Menu

Monthly Archives: March 2015

Uttharashadha

ఉత్తరాషాఢ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 21వ నక్షత్రము. ఇది రవి గ్రహ నక్షత్రము, మానవ గణము, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు, మిగిలిన పాదాలు మూడింటికి శని.

ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణానికి చెందిన వారు. కాబట్టి వీరు సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించ గల్గిగే చాకచక్యం కలిగి ఉంటారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి. ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. ప్రజానాయకులుగా,  ప్రజాఅధికారులుగా రాణించగల నేర్పు వీరికి ఉంటుంది. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు ఆటంకం లేకుండా విద్య సాగుతుంది. వీరికి ఐదు సంవత్సరముల వరకు రవిద శ ఉంటుంది. తరువాత పదేళ్ళ వరకు చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. 15 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే, ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉండే అవకాశాలు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు.

40 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం మళ్లీ మొదలవుతుంది. 56 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 75 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదము

ఈ జాతకులు మానవ గణానికి చెందిన వారు కనుక సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించ గల నేర్పు కలిగి ఉంటారు. ఇక వీరు తండ్రి పట్ల కొంత విముఖత కలిగి ఉంటారు. తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం  ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగాలలో ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వీరికి శ్రమించి పట్టుదలతో పని చేయగలరు. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది.

ఇక ఈ జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 4 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. 14 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కాస్త జాప్యం అయ్యే అవకాశం.

39 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం మళ్లీ మొదలవుతుంది. 55 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రము మూడవ పాదము  
వీరు తండ్రి మీద కొంత విముఖత కలిగి ఉంటారు. అయితే తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల మెండుగా ఉంటుంది. వీరికి  ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగాలల్లోని ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమించి పని చేయగల నేర్పు ఉంటుంది. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల నేర్పు ఉంటుంది. ఈ జాతకులకు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.

వీరికి విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి రెండు సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. 12 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగానే సాగిపోతుంది. 19 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. అయితే వివాహం విషయంలో జాప్యం జరిగే అవకాశం.

37 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం తిరిగి మొదలవుతుంది. 53 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ సమయంలో ఖర్చులు అధికమవుతాయి. 72 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రము నాలుగవ పాదము 
వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. మానవ గణానికి చెందిన జాతకులు కనుక వీరికి సమయానుకూలంగా ప్రవర్తించగలిగే నేర్పు ఉంటుంది. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి. ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ రంగంలో పని చేయడం వీరికి అనుకూలం. ప్రజానాయకులుగా,  ప్రజా అధికారులుగా వీరు సమర్ధతో పని చేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఇక ఈ జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి ఒక సంవత్సరముల వరకు రవిదశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. 11 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 18 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగే అవకాశం. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. అయితే వివాహం విషయంలో జాప్యం జరిగే అవకాశం.

36 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. సుఖం మళ్లీ ఆరంభమవుతుంది. 52 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 71 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు 

రవిగ్రహ నక్షత్రమైన ఈ ఉత్తరాషాఢలో జన్మించిన జాతకులు ప్రలోభాలకు లొంగరు. వీరు సాధారణ స్థాయి నుంచి కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్ష మందిలో ఒకరికి లభించే అరుదైన అవకాశం ఈ జాతకులకు లభిస్తుంది. చదువు, విజ్ఞానంలో తల్లిదండ్రుల కంటే మించిపోతారు. ఇక ఆర్థిక వ్యవహారాలు దాచుకోవడంలో వీరికి వీరే సాటి. తెలిసిన వాళ్ళకు అప్పు కూడా ఇవ్వరు. స్నేహాలు, పరిచయాలు వినోదంగా భావిస్తారు. సెంటిమెంట్స్‌ను కీలక సమయంలో లెక్కచేయరు.

మితంగా వ్యవహరించడం, ఇతరుల పట్ల వినయ విధేయతను కలిగి ఉండటం ఈ నక్షత్ర జాతకుల వ్యక్తిత్వం. బంధుత్వ బంధానికి కట్టుబడి ఉంటారు. బంధువుల కోసం కొన్ని నిందలు తమపై వేసుకుని కష్టనష్టాలు అనుభవిస్తారు. ఒక సమయంలో వీరు నేర ప్రవృత్తి నడవడిక కలిగిన వారికి అండగా నిలువవలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణమవుతాయి. ఉన్నత చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో ఊహించని ఫలితాలను సాధిస్తారు.

Sravana

శ్రవణ నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో శ్రవణ నక్షత్రము  22వది. శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం.

శ్రవణ నక్షత్రము మొదటి పాదము  
శ్రవణానక్షత్ర మొదటి పాదము మేషరాశిలో ఉంటుంది. మేషరాశి అధిపతి కుజుడు. శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరి మీద  కుజ చంద్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు  దేవగణ ప్రధానులు. కనుక వీరు సౌమ్యంగా వ్యవహరిస్తారు. మరికొన్ని సమయాల్లో ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ తమ భావాల మీద నియంత్రత కలిగి ఉంటారు. ప్రేమాభిమానాలను, కోపతాపాలను మార్చుతుంటారు. వీరు ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.  శ్వేతవర్ణ, రక్త వర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సైనిక, ఔషధ సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలమే. విద్యుత్, అగ్ని సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ నక్షత్ర జాతకులకు ఎనిమిది సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్ర దశ కాలంలో  వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 15 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో ఉన్నత విద్యకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. కనుక పట్టుదలతో వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు. వివాహంలో కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది.

ఇక 33 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సంపదనలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిలపరచుకోవాలి. 49 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ఇక 68 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ సమస్యారహితంగా సాగిపోతుంది.

శ్రవణ నక్షత్రము రెండవ పాదము   
వీరు సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం అంటే ఆసక్తి . ధర్మంపక్షం వహిస్తారు. వీరికి కొంత స్థిర స్వభావం ఉంటుంది. ఇక వీరు కళాత్మక  వస్తువులను సేకరించడానికి ఆసక్తి చూపుతారు. విలాస జీవితం పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది. వీరికి శ్వేతవర్ణ సంబంధిత వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబందిత, పర్యాటక సంబంధిత, ఔషధ సంబంధిత  వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం.

ఇక ఈ జాతకులకు ఆరు సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.  తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 13 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో మాధ్యమిక విద్యలోఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం. జీవితంలో స్థిరపడడానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇక వివాహంలో కొంత ఆలస్యం అవుతుంది.

ఇక 31 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది పదిలపరచుకుని ఇబ్బందులను ఎదుర్కొవాలి. 47 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 66 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. ఇక వృద్ధాప్య దశ సమస్యారహితంగా సాగిపోతుంది.

శ్రవణ నక్షత్రము మూడవ పాదము  
వీరు సౌమ్యంగా  ప్రవర్తిస్తారు. ఇక జాతకులకు ధర్మం అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వీరు  ఔషధ తయారీ సంస్థను స్థాపించి నిర్వహించగలరు. వీరికి  విద్యా సంబంధిత, భూ సంబంధిత, ఔషధ సంబంధిత వ్యాపారం, ఉద్యోగం, వృత్తులు అనుకూలిస్తాయి.

ఇక ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి.  తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 11 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ   కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఇక జీవితంలో స్థిరపడడానికి ఆలస్యమయ్యే అవకాశం. వివాహం విషయంలోనూ కొంత జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది పదిలపరుచువలసిన అవసరం ఎంతో  ఉంది. 45 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యారహితంగా సాగిపోతుంది.

శ్రవణ నక్షత్రము నాలుగవ పాదము
వీరు సౌమ్యంగా ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరికి తల్లితో  అనుబంధం అధికం. వీరు  తరచూ భావోద్రేకాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. వీరి భావాలు తరచూ మారుతూ ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు భావోధ్వేగాలను (ప్రేమ, అభిమానం, కోపతాపాలు) మార్చిమార్చి ప్రదర్శిస్తారు.  శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారం , ఉద్యోగం వీరికి అనుకూలం. ఔషధ రంగానికి సంబంధించిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రెండు సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాలారిష్టాలు సమస్యలు ఉంటాయి. తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 9 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం  ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు.వివాహంలో కొంత జాప్యం ఉంటుంది.

ఇక 27 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఎంతో ఉంది. 43 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 62 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది. వృద్ధాప్యం సమస్యారహితంగా సాగిపోతుంది.
శ్రవణ నక్షత్ర జాతకుల గుణగణాలు

ఈ నక్షత్ర జాతకులు వీలైనంత తక్కువగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మంతో జీవితం సాగిస్తారు. చదువు పట్ల శ్రద్ధ.. సమాజంలో ఉన్నత స్థితి.. అవకాశాలను సద్వినియోగపరచుకొనుట.. సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి సహజ లక్షణములు.

వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుంచి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి.

శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా వీరికి ఉండే విశాల హృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. ఏ విషయాన్నైనా అంతర్గత ఆలోచించే వీరికి ఓర్పు కాస్త ఎక్కువ. అయితే కొన్నిసార్లు సహనం కోల్పోతారు. వీరికి ధైర్యం, మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి వస్తారు.

Dhanishtha

ధనిష్ఠ నక్షత్రము  – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ధనిష్ఠ 23వ నక్షత్రము. ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, పురుష జాతి, రాశ్యాధిపతి శని, జంతువు సింహము.
ధనిష్ఠ నక్షత్రము మొదటి పాదము  
ధనిష్ఠ నక్షత్ర అధిపతి కుజుడు. ఈ జాతకుల మీద సూర్య కుజ  గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రము. కనుక వీరు ఏదైనా కార్యము యందు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరికి ఆవేశం పాలు అధికమే. వీరికి యునియన్ నాయకులుగా ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, అతిశయం అధికంగా ఉంటాయి. వీరికి తండ్రితో అనుబంధం కాస్త అధికంగానే  ఉంటుంది. సైనికపరమైన, విద్యుత్ సంబంధిత, అగ్ని సంబంధిత, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వీరికి ఆరు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. విద్యలో అడ్డంకులు ఎదురు కావచ్చు.  వీరికి రాహు దశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా గడిచిపోతుంది.  రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. 24 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు కాస్త తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిందే. లేదంటే తరువాత వచ్చే  శని దశ  కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 40 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.
ధనిష్ఠ నక్షత్రము రెండవ పాదము
  ఈ జాతకులకు ఆవేశం, బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది. వ్యాపారం చేయడమంటే అంటే ఆసక్తి కనబరుస్తారు. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. సైనిక పరమైన వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం.
ఈ నక్షత్ర జాతకులకు నాలుగు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. వీరికి రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో జరిగిపోతుంది కనుక అప్పుడు కష్టాలు తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ  అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. 22 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు క్రమంగా తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. 38 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులే అధికమవుతాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సుఖంగా సాగిపోతుంది.
ధనిష్ఠ నక్షత్రము మూడవ పాదము   
వీరికి  పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఆవేశమూ అధికమే. వీరు పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఆసక్తులై ఉంటారు. వీరు కళాత్మకమైన వస్తు సేకరణ చేయడానికి ఆసక్తులై ఉంటారు. వీరికి జల విద్యుత్, జల, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తుంది. సైనిక సంబంధిత, కళా సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
ఈ జాతకులకు రెండు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహుదశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగిపోవడం వల్ల వీరికి కష్టం తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం. 20 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ  దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు తప్పవు. 36 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 55 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 72 సంవత్సరాల కాలంలో వచ్చే కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన, తీర్ధ యాత్రలు  అనుకూలిస్తాయి. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.
ధనిష్ఠ నక్షత్రము నాలుగవ పాదము
వీరి మీద పరిపూర్ణ కుజ ప్రభావం ఉంటుంది. ఈ జాతకులకు ధైర్యసాహసాలు, ఆవేశం అధికంగా ఉంటాయి. ప్రజా ఉద్యమాలలో వీరు ముందుంటారు.  వీరికి సైనిక సంబంధమైన ఉద్యోగాలు, ధైర్య సహసాలు అవసరమైన ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ఈ జాతకులకు ఒక సంవత్సరమువరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం. రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో ఉంటారు కనుక కష్టాలు లేకుండా జరిగిపోతుంది.  19 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. అయితే సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ  కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 35 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 54 సంవత్సరాల తరువాత  వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.
ధనిష్ఠా నక్షత్రము ఫలితాలు
ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి సరైన తెలివితేటలను ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. చదువు, సంస్కారం ఉపయోగపడే మంచి అధికారిగా రాణిస్తారు. అయితే వీరి అధికార వైఖరి, మొండితనం వల్ల ఇతరుల నుంచి విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురవుతుంది.
అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. సొమ్ము పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపంలోనే నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెబుతారు. అందువలన నష్టపోతారు. అనవసర వ్యక్తులను నెత్తికి ఎక్కించుకుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు.
ఈ జాతకులకు గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి. వీరు జమ్మిచెట్టును పెంచడం, పూజించడం వల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

Sathabisha

శతభిష నక్షత్రము  – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. శతభిషము రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.

శతభిష నక్షత్రము మొదటి పాదము

శతభిషా నక్షత్ర మొదటి పాదము ధనసు రాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు, శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. ఈ నక్షత్ర జాతకుల మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. ఈ కారణం వల్ల వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఈ జాతకులకు ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం ఉంటుంది. రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు 16 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండా పోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో ఉన్నత చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 32 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలిస్తేనే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము రెండవ పాదము
ఈ నక్షత్ర జాతకుల మీద రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం.. కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. శ్రమించి పట్టుదలతో కార్యాలను నెరవేర్చగలరు. ఈ జాతకులకు పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 12 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తగ్గుతాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండానే ముగిసిపోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో మాధ్యమిక చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. ఇక వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి.

47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రలకు అవకాశం ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము మూడవ పాదము
వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. పట్టుదలతో, శ్రమించి కార్యాన్ని పూర్తి చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.

ఈ జాతకులకు ఎనిమిది సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు ప్రభావం చూపే అవకాశం లేదు. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు. 24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశ వస్తుంది. దీంతో సంపాదన కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.

60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధ యాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగానే గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము నాలుగవ పాదము  
వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఇక వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. వీరు రచయితలుగానూ రాణించే నేర్పు ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల కాలం మాత్రమే రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుంది. నాలుగు సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా చదువు ఆటంకాలు లేకుండా సాగుతుంది.  అయితే ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు తప్పకపోవచ్చు. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది.

39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం  ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము – ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులకు విద్యభ్యాసం కొంతకాలం మందకొడిగా సాగినా.. క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. వీరికి సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపారవెత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలతో పాటు, చిక్కులు కూడా ఎదుర్కొంటారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు.

వివాహాది శుభకార్యాలు వాయిదా పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఆత్మీయులతో అరమరికలు లేకుండా మెలగడం వల్ల మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం దశలో కొంత కాలం జరిగిన తరువాత సుఖం మొదలవుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వల్ల మార్పులు తప్పవు.

Poorvabhadra

పూర్వాభద్ర నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో పూర్వాభద్ర 25వ నక్షత్రము. పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు. అధిదేవత అజైకపాదుడు. మానవ గణము. జంతువు సింహము. రాశ్యాధిపతులు శని, గురువులు.

పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము  
పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము మేషరాశిలో ఉంటుంది. మేషరాశి అధిపతి కుజుడు. పూర్వాభాద్ర నక్షత్రము అధిపతి గురువు. ఈ జాతకుల మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికం. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. ఈ జాతకులకు భూ సంబంధిత, సైనికపరమైన, సాహసాలు ప్రదర్శించగలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది.

ఈ జాతకులకు 14 సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. ఈ కారణం వల్ల మొదటి నుంచి విద్యభ్యాసంలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. సంపాదన కంటే ఖర్చులు అధికం. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 50 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలువుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్ర రెండవ పాదము

వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు, మత బోధకులు, మత గురువులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలం. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు పది సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. కనుక ఆరంభం నుంచి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యభ్యాసంలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరిగే అవకాశం. 29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ  కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్రము మూడవ పాదము
పూర్వాభాద్ర  నక్షత్రం వారు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాధ్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. భూ సంబంధిత, విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు ఆరు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్ర నాలుగవ పాదము

వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేతవర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. ఔషధ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు రెండు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 21 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. జీవితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలమవుతాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

పూర్వాభద్ర నక్షత్రము – ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులు సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలం. దేశవిదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం ఉంటుంది. వీరికి గురువుల, మేధావుల సహకారం ఉంటుంది. ఇతర రంగాల గురించి కూడా మంచి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు.

స్నేహాలు, విరోధాలు వెంటవెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం మొదలవుతుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు.  వైవాహిక జీవితం సాధారణము. బాల్యం సాఫీగా, తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

Uttharabhadra

ఉత్తరాభద్ర నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఉత్తరాభద్రా 26వ నక్షత్రము. ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యాధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు.

ఉత్తరాభద్ర నక్షత్రము మొదటి పాదము
ఉత్తరాభద్ర నక్షత్ర మొదటి పాదము సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు. ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని. ఈ జాతకుల మీద సూర్య శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రం. వీరికి తండ్రితో వ్యతిరేకత ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. శ్రమించి పనిచేయగలరు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. పరిశ్రమలు,   కర్మాగారాలు ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు ఉంటుంది. ఇక ఈ జాతకులకు సాంకేతిక  విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 17 సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది. శని దశ కాలంలోవిద్య కాస్త మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17  సంవత్సరాల బుధ దశ కాలంలో అనుకూలత ఏర్పడి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. 34 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, విదేశీ ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 41 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగానే సాగుతుంది.

ఉత్తరాభద్ర నక్షత్రము రెండవ పాదము
ఈ జాతకుల మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రము. ఈ జాతకులకు సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వ్యాపారం అనుకులిస్తుంది కూడా. వీరికి విద్యా సంబంధిత, పరిశ్రమల సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు.

ఈ జాతకులకు 13 సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 30 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 37 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగా గడిచిపోతుంది.

ఉత్తరభద్ర నక్షత్రము మూడవ పాదము
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం  ఉంటుంది. వీరు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి నౌకలలో ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు తొమ్మిది సంవత్సరాలు శని దశ  ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 26 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడిఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 33 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

ఉత్తరాభద్ర నక్షత్రము నాలుగవ పాదము
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం ఉంటుంది. వీరికి ధైర్యం, ఆవేశం ఉంటాయి. భావోధ్వేగాల విషయంలో తమ మీద తమకు నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి  విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వృత్తులు వ్యాపారం ఉద్యోగం అనుకూలిస్తాయి. సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు కూడా అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు ఐదు సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 29 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. 72 సంవత్సరాల  వచ్చే18 సంవత్సరాల రాహు దశ  కాలంలో కాస్త ఒడిదుడికులు ఎదుర్కొంటారు.

ఉత్తరాభద్ర నక్షత్రము ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులకు అన్ని విషయాల మీద కనీస అవగాహన ఉంటుంది. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. వీరు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు.

కుటుంబ చరిత్ర, తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. వీరి జీవితం సాఫీగా జరిగి పోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు.

Revathi

రేవతి నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము. రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు.

రేవతి నక్షత్రము మొదటి పాదము 
రేవతి నక్షత్రము మొదటి పాదము ధనసురాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ నక్షత్రంలోని మొదటి పాదము జాతకుల మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం. వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించ గలిగే నేర్పు ఉంటుంది. విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలం.

ఈ జాతకులకు 16 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు  విద్యారంభం నుంచి ప్రతిభ చూపిస్తారు. 16 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ   కాలంలో విద్యసాధన విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. తరువాత 23  సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి  ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో విద్య  సాధనలో విజయం సాధించాల్సి ఉంటుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 66 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి.

రేవతి నక్షత్ర రెండవ పాదము 
వీరు ఆధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూ సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది.

ఈ జాతకులకు 12  సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు మొదటి నుంచి విద్యాలో ప్రతిభ చూపిస్తారు. 12 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 19 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్ర దశ కాలంలో విద్యకంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 62 సంవత్సరాల వరకు జీవితం  సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే  విదేశీఉద్యోగావకాశాలు, విదేశీపర్యటనలు కలిసి వస్తాయి. 80 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ  కారణంగా జీవితం మళ్లీ గాడిలో పడుతుంది. ఇక వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

రేవతి నక్షత్రము మూడవ పాదము 
వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూసంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్య అనుకూలిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.

ఈ జాతకులకు ఐదు సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఐదు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతుదశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 12  సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీదికే మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య  వైపు మళ్ళించి సఫలం కావాలి. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వీరికి సకాలంలోనే వివాహం జరుగుతుంది. 55 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల   రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 73 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ  కారణంగా జీవితంలో తిరిగి సుఖం వస్తుంది. వృద్ధాప్య దశ కూడా సౌఖ్యంగా గడుస్తుంది.

రేవతి నక్షత్రము నాలుగవ పాదము   
వీరికి విద్య సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం  ఉంది. వీరికి విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే బుధ దశ   ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి.

నాలుగు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో విద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  సమస్యలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి  ఉంటుంది. శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి ఉంటుంది కనుక మనసును పట్టుదలతో విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలో జీవితంలోనే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 54  సంవత్సరాల  వరకు జీవితం సాఫీగా   జరుగుతుంది. తరువాత వచ్చే 18  సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే  విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 72 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సాఫీగా గడిచిపోతుంది.

రేవతీ నక్షత్రము ఫలితాలు

ఈ నక్షత్రమున జన్మించిన వాడు రూపవంతుడు, ధనవంతుడు, భోగములను అనుభవించువాడు, పాండిత్యము కలవాడై ఉంటారని శాస్త్రం చెబుతోంది. చరరూప ధన సంపదలు కలవారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది.

ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. ఆర్ధిక ప్రగతిని తొందరగానే సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుంచి తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండదండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉండదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు.

మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుంచే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

Durmukhi samvatsara panchangam

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర నవ నాయక ఫలము

{ 2016 -2017}

 

రాజు :- శుక్రుడు 

శుక్రుడు రాజు అయినందువల్ల ప్రతి ఇంట లగ్జరీ పెరుగును, స్త్రీ పురుషులు విలసవమ్థమైన్ జీవితము గడుపుట, వెండి, బంగారముల ధరలు పెరుగుట, మత్తుపదార్ధములు, మద్యము, సుగంధ ద్రవ్యాలు ధరలు పెరుగుట, ప్రేత్యక రిజర్వేషన్స్, స్త్రీలపై అత్యాచారములు, భార్యాభర్తల మద్య విభేదాలు, ఉలవ ధాన్యము ధర పెరుగుట, వైద్య అవసరములు పెరుగుట పాలధరలు పెరుగుట, వర్షాభావము బాగుండును.   

మంత్రి :- బుదుడు 

భుధుడు మంత్రి అవ్వుట వలన దేశములో విదేశి వ్యాపారములు పెరుగుట, పరిపాలన అత్యంత యుక్తి  ప్రయుక్తులతో కూడుకొని ముందుకు సాగును, ప్రజలలో  నేర ప్రవుత్తి మోసము పెరుగును, ప్రభుత్వము కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనును,పెసర దాన్య ధరలు పెరుగును,  ప్రభుత్వ నాతన పధకాలు తో ముందుకు సాగును.        

సైన్యాధిపతి :- బుదుడు 

  బుదుడు సైన్యాధిపతిఅగుట వల్ల దేశములో దోగల భయము పెరుగుట, సైన్యము నకు సంభందించి కొన్ని విషయములు బయటకు వచ్చును, సరిహద్దులలో యుద్ధ వాతావరణము ఉండును, కామప్రకోపములు అధికముగా స్త్రీ పురుషుల మద్య పెరుగును, మత సంభందిత చర్చలు పెరుగును, అగ్ని ప్రమాదములు, ఉద్యోగస్తులకు నూతన అవకాశములు కలుగును.   

సస్యాధిపతి :- శని 

  శని సస్యాధిపతి అగుటచే ప్రతి ఇంట మదుల వాడకము పెరుగును, క్రిమి కితకముల వల్ల పంటలు పాడగును, పంటలకు ధర వచ్చినప్పటికీ నిల్వలు తగ్గును,ఇనుము,నువ్వులు,నూనె ,ఫ్యాక్టరీలు అభివృద్ధి,  భయానక సంఘటనలవల్ల ప్రజలలో భయము పెరుగును, పెట్రోలు ధరలలో పెరుగుట తగ్గుట ఉండును.     

ధాన్యాధిపతి :- శుక్రుడు

అన్ని ధాన్యపు పంటలు బాగుండును,బొబ్బర్లు బాగా పండును, కొన్ని ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులలో వ్యతిరేకత ఉండగలదు, అతి వృష్టి అనా వృష్టి కలుగును, కాఫీ,టి మరియు సుఘంధ ద్రవ్యములు పంటలు ధరలు బాగుండును, నిలువ ఉంచిన వారు మంచి లాభములు పోడుడురు, పొడుగు ధాన్యములు విరివిగా పండ గలవు.  

అర్ఘాదిపతి :- బుదుడు

 పెసల ధాన్యధరలు పెరుగును, ప్రతి వస్తువుకు ధరలు లభించును, విదేశి మారక ద్రవ్య రేటు పెరుగును, ప్రభుత్వము లో నూతన చట్టములు వచ్చును, పారిశ్రామిక రంగములో విశేష మార్పు అభివృద్ధి వుందా గలదు, ద్రవోల్పనం తగ్గుటయే కాక వస్తువు నాణ్యత తగ్గును.  

మేఘాదిపతి :-  బుదుడు

దేశము అంతా వర్ష భావము అధికము.విశేష వర్షముల వాళ్ళ ప్రజా జీవనమునకు ఇబ్బంది కలుగును,  అధిక ప్రమాదములు, అధిక నష్టము ఉండును, వస్తువుల ధరలు పెరుగును, వ్యవసాయ అభివృద్ధి ఉండగలదు, కొన్ని చోట్ల అనావృష్టి వల్ల కొంత నష్టము తప్పక పోవచ్చును, రైతులుక ఇది కొంత నిరాశాకాలము. 

రసాధిపతి :- చంద్రుడు 

కంటికి సంబదిత వ్యాధులు పెరుగును, పిడుగు బాట్లు, నెయ్యి, పంచదార, నూనె ధరలు పెరుగును, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలమద్య విభేదాలు ఇటువంటి వాటితో ప్రజలకు ఇబ్బంది కలుగును. ఉష్ట్నోగ్రత అధికముగా రికార్డుస్థాయిలో ఉండును, రక్షణ వ్యవస్థ సకాలములో సమస్యలను గుర్తించుట చే భారి ప్రమాదములు అరికట్టేదరు, విదేసములలో మన దెశ ఖ్యాతి పెరుగును.  విదేశి ఎగుమతులు పెరుగుట విదేశములో కూడా  మన వస్తువులకు గిరాకి ఉండును. 

నీరసాధిపథి :-  శని 

సుఘంధ ద్రవ్య వ్యాపార రంగము మంచి అభివృద్ధిగా ఉండును,  మత్తు పానియముల ధరలు అధికమగును, పువ్వులు, పండ్లు ధరలు పెరుగును, ప్రజలు విలాస వంత జీవితము గడుపుదురు, కళాకారులకు మంచి సమయము, విదేశములలో ఉన్న ధనము బయటికి వచ్చును,  మహిళలకు అన్ని విధములా బాగుండును. నూతన విహంగ ఆశ్రమములు పెట్టుదురు, మాంసము, సీసం వంటి వాటి ధరలు తగ్గును. 

moudyami and adhikamaasam

 మూఢమి 

 

గురుమూఢమి :- ది . 11-09-2016 తేది బాద్రపద శుద్ధ దశమి ఆదివారం నుండి[పశ్చాదస్తమిత] గురు మౌడ్యమి ప్రారంభము అయ్యి  ది. 10-10-2016 తేది ఆశ్వియుజ శుద్ధ దశమి సోమవారం నాడు త్యాగము.  

శుక్ర మూఢమి :- ది.30-04-2016 చెత్ర బహుళ నవమి స్థిరవారం నుంచి[ప్రాగాస్తమిత] శుక్ర మౌడ్యమి ప్రారంభము అయ్యి  ది.1307-2016 తేది ఆషాడ శుద్ధ నవమీ బుధవారం నాడు త్యాగము. 

తిరిగి ది. 20-03-2017 తేది పాల్గుణ బహుళ అష్టమీ సోమవారం నుండి [పశ్చాదస్తమిత]  శుక్ర మౌడ్యమి ప్రారంభము

Puskaramulu and Grahanamulu

 

కృష్ణా నదికి  ఈ సంవత్సరము పుష్కరము 

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి గురువారం అనగా ది. 11-08-2016 తేది రాత్రి  11గం. 32 నిమిషములకు గురుడు కన్యా రాశి ప్రవేశము కావున మరునాడు అనగా థి. 12-08-2016 తేది శుక్రవారం కృష్ణానదికి పుష్కరములు ప్రారంభం. [ద్రిక్సిద్ధపద్ధతిన ..భారత ప్రభుత్వము ప్రకారము] సార్ధ త్రికోటి తిర్ధరాజ సహిత కృష్ణా  పుష్కర ప్రారంభం. అప్పటి నుంచి పన్నెండు రోజులు పుష్కర దినములుగా అవుతాయి.

2016 – 2017 సంవత్సరము లో గ్రహణములు

ఈ సంవత్సరము ప్రపంచములో 2 గ్రహణములు సంభవించును, అయితే భారత దేశములో మాత్రము గ్రహణములు కనిపించవు . 

1] ది. 01-09-2016 వ తేది శ్రవణ బహుళ అమావాస్య గురువారంసింహ రాశి యందు రాహు గ్రస్త సంపూర్ణ కంకణాకార సూర్య గ్రహణము.  ఆఫ్రికా, హిందు మహాసముద్రము,  దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రము, మెడగాస్కర నాడు కనుపించ గలవు.  

2] ది . 26-02-2017 వ తేది మాఘ బహుళ అమావాస్య ఆది వారము కుంబ రాశి యందు కేతు గ్రస్త కంకణాకార సూర్య గ్రహణం, ఇది భారతదేశము లొ కనిపించదు. జింబాబ్వే, చీలి, దక్షణఅంట్లాంటిక్,పసిపిక్ సముద్రములయందు, అఫికలో అంగోలా మొదలగు చోట్ల కనిపించును   

  భారతదేశము వారు నియమములు ఏమియు పాటించ వలసిన అవసరము లేదు.

కర్తరి 

డొల్లు [చిన్న]కర్తరి :- ది 04-05-2016 తేది చెత్ర బహుళ ద్వాదశి బుధవారం ఉదయం గం. 08-18 ని.    నుంచి 

  

నిజ   [పెద్ద] కర్తరి :- ది .11-05-2016 వైశాఖ శుద్ధ పంచమీ బుధవారం ఉదయం గం. 08-53 ని. నుండి నిజ కత్తిరి ప్రారంభము 

  ది. 28-05-2016తేది వైశాఖ బహుళ సప్థమీ స్థిరవారం నాడు త్యాగము. 

 కర్తిరి సమయమున కర్ర మట్టి పనులు నిషిద్ధము. 

మకర సంక్రాంతి, ఫలములు

ది. 14-01-2017 వ తేది ఉదయం 07 గం.28 ని.లకు రవి[సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును, కావున గురువారము అనగా 14-01-2017 వ తేది మకర సంక్రాంతి చెయవలయును.

మకర సంక్రాంతి పురుషుడు రాక్షస నామము  ఏనుగు వాహనము

రాక్షస నామం, శుద్దోదక స్త్నానం, అరిష్టం,చొరభయం, వ్యాది దుర్భిక్షం, పెసలు అక్షతలుచే పెసలు ధాన్యం ధరలు అధికమగును,రక్త వస్త్ర ధారణవల్ల ప్రజారోగభయము,గోరోచన చందన లెపముచే కొంత శుభము,  యుద్ధ భయం, జపాపుష్ప ధారణ వల్లయసోహాని, సిసపాత్ర ఆభరణ ధారణ వల్లఆరోగ్యం, పాలు త్రాగుటచే పశు నాశనం కీర్తి,రేగు పండు భుజించుటవల్ల శుభము, గజ వాహనము చే అరణ్య ప్రాంత జంతువులకు నష్టము, కోదండ ధరనవల్ల యుద్ధ బాయము, కాంచన చత్ర దారణచే రోగ స్వర్ణ నాశనము, ఆగ్నేయదిక్కు ప్రయాణము వల్లఆగ్నేయ రాష్ట్రములకు ఇబ్బందులుకలుగును.

Remedies mantra

ఉదయం లేవగానే కర చివరలు చూస్తూ పటించు స్తోత్రం:-
కరాగ్రే వసతే లక్ష్మి –  కరమధ్యే సరస్వతికరములేతు గోవిందః  – ప్రభాతే కర దర్శనం!
నిద్రించుటకు ముందు పటించు స్తోత్రం:-
రామస్కందం హనూమంతం – వైనతేయ వ్రాకోదరంశయనే యః సమరే నిత్యం – దుస్వప్నస్తన్యనశ్యతి!
విద్యార్ధులకు మంద భుద్ధి తగ్గి చదివినది గుర్తు ఉండుటకు:-
ఓం హ్యీం శ్రీం ఐ వద్వద వాగ్వాదినీసరస్వతీ తుష్టి పుష్టి తుభ్యం నమః
ధనం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుటకు:-
ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ   భగవతి మమ సంరుద్ధౌ జ్వల   జ్వల మా సర్వ సంపదం దేహిదేహి   మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ!
ధనసంపదనిచ్చే మంత్రం
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవంతేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
ధన లాభము పొందుటకు:-ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ, ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా!