Menu

Monthly Archives: August 2015

నవగ్రహాలకు జపాలు పరిహారాలు

నవగ్రహాలకు జపాలు పరిహారాలు by Chinta Gopi Sarma

Nvagraha Dosha Pariharalu

Nvagraha Dosha Pariharalu

నవగ్రహాలకు జపాలు పరిహారాలు

పూర్వజన్మలో మానవుడు చేసిన పుణ్య పాపకర్మ ఫలాల్ని అనుసరించి ప్రస్తుత జన్మలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే, ఈ కర్మఫలాలని అనుభవింపజేసేవి నవగ్రహాలు. నవగ్రహాలు అన్నీ తమతమ అంతర్దశలలో జాతకుడి కర్మ ప్రారాబ్దానుసారం అతడికి సుఖాల్ని, సమస్యలను కలిగిస్తూ ఉంటాయి.

ఇలా మానవులు నవగ్రహదోషాల ద్వారా కష్టాలు పడకుండా, వీటికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. అయితే, ఏ దోషానికైనా పాపఫలం కారణం అని గుర్తించాలి. దానికి మనం సంపాదించినదాంట్లో 20 శాతం సొమ్మును దానంచేస్తే మంచిది.

ఆయా గ్రహాలకి బ్రాహ్మణాదుకి ఇవ్వడంతోపాటు తమ దగ్గర పనిచేసేవారికి, చుట్టు ఉండే బంధువులకి, స్నేహితులకి పంచుకోవడం, బీదలకి అనాధలకి ఇవ్వడం కూడా పుణ్యకార్యమే. నిజానికి దానాలు ఎవరెవరికి ఎలాంటివి ఇవ్వవచ్చో తెలుసుకుని దానాలు చేయాలి. అవిచేస్తూ కింది జపాలు, ఆయా దేవతా పూజలు చేయడం శుభప్రదం.

రత్నాలు అందరూ అన్నీ ధరించకూడదు అవిసూచనిబట్టే ధరించాలి. అయితే, పూజ, జపం, దానం లేకుండా రత్నధరణ ఫలించదు. ప్రతీ గ్రహానికి (జపం (అనగా ఇవ్వబడ్డ సంఖ్య) + తర్పణం + హోమం + దానం) ఇవన్నీ చేయడాన్ని మాములు పరిహారం అంటారు. విశేష సమస్యలకు ఆయా పరిహారాలు పాటించాలి.

చేయాల్సిన పరిహార విధులు

సూర్యగ్రహానికి..
గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణకారకః । విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవిః ॥ ఈశ్లోకాన్ని ఏడు వేల సార్లు జపించాలి దానాలు త గోధులు, గోధుమ పిండి పదార్థాలు రొట్టెల వంటివి, రాగి వస్తువులు. పూజలు- విష్ణుమూర్తికి పూజ, సూర్యోపాసన. రత్నాలు- కెంపు ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాలి.

చంద్రగ్రహానికి..
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సురాశనః । విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదుః ।। ఈ శ్లోకాన్ని పది వేలసార్లు జపించాలి. దానాలు తపాలు, తెల్ల బట్టలు, బియ్యం వెండి వస్తువులు. నీరు దానం చేయవచ్చు. లేదా నీటి ట్యాంకర్‌ కట్టించడం. శివాలయం, ఏదైనా తీర్థాలు, పూజలు-శివారాధన, చంద్రపూజ, చంద్రుడి అష్టోత్తర శతనామాలు చదవటం.
రత్నాలు- ముత్యం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

కుజగ్రహానికి..
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్‌సదా । వృష్టికృత్‌ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః ॥ ఈ శ్లోకాన్ని ఏడు వేలసార్లు జపించాలి దానాలు త కారం వస్తువులు, ఎర్ర వస్త్రాలు, కందులు, కందిపప్పు. రక్తదానం పూజలు-దుర్గారాధన, సుబ్రహ్మణ్యారాధన, కుజ పూజ, కుజ అష్టోత్తర శతనామాలు చదవటం.
రత్నాలు- పగడం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

బుధగ్రహానికి..
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రోమహాద్యుతిః । సూర్యప్రియకరోవిద్వాన్‌ పీడాంహరతుమే బుధః । ఈశ్లోకాన్ని పదిహేడువేల సార్లు జపించాలి దానాలు తపెసలు, ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, రోగులకు మందులు ఇవ్వడం,
రత్నాలు- పచ్చ (మరకతం) ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
పూజ. విష్ను ఆరాధన, వణిగింద్ర పూజ, కుబేర పూజ ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవటం

గురుగ్రహానికి..
దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః । అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః॥ ఈశ్లోకాన్ని పదహారు వేల సార్లు జపించాలి. దానాలు త పుస్తకాలు, బంగారు వస్తువులు, తీపి పిండి వంటలు, పట్టు బట్టలు. పండ్లు.
పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

శుక్రగ్రహానికి…
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః । ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భృగుః ॥ ఈ శ్లోకాన్ని ఇరవై వేల సార్లు జపించాలి. దానాలు తచక్కెర, బబ్బెర్లు, అలంకరణ వస్తువులు. పూలు. ఆవు పూజలు. లలితా, కాలీ, శుక్ర గ్రహం పూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తర శత నామాలు చదవటం. రత్నాలు- వజ్రం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

శనిగ్రహానికి..
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః । మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః ॥ ఈ శ్లోకాన్ని పందొమ్మిది వేల సార్లు జపించాలి దానాలు త వాడుకున్న వస్త్రాల్లోచినిగి పోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడు పండ్లు, దానంచేయడం, నువ్వుల నూనెతో శరీరాన్ని రుద్ది తర్వాత స్నానం చేయడం. పూజలు, రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శత నామాలు చదవటం.
రత్నాలు- నీలం(ఇంద్రనీలం) ధరించాలి, అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

రాహుగ్రహానికి..
అనేకరూప వర్ణైశ్చ శతశఃఅథసహస్రశః । ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః ॥ ఈ శ్లోకాన్ని పద్దెనిమిది వేల సార్లు జపించాలి. దానాలు తముల్లంగి వంటి దుంపలు, మినప్పప్పుతో చేసిన వడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాల సర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

కేతుగ్రహానికి..
మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః। అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ ॥ ఈ శ్లోకాన్ని ఏడు వేల సార్లు జపించాలి.
దానాలు ఉలవలు, మిక్స్‌డ్‌ కలర్స్‌ వస్త్రాలు, ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం.
రత్నాలు- వైఢూర్యం ధరించాలి. అయితే జాతకాన్ని అనుసరించి మాత్రమే ధరించాల్సి ఉంటుంది.

Vasthu Dosham

vasthu Dosha

వాస్తు దోషం ఎలా తెలుస్తుంది..?

మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది.  తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం పడుతుంది.

ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు.  కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ  అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని చెప్పుకోవచ్చు.

అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే.  ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించండం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి వస్తాయి. అందువలన ఏ నిర్మాణమునైనా సరైన వాస్తు రీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలి.

కొన్ని గృహాలు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు  అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు.  అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు ఉంటాయి. ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం ఉండదు.  అయినా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము.  అందుకని వాస్తు పండితులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది.  కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు పండితుల్ని సంప్రదిస్తారు. అది సరికాదు. అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పవచ్చు. మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు. కట్టడం బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో కూడా గృహం నిర్మిస్తే సుఖంగా వుండలేరు. అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాల్సిందే.

రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలి..? ఎన్ని గుమ్మాలు ఉండాలి..? ఎక్కడెక్కడ వుండాలి..? కిటికీలు ఎక్కడ ఉండాలి..? వగైరాలన్నీ ముందే వాస్తు పండితుల్ని సంప్రదించి నిర్ణయించుకోవాలి. ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు. దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం ఉంటుందంటారు.

జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృద్దులు, బాధపడే గృహం వాస్తు దోషం ఉన్నట్లే. అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉండవు. సర్ప, దేవతా, ఋషి శాపాలు ఉన్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం ఉన్నట్లే. ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలు కాదు. మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు. వాస్తుతో పాటు ప్రవర్తన కూడా బాగుంటేనే సుఖ సంతోషాలతో ఉంటారు.

Vastu Shastra – Interior- 2

Vastu Shastra - Interior - 2

వాస్తు – గృహాలంకరణ -2

నూతనంగా నిర్మించుకున్న గృహానికి అలంకరణ విషయంలో వాస్తు శాస్త్రం సలహాలను, సూచనలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆ గృహం సంపూర్ణంగా వాస్తుకు లోబడి ఉండటంతో ఆ గృహం మంచి అభివృద్ధిని సాధించి, నిరంతరం సుఖసంతోషాలను తనలో ఇముడ్చుకుంటుంది.

గృహంలో బీరువాను దక్షిణ గోడకుకానీ పడమర గోడకుగానీ ఆనించి ఉంచాలి. మూలలకు ఆనించి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ద్వారం తలుపులు పువ్వులతోనూ, గంటలతోనూ అందంగా ఉండేటట్లు అలంకరించుకోవాలి.

అలాగే డైనింగ్ టేబుల్ అలంకరణ విషయంలో తూర్పు వైపు తిరిగి భోంచేసే విధంగా అమరిక ఉండాలి. ఇంట్లో ప్రతి గదిలోనూ ఈశాన్యం మూల ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి.

అలాగే అన్ని గదులు సర్దిన తరువాత పడక గదిని కూడా వాస్తు సలహాల మేరకు అలంకరించుకోవాలి. వాస్తు ప్రకారం పడుకునేటప్పుడు ఉత్తరం వైపున తలపెట్టి పడుకునే విధంగా ఉండకూడదు. అలాగే ముఖద్వారానికి ఎదురుగా, దూలానికి వెన్ను కింద భాగంలో కూడా తలపెట్టి పడుకునే విధంగా ఉండకూడదు. అలాగే గృహ ఆవరణలో చెట్లు పెంచదలచుకుంటే వాటి నీడ ఇంటిపైన పడకుండా విధంగా జాగ్రత్తలు తీసుకొని పెంచుకోవాలి.

ఇక సాధారణంగా నివాస గృహాలు, కార్యాలయాలు, దేవాలయాల్లో అలంకరణ ప్రాయంగా చిత్రించే చిత్ర పలకముల ద్వారా కొన్ని దోషములు ప్రాప్తించగలవని వాస్తు చెబుతోంది. శాస్త్ర ప్రకారం కాకుండా రాక్షసులు, గ్రహ, నక్షత్ర, యక్ష, గంధర్వలు వంటి చిత్రాలు నివసించే గృహాల్లో ఉంటే దోషము సంభవిస్తుంది. అదే విధంగా ఉయ్యాలలూగుచున్నట్లు, ఏనుగులను పట్టుచున్నట్లు, జంతు యుద్ధ చిత్రములు, రాజవిగ్రహములు, దేవరాక్షస యుద్ధము, వేట, ప్రాణహింస, దేవాలయ విమాన గోపరములు మొదలగు చిత్రములు గృహమందుంచితే దోషప్రదము.

గృహావరణలో చెట్లను పెంచాలనుకున్నప్పుడు ఆ చెట్టు నీడ తన ఇంటిపై పడనంత దూరంగా వాటిని పెంచాలి. పూల మొక్కలను ఈశాన్య మూల మినహాయించి అన్ని దిక్కుల్లోనూ పెంచవచ్చు. ఇక తీగ చెట్లను ఇంటి మీదకు పాకించటం ఫ్యాషన్ అనుకుంటారు కానీ వాస్తు ప్రకారం వాటిని అలా ఇంటిపైకి పాకించకూడదు.

ఇంటి రంగులు
గృహ అలంకరణలో ముఖ్యమైనవి ఈ ఇంటికి అందం తెచ్చే రంగులు. నిర్మాణం పూర్తయిన గృహాలకు చక్కటి రంగులను నచ్చే విధంగా వేస్తే ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. అయితే ఈ రంగుల ఎంపిక కూడా వాస్తుకు లోబడి ఉంటే మంచిది. లేత రంగుల పెయింట్లు వాస్తు ప్రకారం మంచిది. లేత నీలం, ఆకుపచ్చ, పింక్‌, క్రీమ్‌ కలర్లను గదులకు వాడడం మంచిది. ఇంట్లో ఎరుపు, నలుపు రంగులను వాడకపోవడమే మంచిది. వాస్తు ప్రకారం ఇంటికి తెల్ల సున్నం వేయించటంలో తప్పులేదు. కాని ఇంటి పెద్ద జాతక రీత్యా లగ్నాధిపతి ఏ గ్రహముతో కలసి ఉంటాడో చూసుకుని రంగులు వేయించడం మంచిది. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలతో సున్నం వేస్తే సరిపోతుంది. అలాగే తూర్పు వైపు గృహానికి తెల్ల రంగు, దక్షిణ వైపున అయితే ఎరుపు రంగు, పశ్చిమ వైపున అయితే నీలి రంగు, ఉత్తరం వైపు ఆకుపచ్చని రంగులు వేస్తే మంచిది.

ఇక విద్యుత్‌ పరికరాలను కూడా సరైన దిక్కున ఉంచాలి. విద్యుత్‌ ఉపకరణాలను ఈశాన్య దిక్కున పెట్టకుండా చూసుకోవడం మంచిది. గ్యాస్‌, ఓవెన్‌ల, మైక్రోవేవ్‌ వంటి వేడిచేసే పరికరాలు ఆగ్నేయం దిశల్లో అమర్చుకోవాలి. గీజర్‌ కూడా బాత్‌రూమ్‌లో ఆగ్నేయ దిశలో అమర్చుకోవాలి. కూలర్‌, ఏసీ, ఫ్రిజ్‌.. గదిలో వాయవ్యంలో అమర్చుకోవాలి. గదిలో ఉత్తరం, తూర్పు లేక ఆగ్నేయంలో టివీ పెట్టుకోవచ్చు. గది ఈశాన్యంలో విద్యుత్‌ పరికరాలు ఉంచవద్దు. ఇక ఇంట్లో వెలుతురు ధారాళంగా ఉండాలి. ఇంట్లో మసక వెలుతురు ఉండడం అక్కడ నివసించే వారికి మంచిది కాదు.

స్టడీ టేబుల్‌ను గదికి ఉత్తర లేదా తూర్పు దిక్కున వేసుకోవాలి. అలాగే డ్రాయింగ్‌ రూంలో పెట్టుకునే అక్వేరియంను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కులలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కనుక.. పైన చెప్పిన దిక్కులు నీటికి సంబంధించినవి కనుక.

Vastu Shastra – Interior

Vastu Shastra - Interior

వాస్తు – గృహాలంకరణ -1

గృహ నిర్మాణంలోనే కాదు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. గృహాన్ని అలంకరించుకోవడానికి వాస్తు శాస్త్రం కొన్ని మార్గదర్శకాలను అందిస్తుంది. ఇంటిని అలంకరించడానికి ఇంట్లో వివిధ ప్రదేశాలను అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి ఇంట్లో మనకు సానుకూలమైన దిక్కులు(ప్రదేశాలు), ప్రతికూల దిక్కులూ(ప్రదేశాలు) ఉంటాయి.

అయితే, ప్రతికూల ప్రదేశాలతో పోలిస్తే సానుకూల ప్రదేశాలను తేలికగా ఉంచాలని వాస్తు స్పష్టం చేస్తోంది. భారీ ఫర్నిచర్‌, ఇతర వస్తువులు ప్రతికూల ప్రదేశాల్లో అమర్చాలి. తేలికైన ఫర్నిచర్‌ను సానుకూలమైన ప్రదేశాల్లో అమర్చాలి. ఉత్తరం, తూర్పు, ఈశాన్యం సానుకూల ప్రదేశాలు లేదా తేలికైన దిక్కులు అయితే, మిగితావి ప్రతికూల ప్రదేశాలు.

సాధారణంగా ప్రతికూల జోన్లు ఇంటికి దక్షిణంలో, పశ్చిమంలో, నైరుతిలో ఉంటాయి. కనుక ఇంట్లో సామాన్లు ఏవి ఎక్కడ సర్దుకుంటే మంచిదో వాస్తు కొన్ని విషయాలు చెబుతోంది.

డ్రాయింగ్‌ రూమ్ లో సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర లేక దక్షిణ దిక్కులో వేసుకోవాలి. ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి.

బెడ్‌రూంలో మంచాన్ని నైరుతి మూలను వదిలేసి నైరుతి దిక్కులో వేసుకోవాలి. విలువైన నగలు, డబ్బులు పెట్టే బీరువాలను నైరుతి దిక్కుని వదిలి నైరుతిలోనే పెట్టుకోవాలి. దాని తలుపులు ఉత్తరముఖంగా ఉండేలా పెట్టుకోవాలి. వంటింట్లో కానీ, డైనింగ్‌ హాల్లో కానీ డైనింగ్‌ టేబుల్‌ వేసుకునేటప్పుడు దానిని గదికి వాయువ్య దిక్కులో ఉండేట్టుగా చూసుకోవాలి.

అద్దం బిగించడానికి..
ఇంట్లో అయినా ఆఫీస్ అయినా సరే వాస్తు ప్రకారం అద్దం ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. మీ ఇంటిలో సానుకూల శక్తి పొందడం అనేది మీరు మీ ఇంట్లో మీ అద్దాలను ఉంచే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తుప్రకారం అన్ని అద్దాలు వాటి ప్రదేశంలో వాస్తు ప్రకారం పెట్టాలని లేదు. అద్దాలు కొన్ని ప్రదేశాలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో కొన్ని వ్యతిరేక శక్తిలు కలిగిస్తే, మరికొన్ని ప్రదేశాల్లో ఉంచడం వల్ల సానుకూల శక్తిని అందిస్తాయి. మీ ఇంట్లో వాస్తు ప్రకారం అద్దాలను అమర్చాలనుకొన్నప్పుడు మీకోసం కొన్ని ప్రాధమిక చిట్కాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

పడకగదిలో మీకు ప్రతిబింబించేలా అద్దం పెట్టకూడదు. అలా పెడితే అనారోగ్యం చెందడం లేదా ప్రతి కూలశక్తులు పొందవచ్చు. మీ ఇంట్లో ప్రతికూల శక్తి కలిగే ప్రదేశానికి అభిముఖంగా అద్దం ఉంచడానికి ప్రయత్నించండి. అటువంటప్పుడు ఇంట్లో ఉండే అన్ని ప్రతికూల శక్తులు తొలగించబడుతుంది. ఆఫీసులు అద్దాలు అమరికకు వాస్తు చిట్కాలు మీ ప్రొఫెషనల్ వాతావరణంలో కూడా అన్ని సానుకూల శక్తిని పొందాలనుకుంటారు. ఈ పాజిటివ్ శక్తులు అలాగే నిలిచి ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అద్దాలు కేవలం పాజిటివ్ శక్తులను మాత్రమే ప్రతిబింబిస్తాయి.

ఇక అద్దంను మీ ఆఫీసులో లాకర్ కు ఎదురుగా అమర్చాలి. అప్పుడు అన్ని శక్తులు సానుకూలా శక్తులు సమృద్ధిగా పొంది మరింత ముందుకు ఎదగడానికి అవకాశం ఉంది. మీరు ఇరుకైన ద్వారాలకు ఎదురుగా అద్దాలు అమర్చడం నివారించండి. మీ ఆఫీసుల మీ క్యూబికల్ విండోకు అపోజిట్ గా అద్దాలను అమర్చుకోవచ్చు . దాంతో మీకార్యాలయంలో సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీరు అద్దలు అమర్చాలంటే మంచి ప్రదేశం ప్రతిబింబించే ప్రదేశంను ఎంపిక చేసుకోవాలని నిర్ధారించుకోండి.

మీరు , మీ బాత్రూంలో అద్దాలు అమర్చుకోవాలనుకుంటే, వాటిని ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో గోడ విశాలంగా ఉంటే అక్కడ ఇంటికి కనెక్ట్ అయ్యేలా అద్దంను అమర్చవచ్చు. రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంచకండి . ఇది వాస్తు చిట్కాలకు పూర్తి వ్యతిరేకంగా. అలా ఉంచినట్లైతే మీరు విశ్రాంతిలేకుండా ఉండటానికి కారణం అవుతుంది. బాత్రూమ్ లో కాకుండా, అద్దాలను ఉత్తర లేదా తూర్పు దిశలో అద్దాలాను ఎప్పటికి ఉంచకండి అది, మీ పాజిటివ్ శక్తిని మొత్తం తీసుకెళ్ళిపోతుంది. మీ ప్రతిబింబాన్ని కనబడకుండా ఉండే ప్రదేశాల్లో అద్దాలను అమర్చకూడదని గుర్తుంచుకోండి. అలాగే ప్రధాన ద్వారంకు ఎదురుగా ఉంచకూడదు. ఇవి చిట్కాలు అద్దాలను వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదనడానికి ప్రధాన చిట్కాలు.

ఇక ఇంట్లో ఫర్నిచర్‌ సర్దుకునేప్పుడు భారీగా ఉండే దానిని ప్రతికూల ప్రాంతంలోనూ, తేలికపాటివి సానుకూల ప్రాంతాల్లోనూ సర్దుకోవడం మంచిది. సాధారణంగా ప్రతికూల జోన్లు ఇంటికి దక్షిణంలో, పశ్చిమంలో, నైరుతిలో ఉంటాయి. గదిలో దక్షిణాన కానీ పశ్చిమ భాగాన కానీ సోఫాను ఉంచాలి. సోఫాలో కూర్చునే వారు ఉత్తరం లేక తూర్పు దిక్కుగా కూర్చోవాలి. నైరుతి మూల ఖాళీగా వుంచి నైరుతి దిక్కుగా బెడ్‌ను ఉంచాలి. ఖరీదైన వస్తువులు నగలు ఉన్న బీరువాను నైరుతి మూలన కొంచెం ఖాళీగా వదిలేసి అక్కడే ఉత్తర ముఖంగా అమర్చాలి. వంటగది, లివింగ్‌రూం లేక డైనింగు రూంలో వాయవ్య దిశలో డైనింగు టేబులు అమర్చాలి. గదిలో ఉత్తరానగానీ తూర్పున గానీ చదువుకునే బల్లను అమర్చాలి. ఉత్తరం లేక తూర్పు లేక ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచితే మంచిది.

ఇక సూర్యోదయం, జలపాతం వంటి ప్రతిమలు ఇంట్లో వాడితే మంచిదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. యుద్ధం, హింసను ప్రతిబింబించే చిత్రాలను ఉపయోగించకూడదు. పడకగదిలో దేవతామూర్తులను ఉంచకూడదు. వినాయకుడి బొమ్మలను అలంకార సామగ్రిగా వాడడం బాగా ప్రజాదరణ పొందింది. దేవతా విగ్రహాలను పూజ గదిలో ఉంచండి. గదిలో ఇంట్లో ఈశాన్య దిశలో భారీ విగ్రహం ఉంచరాదు.

బెడ్‌రూంలో తేలిక రంగు కర్టెన్లు అమర్చుకోండి. పడకగదిలో ఎరుపు నల్ల రంగు కర్టన్లు వాడవద్దు. లివింగ్‌ రూంలో ముదురురంగు కర్టెన్లు వాడవచ్చు. ఇక గృహాలంకరణలో ఇండోర్‌ మొక్కలు ఎంతో ప్రజాదరణ పొందాయి. బ్రహ్మజెమడు, ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంచవద్దు. ఇంట్లో ఈశాన్యంలో పెద్ద మొక్కలు ఉంచవద్దు. వాస్తు ప్రకారం లేత రంగు పెయింట్‌ మంచిది. లేత నీలం, ఆకుపచ్చ, గులాబీ, గోధుమ రంగులు గదులకు వేయండి. ఎరుపు, నల్ల రంగులు ఇంట్లో వాడవద్దు. నేలకు మొజెయిక్‌, సెరామిక్‌ టైల్స్‌, పాలరాయి మంచిది. గదుల్లో తెల్ల పాలరాయి వాడవద్దు. దీన్ని పూజ గదులకు మందిరాలకు శుభ ప్రదమైందిగా భావిస్తారు. నివాస గృహాలకు కప్పు చదునుగా ఉండడం మంచిది. గది కప్పు ఎత్తున ఉండకూడదు. దీపాలు కాంతివంతంగా ఉండాలి. ఇళ్లు మసక చీకటిగా ఉండటం మంచిది కాదు.