Menu

Monthly Archives: June 2015

Pearl

ముత్యము

ప్రకృతిలో లభించే నవరత్నాలలో ముత్య‌ము ఒకటి. ఇవి మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. ముందుగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.

ముత్యాల‌ను స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తారు. స్త్రీలు మంగళ సూత్రానికి ముత్యాన్ని చేర్చే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉంది. శ్రీరామమవమి రోజున సీతారాముల కల్యాణం జరినప్పుడు ముత్యాల త‌లంబ్రాలు పోయ‌డం ఆన‌వాయితీగా ఉంది. కల్యాణం జ‌రిగే సమయంలో స్వామివారికి .. అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు పోస్తారు. అలా పోయబడిన ముత్యాలను అక్కడి అర్చకులు వివాహితులైన స్త్రీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తుంటారు. ఆ ముత్యాన్ని మంగళ సూత్రానికి చేర్చి కట్టుకోవడం వలన, అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యం సుస్థిరమవుతుందని స్త్రీలు భావిస్తుంటారు. ప్రాచీనకాలం నుంచి ఈ విశ్వాసం బలపడుతూ రావడం వలన ఈ ఆచారం ఇప్పటికీ కొన‌సాగుతోంది.

ఎవ‌రు ధ‌రించ‌వ‌చ్చు..?
నవరత్నాలలో ముత్యము చంద్ర గ్రహానికి వర్తిస్తుంది. కర్కాటకం చంద్రుని రాశి. రోహిణి, హస్త, శ్రవణం చంద్రుని నక్షత్రాలు. 2, 11, 20, 29 తేదీలు చంద్రుని రోజులుగా జోతిష్య శాస్త్రం పరిగణించబడుతుంది. కాబట్టి కర్కాటక రాశి, లగ్నాలలో, రోహిణి, హస్త, శ్రవణా నక్షత్రాలలో జన్మించిన వారు ముత్యమును ధరించవచ్చు. చంద్రుడు దుష్ట స్థానాలలో, దుర్బల స్థానాలలో ఉండగా జన్మించిన వారు, చంద్ర దశ నడుస్తున్నవారు కూడా ముత్యాన్ని ధరించవచ్చునని రత్నాలశాస్త్రం చెబుతోంది.

ఎప్పుడు, ఎలా ధ‌రించాలి..?
సోమవారం శ్రావణం, రోహిణీ, హస్త నక్షత్రాల సంచారంలో ఉదయం 10 నుంచి మద్యాహ్నం 12 గంటలలోపు ముత్యాన్ని తయారుచేసి ఉండాలని అలాంటి నక్షత్రాల్లో చేసిన ముత్యపు ఉంగరాన్ని ధరించిన వారికి శుభ ఫలితాల్నిస్తుందని శాస్త్రం చెబుతోంది.

పచ్చి పాలలో, గంగా జలంలో ఒక రోజంతా ముత్యాన్ని ఉంచి శుద్ధి చేయాలని, ముత్యాన్ని ధరించిన‌ప్పుడు ఓం చంద్రమసే నమ: అనే నామాన్ని జపిస్తూ ముత్యమును కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలి. ముత్యాన్ని ధరించునప్పుడు పెరుగు, పాలు, వెండి, దూది, బియ్యం, నెయ్యి తదితరాలను దానం చేస్తే మంచిది. ఈ విధమైన ఆచారంతో ముత్యాన్ని ధరించిన వారికి మానసిక శాంతి ప్రేరణ, ఆనందం కలుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

సుఖ నిద్ర, జ్ఞాపకశక్తి, మానసిక ఎదుగుదల, వ్యాపారాభివృద్ధి, నిత్యావసరాలు, మందులు, పండ్ల తోటలు, మాతృ సౌఖ్యం, సంసార సుఖం, సత్వర వివాహానికి, హోటళ్ళు, విశ్రాంతి భవనాలు, నీటి పన్నులు, పానీయాలు, రస పదార్ధాలతో వ్యాపారం చేసే వారికి ముత్యం ధరించడం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తాయి. పైత్యం, శ్వాస రోగాలు, మనో వ్యాధులు, చర్మ వ్యాధులు, ఉబ్బసం, ఉదర రోగం, స్త్రీల వ్యాధులు, నివారణకు ముత్యం ధరించడం శుభప్రదం.

Red Coral

ప‌గ‌డ‌ము

       న‌వ‌ర‌త్నాల్లో ప‌గ‌డ‌ము ఒక‌టి. పగడాన్ని ఆభరణాలలో ధ‌రించ‌డం అనాదికాలం నుంచి కొన‌సాగుతూ వ‌స్తోంది. రోమనులు తమ పిల్లల మెడలో వీటిని హారంగా గుచ్చి వేసేవారట‌. ఇలా ధరించడం వల్ల పగడం వారు ఆరోగ్యంగా ఉంటార‌ని, ఆపదలు రాకుండా కాపాడుతుందని వారి నమ్మకం. ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో దీనిని ఇప్పటికీ దృష్టి దోషం తగలకుండా ఉండేందుకు ధరిస్తారు. హిందువులు కూడా ఆదికాలంనుంచి వీటిని ఉపయోగిస్తున్నారు.

అయితే పగడం రాయి కాదు. ఇది సముద్రంలో నివసించే కోరల్‌ ఫాలిప్‌ అనే జిగురువంటి చిన్న సముద్ర ప్రాణి కవచం. ఈ కవచం దాని శరీరంలో వెలుపల పెరుగుతుంది. ఇది ఆ ప్రాణి శరీరాన్ని కాపాడుతుంది. దానితోపాటు పెరుగుతుంది.

ప‌గ‌డ‌ము ధ‌రించ‌డం వ‌ల్ల వ‌చ్చే ఫ‌లితాలు
పగడము ముదురు ఎరుపురంగు క‌లిగి ప్రకాశవంతమైన నునుపు పగడాలు కుజ గ్రహానికి చాలా ప్రీతి. కుజుడు రక్త వర్ణం కలిగి అగ్నితత్వం గల పురుష గ్రహము. పగడం కూడా తేజోతత్వానికి సంబంధించింది. ఎరుపుగా ఉండ‌టం కార‌ణంగానే కుజుడుకి ఇష్టప్రదమైంది. ఈ పగడం త్రిదోషంలోని పిత్తమను దోషాన్ని హరింపగలదు.

మాన‌వ శరీరంలోని మూలాధార చక్రమునందలి వివిధ కాంతి విశేషములన్ని ఈ పగడంనందు నెలకొని ఉండ‌టం వ‌ల్ల‌ మూలాధార చక్రంలోని  పసుపు పచ్చని రంగుగల కాంతి కిరణాల దేహతత్వంపై ఏ విధంగా పనిచేయగలవో ఈ పగడం ధరించడం వల్ల కూడా అదే విధంగా హరిత కిరణాలు దేహ రంద్రాల ద్వారా చొచ్చుకుపోయి, రక్త దోషాలు, లివర్, బ్లడ్ ప్రషర్, అల్సరు, జననేంద్రియ సంబంధిత వ్యాధులు, స్ఫోటకం వంటి అనేక అంటువ్యాధులు, కీళ్ళ బాధలు మొదలగు అనేక రుగ్మతలు పారద్రోలి ఆరోగ్యవంతులను చేయగలదు.

మృగశిర, చిత్త, ధనిష్ఠ అను నక్షత్రాల్లో జ‌న్మించిన వారు ఏ కాలంలోనైనా మంచి పగడాలను ధరించవచ్చు. ఇతర నక్షత్ర జాతకులలో ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రజాతకులు పగడం ధరించి సత్ఫలితలు పొందటం చాలా కష్టం, మిగిలినవారు తమ  జన్మకాలమునందలి జాతక చక్రంను అనుసరించి గ్రహాల యొక్క దశాంతర్దశలను గమనించి కుజగ్రహం దోష ప్రమాదంగా ఉన్న సమయములందే పగడం ధరించాలి. అలా ధరించ‌డం మూలంగాల‌ కుజగ్రహ దోషంవల్ల జీవితంలో సంభవించే అనేక అనర్థాలు, నివారింపబడి శుభం, జయం కలుగును.

బ్రహ్మజాతికి , క్షత్రియ జాతికి సంభంధించిన ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతుల వ‌ల్ల‌ ధరించ‌డం వ‌ల్ల‌ శుభం జరుగుతుంది. ఆచరించే ప్రతికార్యంలో కలిగే విఘ్నాలు అంతరించి ఆయా పనులలో విజయం లభిస్తుంది. ఆ కారణంగా శత్రుత్వం తొలగిపోయి జనవశీకరణ లభిస్తుంది. పగడము అగ్నినుంచి, ఆయుధాల నుంచి కృర శతృవుల నుంచి తగిన రక్షణ అందిస్తుంది. అనుకోని ప్రమాదాలు, గండాలను తప్పించి ర‌క్ష‌ణ‌గా ఉండ‌గలదు. దీర్ఘ‌కాలంగా బాధిస్తున్న రుణ బాధలు, సూర్యోదయమునకు చీకట్లు తొలగిపోయినట్లు స‌మ‌సిపోవును.

ఇక వివాహ విషయంలో కలిగే వివిధ ఆటంకాలు అంతరించి శీఘ్రంగా వివాహం అవుతుంది. కుజదోషంల వలన కలిగే దాంపత్య జీవితంలో కలిగే కలహాలు, కలతలు కార్పణ్యాలు, పరస్పర వైషమ్యాలు, విడాకులలాంటి దుర్మార్గపు భావనలు, అంతరించి, అన్యోన్యప్రేమ పూరితమైన అనురాగంతో దంపతులు దీర్ఘకాలం సుఖ సంసార జీవనం చేసుకొనుటకు తోడ్పడుతుంది.

శతృవుల వల్ల ఏర్ప‌డే స‌మ‌స్య‌లు, రాజకీయ బాధలు, పోలీస్ కేసులు, ఇతర బాధలు, లివర్ వ్యాధులు, దేహతాపం, చర్మవ్యాధులు, గడ్డలు వ్రణములు, వాపులు, కీళ్ళబాధలు, జననేంద్రియములకు సంబంధించిన అన్ని వ్యాధులు. కడుపునొప్పి కాన్సరు మొదలగు ఇంకా అనేక వ్యాధులను శీఘ్రంగా నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులగుటకు పరిపూర్ణ సంతోషముతో తృప్తిగల సుఖవంతమైన జీవితమును గడుపుటకు పగడం స‌హాయప‌డుతుంది.

పగడానికి అధిపతి కుజగ్రహం అనుగ్రహం కలిగి శుభగ్రహ స్థానల్లో ఉంటే ఎంత మంచి చేస్తాడో ఆ విధమైన శ‌క్తికలవాడై అశుభ స్థానాల్లో ఉంటే అంతటి కీడును కూడా కలిగిస్తాడు. ఆయనకు ప్రీతికరమైన పగడాన్ని ధరించడం వలన కుజ గ్రహం ప్రసన్నుడై సకల ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సంపదలతో, గౌరవం, ఆరోగ్యం, గౌరవం వంశాభివృద్ది, సకలసౌభాగ్యాలు కలుగచేస్తారు. పగడపు పూస మాలలు ధరించడం వల్ల‌ కూడా పై విధమైన ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష మాలల యందు 7 పగడాలు గానీ కనీసం ఒకటి రెండు పగడాలుగానీ చేర్చి ధరించాలి.

పగడము ధరించే విధానం
పగడం 7 కారెట్లు ఉన్న దాన్ని ధరించుట మంచింది. త్రికోణంగా ఉన్న పగడం విశేష ఫలప్రదం, అలా కాకుంటే బాదంకాయ రూపంలో ఉన్న దాన్ని కూడా వాడవచ్చు. నలుచదరపు, వర్తులం విల్లువలె ఉండునది. నక్షత్రాకారంను పోలిన పగడాలు ధారణకు అంతగా ఉపయోగించవు. పగడం చిన్నదైనా దోషరహితంగా ఉండాలి. బంతివలె ఉన్న ప్రవాళాలు మూలల్లో, ఆభరణాల్లో కూర్చుకోవ‌డం ఉత్తమముం. పగడం కూర్చే ఉంగరం బంగారంతో గానీ లేక వెండితో గానీ, లేదా పంచలోహంలతో గానీ తయారు చేయించాలి. ఈ ఉంగరం పీట భాగంలో ముక్కోణాకారంలో ఉండి దాని చుట్టూ వలయ రేఖలను ఏర్పాటు చేయ‌డం చాలా ముఖ్యం.

కృష్ణ పక్షంలో చదుర్దశీ మంగళవారం వచ్చిన రోజునందుగానీ, లేక కుజుడు మకర రాశిలో ధనిష్ఠా నక్షత్ర సంచారం చేసే కాలంలో గానీ ఏదో ఒక మంగళవారంనాడు గానీ, మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంట‌ల‌ మధ్య కాలంలో గానీ లేక రాత్రి రెండు నుంచి మూడు గంట‌ల‌ మధ్య స‌మ‌యంలో గానీ, దక్షిణ ముఖంగా కూర్చొని పగడం ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని ఒక రోజంతా నవ ధాన్యాలలో ఉంచి మ‌రో రోజంతా పంచగవ్యములు (ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవు పంచితం, గోమయం కలిసినది)యందుంచి, 3వ రోజున సుగంధ, ద్రవ్యాలతోడను, ఎర్రచందనపు నీళ్ళతో రుద్రాభిషేకం జరిపించి శుద్ది చేయాలి. ధరించే వారు తమకు తారాబలం చంద్రబలం గలిగిన శుభతిదులయందు (శనివారం గాక)మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నములు వర్తించు వేళాలందు ఉంగరము కుడిచేతి ఉంగరపు వేలికి ధరించాలి.

ధరించుటకు పూర్వమే షోఢశోపచార పూజలు జరిపి నమస్కరించి గురువులను గణపతిని ధ్యానించి దక్షిణ ముఖముగా నిలువడి ఉంగరము కుడి అరచేతియందుంచుకొని “ఓం లం ఐం హ్రీం శ్రీం మహిపుత్రాయ సకలారిష్ట వివారనాయ క్లీం క్లీం స్వాహా”అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయాలు జపించి, ఉంగరాన్ ముమ్మారు క‌ళ్ల‌కు అద్దుకొని వేలికి ధరించాలి. స్త్రీలు మాత్రం ఎడమ చేతికి అనామికా వేలికి ధరించుట శుభప్రదం.

Emerald

మ‌రక‌త‌ము (ప‌చ్చ) 

నవరత్నములలో ఒకటి మరకతము. పచ్చ అని తెలుగులో దీనికి వ్యావహారిక నామము గ‌ల‌దు. ఇంగ్లీష్ లో ‘ఎమరాల్డ్’ అంటారు. పచ్చని రంగును కలిగి ఉండ‌టం వ‌ల్ల‌ హరిన్మణి, పచ్చలు అన్న పేర్లు కూడా ఉన్నాయి. మరకతము య‌వ్వ‌నముగల నెమలి పిట్ట రంగును, నాచువలెను, గాజువలెను ప్రకాశించే గరికమొలక రీతిగాను, కోమలమగు పాలచెట్టు కొమ్మరంగునను, మంచి కాంతి గల రామ చిలుక రెక్కల చాయను, సుందరమియన్ దిరిశిన పువ్వురంగు వలె.. ఇలా ఈ 8 రంగులలో ప్రకాశించును.

జాతి ఎమరాల్డ్ బైరేల్ కుటుంబంలో గ్రీన్ వెరైటీ, అల్యూమినియం, బెరిలియం తాలుకూ సిలికేట్ తో ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారం, స్టెప్ కట్ అనే దాన్ని ఎమరాల్డ్ కి సాధారణంగా ఉపయోగిస్తారు. కటింగ్ ఆ విధంగా ఉన్నప్పుడే ఎమరాల్డ్ క్రిస్టల్ తాలూకు లోతు, అందమైన రంగు, ఫోకస్ చేయబడుతుంది. 1934 నుండి సింథటిక్ ఎమరాల్డ్ కూడా తయారు చేస్తున్నారు.

బుధుని ర‌త్నం ప‌చ్చ‌. మిథున‌. క‌న్యా రాశులు ల‌గ్నాలు, ఆశ్లేష‌, జ్యేష్ఠ‌, రేవ‌తి న‌క్ష‌త్రాలు, 5,14, 23 తేదీలు. మే 21 నుంచి జూన్ 21 మధ్య జ‌న్మించిన వారు ధ‌రించవ‌చ్చు. అలాగే ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 23 మ‌ధ్య జ‌న్మించిన వారు కూడా ప‌చ్చ‌ను ధ‌రించ‌వ‌చ్చు.

లోపాలు లేని జాతిపచ్చ సంపదను, ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని అందిస్తాయి. జాతిరత్నం జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు, ధరించిన వ్యక్తి చదువు పట్ల ఏకాగ్రత ఏర్పడేలా చేస్తుంది. విద్య‌కు, జ్ఞానానికి, వ్యాపారానికి, వైద్య వృత్తికి, జ్ఞాప‌క‌శ‌క్తికి, మాన‌సిక రోగ‌నివృత్తికి ఈ ర‌త్నం స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణ‌కోశానికి, న‌రాలు, మెద‌డుకు సంబంధించిన జ‌బ్బులు, హిస్టీరియా, మ‌తిభ్ర‌మ‌ణం, ప‌చ్చ కామెర్లు, క‌డుపునొప్పి, ర‌క్త‌పోటు మొద‌లైవి తొల‌గించి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని, స్నేహ‌సామ‌ర‌స్యాల‌ను పెంపొందిస్తుంది.

ఎమరాల్డ్ నుంచి ఆకుపచ్చ కిరణాలు బయటకు వెదజల్లబడతాయి. కాబట్టి ఆ రంగు మూత్రపిండాలు, ప్రేగుల మీద, కాలేయం మీద పనిచేసి ఆరోగ్యస్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాక శ్వాస ప్రక్రియ సరిగా జరగడం, ఏకాగ్రత కలగడం, ఇన్ సోమ్నియా, డీసెంట్రీ, డయేరియా, ఆస్తమా, అల్సర్ వ్యాధుల నుంచి దూరం కావడం జరుగుతుంది.

బంగారం లేదా, వెండిలో జాతిపచ్చను పొదిగి బుధవారం ధరించాలి. కుడి చేతి చిటికెన వ్రేలికి ధరించాలి.