Menu

Vastu Shastra – Interior

Vastu Shastra - Interior

వాస్తు – గృహాలంకరణ -1

గృహ నిర్మాణంలోనే కాదు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. గృహాన్ని అలంకరించుకోవడానికి వాస్తు శాస్త్రం కొన్ని మార్గదర్శకాలను అందిస్తుంది. ఇంటిని అలంకరించడానికి ఇంట్లో వివిధ ప్రదేశాలను అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి ఇంట్లో మనకు సానుకూలమైన దిక్కులు(ప్రదేశాలు), ప్రతికూల దిక్కులూ(ప్రదేశాలు) ఉంటాయి.

అయితే, ప్రతికూల ప్రదేశాలతో పోలిస్తే సానుకూల ప్రదేశాలను తేలికగా ఉంచాలని వాస్తు స్పష్టం చేస్తోంది. భారీ ఫర్నిచర్‌, ఇతర వస్తువులు ప్రతికూల ప్రదేశాల్లో అమర్చాలి. తేలికైన ఫర్నిచర్‌ను సానుకూలమైన ప్రదేశాల్లో అమర్చాలి. ఉత్తరం, తూర్పు, ఈశాన్యం సానుకూల ప్రదేశాలు లేదా తేలికైన దిక్కులు అయితే, మిగితావి ప్రతికూల ప్రదేశాలు.

సాధారణంగా ప్రతికూల జోన్లు ఇంటికి దక్షిణంలో, పశ్చిమంలో, నైరుతిలో ఉంటాయి. కనుక ఇంట్లో సామాన్లు ఏవి ఎక్కడ సర్దుకుంటే మంచిదో వాస్తు కొన్ని విషయాలు చెబుతోంది.

డ్రాయింగ్‌ రూమ్ లో సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర లేక దక్షిణ దిక్కులో వేసుకోవాలి. ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి.

బెడ్‌రూంలో మంచాన్ని నైరుతి మూలను వదిలేసి నైరుతి దిక్కులో వేసుకోవాలి. విలువైన నగలు, డబ్బులు పెట్టే బీరువాలను నైరుతి దిక్కుని వదిలి నైరుతిలోనే పెట్టుకోవాలి. దాని తలుపులు ఉత్తరముఖంగా ఉండేలా పెట్టుకోవాలి. వంటింట్లో కానీ, డైనింగ్‌ హాల్లో కానీ డైనింగ్‌ టేబుల్‌ వేసుకునేటప్పుడు దానిని గదికి వాయువ్య దిక్కులో ఉండేట్టుగా చూసుకోవాలి.

అద్దం బిగించడానికి..
ఇంట్లో అయినా ఆఫీస్ అయినా సరే వాస్తు ప్రకారం అద్దం ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. మీ ఇంటిలో సానుకూల శక్తి పొందడం అనేది మీరు మీ ఇంట్లో మీ అద్దాలను ఉంచే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తుప్రకారం అన్ని అద్దాలు వాటి ప్రదేశంలో వాస్తు ప్రకారం పెట్టాలని లేదు. అద్దాలు కొన్ని ప్రదేశాలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో కొన్ని వ్యతిరేక శక్తిలు కలిగిస్తే, మరికొన్ని ప్రదేశాల్లో ఉంచడం వల్ల సానుకూల శక్తిని అందిస్తాయి. మీ ఇంట్లో వాస్తు ప్రకారం అద్దాలను అమర్చాలనుకొన్నప్పుడు మీకోసం కొన్ని ప్రాధమిక చిట్కాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

పడకగదిలో మీకు ప్రతిబింబించేలా అద్దం పెట్టకూడదు. అలా పెడితే అనారోగ్యం చెందడం లేదా ప్రతి కూలశక్తులు పొందవచ్చు. మీ ఇంట్లో ప్రతికూల శక్తి కలిగే ప్రదేశానికి అభిముఖంగా అద్దం ఉంచడానికి ప్రయత్నించండి. అటువంటప్పుడు ఇంట్లో ఉండే అన్ని ప్రతికూల శక్తులు తొలగించబడుతుంది. ఆఫీసులు అద్దాలు అమరికకు వాస్తు చిట్కాలు మీ ప్రొఫెషనల్ వాతావరణంలో కూడా అన్ని సానుకూల శక్తిని పొందాలనుకుంటారు. ఈ పాజిటివ్ శక్తులు అలాగే నిలిచి ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అద్దాలు కేవలం పాజిటివ్ శక్తులను మాత్రమే ప్రతిబింబిస్తాయి.

ఇక అద్దంను మీ ఆఫీసులో లాకర్ కు ఎదురుగా అమర్చాలి. అప్పుడు అన్ని శక్తులు సానుకూలా శక్తులు సమృద్ధిగా పొంది మరింత ముందుకు ఎదగడానికి అవకాశం ఉంది. మీరు ఇరుకైన ద్వారాలకు ఎదురుగా అద్దాలు అమర్చడం నివారించండి. మీ ఆఫీసుల మీ క్యూబికల్ విండోకు అపోజిట్ గా అద్దాలను అమర్చుకోవచ్చు . దాంతో మీకార్యాలయంలో సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీరు అద్దలు అమర్చాలంటే మంచి ప్రదేశం ప్రతిబింబించే ప్రదేశంను ఎంపిక చేసుకోవాలని నిర్ధారించుకోండి.

మీరు , మీ బాత్రూంలో అద్దాలు అమర్చుకోవాలనుకుంటే, వాటిని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో గోడ విశాలంగా ఉంటే అక్కడ ఇంటికి కనెక్ట్ అయ్యేలా అద్దంను అమర్చవచ్చు. రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంచకండి . ఇది వాస్తు చిట్కాలకు పూర్తి వ్యతిరేకంగా. అలా ఉంచినట్లైతే మీరు విశ్రాంతిలేకుండా ఉండటానికి కారణం అవుతుంది. బాత్రూమ్ లో కాకుండా, అద్దాలను ఉత్తర లేదా తూర్పు దిశలో అద్దాలాను ఎప్పటికి ఉంచకండి అది, మీ పాజిటివ్ శక్తిని మొత్తం తీసుకెళ్ళిపోతుంది. మీ ప్రతిబింబాన్ని కనబడకుండా ఉండే ప్రదేశాల్లో అద్దాలను అమర్చకూడదని గుర్తుంచుకోండి. అలాగే ప్రధాన ద్వారంకు ఎదురుగా ఉంచకూడదు. ఇవి చిట్కాలు అద్దాలను వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదనడానికి ప్రధాన చిట్కాలు.

ఇక ఇంట్లో ఫర్నిచర్‌ సర్దుకునేప్పుడు భారీగా ఉండే దానిని ప్రతికూల ప్రాంతంలోనూ, తేలికపాటివి సానుకూల ప్రాంతాల్లోనూ సర్దుకోవడం మంచిది. సాధారణంగా ప్రతికూల జోన్లు ఇంటికి దక్షిణంలో, పశ్చిమంలో, నైరుతిలో ఉంటాయి. గదిలో దక్షిణాన కానీ పశ్చిమ భాగాన కానీ సోఫాను ఉంచాలి. సోఫాలో కూర్చునే వారు ఉత్తరం లేక తూర్పు దిక్కుగా కూర్చోవాలి. నైరుతి మూల ఖాళీగా వుంచి నైరుతి దిక్కుగా బెడ్‌ను ఉంచాలి. ఖరీదైన వస్తువులు నగలు ఉన్న బీరువాను నైరుతి మూలన కొంచెం ఖాళీగా వదిలేసి అక్కడే ఉత్తర ముఖంగా అమర్చాలి. వంటగది, లివింగ్‌రూం లేక డైనింగు రూంలో వాయవ్య దిశలో డైనింగు టేబులు అమర్చాలి. గదిలో ఉత్తరానగానీ తూర్పున గానీ చదువుకునే బల్లను అమర్చాలి. ఉత్తరం లేక తూర్పు లేక ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచితే మంచిది.

ఇక సూర్యోదయం, జలపాతం వంటి ప్రతిమలు ఇంట్లో వాడితే మంచిదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. యుద్ధం, హింసను ప్రతిబింబించే చిత్రాలను ఉపయోగించకూడదు. పడకగదిలో దేవతామూర్తులను ఉంచకూడదు. వినాయకుడి బొమ్మలను అలంకార సామగ్రిగా వాడడం బాగా ప్రజాదరణ పొందింది. దేవతా విగ్రహాలను పూజ గదిలో ఉంచండి. గదిలో ఇంట్లో ఈశాన్య దిశలో భారీ విగ్రహం ఉంచరాదు.

బెడ్‌రూంలో తేలిక రంగు కర్టెన్లు అమర్చుకోండి. పడకగదిలో ఎరుపు నల్ల రంగు కర్టన్లు వాడవద్దు. లివింగ్‌ రూంలో ముదురురంగు కర్టెన్లు వాడవచ్చు. ఇక గృహాలంకరణలో ఇండోర్‌ మొక్కలు ఎంతో ప్రజాదరణ పొందాయి. బ్రహ్మజెమడు, ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంచవద్దు. ఇంట్లో ఈశాన్యంలో పెద్ద మొక్కలు ఉంచవద్దు. వాస్తు ప్రకారం లేత రంగు పెయింట్‌ మంచిది. లేత నీలం, ఆకుపచ్చ, గులాబీ, గోధుమ రంగులు గదులకు వేయండి. ఎరుపు, నల్ల రంగులు ఇంట్లో వాడవద్దు. నేలకు మొజెయిక్‌, సెరామిక్‌ టైల్స్‌, పాలరాయి మంచిది. గదుల్లో తెల్ల పాలరాయి వాడవద్దు. దీన్ని పూజ గదులకు మందిరాలకు శుభ ప్రదమైందిగా భావిస్తారు. నివాస గృహాలకు కప్పు చదునుగా ఉండడం మంచిది. గది కప్పు ఎత్తున ఉండకూడదు. దీపాలు కాంతివంతంగా ఉండాలి. ఇళ్లు మసక చీకటిగా ఉండటం మంచిది కాదు.