ్వాసం.

 

కాలసర్ప దోషం

రాహు కేతువుల మధ్య అన్ని గ్రహములు ఉండి పోవుటయే కాలసర్ప దోషము ఇవి కొంత మంది  కొన్ని రకములుగా అన్వయించినారు వాటిలో ముఖ్య మైనవి  1  కాలసర్ప దోషము  2 అపసవ్య కాలసర్పదోషము  3  మారణ మాలా కాలసర్పదోషము  4 శేషనాగ కాలసర్ప దోషం .వీటి వల్ల జాతకులకు 45  సంవస్చరములకు  గానీ వివాహము కాకుండుట మరియు కుటుంబ కలహాలు,దీర్ఘ రోగాలు,వ్యాపారసమస్యలు ,ముఖ్యముగా పిల్లలు కలుగ కుండుట లేదా పిల్లలకు సమస్యలు, ఆర్దికముగా నష్టము ఇటువంటివి  జరుగుతుండును….వారియొక్క దోషమును బట్టి నివారణ ఉపాయములు[remides] కలవు ..సంప్రదించండిచింతా గోపి శర్మ

..9866193557 .

Reed Moor మీకు తెలుసా