Menu

Poorvashada

పూర్వాషాఢ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము. పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు. అది దేవత – గంగ. మనుష్య – గణం. జంతువు – వానరం. రాశి – అధిపతి గురువు.
పూర్వాషాఢ నక్షత్రము మొదటి పాదము  
పూర్వాషాఢ ఒకటవ పాదము సింహరాశిలో ఉంటుంది. సింహరాశి సూర్యుడు. పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు. ఈ నక్షత్ర జాతకుల మీద సూర్య, శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణ ప్రధానులు కాబట్టి వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. వీరికి అతిశయభావం, నిర్వహణ సామర్ధ్యం ఉంటుంది. విలాసాల మీద,  సౌందర్యపోషణ మీద అంతులేని ఆసక్తి ఉంటుంది. కళాత్మకమైన వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
ఈ జాతలకులు చిన్న వయసు నుంచే  కళాత్మక రంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. విద్య ఆరంభం నుంచి బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాలు సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. అయితే పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. 18 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సాఫీగా సాగే జీవితంలో తరువాత కాస్త సుఖం తగ్గినా 41 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సాఫీగా, ప్రశాంతంగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్రము రెండవ పాదము
వీరి మీద శుక్ర, బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు  బుద్ధి కుశలత కలిగి ప్రవర్తిస్తారు. ఈ జాతకులు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరించగల నేర్పు ఉంటుంది. అంతేకాదు కళాత్మక వస్తువుల మీద ఆసక్తి అధికం.
చిన్న వయసు నుంచే కళాత్మక రంగంలో ప్రకాశించగలుగుతారు. పర్యాటక ప్రదేశాలలో వీరికి ఉద్యోగావకాశాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత , కళా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. విద్య ఆరంభం నుంచే బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.
14 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సుఖంగా సాగే జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 37 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో అనుకోని కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్రము మూడవ పాదము  
వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. అంతేకాదు వీరి మీద పరిపూర్ణంగా శుక్రుడి ప్రభావం ఉంటుంది కనుక వీరు  కళారంగంలో విశేషంగా ప్రకాశిస్తారు. వీరికి కళాపిపాస అత్యధికంగా ఉంటుంది. కళాత్మక వస్తుసేకరణ అంటే ఆసక్తి అధికం. పరిశుభ్రమైన వాతావరణం అంటే ఇష్టపడతారు. అటువంటి చోటే నివసిస్తారు. పర్యాటక ప్రదేశాలలో, విహార ప్రదేశాలలో, విలాస ప్రదేశాలలో వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.
ఇక ఈ జాతకులు చిన్న వయసులోనే కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుంచి బాగా అబ్బుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే అధిక ఆసక్తి. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. 9 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సుఖంగా సాగే జీవితంలో తరువాత కొంత సుఖం తగ్గినా 32 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం కూడా జరుగుతుంది.
తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా జీవితంలో కొన్ని అనుకోని అవంతరాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 50 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 66 సంవత్సరాల కాలంలో 19  సంవత్సరాల శని దశ కాలంలో వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్ర నాలుగవ పాదము  
వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు స్వభావ రీత్య ఉంటుంది. వీరు భావ తీవ్రత కలిగి ఉంటారు. అయినా కూడా తమ భావాల మీద నియంత్రత కలిగి ఉంటారు. ఈ జాతకులకు భూ సంబంధిత , కళా సంబంధిత, పర్యాటక సంబంధిత,  జలసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
ఈ జాతకులు బాల్యం నుంచే కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుంచే బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. 5 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో తరువాత కొంత సుఖం తగ్గినా… 28 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 61 సంవత్సరాల కాలంలో 19 సంవత్సరాల శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. మిగిలిన జీవితం.. వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు, ఫలితాలు 
ఈ నక్షత్ర జాతకులు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే వాక్చాతుర్యత, అందం వీరి సొంతం. విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. ముఖ్యంగా స్నేహితులతో ఉమ్మడిగా జీవితంలో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తారు. జన్మించిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి.
విదేశీయానం, విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానం మీద ఎవరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కూడా కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. సహోదరుల వలన అపఖ్యాతి వస్తుంది.
ఇకపోతే.. బుధవారం వీరికి అదృష్టమైన రోజు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ఎలాంటి పనులు చేపట్టినా ఆశించిన ఫలితాలుండవు. నలుపు, సిల్వర్ రంగులు గల దుస్తులను ధరించడం మంచిది. నలుపు చేతి రుమాలును వాడటం ద్వారా కొన్ని సమస్యల నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంది. ఇంకా శుక్ర గ్రహ శాంతి కోసం శనివారాల్లో నేతి దీపమెలిగించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. వీరి అదృష్ట సంఖ్య 3. ఇక 5, 6 సంఖ్యలు కలిసి రావు.