Menu

Vruschikam-Lagnam- Grahamulu

వృశ్చిక లగ్నము-లగ్నస్థ గ్రహములు-ఫలితాలు  

వృశ్చిక లగ్నము యొక్క అధిప‌తి కుజుడు. దశమ స్థానం, కేంద్ర స్థానానమైన దశమాధిపతి సూర్యుడు, ధన స్థానమైన 2వ, పుత్ర స్థానం త్రికోణ స్థానం అయిన పంచమ స్థానాధిపతి గురువు, యోగకారకుడు, త్రికోణ స్థానాధిపతి అయిన చంద్రుడు వృశ్చిక లగ్నానానికి శుభం కలిగిస్తారు. సప్తమ స్థానాధిపతి మరియు వ్యయ స్థానమైన ద్వాదశ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు, అష్టమ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి అశుభం కలిగిస్తారు.

సూర్యుడు 
వృశ్చిక లగ్నము గల కుండలిలో సూర్యుడు దశమాధిపతిగా ఉండుట వల్ల కారక గ్రహము కాగలడు. కుజుని యొక్క రాశిలో లగ్నస్థముగా ఉండి సూర్యుడు వ్యక్తికి ఆత్మబ‌లమును ప్రధానించును. ఇది బుద్దివంతునిగాను, మహత్వకాంక్షిగాను చేయును. ప్రభుత్వ పక్షం నుంచి లాభాలను కలిగించును. సూర్యుడు కర్మాదిపతిగా ఉండుట వల్ల‌ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఈ స్థితి ఉన్న‌దో వారికి తండ్రి వద్ద నుంచి సమ్యోగము, స్నేహము లభిస్తుంది. సప్తమ భావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృషభముపై సూర్యుని యొక్క దృష్టి శృంగార, సౌందర్య సంబంధ‌మైన వస్తువుల వ్యాపారం వీరికి విషేశ లాభములను ఇచ్చును. జీవిత భాగస్వామితో అశాంతి నెల‌కొంటుంది. అయితే మాతృమూర్తితో స్నేహపూరితమైన సంబంధాలు ఉంటాయి.

చంద్రుడు
వృశ్చిక లగ్నం యొక్క కుండలిలో చంద్రుడు భాగ్యాదిపతి, త్రికోణాదిపతి కాగలడు. ఇది ఈ లగ్నము గల జాతకునికి శుభ ఫ‌లదాయకముగా ఉండును. లగ్నములో చంద్రుడు స్థితిలోఉండుట వల్ల ఈ జాత‌కుడు అందంగా, ఆకర్షణీయంగా ఉండును. వీరు ప్రభావశాలి వ్యక్తిత్వం గలవారై ఉంటారు. వీరిలో ధార్మిక భావన అధికంగా ఉండును. వీరిలో దయ, కరుణా భావన ఉంటుంది. నడుము నొప్పి, పిత్త సంబంధ‌మైన వ్యాధులు వ‌చ్చే అవకాశం. భాగ్యం యొక్క బలం కారణంగా వీరి పని సునాయసంగా జరుగును. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. సప్తమ భావములో చంద్రుని యొక్క దృష్టి కారణముగా అందమైన జీవిత బాగస్వామి ప్రాప్తించును. జీవిత భాగస్వామి నుంచి వీరికి సమ్యోగము లభించును.

కుజుడు 
వృశ్చిక లగ్నములో కుజుడు లగ్నాధిపతిగా ఉండుట వ‌ల్ల‌ శుభ కారక గ్రహం కాగలడు. షష్టమ భావం యొక్క అధిప‌తిగా ఉండుట వలన దీని శుభత ప్రభావితం కాగలదు. అప్పుడు కూడా లగ్నాధిపతిగా ఉండుట వల్ల శుభ ప్రభావములనే ఇచ్చును. లగ్నస్థు ఉండుట వల్ల‌ విశేష లాభకారిగా ఉండును. ప్రథ‌మ భావంలో స్థితిలో వున్న గ్రహాలు వ్యక్తికి దీర్ఘాయువును ప్రధానించును. వ్యక్తిని శారీరకంగా శక్తిశాలి, పరిశ్రమి, నిరోగిగా చేయును. శత్రువుల వల్ల‌ వీరు భ‌యబీతి పొందరు. ఇక మాతృ పక్షము నుంచి వీరికి లాభము కలుగును. లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావాలను చూస్తున్నాడు. కుజుడు ఏ భావమునైతే చూస్తాడో ఆ భావము యొక్క ఫలితాలు పీడించబడగలవు. అంటే.. భూమి, భవనం, వాహన సుఖం బలహీన పడగలదు. తల్లితో కూడా మత బేధములకు అవకాశాలు ఉండును. జీవిత భాగస్వామికి అనుకోని స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు. వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు చుట్టిముట్ట‌వ‌చ్చును.

బుధుడు 
బుధుడు శుభ గ్రహం అయినప్పటికీ ఈ లగ్నంలో అష్టమాదిపతి, దశమాదిపతిగా ఉండి అశుభ, అకారక గ్రహంగా ఉండును. వృశ్చిక లగ్నము కుండలిలో బుధుడు లగ్నస్థముగా ఉండుట వల్ల‌ వ్యక్తి సాహసి, జ్ఞాని కాగలడు. బుధుని ప్రభావం వ‌ల్ల ఈ జాత‌కుడు భోజ‌న ప్రియుడై ఉంటాడు. వీరు జన్మించిన తరువాత వీరి తండ్రి ఆర్ధిక పరిస్థితి బలపడును. తండ్రి లేదా తండ్రి పక్షం నుంచి లాభం కలిగే అవ‌కాశాలున్నాయి. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ భావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృశ్చికమును చూస్తున్నాడు. దాని ప్రభావము కారణముగా జీవిత భాగస్వామి, సంతానం నుంచి సమ్యోగము లభించగలదు. ధన సేకరణలో నిపుణులు అయినప్పటికీ కొన్ని సమయాలలో  అలవాట్లు, ఉల్లాస సంబందమైన అలవాట్ల కారణంగాను వీరి ఆర్ధిక నష్టములను ఎదుర్కొవాల్సి వచ్చును. బుధుడు పాప గ్రహములతో యుది లేదా దృష్టి కలిగి ఉన్న ఎడల గృహస్థ జీవితం కలహ పూరితమైనదిగా ఉండును. ఖర్చులు అధికంగా ఉండుట వ‌ల్ల అప్పులు కూడా తీసుకోవాల్సిన ప‌రిస్థితి రావ‌చ్చును.

గురువు 
గురువు వృశ్చిక లగ్నం యొక్క కుండలిలో ద్వితీయాధిపతి, పంచమాధిపతి కాగలడు. ద్వితీయాధిపతిగా ఉండుట వల్ల‌ దీని యొక్క శుభత ప్రభావితము కాగలదు. కాని త్రికోణాదిపతిగా ఉండుట వల్ల‌ కారక గ్రహం యొక్క ఫలితాలను ఇచ్చును. ఈ లగ్నం గల కుండలిలో గురు యది లగ్నస్తుడుగా వుండిన ఎడల వ్యక్తి చూడడానికి అందంగాను, పరిపూర్ణ ఆత్మవిశ్వాసము కలిగి ఉండును. గురువు యొక్క ప్రభావము కారణంగా ఉచ్చ శిక్షలను పొందెదరు. బుద్ధి కుశలత గ‌లవారై ఉండెదరు. భవిష్యత్తు కొరకు ధన సంచయం చేయు అలవాట్లు ఉండుట కారణముగా సాదారణముగా వీరి జీవితము సుఖమయంగానే ఉంటుంది. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ, నవమ భావములను చూస్తున్నాడు. గురువు యొక్క దృష్టి కారణముగా వ్యక్తి ధనవంతుడు, సంతానం గ‌లవాడు, గౌరవనీయమైన వ్యక్తికాగలడు.

శుక్రుడు  
శుక్రుడు వృశ్చిక లగ్నం గల కుండలిలో సప్తమాదిపతి, ద్వాదశాదిపతిగా ఉండుట వల్ల‌ అకారక, అశుభ గ్రహము రూపంలో కార్యములను చేయును. శుక్రుడు కుండలిలో లగ్నస్థుడుగా ఉండ‌టం వ‌ల్ల‌ శరీరం, ఇత‌ర వ్యవహారములలో విపరీత ప్రభావములను కలిగించును. ఆరోగ్య హాని ఉండ‌వ‌చ్చును. మానసికంగా సమస్యలను కలిగించును. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టి ద్వారా సప్తమ బావములో స్వరాశి వృశ్చికమును చూస్తున్నాడు. జీవిత భాగస్వామితో మత బేధ‌ములు ఉండగలవు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కష్టాలతో ప్రభావితం కాగలడు. భాగస్వామి నుంచి హాని కలుగవచ్చును. వస్త్రము, శృంగారం, సుగంధ పదార్ధముల వ్యాపారాలు వీరికి లాభాల‌ను తెచ్చిపెడ‌తాయి. వ్యవసాయ సంబంధ‌ వ్యాపారాలు కూడా వీరికి లాభాల‌ను క‌లిగిస్తాయి.

శని 
వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో శని తృతీయాదిపతి, చతురాదిపతిగా ఉండుట వల్ల‌ అకారక గ్రహము కాగలదు. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఇది ప్రథ‌మ భావములో వుండునో వారికి అరోగ్య సంబంధ‌ సమస్యలను ఎదుర్కొవలసి వచ్చును. వీరికి ప్రభుత్వ రంగం నుంచి కష్టాలు కలుగును. దుర్ఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి.  స్త్రీల కుండలిలో వృశ్చిక లగ్నంలో లగ్నస్థ శని సంతాన విషయంలో కష్టకారి కాగలడు. ప్రథ‌మస్థ శని తృతీయ, సప్తమ, దశమ భావములను పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. శని యొక్క దృష్టి ఫలితంగా సోదరుల నుంచి సమ్యోగం లభించగలదు. వ్యతిరేక లింగపు వ్యక్తికి లాభం కలుగును. చాలా ప్రేమ ప్రశంస‌లు ఉండగలవు. మెట్టింటి వారి నుంచి లాభం కలుగును. కాని జీవిత భాగస్వామి నుంచి అనుకోని స‌మస్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు.

రాహువు
ఈ లగ్నం యొక్క కుండలిలో రాహువు లగ్నస్థంలో ఉండ‌టం వ‌ల్ల వ్యక్తికి శారీరక సమస్యలు కలుగవచ్చును. ఆరోగ్య హాని కూడా కలుగవచ్చును. రాహువు యొక్క దశావదిలో వ్యాధులు వ‌చ్చేందుకు అవకాశ‌లు మెండుగా ఉన్నాయి. దీని వల్ల‌ ప్రభావితం అయ్యే వ్యక్తిలో ఆత్మవిశ్వాసం బలహీనపడును. లగ్నస్థ రాహువు పంచమ, సప్తమ మరియు, నవమ భావమునకు దృష్టిని ప్రధానించును. రాహువు యొక్క దృష్టి కారణంగా వ్యక్తికి ఉద్యోగ వ్యాపారాలలో కష్టాలను ఎదుర్కొవలసి వచ్చును. అకస్మాత్తుగా హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి అనేక ప్రేమ ప్రశంస‌లు ఉండగలవు. వైవాహిక జీవితంలో కష్టాలను ఎదుర్కొవాలసి వచ్చును. జీవిత భాగ‌స్వామితో స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు.

కేతువు 
కేతువు వృశ్చిక లగ్నం యొక్క కుండలిలో వుండిన ఎడల వ్యక్తి సామాన్యముగా అరోగ్యముగా వుండును. కేతువు యొక్క ప్రభావం కారణంగా వ్యక్తి శారీరకంగా ధృడంగా, శక్తివంతంగా ఉంటాడు. సామాజిక ప్రతిష్ట, గౌరవ మర్యాదలను పొందుతారు. మాతృ పక్షం నుంచి స్నేహం, సమ్యోగము లభించగలదు. పంచమ, సప్తమ, నవమ భావములలో కేతువుతో దృష్టి కలిగి ఉండ‌టం వ‌ల్ల వ్యక్తికి ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుంది. జీవిత భాగస్వామి, సంతానం యొక్క సందర్భాల‌లో కష్టాల అనుభూతి కలుగగలదు.