Menu

Lagnam Graham

Minam – Lagnam- Grahamulu

మీన‌ లగ్నము – లగ్నస్థ గ్రహములు – ఫలితాలు

మీన లగ్నానికి అధిపతి గురువు. మీన లగ్నానికి చంద్రుడు, కుజుడు, గురువు కారక గ్రహాలు. ఈ కార‌ణం వల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయి.  శుక్రుడు, సూర్యుడు, శని అకారక గ్రహాలు. అశుభ ఫలితాలు ఇస్తారు. మీన లగ్నంలో ర్యాది గ్రహాలు ఉన్నప్పుడు కలుగే ఫలితాలు ఎలా ఉంటాయో ప‌రిశీలిద్దాము.

సూర్యుడు

సూర్యుడు మీన లగ్న కుండలిలో షష్టమాధిపతిగా ఉండును. షష్టమ భావంలో ఉండ‌డం వ‌ల్ల‌ సూర్యుడు అకారక గ్రహంగా ఉండును. మీన లగ్నంలో లగ్నస్థంగా ఉండి సూర్యుడు వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచును. ఎవరి కుండలిలో అయితే ఈ స్థితి ఉండునో వారు ఆత్మవిశ్వాసంతో ఉండ‌గ‌ల‌రు. ఏ ప‌నినైనాను పూర్తి మనోబ‌లంతో పూర్తి చేయుదురు. శత్రువులు, విరోదుల నుంచి భ‌యపడరు. సూర్యుని పూర్ణ దృష్టి సప్తమ భావములో కన్యా రాశిపై ఉండును. వ్యాపారం చేయలననే కోరికతో పాటు, ఉద్యోగంలో అనుకూల‌త ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు త‌ప్ప‌వు.

చంద్రుడు

మీన లగ్న కుండలిలో చంద్రుడు పంచమాధిపతి అవుతాడు. ఈ లగ్నంలో త్రికోణాధిపతిగా ఉండ‌టం వ‌ల్ల‌ చంద్రుడు శుభ కారక గ్రహంగా ఉండును. లగ్నంలో దీని స్థితి వ్యక్తికి సుఖంగా, శుభకరంగాను ఉండును. చంద్రుని ప్రభావం వ‌ల్ల వ్యక్తి అందం, ఆకర్షణీయమునకు అధిపతి కాగలడు. వీరి మాటలు ఇత‌రుల‌పై ప్రభావం చూపును. వీరిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉండును. అందుకే ఎలాంటి పెద్ద కార్య‌మును మొద‌లు పెట్ట‌డానికి భ‌య‌ప‌డ‌రు. మాతృ పక్షం నుంచి, మాతృమూర్తి నుంచి సుఖాన్ని, ఆద‌రాభిన‌మాల్ని పొందగలరు. చంద్రుడు పూర్ణ దృష్టి ద్వారా బుధుని రాశి కన్యను చూస్తున్నాడు. ఈ ప్రభావం వ‌ల్ల‌ జీవితభాగస్వామి, సంతానం నుంచి ప్ర‌శాంత‌త‌, సుఖం లభిస్తుంది.

కుజుడు

కుజుడు మీన లగ్నం గల కుండలిలో ద్వితీయ, నవమ భావము యొక్క అధిప‌తిగా ఉండును. లగ్నంలో దీని ఉపస్థితి కారణంగా వ్యక్తి శక్తిశాలి, పరాక్రమిగా ఉండును. ఇది వ్యక్తిని మొరటి వాడిగా చేయును. అధ్యాత్మికమంటే మీరికి ఆస‌క్తి ఉంటుంది. తోటి వారికి స‌హాయం చేసేందుకు వీరు ఎల్ల‌వేళ‌ల సిద్ధంగా ఉందురు. ఆర్ధిక స్థితికి అడ్డంకులు ఉండ‌వు. ఇక ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయరు. వీరికి దృష్టి దోషం, కర్ణ దోషం కలిగే అవకాశాలు ఉన్నవి. ప్రథ‌మ భావ స్థితిలో ఉన్న కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావములను తన దృష్టితో ప్రభావితం చేస్తున్నాడు. ఈ ప్రభావం వ‌ల్ల మిత్రులు, భాగస్వాముల వల్ల‌ లాభం కలుగుతుంది.

బుధుడు
బుధుడు మీన లగ్న కుండలిలో చతుర్ధ, సప్తమ భావం యొక్క అధిప‌తిగా ఉండ‌డం వ‌ల్ల‌ క్రోదాధిపతి దోషం కారణంగా దూషించబడును. లగ్నంలో బుధుని ఉపస్థితి కారణంగా వ్యక్తి పరిశ్రమి కాగలడు. వారి పరిశ్రమ, బుద్ధి బలం వల్ల‌ ధనార్జన చేస్తారు. పితృ సంపత్తి నుంచి వీరికి విశేష‌
లాభాలు క‌లుగుతాయి. మ‌హిళ‌ల వల్ల‌ వీరికి లాభాలు, సమ్యోగము లభిస్తాయి. లగ్నంలో కూర్చొని ఉన్న బుధుడు సప్తమ భావంలో స్వరాశిని చూస్తున్నాడు. దీని ప్రభావం వ‌ల్ల‌ వర్తక వ్యాపారాలలో మిత్రుల, భాగస్వాముల నుంచి సమ్యోగం లభిస్తుంది. గృహస్థ జీవితం సుఖమయంగా ఉంటుంది. అనుకూలమైన జీవితభాగస్వామి లభించే అవ‌కాశం.

గురువు 
గురువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి, దశమాధిపతిగా ఉండును. లగ్నాధిపతిగా ఉండ‌టం వ‌ల్ల‌ రెండు కేంద్ర భావాలకు అధిప‌తిగా ఉన్నప్పటికి కేంద్రాధిపతి దోషం కలుగుతుంది. లగ్నంలో దీని ఉపస్థితి కారణంగా వ్యక్తి అత్యంత భాగ్యశాలిగా ఉండును. శారీరకంగా అరోగ్యంగా, అందంగా ఉండును. ఈ జాత‌కులు దయా స్వభావం, వినమ్రత కలిగి ఉంటారు. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ, నవమ భావాల‌ను చూస్తున్నాడు. దీని ప్రభావం వ‌ల్ల తండ్రి, సంతానం నుంచి సుఖం లభిస్తుంది. గృహస్థ జీవితం సుఖమయంగా ఉంటుంది.

శుక్రుడు
శుక్రుడు మీన లగ్నకుండలిలో తృతీయ, అష్టమ భావం యొక్క అధిప‌తి కాగలడు. ఈ లగ్నం యొక్క కుండలిలో ఇది అకారకంగా ఉండును. ఈ లగ్నంలో శుక్రుడు ప్రథ‌మ భావంలో ఉండ‌టం వ‌ల్ల‌ వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగాను ఉండును. వీరికి పిత్తవాత రోగం కలుగు అవకాశాలు ఉండును. వీరి పనిలో వీరు నిపుణత కలిగి ఉంటారు. వీరు సాహసం, పరాక్రమం కలిగిన వారై ఉంటారు. వీరు ఏ విషయంనైనా చాలా లోతుగా తెలుసుకొనుటకు ఆసక్తి కలిగిన వారై ఉండును. తల్లి నుంచి సుఖం, స‌మ్యోగానికి అవకాశాలు తక్కువ. సంతానం యొక్క సందర్భంలో కష్టాలు ఎదుర‌వుతాయి. సప్తమ భావంలో శుక్రుని పూర్ణ దృష్టి ఉండ‌టం వ‌ల్ల‌ గృహస్థ జీవితం సామాన్యంగా సుఖమయంగా ఉండును.

శని  
శని మీన లగ్న కుండలిలో ఏకాదశాధిపతి, ద్వాదశాధిపతిగా ఉండును. లగ్న భావంలో శని యొక్క ఉపస్థితి కారణంగా వ్యక్తి సన్నగా ఉంటాడు. శని యొక్క ప్రభావం వ‌ల్ల‌ వ్యక్తి నేత్ర సంబంధ వ్యాధుల వారిన ప‌డవ‌చ్చు. వీరికి సొంత నిర్ణయాలు తీసుకొవ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు. జీవితంలో ప్రగతి కొసం ఇతరుల సలహాలను పాటించాల్సి వ‌స్తుంది. ధన సేకరణ యొక్క ప్రవృత్తి ఉంటుంది. షేయర్, పందాలు, లాటరీల వలన ఈ జాత‌కుల‌కు అకస్మాత్తు లాభాలు కలిగే అవ‌కాశం. లగ్నస్థ శని తృతీయ భావంలో వృశ్చిక రాశిని, సప్తమ భావంలో కన్యా రాశిని, దశమ భావంలో గురుని రాశి ధను చూస్తుండును. ఈ భావాలో శని యొక్క దృష్టి ఉన్న ఎడల మిత్రుల నుంచి అపేక్షిత లాభం, సమ్యోగం లభించదు. ఇక భాగస్వాముల నుంచి హాని ఏర్ప‌డే అవ‌కాశం. దాంపత్య జీవితంలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.

రాహువు  
రాహువు మీన లగ్న కుండలిలో లగ్నస్థంగా ఉండ‌టం వ‌ల్ల ఈ జాత‌కుడు కండలు తిరిగిన బ‌ల‌శాలి అయి ఉండును. రాహువు వీరికి చతురతను, బుద్దిని ప్ర‌సాధించును. వీరిలో స్వార్ధ భావన ఉంటుంది. అనుకున్న కార్యాల‌ను సాధించుట‌కు, వీరు ఎవరితోనైనా మితృత్వంను చేస్తారు. పనిని ఎలా పూర్తి చేసుకొనవలనో వీరికి బాగా తెలుసు. వీరిలో సహాసం అధికంగా ఉండును. లగ్నస్థ రాహువు సప్తమ భావంలో స్థితిలో ఉన్న బుధుని కన్యా రాశిని చూస్తున్నాడు. దీని ప్రభావం వ‌ల్ల‌ సంతానం యొక్క సందర్బంలో స‌మ‌స్య‌లు వ‌చ్చే అవకాశాలు ఉన్నాయి. జీవితభాగస్వామి అరోగ్య సంబంధ‌మైన సమస్యలతో బాధించబడును. గృహస్థ జీవితంలో స‌మ‌స్య‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

కేతువు 
కేతువు మీన లగ్న కుండలిలో లగ్నస్థంగా ఉండ‌టం వ‌ల్ల వ్య‌క్తి అరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. నడుము నొప్పి, వాత వ్యాధులు క‌లిగే అవకాశం ఉన్నాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండ‌టం మూలంగా సొంత నిర్ణ‌యాలు తీసుకోలేరు. వ్యాపారం చేయాలనే కోరిక, ఉద్యోగం చేయుట వీరికి ఇష్టంగా ఉండును. స్వార్ధ సిద్ది కొరకు సామాజిక నియమాలను ఉల్లంఘించుటకు కూడా వీరు వెనుకాడరు. సప్తమ భావంలో కేతువు యొక్క దృష్టి జీవిత బాగస్వామికి కష్టకారిగా ఉండును. కేతువు వీరిని వివాహేతర సంబంధాలకు ప్రేరేపితం చేయును. ఫలితంగా గృహస్థ జీవితంలోని సుఖం బాధించబడును. ఆర్ధిక ప‌రిస్థితి సామాన్యంగా ఉంటుంది.