Menu

Kumbha- Lagnam- Grahamulu

కుంభ లగ్నము – లగ్నస్థ గ్రహములు – ఫలితాలు

కుంభ లగ్నము యొక్క అధిప‌తి శని. ఈ లగ్నములో సూర్యుడు, శుక్రుడు, శని శుభ కారక గ్రహములు. చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు అశుభ, అకారక గ్రహములుగా వుండును. కుంభ లగ్నానికి సప్తమ స్థానాధిపతి సూర్యుడు, నవమ స్థానాధిపతి శుక్రుడు, లగ్నాధి పతి శని శుభగ్రహాలు, కారక గ్రహాలు. తృతీయాధిపతి అయిన కుజుడు, షష్టమాధిపతి చంద్రుడు, అష్టమస్థానాధిపతి బుధుడు అశుభ గ్రహలు అకారక గ్రహలు. కుంభ లగ్నములో జ‌న్మించిన వారిని ప్రథ‌మ భావములో స్థితిలో ఉన్న గ్రహాలు వారిని ఏ విధంగా ప్రభావితం చేయునో చూద్దాము.

సూర్యుడు 

కుంభ లగ్నం గల కుండలిలో సూర్యుడు సప్తమాధిపతిగా ఉండును. కేంద్ర భావం స్థితిలో ఉండి ఇది శుభ కారక గ్రహం యొక్క ఫలితాలను ఇచ్చును. కుంభ లగ్నం యొక్క కుండలిలో సూర్యుడు యది లగ్నస్థుడైన ఎడల వ్యక్తి చూడడానికి అందంగా, పరిపూర్ణ ఆత్మవిశ్వాసం కలిగి ఉండును. సప్తమాధిపతి సూర్య లగ్నస్తుడుగా ఉండ‌టం వ‌ల్ల‌ జీవిత భాగస్వామి అందంగాను, సమ్యోగమును ఇచ్చువాడు గాను ఉండును. అప్పుడప్పుడు వివాదాలు ఏర్ప‌డ‌తాయి. మిత్రుల నుంచి, భాగస్వాముల నుంచి సమ్యోగము లేదా లాభం క‌లుగుతుంది. వర్తక వ్యాపారాలలో త్వరగా సఫలత లభిస్తుంది. ఆర్ధిక స్థితి సామాన్యంగా ఉంటుంది.

చంద్రుడు 

చంద్రుడు కుంభ లగ్నం గల కుండలిలో 6వ భావము యొక్క స్వామిగా ఉండి అకారక గ్రహము యొక్క భూమి కత్వమును నిర్వహిస్తున్నాడు. ప్రథ‌మ భావంలో చంద్రుని స్థితి ఉండ‌టం వ‌ల్ల‌ వ్యక్తికి దగ్గు, జలుబు, జీర్ణశక్తికి సంబంధ‌మైన వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రుని యొక్క ఈ స్థితి కారణంగా వ్యక్తి యొక్క మనస్సు అశాంతితో కూడినదై ఉండగలదు. కుటుంబ జీవితంలో కలహాలు, వివాదాలు జరిగే అవకాశములున్నాయి. చంద్రుని దృష్టి సప్తమస్థ సూర్య రాశి సింహంపై ఉండును. ఈ దృష్టి సంబంధం కారణంగా జీవిత భాగస్వామి అందముగాను, మహత్వాకాంక్షిగాను ఉండును.

కుజుడు 

కుజుడు కుంభ లగ్నం గల కుండలిలో తృతీయ, దశమ భావం యొక్క అధిప‌తి కాగలడు. ఈ లగ్నంలో కుజుడు అశుభ, అకారక గ్రహాల భూమికత్వమును నిర్వహించును. కుజుడు లగ్నస్థంగా ఉండ‌టం వ‌ల్ల ఈ జాత‌కుడు ధృడ‌మైన‌ శారీరకము క‌లిగి ఉండును. వీరిలో సాహాసం, పరాక్రమం ఎక్కువ‌గా ఉంటుంది. క‌ఠోర శ్ర‌మ‌తో క‌ఠిన‌మైన‌ పనులను కూడా పూర్తి చేస్తారు. మాతృ, పితృ పక్షం నుంచి ఈ జాత‌కుల‌కు అనుకూల సమ్యోగము లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు క‌లుగుతాయి. స్వభావంలో ఉగ్రత కారణంగా అనవసర వివాదాలను కొని తెచ్చుకొనెదరు. కుజుని యొక్క దృష్టి పంచమ భావంలో వృషభం, సప్తమ భావంలో సింహం, అష్టమంలో కన్యాలో ఉండ‌టం వ‌ల్ల‌ జీవిత భాగస్వామి గుణవంతుడు, వ్యావహారిక స్వభావం గ‌లవాడై ఉండును. వైవాహిక జీవితం సామాన్యంగా సుఖమయంగా ఉండును. సప్తమాదిపతి, కుజుడు పీడించబడి లేదా పాప ప్రభావంలో ఉండ‌టం వ‌ల్ల‌ సప్తమ భావంలో సంబంధిత సుభాలు బాధిస్తాయి.

బుధుడు  

బుధుడు కుంభలగ్నము గల కుండలిలో పంచమాధిపతి, అష్టమాదిపతి కాగలడు. అష్టమాధిపతిగా ఉండ‌టం వ‌ల్ల‌ ఇది అకారక, అశుభ ఫలదాయిగా ఉంటుంది. లగ్నంలో దీని ఉపస్థితి కారణంగా ఈ జాత‌కుడు బుద్దివంతుడు, వివేక‌వంతుడు అవుతాడు. శిక్షా రంగంలో వీరికి సఫలత లభిస్తుంది. మాటల ద్వారా వీరు ప్రజలను ప్రభావితం చేస్తారు. జలక్షేత్రంలో వీరికి ఆసక్తి అధికం. పడవ ప్రయాణాలు, జల యాత్రలు వీరిని ఆక‌ట్టుకుంటాయి. బుధుని దశావదిలో మానసిక సమస్యలు ఏర్ప‌డ‌తాయి. ప్రథ‌మస్థ బుధుడు సప్తమ భావంలో స్థితిలో ఉన్న సింహ రాశిని చూస్తున్నాడు. ఈ కారణం వ‌ల్ల‌ జీవిత బాగస్వామితో వివాదాలు, మత బేధాలు ఏర్ప‌డ‌తాయి. వివాహేతర సంబంధాలు కూడా ఉండే అవకాశం.

గురువు 

కుంభ లగ్నం గల కుండలిలో గురువు అకారక గ్రహం కాగలడు. ఇది ద్వితీయ, ఏకాదశ భావము యొక్క అధిప‌తిగా ఉండును. లగ్నంలో దీని ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధివంతుడు, వివేక‌వంతుడు అవుతాడు. ఈ జాత‌కుల్లో ఆత్మబ‌లం, ఆత్మవిశ్వాసం అధికం. ధన సేకరణ చేసే నైపుణ్యం ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు పెద్ద‌గా రావు. లగ్నంలో కూర్చొని ఉన్న గురువు పంచమ, సప్తమ, నవమ భావాల‌పై దృష్టి కలిగి ఉండును. గురువు యొక్క దృష్టి కారణంగా బంధుమిత్రుల నుంచి లాభం ప్రాప్తించగలదు. పితృ పక్షం నుంచి లాభము కలుగును. సంతానం, జీవిత భాగస్వామి నుంచి సుఖం ఉంటుంది.

శుక్రుడు 

కుంభ లగ్నం గల కుండలిలో శుక్రుడు సుఖాధిపతి, భాగ్యాధిపతిగా ఉండును. సుఖాధిపతి, భాగ్యాధిపతిగా ఉండ‌ట‌వ వ‌ల్ల‌ ఇది ప్రముఖ కారక గ్రహంగా ఉంటుంది. లగ్నంలో దీని ఉప స్థితి కారణంగా వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా ఉండును. వీరు బుద్దివంతులు, గుణవంతులు అవుతారు. అధ్యాత్మికంలో వీరికి అభిరుచి అధికం. ఆధ్యాత్మిక‌ కార్యకలాపములలో వీరు ఇష్టంగా పాల్గొంటారు. మాతృమూర్తి నుంచి ప్రేమ, సమ్యోగం లభిస్తుంది. భూమి, భవనం, వాహన సుఖం ప్రాప్తి చెందగలదు. శుక్రుడు సప్తమస్థ సింహరాశిని చూస్తున్నాడు. ఈ కార‌ణంగా వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డవ‌చ్చు. జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు త‌ప్ప‌వు.

శని 

శని కుంభ లగ్నం గల కుండలిలో లగ్నాదిపతి, ద్వాదశాధిపతిగా ఉండి కారక గ్రహం యొక్క భూమికత్వమును నిర్వహించును. లగ్నాదిపతి శని స్వరాశి స్థితిలో వుండి వ్యక్తి ఆరోగ్యాన్ని, నిరోగముతో కూడిన శరీరాన్ని ప్రదానించును. శని యొక్క ప్రభావం కారణంగా వ్యక్తి ఆత్మవిశ్వాసముతో పరిపూర్ణత క‌లిగి ఉంటాడు. ఈ జాత‌కుడు త‌న వ్యక్తిత్వ తీరు వ‌ల్ల‌ సమాజంలో గౌరవమర్యాదలు, ప్రతిష్టలను పొందుతాడు. లగ్నంలో కూర్చొని ఉన్న శని తృతీయ భావంలో మేషరాశి, సప్తమంలో సింహరాశి, దశమంలో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. శని యొక్క దృష్టి కారణంగా సోదరులతో అపేక్షిత సమ్యోగములో సమస్యలు ఏర్పడతాయి. ఇక జీవిత భాగస్వామితో సమస్యలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

రాహువు 

ప్రథ‌మ భావంలో అష్టమ గ్రహం రాహువు యొక్క ఉపస్థితి కారణంగా అనారోగ్యం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. రాహువు యొక్క దశా కాలంలో ఉదర సంబంద రోగాలు కలిగే అవకాశాలున్నాయి. వర్తక వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొవలసి రావచ్చు. వీరికి వ్యవసాయంపై కోరిక ఉన్నప్పటికీ ఉద్యోగం ఫలదాయకంగా ఉంటుంది. లగ్నస్థ రాహువు సప్తమ భావంలో సూర్యుని రాశి సింహాన్ని చూస్తున్నాడు. శత్రు రాశిపై రాహువు యొక్క దృష్టి వైవాహిక జీవిత సుఖాన్ని బలహీన పర్చును. భాగస్వాముల నుంచి ఈ జాత‌కుల‌కు లాభం కలిగే అవకాశాలు తక్కువ. రహాస్యాలు, గుప్త‌ విద్యల అంటే ఈ జాత‌కుల‌కు మ‌క్కువ‌. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. దీంతో నిర్ణయాలు తీసుకొవ‌డంలో సమస్యలు ఎదుర్కొంటారు.

కేతువు 

కేతువు కుంభ లగ్నం గల కుండలిలో లగ్నస్థంగా ఉండి వ్యక్తిని అస్థిరునిగా చేస్తున్నాడు. విపరీత లింగపు వ్యక్తిపై వీరికి  అభిరుచి అధికం. వీరు తల్లిదండ్రులతో వివాదాలు, మనస్థాపాలు కలిగే అవకాశములున్నాయి. సప్తమ భావంపై కేతువు యొక్క దృష్టి ఉండ‌టం వ‌ల్ల‌ గృహస్థ సుఖంలో లోపం ఏర్పడుతుంది. వ్యక్తికి అన్య వ్యక్తితో సంబంధాల కారణంగా కుటుంబములో అశాంతి ఏర్పడుతుంది. కేతువుతో పాటు శుభ గ్రహాల యుతి లేదా దృష్టి సంబంధాలు ఉంటే గ‌న‌క‌ కేతువు యొక్క అశుభ ప్రభావం తగ్గుతుంది.