Menu

Navaratnalu

Pearl

ముత్యము

ప్రకృతిలో లభించే నవరత్నాలలో ముత్య‌ము ఒకటి. ఇవి మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. ముందుగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.

ముత్యాల‌ను స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తారు. స్త్రీలు మంగళ సూత్రానికి ముత్యాన్ని చేర్చే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉంది. శ్రీరామమవమి రోజున సీతారాముల కల్యాణం జరినప్పుడు ముత్యాల త‌లంబ్రాలు పోయ‌డం ఆన‌వాయితీగా ఉంది. కల్యాణం జ‌రిగే సమయంలో స్వామివారికి .. అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు పోస్తారు. అలా పోయబడిన ముత్యాలను అక్కడి అర్చకులు వివాహితులైన స్త్రీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తుంటారు. ఆ ముత్యాన్ని మంగళ సూత్రానికి చేర్చి కట్టుకోవడం వలన, అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యం సుస్థిరమవుతుందని స్త్రీలు భావిస్తుంటారు. ప్రాచీనకాలం నుంచి ఈ విశ్వాసం బలపడుతూ రావడం వలన ఈ ఆచారం ఇప్పటికీ కొన‌సాగుతోంది.

ఎవ‌రు ధ‌రించ‌వ‌చ్చు..?
నవరత్నాలలో ముత్యము చంద్ర గ్రహానికి వర్తిస్తుంది. కర్కాటకం చంద్రుని రాశి. రోహిణి, హస్త, శ్రవణం చంద్రుని నక్షత్రాలు. 2, 11, 20, 29 తేదీలు చంద్రుని రోజులుగా జోతిష్య శాస్త్రం పరిగణించబడుతుంది. కాబట్టి కర్కాటక రాశి, లగ్నాలలో, రోహిణి, హస్త, శ్రవణా నక్షత్రాలలో జన్మించిన వారు ముత్యమును ధరించవచ్చు. చంద్రుడు దుష్ట స్థానాలలో, దుర్బల స్థానాలలో ఉండగా జన్మించిన వారు, చంద్ర దశ నడుస్తున్నవారు కూడా ముత్యాన్ని ధరించవచ్చునని రత్నాలశాస్త్రం చెబుతోంది.

ఎప్పుడు, ఎలా ధ‌రించాలి..?
సోమవారం శ్రావణం, రోహిణీ, హస్త నక్షత్రాల సంచారంలో ఉదయం 10 నుంచి మద్యాహ్నం 12 గంటలలోపు ముత్యాన్ని తయారుచేసి ఉండాలని అలాంటి నక్షత్రాల్లో చేసిన ముత్యపు ఉంగరాన్ని ధరించిన వారికి శుభ ఫలితాల్నిస్తుందని శాస్త్రం చెబుతోంది.

పచ్చి పాలలో, గంగా జలంలో ఒక రోజంతా ముత్యాన్ని ఉంచి శుద్ధి చేయాలని, ముత్యాన్ని ధరించిన‌ప్పుడు ఓం చంద్రమసే నమ: అనే నామాన్ని జపిస్తూ ముత్యమును కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలి. ముత్యాన్ని ధరించునప్పుడు పెరుగు, పాలు, వెండి, దూది, బియ్యం, నెయ్యి తదితరాలను దానం చేస్తే మంచిది. ఈ విధమైన ఆచారంతో ముత్యాన్ని ధరించిన వారికి మానసిక శాంతి ప్రేరణ, ఆనందం కలుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

సుఖ నిద్ర, జ్ఞాపకశక్తి, మానసిక ఎదుగుదల, వ్యాపారాభివృద్ధి, నిత్యావసరాలు, మందులు, పండ్ల తోటలు, మాతృ సౌఖ్యం, సంసార సుఖం, సత్వర వివాహానికి, హోటళ్ళు, విశ్రాంతి భవనాలు, నీటి పన్నులు, పానీయాలు, రస పదార్ధాలతో వ్యాపారం చేసే వారికి ముత్యం ధరించడం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తాయి. పైత్యం, శ్వాస రోగాలు, మనో వ్యాధులు, చర్మ వ్యాధులు, ఉబ్బసం, ఉదర రోగం, స్త్రీల వ్యాధులు, నివారణకు ముత్యం ధరించడం శుభప్రదం.