Navaratnalu
Red Coral
పగడము
నవరత్నాల్లో పగడము ఒకటి. పగడాన్ని ఆభరణాలలో ధరించడం అనాదికాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. రోమనులు తమ పిల్లల మెడలో వీటిని హారంగా గుచ్చి వేసేవారట. ఇలా ధరించడం వల్ల పగడం వారు ఆరోగ్యంగా ఉంటారని, ఆపదలు రాకుండా కాపాడుతుందని వారి నమ్మకం. ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో దీనిని ఇప్పటికీ దృష్టి దోషం తగలకుండా ఉండేందుకు ధరిస్తారు. హిందువులు కూడా ఆదికాలంనుంచి వీటిని ఉపయోగిస్తున్నారు.
అయితే పగడం రాయి కాదు. ఇది సముద్రంలో నివసించే కోరల్ ఫాలిప్ అనే జిగురువంటి చిన్న సముద్ర ప్రాణి కవచం. ఈ కవచం దాని శరీరంలో వెలుపల పెరుగుతుంది. ఇది ఆ ప్రాణి శరీరాన్ని కాపాడుతుంది. దానితోపాటు పెరుగుతుంది.
పగడము ధరించడం వల్ల వచ్చే ఫలితాలు
పగడము ముదురు ఎరుపురంగు కలిగి ప్రకాశవంతమైన నునుపు పగడాలు కుజ గ్రహానికి చాలా ప్రీతి. కుజుడు రక్త వర్ణం కలిగి అగ్నితత్వం గల పురుష గ్రహము. పగడం కూడా తేజోతత్వానికి సంబంధించింది. ఎరుపుగా ఉండటం కారణంగానే కుజుడుకి ఇష్టప్రదమైంది. ఈ పగడం త్రిదోషంలోని పిత్తమను దోషాన్ని హరింపగలదు.
మానవ శరీరంలోని మూలాధార చక్రమునందలి వివిధ కాంతి విశేషములన్ని ఈ పగడంనందు నెలకొని ఉండటం వల్ల మూలాధార చక్రంలోని పసుపు పచ్చని రంగుగల కాంతి కిరణాల దేహతత్వంపై ఏ విధంగా పనిచేయగలవో ఈ పగడం ధరించడం వల్ల కూడా అదే విధంగా హరిత కిరణాలు దేహ రంద్రాల ద్వారా చొచ్చుకుపోయి, రక్త దోషాలు, లివర్, బ్లడ్ ప్రషర్, అల్సరు, జననేంద్రియ సంబంధిత వ్యాధులు, స్ఫోటకం వంటి అనేక అంటువ్యాధులు, కీళ్ళ బాధలు మొదలగు అనేక రుగ్మతలు పారద్రోలి ఆరోగ్యవంతులను చేయగలదు.
మృగశిర, చిత్త, ధనిష్ఠ అను నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ కాలంలోనైనా మంచి పగడాలను ధరించవచ్చు. ఇతర నక్షత్ర జాతకులలో ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రజాతకులు పగడం ధరించి సత్ఫలితలు పొందటం చాలా కష్టం, మిగిలినవారు తమ జన్మకాలమునందలి జాతక చక్రంను అనుసరించి గ్రహాల యొక్క దశాంతర్దశలను గమనించి కుజగ్రహం దోష ప్రమాదంగా ఉన్న సమయములందే పగడం ధరించాలి. అలా ధరించడం మూలంగాల కుజగ్రహ దోషంవల్ల జీవితంలో సంభవించే అనేక అనర్థాలు, నివారింపబడి శుభం, జయం కలుగును.
బ్రహ్మజాతికి , క్షత్రియ జాతికి సంభంధించిన ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతుల వల్ల ధరించడం వల్ల శుభం జరుగుతుంది. ఆచరించే ప్రతికార్యంలో కలిగే విఘ్నాలు అంతరించి ఆయా పనులలో విజయం లభిస్తుంది. ఆ కారణంగా శత్రుత్వం తొలగిపోయి జనవశీకరణ లభిస్తుంది. పగడము అగ్నినుంచి, ఆయుధాల నుంచి కృర శతృవుల నుంచి తగిన రక్షణ అందిస్తుంది. అనుకోని ప్రమాదాలు, గండాలను తప్పించి రక్షణగా ఉండగలదు. దీర్ఘకాలంగా బాధిస్తున్న రుణ బాధలు, సూర్యోదయమునకు చీకట్లు తొలగిపోయినట్లు సమసిపోవును.
ఇక వివాహ విషయంలో కలిగే వివిధ ఆటంకాలు అంతరించి శీఘ్రంగా వివాహం అవుతుంది. కుజదోషంల వలన కలిగే దాంపత్య జీవితంలో కలిగే కలహాలు, కలతలు కార్పణ్యాలు, పరస్పర వైషమ్యాలు, విడాకులలాంటి దుర్మార్గపు భావనలు, అంతరించి, అన్యోన్యప్రేమ పూరితమైన అనురాగంతో దంపతులు దీర్ఘకాలం సుఖ సంసార జీవనం చేసుకొనుటకు తోడ్పడుతుంది.
శతృవుల వల్ల ఏర్పడే సమస్యలు, రాజకీయ బాధలు, పోలీస్ కేసులు, ఇతర బాధలు, లివర్ వ్యాధులు, దేహతాపం, చర్మవ్యాధులు, గడ్డలు వ్రణములు, వాపులు, కీళ్ళబాధలు, జననేంద్రియములకు సంబంధించిన అన్ని వ్యాధులు. కడుపునొప్పి కాన్సరు మొదలగు ఇంకా అనేక వ్యాధులను శీఘ్రంగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు పగడం సహాయపడుతుంది.
పగడానికి అధిపతి కుజగ్రహం అనుగ్రహం కలిగి శుభగ్రహ స్థానల్లో ఉంటే ఎంత మంచి చేస్తాడో ఆ విధమైన శక్తికలవాడై అశుభ స్థానాల్లో ఉంటే అంతటి కీడును కూడా కలిగిస్తాడు. ఆయనకు ప్రీతికరమైన పగడాన్ని ధరించడం వలన కుజ గ్రహం ప్రసన్నుడై సకల ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సంపదలతో, గౌరవం, ఆరోగ్యం, గౌరవం వంశాభివృద్ది, సకలసౌభాగ్యాలు కలుగచేస్తారు. పగడపు పూస మాలలు ధరించడం వల్ల కూడా పై విధమైన ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష మాలల యందు 7 పగడాలు గానీ కనీసం ఒకటి రెండు పగడాలుగానీ చేర్చి ధరించాలి.
పగడము ధరించే విధానం
పగడం 7 కారెట్లు ఉన్న దాన్ని ధరించుట మంచింది. త్రికోణంగా ఉన్న పగడం విశేష ఫలప్రదం, అలా కాకుంటే బాదంకాయ రూపంలో ఉన్న దాన్ని కూడా వాడవచ్చు. నలుచదరపు, వర్తులం విల్లువలె ఉండునది. నక్షత్రాకారంను పోలిన పగడాలు ధారణకు అంతగా ఉపయోగించవు. పగడం చిన్నదైనా దోషరహితంగా ఉండాలి. బంతివలె ఉన్న ప్రవాళాలు మూలల్లో, ఆభరణాల్లో కూర్చుకోవడం ఉత్తమముం. పగడం కూర్చే ఉంగరం బంగారంతో గానీ లేక వెండితో గానీ, లేదా పంచలోహంలతో గానీ తయారు చేయించాలి. ఈ ఉంగరం పీట భాగంలో ముక్కోణాకారంలో ఉండి దాని చుట్టూ వలయ రేఖలను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.
కృష్ణ పక్షంలో చదుర్దశీ మంగళవారం వచ్చిన రోజునందుగానీ, లేక కుజుడు మకర రాశిలో ధనిష్ఠా నక్షత్ర సంచారం చేసే కాలంలో గానీ ఏదో ఒక మంగళవారంనాడు గానీ, మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్య కాలంలో గానీ లేక రాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య సమయంలో గానీ, దక్షిణ ముఖంగా కూర్చొని పగడం ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని ఒక రోజంతా నవ ధాన్యాలలో ఉంచి మరో రోజంతా పంచగవ్యములు (ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవు పంచితం, గోమయం కలిసినది)యందుంచి, 3వ రోజున సుగంధ, ద్రవ్యాలతోడను, ఎర్రచందనపు నీళ్ళతో రుద్రాభిషేకం జరిపించి శుద్ది చేయాలి. ధరించే వారు తమకు తారాబలం చంద్రబలం గలిగిన శుభతిదులయందు (శనివారం గాక)మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నములు వర్తించు వేళాలందు ఉంగరము కుడిచేతి ఉంగరపు వేలికి ధరించాలి.
ధరించుటకు పూర్వమే షోఢశోపచార పూజలు జరిపి నమస్కరించి గురువులను గణపతిని ధ్యానించి దక్షిణ ముఖముగా నిలువడి ఉంగరము కుడి అరచేతియందుంచుకొని “ఓం లం ఐం హ్రీం శ్రీం మహిపుత్రాయ సకలారిష్ట వివారనాయ క్లీం క్లీం స్వాహా”అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయాలు జపించి, ఉంగరాన్ ముమ్మారు కళ్లకు అద్దుకొని వేలికి ధరించాలి. స్త్రీలు మాత్రం ఎడమ చేతికి అనామికా వేలికి ధరించుట శుభప్రదం.