Menu

జ్యోతిష్యము

Stras -Nakshathara yoni

జ్యోతిష భాగములో[నక్షత్ర] యోని వివరణ  

యోని సంబందములు పరస్పరముగా అయిదు విధములుగా ఉండును. అవి. ౧.స్వవర్గ, ౨.మిత్ర, ౩. ఉదాసిన, ౪.శత్రు, ౫.మహా శత్రు 
వరుడు మరియు కన్య నక్షత్రముల యోని ఒక్కటి అయిన లేదా నామ నక్షత్రముల యోని వేరుయినా వివాహమునకు శుభము. ఉదాసిన యోనిలు అయిన జీవితము సామాన్యముగా జరుగును. శత్రు యోని మంచిది కాదు. మహాసత్రుయోని వారి జీవితాలను పాడుచేయును. 
 అత్రి మహర్షి పురుష స్త్రీ యోనిలు ఒకటిగా వున్నా శుభము అని చెప్పివున్నారు.
యోని గుణాంకములు 
౧. ఇరువురి నక్షత్రములు ఒకే యోని అయిన ౪. గుణములు 
౨. మిత్ర యోని అయిన ౩ గుణములు.
౩. ఉదాసిన యోని అయిన ౨ గుణములు.
౪ . శత్రు యోని అయిన ౧. గుణము.
౫. మహా శత్రు అయిన ౦ గుణము వచ్చును.
ఇంతియేకాక కొన్ని యోని దోషములు కలుగనివి
౧. ఇరువురు రాశి అధిపతి మిత్రుడు అయిన ౨.  భ కూటము సుద్ధి అయినా. ౩. నవమాదిపతి ఇరువురకు మిత్రుడు కానీ ఒకటయినా.౪.వశ్య శుద్ధి కలిగిననూ యోని కూత దోషము వర్తిం పదు.
 
VIVAAHAMUNAKU VAIRA NAKSHATHRAMULU
 వివాహమునకు వైర నక్షత్రములు
అశ్వని     కి        జ్యేష్ట 
భరణి       కి       అనూరాధ 
కృత్తిక      కు      విశాఖ 
రోహిణికి    కి       స్వాతి 
ఆరుద్ర      కి        శ్రవణం
పునర్వసు   కి    ఉత్తరాషాడ 
అశ్రేష        కి      మూల 
మఘ        కి      రేవతి
పుబ్భ      కి      ఉత్తరాబాద్ర 
ఉత్తర       కి      పూర్వాబాద్ర 
హస్త        కి      శతభిషం 
 
పై నక్షత్రములు ఒకదానికి ఒకటి వేధలు మరియు చిత్త, మృగశిర, ధనిష్ట లు ఒకదానికి ఒకటి అన్యోన్య వేదలగుట వల్ల వీటిని వదలి పెట్టి మిగతా నక్షత్రములలో కలిసిన మంచిది.
వివాహ విషయమునందు వధూ వరులకు [స్త్రీ పురుషులకు] ఇరువురకూ కుజదోషమున్న దోషము బంగమగును సప్తమాదిపతుల మిత్రత మరియు చంద్ర రాశియొక్క అడిపతుల మిత్రత పరిశిలించుట శుభము.
వర్ణాధిపులు                                              వేదాధిపులు
 బ్రాహ్మణులకు – గురు, సుక్రులు         ఋగ్వేధులకు – గురువు 
క్షత్రియులకు  – రవి,కుజులు                యజుర్వేధులకు -శుక్రుడు
వైశ్యులకు    –   చంద్రుడు                    సామవేధులకు – కుజుడు
శూద్రులకు  –  భుదుడు                       అధర్వణ వేదులకు – భుదుడు 
అంత్య జాతులవారికి -శని   

Santhana Yoga

జ్యోతిష శాస్త్రములో సంతాన యోగము గూర్చి తెలుసుకొనుట
లగ్నము నుంచి పంచమ భావమును పరిశీలించుట గురువునకు ఇది శుభస్థానము గా వున్న సంతాన సుఖ ప్రాప్తిలు వుండగలవు, మరియు పంచమాధిపతి స్వగృహములో వుండి మరియు భాగ్యదిపతి పూర్తి ద్రుష్టి వున్న సంతానయోగములు కలుగగలవు, గురువు కేంద్ర త్రికోణములలోను మరియు నవమ భావములో గురుశుక్రులతో పంచమాదిపతివున్నాను సంతాన కారకత్వముగా చెప్పబడుతున్నది. శుక్ర ద్రుష్టి వల్ల స్త్రీ సంతానము మరియు జన్మలగ్నములో స్త్రీ రాశిలో స్త్రీ గ్రహ ద్రుష్టి కలిగినను స్త్రీ సంతతి కలుగును.
జన్మ లగ్నములో పాపగ్రహ సంతాన భావము యొక్క గ్రహము స్వరాశి స్థితిలో ఉన్నను పురుష సంతతి కలుగును. ఇంకనూ చాల విధములుగా ఈ సంతాన యోగములను చూడ వచ్చును.

బాలారిస్టములు

12 సంవత్సరముల లోపు మరణాన్ని సూచించే యోగాన్ని బాలారిస్టం అందురు.
అష్టమం [ఎనిమిది] లో చంద్రుడు, సప్తమం[ఏడు] లో కుజుడు, నవమం [తొమ్మిది] లో రాహువు, లగ్నము[ఒకటి] లో శని,తృతీయం [మూడు] లో గురుడు, పంచమం [అయిదు] లో రవి, సస్టమం [ఆరు] లో శుక్రుడు, చతుర్ధం [నాలుగు] లో భుదుడు, ఎకద్వితియం [ఒకటి రెండు] లో  కేతువులు బాలారిష్ట కరములుగా చెప్పబడ్డాయి, ఆగ్రహముల యొక్క దశలలో ప్రభావము ఎక్కువగా వుంటుంది. అయితే దోషముగల గ్రహముపై శుభగ్రహ దృష్టి వున్న ఆ దోషము తగ్గగలదు.
కొన్ని దోషబంగాలు 
1) లగ్నాదిపతి బలముగా వుండి శుభ గ్రహ దృష్టి కలిగి కేంద్రస్థితి పొంది పాపగ్రహ దృష్టి లేకున్నా బాలారిష్ట బంగమగును.
2) పూర్ణ చంద్రుని పై శుభ గ్రహ దృష్టి శుభ రాశి నవాంశలలో కాని స్వ,ఉచ్చ,మిత్ర,వర్గాములలో గాని  ఉన్న బాలారిష్ట బంగమగును.
3) గురు, శుక్ర, భుదులలో ఒకరు అయినా కేంద్రములో పాప సంభందము [దృష్టి] లేకున్నా  బాలారిష్ట బంగమగును.
4) శుక్ల పక్షములో రాత్రి కాని పగటిపూట గానీ జన్మించి చంద్రుడు శుభ దృష్టిని కల్గి సస్ట, అష్టమ స్థానాలలో ఉన్న  బాలారిష్ట బంగమగును.