Menu

kalathra Viyogam

Kalathra Viyogam

#కళత్ర వియోగము

పురుషుని నుండి పరిశీలిస్తే భార్యా వియోగము అనేది విశేషమైన పరిణామాలకు కారణం అవుతుంది . సంఘంలో భార్యను కోల్పోయిన వారికి ఏర్పడే గృహ సంతాన బాధ్యతలపై , ప్రత్యేకించి జాతకులపై విశేష ప్రభావాన్ని చూపిస్తాయి . ఈ కారణంచేత కళత్రవియోగమే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది . ప్రామాణిక గ్రంధాలలో వివరించిన కళత్రవియోగ సంబంధ గ్రహ యోగాలను పరిశీలిద్దాం . 2,7స్థానములందు పాపగ్రహములన్న భార్యావియోగము ఏర్పడుతుంది . అందుచేత ఇదే రకమైన గ్రహస్థితులున్న జాతకురాలిని వివాహం చేసుకోవడం ద్వారా పై ఫలితములు తటస్థీకరించబడి దంపతులు సుఖ సంతోషాలతో సంతానంతో జీవిస్తారు , లగ్నమునుండి లేదా చంద్రుని నుండి 5 , 7స్థానములందు పాపగ్రహము ఉన్నను , చూసినను వివాహము కాదు ఒకవేళ వివాహమైనను భార్య జీవించదు . కన్యాలగ్నమై అందు రవి , సప్తమంలో శని ఉన్న భార్య మరణించును . అలాగే సప్తమంలో కుజుడున్నను పై ఫలితమే చెప్పవచ్చును . సప్తమాధిపతి శుక్రుని నుండి సప్తమాధిపతి సప్తమంలో బలము కలిగి ఉండగా , ఎటువంటి పాప గ్రహముల స్థితి వీక్షణలు లేకున్న భార్యాభర్తలు ఇరువురు ఒకేసారి మరణిస్తారు . సప్తమంలో కార్ముకమనే ఉపగ్రహమున్న భార్య లేదా భర్త శీఘ్రముగా మరణిస్తారు
2 , 7స్థానాధిపతులు శుక్రునితో కలసినను , లేదా పాపగ్రహములు వీరితో కలసి ఎస్థానములో ఉన్నను అంతమంది భార్యలు మరణిస్తారు . నవాంశలో శుక్రునికి 7లో కుజుడు , సప్తమాధిపతి 5లో ఉన్నను భార్యా వియోగము కలుగు తుంది . శుక్ర కుజులు ” సప్తమం లో ఉన్న భార్యావియోగం కలుగుతుంది . 1 , 7 , 12లందు పాపగ్రహములుండగా బలహీనమైన చంద్రుడు 5లో ఉన్న భార్య లేక పోవడమో లేదా భార్య సంతాన హీనురాలగును . కుజుడు 2 , 12 , 4 , 6 , 7 స్థానము లందున్న కళత్రమారకమగును.
సప్తమాధిపతి 12వస్థానంలో ఉండగా కారకుడు బలహీనుడైన , సంసార సుఖము తక్కువగా ఉండడం భార్య వియోగమో లేదా భార్యనుండి విడిపోవడమో జరుగుతుంది. విదేశాలలో నష్టాలు పొందుతారు . వీరితో లగ్నాధిపతి కలిసిన భార్యాభర్తలు ఇరువురు విదేశాలలోనే జీవిస్తారు . ఇక్కడ పాపస్థితి ఏర్పడితే జాతకులు భార్యతో కలసి పాపఫుపనులు చేస్తారు . వీరిపై శుభగ్రహదృష్టి ఉన్న సప్తమాధిపతి దశలో ఆధ్యాత్మికచింతన ఎక్కువ గా ఉంటుంది .