Menu

Durmukhi samvatsara panchangam

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర నవ నాయక ఫలము

{ 2016 -2017}

 

రాజు :- శుక్రుడు 

శుక్రుడు రాజు అయినందువల్ల ప్రతి ఇంట లగ్జరీ పెరుగును, స్త్రీ పురుషులు విలసవమ్థమైన్ జీవితము గడుపుట, వెండి, బంగారముల ధరలు పెరుగుట, మత్తుపదార్ధములు, మద్యము, సుగంధ ద్రవ్యాలు ధరలు పెరుగుట, ప్రేత్యక రిజర్వేషన్స్, స్త్రీలపై అత్యాచారములు, భార్యాభర్తల మద్య విభేదాలు, ఉలవ ధాన్యము ధర పెరుగుట, వైద్య అవసరములు పెరుగుట పాలధరలు పెరుగుట, వర్షాభావము బాగుండును.   

మంత్రి :- బుదుడు 

భుధుడు మంత్రి అవ్వుట వలన దేశములో విదేశి వ్యాపారములు పెరుగుట, పరిపాలన అత్యంత యుక్తి  ప్రయుక్తులతో కూడుకొని ముందుకు సాగును, ప్రజలలో  నేర ప్రవుత్తి మోసము పెరుగును, ప్రభుత్వము కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనును,పెసర దాన్య ధరలు పెరుగును,  ప్రభుత్వ నాతన పధకాలు తో ముందుకు సాగును.        

సైన్యాధిపతి :- బుదుడు 

  బుదుడు సైన్యాధిపతిఅగుట వల్ల దేశములో దోగల భయము పెరుగుట, సైన్యము నకు సంభందించి కొన్ని విషయములు బయటకు వచ్చును, సరిహద్దులలో యుద్ధ వాతావరణము ఉండును, కామప్రకోపములు అధికముగా స్త్రీ పురుషుల మద్య పెరుగును, మత సంభందిత చర్చలు పెరుగును, అగ్ని ప్రమాదములు, ఉద్యోగస్తులకు నూతన అవకాశములు కలుగును.   

సస్యాధిపతి :- శని 

  శని సస్యాధిపతి అగుటచే ప్రతి ఇంట మదుల వాడకము పెరుగును, క్రిమి కితకముల వల్ల పంటలు పాడగును, పంటలకు ధర వచ్చినప్పటికీ నిల్వలు తగ్గును,ఇనుము,నువ్వులు,నూనె ,ఫ్యాక్టరీలు అభివృద్ధి,  భయానక సంఘటనలవల్ల ప్రజలలో భయము పెరుగును, పెట్రోలు ధరలలో పెరుగుట తగ్గుట ఉండును.     

ధాన్యాధిపతి :- శుక్రుడు

అన్ని ధాన్యపు పంటలు బాగుండును,బొబ్బర్లు బాగా పండును, కొన్ని ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులలో వ్యతిరేకత ఉండగలదు, అతి వృష్టి అనా వృష్టి కలుగును, కాఫీ,టి మరియు సుఘంధ ద్రవ్యములు పంటలు ధరలు బాగుండును, నిలువ ఉంచిన వారు మంచి లాభములు పోడుడురు, పొడుగు ధాన్యములు విరివిగా పండ గలవు.  

అర్ఘాదిపతి :- బుదుడు

 పెసల ధాన్యధరలు పెరుగును, ప్రతి వస్తువుకు ధరలు లభించును, విదేశి మారక ద్రవ్య రేటు పెరుగును, ప్రభుత్వము లో నూతన చట్టములు వచ్చును, పారిశ్రామిక రంగములో విశేష మార్పు అభివృద్ధి వుందా గలదు, ద్రవోల్పనం తగ్గుటయే కాక వస్తువు నాణ్యత తగ్గును.  

మేఘాదిపతి :-  బుదుడు

దేశము అంతా వర్ష భావము అధికము.విశేష వర్షముల వాళ్ళ ప్రజా జీవనమునకు ఇబ్బంది కలుగును,  అధిక ప్రమాదములు, అధిక నష్టము ఉండును, వస్తువుల ధరలు పెరుగును, వ్యవసాయ అభివృద్ధి ఉండగలదు, కొన్ని చోట్ల అనావృష్టి వల్ల కొంత నష్టము తప్పక పోవచ్చును, రైతులుక ఇది కొంత నిరాశాకాలము. 

రసాధిపతి :- చంద్రుడు 

కంటికి సంబదిత వ్యాధులు పెరుగును, పిడుగు బాట్లు, నెయ్యి, పంచదార, నూనె ధరలు పెరుగును, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలమద్య విభేదాలు ఇటువంటి వాటితో ప్రజలకు ఇబ్బంది కలుగును. ఉష్ట్నోగ్రత అధికముగా రికార్డుస్థాయిలో ఉండును, రక్షణ వ్యవస్థ సకాలములో సమస్యలను గుర్తించుట చే భారి ప్రమాదములు అరికట్టేదరు, విదేసములలో మన దెశ ఖ్యాతి పెరుగును.  విదేశి ఎగుమతులు పెరుగుట విదేశములో కూడా  మన వస్తువులకు గిరాకి ఉండును. 

నీరసాధిపథి :-  శని 

సుఘంధ ద్రవ్య వ్యాపార రంగము మంచి అభివృద్ధిగా ఉండును,  మత్తు పానియముల ధరలు అధికమగును, పువ్వులు, పండ్లు ధరలు పెరుగును, ప్రజలు విలాస వంత జీవితము గడుపుదురు, కళాకారులకు మంచి సమయము, విదేశములలో ఉన్న ధనము బయటికి వచ్చును,  మహిళలకు అన్ని విధములా బాగుండును. నూతన విహంగ ఆశ్రమములు పెట్టుదురు, మాంసము, సీసం వంటి వాటి ధరలు తగ్గును. 

moudyami and adhikamaasam

 మూఢమి 

 

గురుమూఢమి :- ది . 11-09-2016 తేది బాద్రపద శుద్ధ దశమి ఆదివారం నుండి[పశ్చాదస్తమిత] గురు మౌడ్యమి ప్రారంభము అయ్యి  ది. 10-10-2016 తేది ఆశ్వియుజ శుద్ధ దశమి సోమవారం నాడు త్యాగము.  

శుక్ర మూఢమి :- ది.30-04-2016 చెత్ర బహుళ నవమి స్థిరవారం నుంచి[ప్రాగాస్తమిత] శుక్ర మౌడ్యమి ప్రారంభము అయ్యి  ది.1307-2016 తేది ఆషాడ శుద్ధ నవమీ బుధవారం నాడు త్యాగము. 

తిరిగి ది. 20-03-2017 తేది పాల్గుణ బహుళ అష్టమీ సోమవారం నుండి [పశ్చాదస్తమిత]  శుక్ర మౌడ్యమి ప్రారంభము

Puskaramulu and Grahanamulu

 

కృష్ణా నదికి  ఈ సంవత్సరము పుష్కరము 

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి గురువారం అనగా ది. 11-08-2016 తేది రాత్రి  11గం. 32 నిమిషములకు గురుడు కన్యా రాశి ప్రవేశము కావున మరునాడు అనగా థి. 12-08-2016 తేది శుక్రవారం కృష్ణానదికి పుష్కరములు ప్రారంభం. [ద్రిక్సిద్ధపద్ధతిన ..భారత ప్రభుత్వము ప్రకారము] సార్ధ త్రికోటి తిర్ధరాజ సహిత కృష్ణా  పుష్కర ప్రారంభం. అప్పటి నుంచి పన్నెండు రోజులు పుష్కర దినములుగా అవుతాయి.

2016 – 2017 సంవత్సరము లో గ్రహణములు

ఈ సంవత్సరము ప్రపంచములో 2 గ్రహణములు సంభవించును, అయితే భారత దేశములో మాత్రము గ్రహణములు కనిపించవు . 

1] ది. 01-09-2016 వ తేది శ్రవణ బహుళ అమావాస్య గురువారంసింహ రాశి యందు రాహు గ్రస్త సంపూర్ణ కంకణాకార సూర్య గ్రహణము.  ఆఫ్రికా, హిందు మహాసముద్రము,  దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రము, మెడగాస్కర నాడు కనుపించ గలవు.  

2] ది . 26-02-2017 వ తేది మాఘ బహుళ అమావాస్య ఆది వారము కుంబ రాశి యందు కేతు గ్రస్త కంకణాకార సూర్య గ్రహణం, ఇది భారతదేశము లొ కనిపించదు. జింబాబ్వే, చీలి, దక్షణఅంట్లాంటిక్,పసిపిక్ సముద్రములయందు, అఫికలో అంగోలా మొదలగు చోట్ల కనిపించును   

  భారతదేశము వారు నియమములు ఏమియు పాటించ వలసిన అవసరము లేదు.

కర్తరి 

డొల్లు [చిన్న]కర్తరి :- ది 04-05-2016 తేది చెత్ర బహుళ ద్వాదశి బుధవారం ఉదయం గం. 08-18 ని.    నుంచి 

  

నిజ   [పెద్ద] కర్తరి :- ది .11-05-2016 వైశాఖ శుద్ధ పంచమీ బుధవారం ఉదయం గం. 08-53 ని. నుండి నిజ కత్తిరి ప్రారంభము 

  ది. 28-05-2016తేది వైశాఖ బహుళ సప్థమీ స్థిరవారం నాడు త్యాగము. 

 కర్తిరి సమయమున కర్ర మట్టి పనులు నిషిద్ధము. 

మకర సంక్రాంతి, ఫలములు

ది. 14-01-2017 వ తేది ఉదయం 07 గం.28 ని.లకు రవి[సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును, కావున గురువారము అనగా 14-01-2017 వ తేది మకర సంక్రాంతి చెయవలయును.

మకర సంక్రాంతి పురుషుడు రాక్షస నామము  ఏనుగు వాహనము

రాక్షస నామం, శుద్దోదక స్త్నానం, అరిష్టం,చొరభయం, వ్యాది దుర్భిక్షం, పెసలు అక్షతలుచే పెసలు ధాన్యం ధరలు అధికమగును,రక్త వస్త్ర ధారణవల్ల ప్రజారోగభయము,గోరోచన చందన లెపముచే కొంత శుభము,  యుద్ధ భయం, జపాపుష్ప ధారణ వల్లయసోహాని, సిసపాత్ర ఆభరణ ధారణ వల్లఆరోగ్యం, పాలు త్రాగుటచే పశు నాశనం కీర్తి,రేగు పండు భుజించుటవల్ల శుభము, గజ వాహనము చే అరణ్య ప్రాంత జంతువులకు నష్టము, కోదండ ధరనవల్ల యుద్ధ బాయము, కాంచన చత్ర దారణచే రోగ స్వర్ణ నాశనము, ఆగ్నేయదిక్కు ప్రయాణము వల్లఆగ్నేయ రాష్ట్రములకు ఇబ్బందులుకలుగును.