Menu

Graha Avasthalu-గ్రహ అవస్థలు

Graha Avastha

గ్రహ అవస్థలు

గ్రహావస్థలు పది రకాలు. 

1) స్వస్థము

2) దీప్తము

3) ముదితము

4) శాంతము 

5) శక్తము

6) పీడితము

7) దీనము

8) వికలము

9) ఖల

10) భీతము  

1)స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును

2)దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.

3)ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.

4)శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.

5)శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.

6)పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.

7)దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.

8)వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.

9)ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.

10)భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.

   సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగతము పొందిన గ్రహము అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహము అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు. సూర్యునికి పదకొండు, పన్నెండు స్థానాలలో ఉన్న గ్రహాన్ని అత్యంత శీఘ్రగతిన ఉన్న గ్రహం అంటారు.ఈ విధముగా గ్రహ అవస్థలు ఉంటాయి.

Reed Moor మీకు తెలుసా

Leave a Reply