Menu

Monthly Archives: March 2015

Poorvaphalguni

 పూర్వఫల్గుణీ నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

పూర్వఫల్గుణీ నక్షత్రములలో ఇది 11వ నక్షత్రము. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది.  ఈ నక్షత్రము అధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. జాతి పురుష జాతి. జంతువు సింహం, ఆధిదేవత భర్గుడు, రాశి సింహా రాశి. పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము సింహరాశి, రెండవ పాదము – కన్యారాశి, మూడవ పాదము – తులారాశి, నాలుగవ పాదము – వృశ్చికరాశి.

పూర్వఫల్గుణీ మొదటి పాదము
ఈ నక్షత్రములోని ఏ పాదంలో శిశువు జన్మించినా, సామాన్య దోషం కలుగుతుంది. ఈ దోష శాంతికి సామాన్య శాంతికి శిశువు ముఖాన్ని తండ్రి నూనెలో చూడాలి. అబ్బాయి పుడితే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్య విచారమును ఎరిగిన వాడుగా, నృత్య శాస్త్రమున సమర్థుడుగా అవుతాడు. స్త్రీ పుడితే ఉత్తమమైన సంతానం కలిగినదిగా, ధనవంతురాలుగా, శతృజయం పొందినదిగా అవుతుంది.

పూర్వఫల్గుణీ రెండవ పాదము
పూర్వఫల్గుణీ రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారమును ఉంగరపు వేలుకు పొదిగించుకుని ధరించాలి. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 21 సంవత్సరముల నుంచి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ ఉంటుంది. కనుక ఈ సమయాన ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 31 నుంచి 38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి  పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 38 నుంచి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు.

56 సంవత్సరము వయస్సు నుంచి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ. కాబట్టి కనుక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 72 సంవత్సరముల నుంచి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది.

పూర్వఫల్గుణీ మూడోపాదము
పూర్వఫల్గుణీ మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. జన్మించిన 10 సంవత్సరముల వయస్సు వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ ఉంటుంది. అందువల్ల వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం. ఇక 10 సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల వరకు రవి మహర్దశ. అందువల్ల కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 సంవత్సరముల నుంచి 26 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

26 నుంచి 33 సంవత్సరముల వరకు కుజ మహర్దశ. అందువల్ల పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 33 సంవత్సరముల నుంచి 51 సంవత్సరముల వరకు రాహు మహర్దశ ఉంటుంది. కనుక గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 51 నుంచి 67 సంవత్సరముల వరకు గురు మహర్దశ. అందువల్ల కనక పుష్యరాగమను బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిది. 67 సంవత్సరముల నుంచి 86 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి మీరు నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

పూర్వఫల్గుణీ నాలుగో పాదము
పుబ్బ నక్షత్రం 4వ పాదములో జన్మించిన జాతకులైతే జన్మించిన 5 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. కాబట్టి వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాల్సి ఉంటుంది. 5 సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించాలి. 11 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.

21 నుంచి 28 సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ ఉంటుంది. కాబట్టి పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి. 28 నుంచి 46 సంవత్సరాల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు గురు మహర్దశ. అందువల్ల కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. 62 ఏళ్ల వయసు నుంచి 81 సంవత్సరముల వరకు శని మహర్దశ. కాబట్టి నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

పూర్వఫల్గుణి నక్షత్రము – గుణగణాలు

పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు. అందువల్ల వీరి బాల్యం సుఖమయంగా గడుస్తుంది. విద్యాభ్యాసముకు ఎలాంటి ఆటంకం కూడా రాదు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించే స్వభావం వల్ల అధికారులుగాను, నాయకులుగానూ రాణిస్తారు.

ఇక ఎవరు ఏమనుకున్నా లెక్క చేయరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని, సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యా దానము చేస్తారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమించి సంపాదించిందంతా వైరి వర్గానికి ధారపొస్తారు.

మిత్రుల ఉచ్చు నుంచి కొందరు జీవితకాలమంతా బయటపడని సందర్భం ఎదురు కావొచ్చు. బయటకి కనిపించే జీవితము కాక రహస్య జీవితము వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సమ్తానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు.

uttharaphalguni

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం- గుణగణాలు, ఫలితాలు

ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది 12వది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు. అధిదేవత ఆర్యముడు. గణము మనుష్య. రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు. జంతువు గోవు. ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో ధనసురాశి, రెండవ పాదములో మకరరాశి, మూడవ పాదములో కుంభరాశి, నాలుగవ పాదములో మీనరాశి.

ఉత్తర ఫల్గుణీ మొదటి పాదము
మొదటి పాదములో జన్మించిన వారైతే.. వెండితో పొదిగించిన కెంపును ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. కెంపును ధరించడం ద్వారా ఉన్నత స్థానాలను అలంకరించడం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకులు 6 నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్ధశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

16 నుంచి 23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కలగటం వల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుగుణవతి అయిన భార్య లభిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడమును ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయి. ఇక 41 నుంచి 57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవటంతో ఈ జాతకులు పుష్యరాగంను బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి.
ఇక 57 నుంచి 76 సంవత్సరాల మధ్య శని మహర్ధశ. కాబట్టి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేష్టము. అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో జన్మించిన జాతకులకు బుధ మహర్ధశ. కాబట్టి పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలి.

ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతి బాధలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం మంచిది. ఇలా 9వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఉత్తర ఫల్గుణీ రెండవ పాదము

ఉత్తర నక్షత్రము రెండో పాదములో జన్మించిన జాతకులకు తొలి 4 సంవత్సరముల నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. 4 సంవత్సరముల 6 నెలల వరకు, 14 సంవత్సరముల వయస్సు నుంచి 6 నెలల వరకు చంద్ర మహర్దశ.. వస్తుంది కావున ముత్యంను వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 14 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 21 సంవత్సరముల 6 నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి.

21 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 39 సంవత్సరముల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికంను వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 39 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 55 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. ఇక 55 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 74 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్దశ. కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 74 సంవత్సరాల 6 నెలల వయస్సు నుంచి 91 సంవత్సరాల 6 నెలల వరకు బుధ మహర్దశ. కాబట్టి పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం.

ఉత్తర ఫల్గుణీ మూడవ పాదము

వీరికి స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని మార్గములో కూడా ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. తక్కువ ధరల్లో ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు.

ఉత్తర ఫల్గుణీ నాలుగవ పాదము
ఉత్తర నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు జన్మించిన ఒక సంవత్సరం నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలును ధరించాలి. ఒక సంవత్సరము 6 నెలల వయస్సు నుంచి 11 సంవత్సరాల 6 నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ. కాబట్టి ముత్యంను వెండిలో ఉంగరము వేలుకు ధరించాలి. 11 సంవత్సరాలు 6 నెలల వయస్సు నుంచి 18 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్ధశ. కాబట్టి పగడంను బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 18 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 36 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం.

30 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 32 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్ధశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 52 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 71 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్ధశ. కాబట్టి నీలంను వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు
ఈ నక్షత్ర జాతకులకు సకాలంలో వివాహమవుతుంది. భార్య ఆధిపత్యం అధికం. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. ఈ జాతకులు ముఖ్యంగా తండ్రి వలన ప్రయోజనము పొందుతారు. తేనెటీగ లాగా కూడబెడతారు. నైతిక బాధ్యతలు అధికం. ఇక వైవాహిక జీవితంలో సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.

Hasta

హస్త నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 13వ నక్షత్రము. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం. రాశ్యాధిపతి – బుధుడు. అధిదేవత – సూర్యుడు. జంతువు – మహిషి(గేదె). హస్తనక్షత్రము నవాంశ విషయానికి వస్తే మొదటి పాదము – మేషరాశి, రెండవ పాదము – వృషభరాశి, మూడవ పాదము – మిధునరాశి, నాలుగవ పాదము – కర్కాటకరాశిలో ఉంటాయి.

హస్తా నక్షత్ర మొదటి పాదము
హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు. దేవగణ నక్షత్రం. కాబట్టి వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. అవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటి భావాలు పరిస్థితులను బట్టి మార్చి ప్రదర్శిస్తారు. తరచూ అభిప్రాయాలూ కూడా మార్చుకుంటారు.

15 ఏళ్ల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం జరుగుతుంది.

హస్త నక్షత్ర మొదటి పాదములోని జాతకులకు ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సైనిక పరమైన ఉద్యోగాలు కూడా అనుకూలం. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. భూ సంబంధిత, అగ్ని సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

33 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఎదురు కావు. 49 సంవత్సరాలకు మొదలయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా ఉంటుంది.

హస్తా నక్షత్ర రెండవ పాదము
ఆధ్యాత్మికం, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్రేకపూరిత స్వభావులైనా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.

13 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహు దశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాల్సి ఉంటుంది. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది.

ఇక వీరు సౌందర్య పోషణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అలంకరణ వస్తువులను సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కళారంగం వీరికి అనుకూలం. కళారంగం వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

31 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించినది పదిల పరసుచుకుంటే  ఇబ్బందులు ఉండవు. 47 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 66 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది.

హస్తా నక్షత్ర మూడవ పాదము

11 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. 29 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభమవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరచుకుంటే ఇబ్బందులు ఉండవు.

ఇక బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఔషధ తయారీ, ఔషధ విక్రయశాల నిర్వహణ వంటి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మేధో సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి  అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు  వీరికి అనుకూలిస్తాయి.

45 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిద శ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది.

హస్తా నక్షత్ర నాలుగవ పాదము
వీరికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మాతృ వర్గంతో అనుబంధం అధికంగా ఉంటుంది. 9 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి.

జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. 27 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే  ఇబ్బందులు ఉండవు.

వీరికి ఔషధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం.. వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం.
43 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 61 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.

హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు

ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. కోమలమైన శరీరం, పొడగైన ముఖ రూపం ఉంటుంది. అనుకున్న సముయములో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. చంచల స్వభావం కారణంగా తరచూ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధం చేసుకుని అడగగానే వారికి, సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన అవుతుంది. వ్యుహాలు రహస్యం అయినా కొందరికి మాత్రమే చెబుతారు.

దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవితంలో మంచి మలుపులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింపుకు కొంత కాలం వేచి చూడాలి. న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది. సొంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గము పట్ల అభిమానము కలిగి ఉంటారు. సంతానం పేరు ప్రతిష్టలు తెస్తారు.

Chitra

చిత్త నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో చిత్త నక్షత్రము 14వది. చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు. గణము రాక్షస. జంతువు పులి. వృక్షము తాటి చెట్టు. రాశ్యధిపతులు బుధుడు, శుక్రుడు. అధిదేవత త్వష్ట. చిత్తానక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము – సింహరాశి, రెండవ పాదము – కన్యారాశి, మూడవ పాదము – తులారాశి, నాలుగవ పాదము – వృశ్చికరాశిలో ఉంటాయి.

చిత్త నక్షత్రము మొదటి పాదము 

చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. వీరు రాక్షసగణ ప్రధానులు. ఆవేశం, అతిశయం, పట్టుదల, మొండితనం వీరి లక్షణాలు. ఈ జాతకులకు ఆరు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది.. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 24 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే 40 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శనిదశలో ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా కొనసాగుతుంది.

ఇక వీరికి విద్యుత్, అగ్ని, భూ సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. యునియన్ లీడర్లుగా ఉండడమంటే వీరు ఆసక్తి. కార్య సాధకులుగా ఉంటారు. అధికారులుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. నిర్వహణ సామర్ధ్యం కూడా అధికమే.

చిత్త నక్షత్రము రెండవ పాదము 
చిత్తా నక్షత్ర రెండవ పాదము వీరు ఆవేశం, పట్టుదల వీరికి అత్యధికం. నాలుగు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహు దశలో ఉన్న సొంత ఊరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 22 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా పోది చేసుకోవాలి. లేదంటే 38 సంవత్సరాలకు వచ్చే శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 57 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.

ఇక ఈ నక్షత్ర జాతకులకు భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరికి అనుకులిస్తుంది. వీరు మేధావంతులు, ఆవేశపూరితులుగా ఉంటారు. కనుక సైనిక పరమైన వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.

చిత్త నక్షత్రము మూడవ పాదము  
చిత్త నక్షత్ర మూడవ పాదము వీరు వీర విద్యలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు కళా రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. స్టంట్ ఆర్టిస్ట్ స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వీరు విద్యా శిక్షకులుగా రాణించగల అవకాశం ఉంది. వీరికి పట్టుదల అధికం. ధైర్య సాహసాలతో కూడిన ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 3 సంవత్సరాలకు రాహు దశ వస్తుంది. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి.

వీరికి కూడా రాహుదశలో సొంత ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలున్నాయి. 21 సంవత్సరాలకు గురు దశ వస్తుంది. కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకుంటే 37 సంవత్సరాలకు వచ్చే శనిదశ లో ఖర్చులు అధికమవుతాయి. ఈ కారణాల వల్ల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం  ఉంది. 56 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సుఖంగా సాగుతుంది.

చిత్త నక్షత్ర నాలువ పాదము
వీరు రాక్షసగణ ప్రధానులు. విరు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు సైనిక పరమైన ఉద్యోగాలమతే బాగా రాణించగల అవకాశం బాగా ఉంది. భూ సంబంధిత సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు  వీరికి  అత్యధికంగా అనుకూలిస్తాయి. ధైర్య సాహసాలు వీరికి అధికమే. మొదటి ఏడాది తరువాత రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి.

19 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే 36 సంవత్సరాలకు వచ్చే శని దశలో ఖర్చులు అధికమవుతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 55 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

చిత్త నక్షత్రము జాతకుల గుణగణాలు

కుజ గ్రహాధిపత్య నక్షత్రమైన చిత్త నక్షత్రంలో జన్మించిన జాతకులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే తరహా. తన నిర్ణయమే సరైనదని వాదిస్తారు. ఇతరుల ద్వారా సహాయంను పొందే వీరు.. ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. తాను చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపించేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తారు. భార్య, లేక ఓ స్త్రీ సహకారం లేనిదే జీవితంలో రాణించలేరు.

స్థిరాస్థులు వంశపారంపర్యంగా లభించినా.. సొంతంగా అంతకంటే ఎక్కువ కూడబెడతారు. రాజకీయంలో ప్రవేశిస్తే ఉన్నత పదవులను అలంకరించవచ్చే అవకాశం. అంతేకాకుండా సాంకేతిక, వైద్య రంగాల్లో ఆర్థిక పరమైన వ్యాపారాల్లో మంచి పట్టు సాధిస్తారు. మంచి సలహాదారులు చెంతనే ఉండటం ద్వారా అధిక లాభాలు పొందుతారు.

ఇక ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణాలు లేకుండా ఆవేశానికి గురవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నించడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలాగే చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళా జాతకులు మధ్య వయస్సు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి.

Swati

స్వాతి నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో స్వాతి నక్షత్రము 15వది. స్వాతి నక్షత్రాధిపతి రాహువు. రాజ్యాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి రాహువు, ఆధిదేవత వాయువు, జంతువు మహిషము, జాతి పురుష, దేవగణాధిపతి(దేవగణము) ఇంద్రుడు.

స్వాతి నక్షత్రము మొదటి పాదము
స్వాతి నక్షత్ర అధిపతి రాహువు. దేవగణ ప్రధానులు కాబట్టి వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా రచయితలు కావడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం కూడా కలదు. ఉపాధ్యాయులుగా మరే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ నక్షత్ర జాతకులు రాహుదశలో జన్మించడంవల్ల కొన్ని సమస్యలు ఎదురైనా తల్లితండ్రుల చాటున కష్టం తెలియకుండా సాగిపోతుంది. వీరికి హైస్కులు తరువాత గురు దశ కాలంలో కాలేజి విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. 16 సంవత్సరాలకే గురు దశ వస్తుంది కనుక సౌఖ్యవంతమైన జీవితం మొదలవుతుంది. విద్యలో చక్కని అభివృద్ధి సాధించి ఉద్యోగాలలో స్థిరపడతారు. ఇక సకాలంలోనే వివాహం జరుగుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం వీరికి అత్యవసరం. లేకుంటే 32 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శని దశలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో అనేక ఇబ్బందులకు గురవుతారు. 51 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం ఉంటుంది. ఇక మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

స్వాతి నక్షత్రము రెండవ పాదము

స్వాతి నక్షత్రము దేవగణ ప్రధానులు కనుక రెండో పాదములోని జన్మనక్షత్రలు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి మీద శని రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి బద్ధకం కొంచం ఎక్కువ. అయినప్పటికీ పని ఆరంభించారంటే  బాగా శ్రమించి పని పూర్తి చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు.

వీరికి రాహుదశ దాదాపు 11 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక  రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 27 సంవత్సరాల నుండి ఉండే 19 సంవత్సరాల శనిదశ  కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక సంపాదించుకున్నది జాగ్రత్త చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. 46 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కొంచం కుదుట పడతాయి. తర్వాత 63 సంవత్సరాల తరువాత వచ్చే కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం అనుకులిస్తుంది. ఇక వృద్ధాప్యం సౌఖ్యంగా సాగుతుంది.

వీరికి కర్మాగారాలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్ధ్యం ఉంటుంది. కర్మాగారాలలో, పరిశ్రమలలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. అయితే వీరు దత్తు పోయే అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.

స్వాతి నక్షత్రము మూడవ పాదము
వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి ఉంటారు. వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ పని మొదలు పెట్టారంటే బాగా శ్రమించి పని చేస్తారు. పరిసరాలను అంతగా పట్టించుకోరు. కర్మాగారాలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించగలరు. కర్మాగారాలలో, పరిశ్రమలలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. స్థిరమైన అభిప్రాయలు ఉంటాయి.   వీరు దత్తు పోవడానికి అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.

వీరికి రాహుదశ దాదాపు 7 సంవత్సరాల కాలం ఉంటుంది. కనుక  ఆరంభంలో రాహుదశ కాలంలో చదువులో మందకొడితనం కొనసాగుతుంది. అయినప్పటికీ తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి ఉండే 19 సంవత్సరాల శనిదశ  కాలంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 42 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 59 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 66 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్య దశ కూడా సాఫీగా సాగిపోతుంది.

స్వాతి నక్షత్రము నాలుగవ పాదము   
వీరు సాత్విక ప్రవృత్తి  కలిగి  వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు కూడా రచయితలు అయ్యే అవకాశం కలదు. ఆధ్యాత్మిక గ్రంధ రచన చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులుగా పని చేసే అవకాశం కూడా ఉండవచ్చు. వీరు దత్తు పోవడానికి అవకాశం ఉంది. ఇతరుల గృహాలలో వీరు ఆదరాభిమానాలు పొందగలరు.

ఈ నక్షత్ర జాతకులకు రాహుదశ దాదాపు మూడు సంవత్సరాల కాలం ఉంటుంది. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులో అభివృద్ధి ఉంటుంది. ఉన్నత చదువులలో కొంత మందకొడితనం ఉంటుంది. ప్రయత్నంతో విజయం సాధించ వచ్చు. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం జాప్యం జరుగుతుంది. 19 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల శని దశ కాలం ఉంటుంది.. కాబట్టి ఆ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 38 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల బుధ దశ కాలంలో పరిస్థితులు కాస్త కుదుటపడతాయి. తరువాత 55 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతువు అనుకూలంగా ఉంటే విదేశీయానం ఉంటుంది. 62 సంవత్సరాల తరువాత పరిస్థితులు చక్కబడతాయి. వృద్ధాప్యం సౌఖ్యంగా సాగిపోతుంది.
స్వాతి నక్షత్ర జాతకుల గుణగణాలు

రాహుగ్రహ అధిదేవత నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులు ముఖ్యంగా పరిశోధకులుగా రాణిస్తారు. బుద్ధికుశలతలతో పలు రంగాల్లో ఉన్నత అధికారులుగా విధులు నిర్వహిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనా శక్తి శుక్ర ప్రభావంతో సౌందర్య ఆరాధనాశక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. శాస్త్రవెత్తలుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతి నక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావ కారణము వల్ల కళలను ఆరాధిస్తారు.

ఈ నక్షత్ర జాతకులు సాహిత్యాన్ని, సంగీతాన్ని, సౌందర్యాన్ని ఆరాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆకస్మిక రాజకీయ జీవితం, ఉద్యోగం, విద్య, ఆర్థిక రంగంలో అత్యధిక అభివృద్ధి చెందుతారు. ప్రతి రంగంలోనూ స్వయం కృషి మంచి అభివృద్ధినిస్తుంది. సినిమా రంగంతో కూడిన ఏ కళారంగంలోనైనా ప్రవేశం రాణింపునిస్తుంది.

నమ్మిన వారి చెంత విశ్వాసంతో ప్రవర్తిస్తారు. అంతర్గత, బహిర్గత శత్రువులు వీరికి అధికంగా ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఆరోపణలను కూడా ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వాటిలో ఏ మాత్రం సత్యముండదు. అంతేకాదు ఇతరులకు దానం చేయడంలో ముందు వరుసలో ఉండే ఈ జాతకులు సామాజిక స్పృహ కలిగి ఉంటారు. ఆర్థికంగా ముందడుగు వేయడంతో పాటు, కీర్తి ప్రతిష్టలు సంపాదించడాన్నే లక్ష్యంగా భావిస్తారు. కొన్ని విషయాల్లో సామాజిక విలువల్ని పట్టించుకోరు. ఈ లక్షణంతో ఈ జాతకుల నుంచి బంధువులు, సన్నిహితులు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వల్ల ఈ జాతకులకు విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.

ఇక ఈ జాతకులు అడపాదడపా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి సోమవారం రాహుగ్రహ శాంతికి నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణతో పాటు ఐదుగురికి అన్నదానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి.

Vishakha

విశాఖ నక్షత్రము –గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 16వ నక్షత్రము. ఇది గురు గ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని. జంతువు పులి, రాజ్యాధిపతి కుజుడు. గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది.

విశాఖ నక్షత్ర మొదటి పాదము

విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరు ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది.

ఇక విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కళాశాల చదువులలో కాస్త మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.  తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా సుఖం కాస్త తగ్గవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కాస్త జాప్యం కలుగే అవకాశం ఉంది. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం జీవితకాలం సహకరిస్తుంది.

ఉపాధ్యాయ వంటి వృత్తులు వీరికి అనుకూలం. అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత  ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి.

33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకులిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.

విశాఖ నక్షత్ర రెండవ పాదము   
ఈ జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కల్గి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆపాధ్యాయులు రంగ వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది. పసుపు వర్ణ వస్తువులు, శ్వేత వర్ణ వస్తువులకు సంబంధించిన, జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

విద్యా ఆరంభ దశలో బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో  విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.  పదేళ్ల వయసు వరకు జీవితం సాఫీగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు.

ఇక సంపాదించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం తరువాత వచ్చే జీవితకాలానికి సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 46 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.

విశాఖ నక్షత్ర మూడవ పాదము
వీరికి పనుల యందు పట్టుదల ఉంటుంది. కార్య నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. వీరు  విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.

ఈ నక్షత్ర జాతకులకు తొలి నుంచి విద్య మందకొడిగా ఆరంభమవుతుంది. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల వయసు వరకు జీవితం సుఖంగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. 42 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. ఇక మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.

విశాఖ నక్షత్ర నాలుగవ పాదము 
వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి మెండు. కోపతాపాలు, ప్రేమాభిమానాలు మార్చిమార్చి ప్రదర్శిస్తారు.  ఉపాధ్యాయ రంగ వృత్తులు వీరికి అనుకూలం. ఔషధ సంబంధిత, శ్వేత వర్ణ సంబంధిత వస్తువుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

జన్మించిన తర్వాత కొంత కాలం మాత్రమే సౌఖ్యంగా ఉంటారు. తరువాత కొంత సుఖం తగ్గుతుంది.  ఆరు సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.  2 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. విద్యాభ్యాసం మందకొడిగా సాగుతుంది. 21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. 38 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన ఉంటుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.

విశాఖ నక్షత్రము గుణగణాలు
 – ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులకు గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది. కాబట్టి బాల్యం సుఖంగానే ఆరంభమవుతుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలవుతుంది. గురు గ్రహ నక్షత్రమైన విశాఖలో జన్మించిన ఈ జాతకులకు పట్టుదల, మొండితనం ఉంటుంది. అనుకున్నది అమలు చేసే మనస్తత్వం.

భార్య లేక ఓ స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశము చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. సొంతంగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుంది. అన్యభాషలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో కూడా విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు.

ఇక ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారమూ లేకపోలేదు. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వలన నష్టము, లాభము సమానంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీ పౌరసత్వము లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.  భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జివితములో సమపాళ్ళలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితం సుఖవంతం. కనుక కనుక వృద్ధాప్యము సుఖవంతమే.

విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం రంగు అన్ని విధాలా అనుకూలం. కాబట్టి నీలపు రంగు చేతి రుమాలును అధికంగా వాడటం మంచిది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు 6 సంఖ్య అన్ని విధాలా సహకరిస్తుంది. అలాగే 4, 5, 8 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అయితే 1, 2 అనే సంఖ్యలు ఏ మాత్రం కలిసి రావు. ఇక గురువారం తలపెట్టే కార్యాలు ఈ జాతకులకు దిగ్విజయంగా పూర్తవుతాయి.

విశాఖ నక్షత్రము నాలుగో పాదంలో పుట్టిన జాతకులకు మంగళవారం, సోమవారం, బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. అయితే చంద్రాస్టమందినాల్లో ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదదు. నాలుగో పాదంలో జన్మించిన జాతకులకు 9 అదృష్ట సంఖ్య. ఇంకా 9, 18, 36 అనే సంఖ్యలు శుభ ఫలితాలనిస్తాయి. అయితే 6, 8 సామాన్య ఫలితాలనివ్వగా, 4, 5, 6, అనే సంఖ్యలు వీరికి అశుభ ఫలితాలిస్తాయి. ఇక పసుపు, ముదురు పచ్చ రంగు వీరికి అదృష్టానిస్తాయి.

ఇక ఈ నక్షత్ర జాతకులు వ్యాపారాభివృద్ధి కోసం ప్రతి శుక్రవారం నేతితో సుబ్రహ్మణ్య స్వామికి దీపమెలిగించడం మంచిది. ఇలా 9 వారాలు ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు ఫలప్రదమవుతాయి.

Anuradha

అనురాధ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో 17వది అనురాధ నక్షత్రము. అనురాధ నక్షత్రాధిపతి శని, ఆధిదేవతలు సూర్యుడు, రాజ్యాధిపతి కుజుడు, ఇది దేవగణ నక్షత్రము, జంతువు మహిషి, రత్నం గోమేధికం.

అనురాధ నక్షత్ర మొదటి పాదము
అనురాధ నక్షత్ర అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం కావడం వల్ల వీరు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకు స్వభావ రీత్య బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. మంచివే అయిన తమ అభిప్రాయాలను సూటిగా తెలియజేస్తారు. తండ్రితో అభిప్రాయభేదాలు కలుగ వచ్చు. తల్లితో ఏకీభవిస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ.ఈ నక్షత్ర జాతకులకు తొలి 17 సంవత్సరాల జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో కాస్త మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధద శ కారణంగా కళాశాల చదువులలో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 41 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.

వీరికి ప్రభుత్వపరమైన కర్మాగారాలు, పరిశ్రమలలో పని చేసే అవకాశాలు ఉంటాయి. అగ్ని సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

అనురాధ నక్షత్ర రెండవ పాదము  

వీరు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరికి బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని ప్రతిఘటిస్తారు. వీరికి మేధో సంబంధమైన వృ త్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వీరికి బుధ దశ అనుకూలించడం వల్ల విద్యలో ఉన్నతిని సాధించగలరు. 13 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా మాధ్యమిక తరగతి నుంచి చదువులలో మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. 34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 37 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత జీవితం సౌఖ్యంగా, సాఫీగా కొనసాగుతుంది.

అనురాధ నక్షత్ర మూడవ పాదము
వీరు ప్రజాకర్షణ కలిగి ఉంటారు. తమ అభిప్రాయాలను సూటిగా, ఆకర్షణీయంగా చెప్పగలరు. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరికి బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమించి పూర్తి చేస్తారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని సహించలేరు. కళాత్మకమైన వస్తువులను సేకరించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటారు.

వీరికి బుధ దశ బాగా అనుకులించడం వల్ల విద్యావంతులై ఉన్నత స్థితికి చేరుకుంటారు. 8 సంవత్సరాల వరకు మందకొడిగా సాగే విద్యాభ్యాసం తరువాత వచ్చే సంవత్సరాల  17 సంవత్సరాల బుధ దశ కాలంలో బాగా రాణిస్తుంది. కనుక వీరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు. 25 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 32 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 75 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నక్షత్ర జాతకులకు ఇనుము, వెండి, ముత్యం సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. పరిశ్రమలు, కర్మాగారం, విమానాశ్రయాలు.. వంటి వాటిలో పనిచేసే అవకాశాలు ఉంటాయి.

అనూరాధ నక్షత్రము నాలుగో పాదము
ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు.

4 సంవత్సరాల  తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో బాగా రాణిస్తుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఉంది. కేతు దశ అనుకూలిస్తే విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 28 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 71 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.

అనురాధ నక్షత్రము గుణగణాలు

ఇది దేవగణ నక్షత్రము కావడం వల్ల ఈ నక్షత్ర జాతకులు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. పని పూర్తి చేయడంలో బద్ధకం ఉన్నా  చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని ఇతర విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు.

పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధు వర్గం నుంచి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. తండ్రి వ్యవహార తీరు నచ్చదు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది.

Jyeshta

జ్యేష్ఠ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము. జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు లేడి, స్త్రీ జాతి. జ్యేష్ఠ నక్షత్రము కలిగిన వధూవరులిద్దరూ జ్యేష్టులైనచో వారికి వివాహము నిశ్చయించరాదని శాస్త్రం చెబుతోంది.

జ్యేష్ఠ నక్షత్ర మొదటి పాదము
ఈ నక్షత్రము మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రము. వీరికి పట్టుదల అధికం. వీరు మేధా సంపన్నులుగా ఉంటారు. అందువల్ల వీరికి మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.

14 సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కాస్త ఉపశమనం  కలుగుతుంది. ఈ  సమయంలో విద్య కంటే అలంకరణ, విలాసాల మీదకు మనసు మళ్లుతుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.

41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 64 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదము   
వీరికి పట్టుదల అధికం. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఇష్టమే. వీరికి  పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకూలిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఈ జాతకులకు పదేళ్ల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురుకావు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద  మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి.

ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 60 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.

జ్యేష్ఠ నక్షత్ర మూడవ పాదము  

వీరు తమ అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది. వీరికి  పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకులిస్తుంది.

ఆరు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే  7 సంవత్సరాల కేతుదశ కారణగా  విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురవ్వవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. మాధ్యమిక విద్య నుంచి సుగమంగా సాగుతుంది. అయితే ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీదికి మనసు మళ్లుతుంది కాబట్టి.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు వెళ్లి విజయం సాధించాలి.

ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత కొంత సుఖం తగ్గినా 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురు దశ కారణంగా తిరిగి సుఖమైన జీవితం మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా కొనసాగుతుంది.

జ్యేష్ఠ నక్షత్ర నాలుగవ పాదము 

వీరి మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు.

రెండు సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి . 4వ తరగతి నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం  కలుగుతుంది. ఈ  సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద మనసు మళ్లే అవకాశం ఉంటుంది కనుక.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.  రాహుదశ  అనుకూలిస్తే విదేశీ పర్యటనలు ఉంటాయి.

జ్యేష్ట నక్షత్రము గుణగణాలు
జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులు సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలను తెలుసుకుంటారు. చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి, లోపాలను ఎంచుకుంటారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. ఇక ఇతరుల నుంచి వచ్చే విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు.

వీరికి శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫిగా సాగుతుంది. బాల్యం నుంచి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.

ఈ నక్షత్ర జాతకులకు పసుపు, నలుపు రంగులు కలిసివస్తాయి. ఇంకా మంగళవారం వీరికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే సోమ, బుధవారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9వ సంఖ్య అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే 9, 18, 36, 1, 2, 3 అనే సంఖ్యలు కూడా అన్ని విధాలా అనుకూలిస్తాయి. కానీ 4, 5, 6 అనే సంఖ్యలు ఈ జాతకులకు కలిసిరావు.

Moola

మూల నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 19వ నక్షత్రము. మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం, పురుష జాతి.

మూల నక్షత్రము మొదటి పాదము
మూల నక్షత్ర అధిపతి కేతువు. ఈ ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకుల మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఉద్యమాలలో వీరు ముందు ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికం. సైనిక పరమైన ఉద్యోగాలంటే వీరికి ఆసక్తి ఉంటుంది. పోలీస్ శాఖ కూడా వీరికి అనుకూలమే. అగ్ని, విద్యుత్, భూసంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ జాతకులకు అనుకూలిస్తాయి.

ఆరు సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్ర దశ  వస్తుంది. కనుక విద్యారంభం బాగానే ఉంటుంది. చదువు సమయంలోనే విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం ఉంది కాబట్టి, గట్టి ప్రయత్నంతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం.. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము రెండవ పాదము 

వీరు రాక్షసగుణ ప్రధానులు కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు.  అకర్షణీయంగా మాట్లాడగల నేర్పు ఉంటుంది. వీరికి కేతు గ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది.  అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి  జలసంబందిత, పర్యాటక సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రకాశించగలరు. వీరు దత్తు పోగల అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 4 సంవత్సరాల వరకు కేతుదశ  ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించాలి.. విజయం సాధించాలి. ఇక వీరు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలోనే వివాహం జరుగుతుంది. 47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం మొదలవుతుంది. అనంతరం వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము మూడవ పాదము
ఈ జాతకుల మీద బుధ  కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షస గుణ ప్రధానులు.. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధి కుశలతతో ప్రదర్శిస్తారు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం చేయడమంటే అధిక ఆసక్తి. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకులిస్తాయి. అకర్షణీయమైన వస్తు సేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి జల సంబంధిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈ జాతకులు చిన్న వయసు నంఉచే కళారంగంలో ప్రావీణ్యత సాధిస్తారు. అయితే వీరికి దత్తుపోగల అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

మూడు సంవత్సరాల వరకు కేతు దశ ఉండే కారణంగా.. విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ మూడు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు వైపు మనసు మళ్లుతుంది. కాబట్టి  పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. ఈ నక్షత్ర జాతకులు జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం అవుతుంది. 46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. ఆ తర్వాత వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము నాలుగవ పాదము 

ఈ జాతకుల మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. దీంతో పట్టుదల గత వ్యక్తులై ఉంటారు. వీరు తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరు తమ భావోద్వేగాలను మార్చి మార్చి ప్రదర్శిస్తారు. వీరికి భక్తి భావం ఎక్కువే. వీరికి శ్వేతవర్ణ వసువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుంచి కళారంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. వీరు దత్తుపోగల అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలపైకి దృష్టి మరలుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాల్సి ఉంటుంది. వీరు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సులభమవుతాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం కొన సాగుతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.

మూల నక్షత్రము గుణగణాలు – ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులు శక్తిమంతులై ఉంటారు. అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయి. దైవజ్ఞానము గలవారై ఉంటారు. భవిష్యత్ ను వాస్తవానికి దగ్గరగా ఊహించి చెప్పగలరు. అనర్గలముగా మాట్లాడే ప్రతిభా ఉంటుంది. ఏ విషయములనైనా విడ మరచి చెప్పగల నేర్పరులు. తాము నమ్మిన సిద్ధాంతములకు కట్టుబడి ఉంటారు. అన్యాయము, అక్రమాలను సహించలేరు. అయితే వీరు కాస్త గర్వం, అహంభావం కలవారు. వీరు తమ జీవితంలో రెండు లేక మూడు వృత్తులను చేపట్టగలరు. కుటుంబం, బంధువులు, స్నేహితుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉంటారు .అందరూ నీతిగా ఉండాలని కోరుకొంటారు.

పట్టుదలతో, స్వయంకృషితో జీవితంలో ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి వైపు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే ఈ జాతకుల లక్ష్యం. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు.

రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞం అవుతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.

Poorvashada

పూర్వాషాఢ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము. పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు. అది దేవత – గంగ. మనుష్య – గణం. జంతువు – వానరం. రాశి – అధిపతి గురువు.
పూర్వాషాఢ నక్షత్రము మొదటి పాదము  
పూర్వాషాఢ ఒకటవ పాదము సింహరాశిలో ఉంటుంది. సింహరాశి సూర్యుడు. పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు. ఈ నక్షత్ర జాతకుల మీద సూర్య, శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణ ప్రధానులు కాబట్టి వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. వీరికి అతిశయభావం, నిర్వహణ సామర్ధ్యం ఉంటుంది. విలాసాల మీద,  సౌందర్యపోషణ మీద అంతులేని ఆసక్తి ఉంటుంది. కళాత్మకమైన వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
ఈ జాతలకులు చిన్న వయసు నుంచే  కళాత్మక రంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. విద్య ఆరంభం నుంచి బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాలు సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. అయితే పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. 18 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సాఫీగా సాగే జీవితంలో తరువాత కాస్త సుఖం తగ్గినా 41 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సాఫీగా, ప్రశాంతంగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్రము రెండవ పాదము
వీరి మీద శుక్ర, బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు  బుద్ధి కుశలత కలిగి ప్రవర్తిస్తారు. ఈ జాతకులు మానవగణ ప్రధానులు కనుక వీరికి సమయానుకూలంగా వ్యవహరించగల నేర్పు ఉంటుంది. అంతేకాదు కళాత్మక వస్తువుల మీద ఆసక్తి అధికం.
చిన్న వయసు నుంచే కళాత్మక రంగంలో ప్రకాశించగలుగుతారు. పర్యాటక ప్రదేశాలలో వీరికి ఉద్యోగావకాశాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత , కళా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. విద్య ఆరంభం నుంచే బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి ఉంటుంది. పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి.
14 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సుఖంగా సాగే జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా 37 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో అనుకోని కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్రము మూడవ పాదము  
వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. అంతేకాదు వీరి మీద పరిపూర్ణంగా శుక్రుడి ప్రభావం ఉంటుంది కనుక వీరు  కళారంగంలో విశేషంగా ప్రకాశిస్తారు. వీరికి కళాపిపాస అత్యధికంగా ఉంటుంది. కళాత్మక వస్తుసేకరణ అంటే ఆసక్తి అధికం. పరిశుభ్రమైన వాతావరణం అంటే ఇష్టపడతారు. అటువంటి చోటే నివసిస్తారు. పర్యాటక ప్రదేశాలలో, విహార ప్రదేశాలలో, విలాస ప్రదేశాలలో వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.
ఇక ఈ జాతకులు చిన్న వయసులోనే కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుంచి బాగా అబ్బుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే అధిక ఆసక్తి. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. 9 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సుఖంగా సాగే జీవితంలో తరువాత కొంత సుఖం తగ్గినా 32 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం కూడా జరుగుతుంది.
తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా జీవితంలో కొన్ని అనుకోని అవంతరాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 50 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 66 సంవత్సరాల కాలంలో 19  సంవత్సరాల శని దశ కాలంలో వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్ర నాలుగవ పాదము  
వీరికి సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు స్వభావ రీత్య ఉంటుంది. వీరు భావ తీవ్రత కలిగి ఉంటారు. అయినా కూడా తమ భావాల మీద నియంత్రత కలిగి ఉంటారు. ఈ జాతకులకు భూ సంబంధిత , కళా సంబంధిత, పర్యాటక సంబంధిత,  జలసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
ఈ జాతకులు బాల్యం నుంచే కళారంగంలో ప్రకాశిస్తారు. విద్య ఆరంభం నుంచే బాగా సాగుతుంది. శుక్ర దశ కారణంగా విలాసాల  మీద, సౌందర్య పోషణ అంటే ఆసక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. 5 సంవత్సరాల వరకు వీరికి శుక్ర దశ ఉంటుంది. అప్పటి వరకు సౌఖ్యంగా సాగే జీవితంలో తరువాత కొంత సుఖం తగ్గినా… 28 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సంపద సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. 61 సంవత్సరాల కాలంలో 19 సంవత్సరాల శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. మిగిలిన జీవితం.. వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.
పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు, ఫలితాలు 
ఈ నక్షత్ర జాతకులు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే వాక్చాతుర్యత, అందం వీరి సొంతం. విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. ముఖ్యంగా స్నేహితులతో ఉమ్మడిగా జీవితంలో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తారు. జన్మించిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి.
విదేశీయానం, విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానం మీద ఎవరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కూడా కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. సహోదరుల వలన అపఖ్యాతి వస్తుంది.
ఇకపోతే.. బుధవారం వీరికి అదృష్టమైన రోజు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ఎలాంటి పనులు చేపట్టినా ఆశించిన ఫలితాలుండవు. నలుపు, సిల్వర్ రంగులు గల దుస్తులను ధరించడం మంచిది. నలుపు చేతి రుమాలును వాడటం ద్వారా కొన్ని సమస్యల నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంది. ఇంకా శుక్ర గ్రహ శాంతి కోసం శనివారాల్లో నేతి దీపమెలిగించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. వీరి అదృష్ట సంఖ్య 3. ఇక 5, 6 సంఖ్యలు కలిసి రావు.