Nvagraha Dosha Pariharalu
నవగ్రహాలకు జపాలు పరిహారాలు
పూర్వజన్మలో మానవుడు చేసిన పుణ్య పాపకర్మ ఫలాల్ని అనుసరించి ప్రస్తుత జన్మలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే, ఈ కర్మఫలాలని అనుభవింపజేసేవి నవగ్రహాలు. నవగ్రహాలు అన్నీ తమతమ అంతర్దశలలో జాతకుడి కర్మ ప్రారాబ్దానుసారం అతడికి సుఖాల్ని, సమస్యలను కలిగిస్తూ ఉంటాయి.
ఇలా మానవులు నవగ్రహదోషాల ద్వారా కష్టాలు పడకుండా, వీటికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. అయితే, ఏ దోషానికైనా పాపఫలం కారణం అని గుర్తించాలి. దానికి మనం సంపాదించినదాంట్లో 20 శాతం సొమ్మును దానంచేస్తే మంచిది.
ఆయా గ్రహాలకి బ్రాహ్మణాదుకి ఇవ్వడంతోపాటు తమ దగ్గర పనిచేసేవారికి, చుట్టు ఉండే బంధువులకి, స్నేహితులకి పంచుకోవడం, బీదలకి అనాధలకి ఇవ్వడం కూడా పుణ్యకార్యమే. నిజానికి దానాలు ఎవరెవరికి ఎలాంటివి ఇవ్వవచ్చో తెలుసుకుని దానాలు చేయాలి. అవిచేస్తూ కింది జపాలు, ఆయా దేవతా పూజలు చేయడం శుభప్రదం.
రత్నాలు అందరూ అన్నీ ధరించకూడదు అవిసూచనిబట్టే ధరించాలి. అయితే, పూజ, జపం, దానం లేకుండా రత్నధరణ ఫలించదు. ప్రతీ గ్రహానికి (జపం (అనగా ఇవ్వబడ్డ సంఖ్య) + తర్పణం + హోమం + దానం) ఇవన్నీ చేయడాన్ని మాములు పరిహారం అంటారు. విశేష సమస్యలకు ఆయా పరిహారాలు పాటించాలి.
చేయాల్సిన పరిహార విధులు
సూర్యగ్రహానికి..
గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణకారకః । విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవిః ॥ ఈశ్లోకాన్ని ఏడు వేల సార్లు జపించాలి దానాలు త గోధులు, గోధుమ పిండి పదార్థాలు రొట్టెల వంటివి, రాగి వస్తువులు. పూజలు- విష్ణుమూర్తికి పూజ, సూర్యోపాసన. రత్నాలు- కెంపు ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాలి.
చంద్రగ్రహానికి..
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సురాశనః । విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదుః ।। ఈ శ్లోకాన్ని పది వేలసార్లు జపించాలి. దానాలు తపాలు, తెల్ల బట్టలు, బియ్యం వెండి వస్తువులు. నీరు దానం చేయవచ్చు. లేదా నీటి ట్యాంకర్ కట్టించడం. శివాలయం, ఏదైనా తీర్థాలు, పూజలు-శివారాధన, చంద్రపూజ, చంద్రుడి అష్టోత్తర శతనామాలు చదవటం.
రత్నాలు- ముత్యం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
కుజగ్రహానికి..
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్‌సదా । వృష్టికృత్ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః ॥ ఈ శ్లోకాన్ని ఏడు వేలసార్లు జపించాలి దానాలు త కారం వస్తువులు, ఎర్ర వస్త్రాలు, కందులు, కందిపప్పు. రక్తదానం పూజలు-దుర్గారాధన, సుబ్రహ్మణ్యారాధన, కుజ పూజ, కుజ అష్టోత్తర శతనామాలు చదవటం.
రత్నాలు- పగడం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
బుధగ్రహానికి..
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రోమహాద్యుతిః । సూర్యప్రియకరోవిద్వాన్ పీడాంహరతుమే బుధః । ఈశ్లోకాన్ని పదిహేడువేల సార్లు జపించాలి దానాలు తపెసలు, ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రోగులకు మందులు ఇవ్వడం,
రత్నాలు- పచ్చ (మరకతం) ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
పూజ. విష్ను ఆరాధన, వణిగింద్ర పూజ, కుబేర పూజ ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవటం
గురుగ్రహానికి..
దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః । అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః॥ ఈశ్లోకాన్ని పదహారు వేల సార్లు జపించాలి. దానాలు త పుస్తకాలు, బంగారు వస్తువులు, తీపి పిండి వంటలు, పట్టు బట్టలు. పండ్లు.
పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
శుక్రగ్రహానికి…
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః । ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భృగుః ॥ ఈ శ్లోకాన్ని ఇరవై వేల సార్లు జపించాలి. దానాలు తచక్కెర, బబ్బెర్లు, అలంకరణ వస్తువులు. పూలు. ఆవు పూజలు. లలితా, కాలీ, శుక్ర గ్రహం పూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తర శత నామాలు చదవటం. రత్నాలు- వజ్రం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
శనిగ్రహానికి..
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః । మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః ॥ ఈ శ్లోకాన్ని పందొమ్మిది వేల సార్లు జపించాలి దానాలు త వాడుకున్న వస్త్రాల్లోచినిగి పోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్, నేరేడు పండ్లు, దానంచేయడం, నువ్వుల నూనెతో శరీరాన్ని రుద్ది తర్వాత స్నానం చేయడం. పూజలు, రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శత నామాలు చదవటం.
రత్నాలు- నీలం(ఇంద్రనీలం) ధరించాలి, అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
రాహుగ్రహానికి..
అనేకరూప వర్ణైశ్చ శతశఃఅథసహస్రశః । ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః ॥ ఈ శ్లోకాన్ని పద్దెనిమిది వేల సార్లు జపించాలి. దానాలు తముల్లంగి వంటి దుంపలు, మినప్పప్పుతో చేసిన వడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాల సర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
కేతుగ్రహానికి..
మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః। అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ ॥ ఈ శ్లోకాన్ని ఏడు వేల సార్లు జపించాలి.
దానాలు ఉలవలు, మిక్స్‌డ్ కలర్స్ వస్త్రాలు, ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం.
రత్నాలు- వైఢూర్యం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.