Menu

Graha Dasa Phalamulu – గ్రహములు శుభ అశుభ ఫలములు

navagraha - Phala

గ్రహములు శుభ అశుభ ఫలములు 

రవి మహాదశ 

జాతకచక్రంలో రవి సూర్యుడు బలవంతుడై ఉన్నప్పుడు సుఖము, ధన లాభము ,రజసన్మానము, కుటుంబ సంతోషములను, కలుగజెయొఉను. 
బలహినుడై ఉన్నపుడు శత్రువుల భాద, అగ్నిచొర భయము, గుండెజబ్బులు, ఉదార భాదలు, కుటుంబ పరస్తల నివాసము కలుగచేయును. 

చంద్ర మహాదశ  

చంద్రుడు బలవంతుడై వున్నప్పుడు శుభకార్యసిద్ధి, ద్రవ్యలాభము, వాహన ప్రాప్తి, శుభభవన సదుపాయము కలిగించును. 
బలహినుడై ఉన్నచొ రాజ వీరొధము, ధెహయమాత్రు వంశీయులకు హాని, సుఖబంగమ.   

కుజమహాదశ 

కుజుదుశుభస్థితిలొ ఉన్నప్పుడు జయప్రాప్థి, ధనలాభము, ఉద్యోగ లాభము, ఆనందము, సకల కార్యసిద్ధి కలుగచేయును. 
అశుభ స్టితి లో ఉన్నచో బందుమిత్రుల విరోధము, కోపతాపములు, వ్యసనములు అనారోగ్యము కలిగిచును . 

రాహుదశ 

రాహూవుబలముగా ఉన్నప్పుడు  సర్వసౌఖ్యం, ఆదాయ ప్రోత్సాహము, వాహన లాభము, పుత్రలాభము, మహా సన్మానములు, స్వస్థత కలుగచేయును. 
దుష్ట స్థానంలో ఉన్న గృహ కలహాలు, స్టాన బ్రంశం, మనోవాతుల్యత, అనారొగ్యత కలుగచేయును. 

గురు దశ 

గురుడు బలీయంగా ఉన్నచో బుద్ధి వికాసం, సంతాన లాభం, గృహ లాభం, కుటుంబ సుఖము, శత్రు జయము కలుగును. 
నీచస్థితి కలిగి ఉన్నచో బంధనము, గృహ విపత్తు, జీవహింస, గౌరవ భంగము కలుగును. 

శని దశ 

శని బలవతుడై ఉన్న గృహ బలము, ధన లాభము, కుటుంబ సామీప్యత, వృత్తి వ్యాపారములలో లాభము, ఉద్యోగ ప్రాప్తిని కలిగించును. 
బలహీనుడై ఉన్న ఖర్చులు పెరుగుట, అసంతృప్తి, బందు మిత్రులతో విరోధములు కలుగును. 

బుధ దశ 

బుధుడు బలవతుడై ఉన్నచో బందు మిత్రులతో శుభ గోష్టి, ధన లాభము వృద్ధి, శుభ కార్యక్రమములు, ఆనదము కలుగ జేయును. 
చెడ్డ బావములో వున్న మనో వ్యాధి, కార్య విఘ్నములు, ధన కఠినత కలిగించును. 

కేతు దశ 

కేతువు సుభుడై ఉన్న వాహన సౌఖ్యము, పుత్ర మిత్ర కళత్రములతో శుభ గోష్టి, నష్ట పోయిన ద్రవ్యములను వస్తువులను తిరిగి పొందుట జరుగును. 
నిచ స్థితిని పొందిన శరీర జాడ్యము, మనస్పర్ధలు, ధన నష్టము, అసౌఖ్యము కలిగించును. 

శుక్ర దశ 

శుక్రుడు బలియముగా వున్న గృహ లాభము, కార్య సిద్ధి, ధన ప్రాప్తి, శుఖ జీవనం, స్త్రీ సంగమం కలిగించును. 
నిచ స్తితి పొందిన కుటుబ కలహములు, భయ భర్తల మద్య విభేదాలు, అసుఖమును కలిగించును.   

Reed Moor మీకు తెలుసా

Leave a Reply