Menu

Monthly Archives: September 2015

Vivaaha Lagna

Vivaaha Lagna

వివాహ లగ్నము – వైవాహిక జీవితం

వివాహము జరిపించే ప్రక్రియలో వరుడు లేదా వధువు ఇరువురి జన్మ కుండలి లెక్కింపు చేయుట ఒక పద్దతి ఉంది. వీటిలో కుజ దోశం, జన్మ రాశి, నక్షత్రం  ఆధారంగా 36 గుణముల లెక్కింపు చేసెదరు. 18 కన్నా అధిక గుణములు కలిస్తే గనక ఇరువురి కుండలి వివాహమునకు ఉపయుక్తముగా చెప్పబడుతుంది.
కుండలి లెక్కింపు చేయడంలో సంపూర్ణ ద్యానము నక్షత్రముపైనే కేంద్రీకరించి ఉండును. జన్మ నక్షత్రం యొక్క పూర్ణ రూపములో అవహేలనగా వుండును, వర్ణము, యోని, నాడి ఇత్యాది ఆదారము నక్షత్రములుగా వుండును. వీటన్నింటిలోను ఒక ముఖ్య విషయం.. వైశ్య జాతి వారి కుండలి ఇది ఒక దోషం.. అలాగే బ్రహ్మణ జాతి వారి కుండలిలో ఇది రెండవ దోషం నాడి గా ఉండును.
నిజానికి మానవులపై అన్నింటి కన్నా అధిక ప్రభావము నవగ్రహముల వల్ల కలుగును. ఈ పరిస్థితిలో కుజుని ఉదాహరణ.. కుండలి యొక్క 1, 4, 7, 8, 12 భావములలో కుజుడు ఉంటే గనక వారు కుజ దోష యుక్తులు కాగలరు. కుజునికి సాహసం, శక్తి, బలం, ఆస్థి పాస్తులు, తమ్ముడు ఇత్యాదులకు కారకముగా చెప్పబడుతున్నది. పైన చెప్పిన 5 భావములలో మూడు కేంద్ర స్థానములుగా చెప్పబడుతున్నాయి. ఇంకా ఫలిత జ్యోతిష్య ఆధారముగా సౌమ్య / శుభ గ్రహము (చంద్ర, బుధ, గురు, శుక్ర) కేంద్ర స్థానములో ఉండిన దోషకారకులుగా ఉండును. కాని క్రూర గ్రహము (సూర్య, కుజ, శని మరియు రాహువు) కేంద్ర స్థానములో ఉంటే శుభ ఫలదాయిగా ఉంటుంది. ఈ విధముగా రెండు విరోదాత్మక విషయములు ఎదురవుతుండును. కుజ గ్రహము బలహీనముగా ఉంటే గనక కుండలి లెక్కింపు ఉత్తమముగా ఉండును. శని సప్తమ బావములో దృష్టి వలన వివాహం ఆలస్యముగా జరుగుట లేదా రెండు వివాహములు జరుగు యోగమును కలిగించును.
కుండలిలో స్థితిలో ఉన్న గ్రహములు వైవాహిక జీవితమును సుఖమయంగాను, లేదా కలహపూర్ణముగాను చేయగలదు. కాని ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నమును సరైన రీతిలో విచారణ చేస్తే గనక వివాహం తర్వాత దాంపత్య జీవితంలో కలిగే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు వైవాహిక జీవితం సుఖమయమవుతుంది. వివాహ సంస్కారములను వ్యక్తి రెండవ జీవితంగా లెక్కిస్తారు. దీని ప్రకారము వివాహ సమయములో శుభ లగ్నము, మహాత్యము కలిగి ఉండును.
 జన్మ కుండలిలో లగ్న స్థానములో శుభ గ్రహములు స్థితిలో వుండును. వివాహము కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు, వరుని కుండలిని పరీక్షణ చేసి వివాహ లగ్నమును నిశ్చయించవలెను. యది కుండలి లేకపోతే గనక  వరుడు మరియు కన్య యొక్క  పేరులో వున్న రాశికి అనుగుణంగా లగ్నమును విచారించవలెను.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జన్మ లగ్నము, రాశి నుంచి అష్టమ లగ్నము.. అశుభ ఫలదాయకముగా ఉండును. అనగా ఈ లగ్నములో వివాహము గురించి ఆలోచించరాదు.
జన్మ లగ్నము మరియు జన్మ రాశి నుంచి 4వ, 12వ రాశి గుణములను లెక్కించుటలో శ్రేష్టముగా ఉంటే గనక ఈ లగ్నములో వివాహము సంభవము. అన్యతా జన్మ లగ్నము నుంచి చతుర్ధ,  ద్వాదశ రాశితో లగ్నములో వివాహము దోషపూరితముగా ఉండును. ఎవరి కుండలిలో లగ్నము నుంచి కేంద్ర స్థానములో శుభ గ్రహములు ఉండునో వారికి వివాహ లగ్న దోషము కలుగదు. కుజ లగ్నం నుంచి  బుధుడు, గురువు, శుక్రుడు యది కేంద్రంలో లేదా త్రికోణంలో ఉన్న ఎడల వివాహ  లగ్నములో అనేక విధములైన దోషములు.. దగ్ధతిధి, గుడ్డి, చెవుడు వంటివి కలుగును. వివాహా లగ్నము లెక్కించు సమయములో రాహువు శనికి సరిసమమైన ప్రబావకారిగా వుండును మరియు కుజుడు కేతువుకు సమానంగా ఉండునని చెప్పదగ్గది.

jyothisham And Uses

jyothisham And Uses

జ్యోతిష్యం – ప్రయోజనాలు

మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య గొప్పది. జన్మించిన తేది, సమయం, ప్రదేశం.. ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం, అతడి భవిష్యత్ సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు చూపించే విద్య జ్యోతిష్యం.

జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మానవుడు అనుభవించే మంచి, చెడు రెండూ గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.

అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ 3 రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించగలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.

జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు. దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తుంటారు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశం ఆధారంగా జాతకచక్రం గణించబడుతుంది. ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి, ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది. దీని గణనలో కాని, జన్మించిన సమయములో కాని తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా, ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవలనుకుంటే జాతక చక్రం అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహా సముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది.

జ్యోతిష శాస్త్రం ప్రధానంగా 3 విభాగాలలో విస్తరించింది. సిద్ధాంత, సంహిత, హోరా విభాగాలు. సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు. దీనిలో గ్రహ గణితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉంటాయి. గ్రహాల మధ్యమ స్థితి, స్పష్ట స్థితి, సంవత్సర-ఆయన-మాసాది కాలనిర్ణయం, గ్రహణాదులు మొదలైన గణితాధార విషయాలను వివరిస్తుంది. దీనిలో మూడు విభాగాలుంటాయి. 1. కల్పారంభం నుంచి గ్రహగణితం కలిగిన దానిని సిద్ధాంతమని, 2. ఒక మహాయుగం నుంచి గ్రహగణితం కలిగిన దానిని తంత్రమని, 3. ఒక శక సంవత్సరం నుంచి గ్రహ గణితం కల దానిని కరణమని అంటారు.

సంహిత విభాగములో ఖగోళములో గ్రహభ్రమణాలు, తోకచుక్కలు, ఉల్కాపాతాలు, గ్రహణాలు మొదలైన వాటివలన ప్రపంచానికి జరిగే శుభాశుభాలకు సంబంధించిన విషయాలు, ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి. హోరా విభాగం మనిషి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకొని అతని జీవితంలో జరిగే శుభాశుభాలను వివరిస్తుంది. దీనికే జాతక స్కంధం అని పేరు. దీని ద్వారా మానవుడుజన్మించిన సమయం, ప్రదేశం ఆధారంగా అతని జాతకచ క్రాన్ని లిఖించి అయా గ్రహ, భావ, యోగాల అధారముగా అతని జీవితములో జరిగే శుభాశుభ ఫలాల్ని లెక్కించడం జరుగుతుంది.

సామాన్యులు కూడా తమ రాశి నక్షత్రాలను మరిచిపోకుండా ఉండే విధంగా ఆయా నక్షత్ర పాదాలు ఏయే అక్షరాలను ప్రభావితం చేస్తాయో వాటికి అనుగుణంగా ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నక్షత్రములో ఆ పాదములో జన్మించిన వ్యక్తులు ఆ నక్షత్రపాదానికి సూచించబడిన అక్షరముతో ఆరంభమయ్యే పేరును తమ జన్మ నామముగా పెట్టుకునే విధానాన్ని మన ప్రాచీనులు ఏర్పాటు చేశారు. జన్మనామాక్షరాలకు సంబంధించి పూర్తివివరాలను లఘు బ్రహ్మయామిళ గ్రంథములో పొందవచ్చు.

మీ జన్మనక్షత్రముద్వారా మీ జన్మ నామాన్ని తెలుసుకునే విధంగా నక్షత్రాలు వాటికి సూచించబడిన అక్షరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
అశ్విని – చు, చే, చో, లా
భరణి – లీ, లూ, లే, లో
కృత్తిక – ఆ, ఈ, ఊ, ఏ
రోహిణి – ఓ, వా, వీ, వు
మృగశిర – వే, వో, కా, కీ
ఆరుద్ర – కూ, ఘ, జ్ఞ, ఛ
పునర్వసు – కే, కో, హా, హీ
పుష్యమి – హూ, హే, హో, డ
ఆశ్రేషా – డీ, డూ, డే, డో
మఖ – మా, మీ, మూ, మే
పుబ్బ – మో, టా, టీ, టూ
ఉత్తర – టే, టో, పా, పీ
హస్త – పూ, షం , ణా, ఠా
చిత్త – పే, పో, రా, రీ
స్వాతి – రూ, రే, రో, తా
విశాఖ – తీ, తూ, తే, తో,
అనురాధ – నా, నీ, నూ, నే
జ్యేష్ఠ – నో, యా, యీ, యూ
మూల – యే, యో, బా, బీ
పూర్వాషాఢ – బూ, ధా, ఫా, ఢ
ఉత్తరాషాఢ – బే, బో, జా, జీ
శ్రవణం – జూ, జే, జో, ఖ
ధనిష్టా – గా, గీ, గూ, గే
శతభిషం – గో, సా, సీ, సూ
పూర్వాభాద్ర – సే, సో, దా, దీ
ఉత్తరాభాద్ర – దూ, శ్యం , ఝ, థ
రేవతి – దే, దో, చా, చీ

ఉదాహరణకు మీరు స్వాతి నక్షత్రం లో జన్మించారనుకోండి చిత్తా నక్షత్రానికి ఇవ్వబడిన అక్షరాలు రూ, రే, రో, తా మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం పే అక్షరముతో ప్రారంభమవుతుంది. అంటే.. రూప, రూపేశ్, ఈ విధంగా ఆయా నక్షత్ర పాదాలలో జన్మించిన వారికి ఆయా జన్మనామాలు ఏర్పడతాయి. పేరు మొదట్లో ద్వంద్వాక్షరం వచ్చినట్లయితే మొదటి అక్షరమును విడిచి రెండవదానినే జన్మనామాక్షరముగా గ్రహించవలెను.

యోగాలు – ఫలితాలు

Yoga - Phala

జ్యోతిష్యశాస్త్రంలో అనేక యోగాలు సూచింపబడ్డాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని యోగాలు గురించి తెలుసుకుందాం.

రవి సంబంధిత యోగాలు

జ్యోతిష్యంలో రవి(సూర్యుడు)కి సంబంధించిన యోగాలు పరిశీలిద్దాం.

1. బుధాదిత్య యోగము
రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగము అంటారు. జాతక చక్రంలో రవి, బుధులు మేషం, మిథునం, సింహం, కన్యారాశుల్లో కలిసి ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ రాశుల్లో ఒకటి లగ్నమై అక్కడ రవి, బుధులు కలిసి ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మిగిలిన చోట ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా బుధాదిత్యయోగం కాదు.
ఫలితాలు: విచక్షణతో కూడిన కార్యాలు, వెనకడుగు వేయని పట్టుదల, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం.

2. శుభవేశి యోగము
రవికి రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగము అంటారు.
ఫలితం: సుఖమైన ప్రశాంత జీవితము, కీర్తి, మర్యాద, అదృష్టము వరించుట.

3. శుభవాశి యోగము
రవికి పన్నెండవ స్థానంలో శుభగ్రహాలు శుభవాశి యోగము అంటారు.
ఫలితాలు: కీర్తి ప్రతిష్టలు, సంపద, పలుకుబడి, పట్టుదల, స్వయంకృషితో అభివృద్ధి.

4. ఉభయరాశి యోగము
2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగము అంటారు.
ఫలితాలు: సంతోషం, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి, పట్టుదల ప్రయత్నంతో ముందుకు రావడం.

చంద్రుడు సంబంధిత యోగాలు
5. చంద్ర మంగళ యోగము
చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉన్నా నేక చంద్రునికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాలలోఉంటే చంద్రమంగళ యోగం అంటారు. జాతక చక్రంలో చంద్రునికి కేంద్రమందు కుజుడు ఉన్నా, లేక ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా ఈ యోగం కలుగుతుంది.
ఫలితాలు:  భాగ్యవంతులవుతారు, రసాయన, ఔషధ వ్యాపార రంగంలో అనుకూలత ఉంటుంది. మనో చంచలం రావడానికి అవకాశం.

6. వసుమతి లేక లక్ష్మి యోగము
చంద్రునికి ఉపజయ స్థానాలయిన 3, 6, 10, 11 స్థానాలలో బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే వసుమతి లేక లక్ష్మి యోగము అంటారు.
ఫలితాలు: అకస్మాత్తుగా ధనాగమనం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ యోగ జాతకులకు ధనం కొరత ఉండదని శాస్త్రం చెబుతోంది.

7. గజ కేసరి యోగము
గురు, చంద్రులు కర్కాటక రాశియందు ఉన్నప్పుడు ఈ యోగము కలుగుతుంది. చంద్రునికి కేంద్రంలో గురువు ఉంటే గజ కేసరి యోగము అంటారు.
ఫలితాలు: చంద్రునికి కేంద్ర స్థానంలో గురుడు ఉన్నా, లేక ఇతర స్థానాల్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా మిక్కిలి భోగభాగ్యాలు అనుభవిస్తారు. కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధనాగమనం, సంపద, దీర్ఘాయువు.

8. అనపా యోగము
చంద్రునికి పన్నెండు స్థానాలలో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.
ఫలితము: ఆరోగ్యమైన శరీరం.

9: శునభా యోగము
చంద్రునికి రెండులో రాహువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.
ఫలితాలు: స్వప్రయత్నంతో సంపాదన.

10. మేఘదృవా యోగము
చంద్రునికి 2, 12 స్థానాలలో ఏగ్రహాలు లేకుంటే అనపా యోగం అంటారు.
ఈ యోగము పీడ, కీడు కలిగిస్తుంది. అయినా కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలలో ఏదైనా గ్రహం ఉంటే నివృత్తి ఉంటుంది.

12 అది యోగము
చంద్రుడికి 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే అది యోగం అంటారు.
ఫలితాలు: విలాసవంతమైన జీవితం.

13. శకట యోగము
చంద్రునికి , 6,8, 12వ స్థానంలో గురువు ఉంటే శకట యోగము అంటారు.రాశి చక్రములోని గ్రహములన్ని లగ్నము మరియు సప్తమ స్థానమల మాత్రమే ఉన్న శకట యోగము అంటారు.
గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానములలో ఉన్న శకట యోగము సంభవిస్తుంది.

ఫలితాలు: జీవితంలో నిలకడ లేమి, అవమానము, ఆర్థిక బాధలు, శారీరక కష్టం, మానసిక బాధలు కలిగించును. ధనవంతుల గృహంలో జన్మించినా ఈ యోగప్రభావమున పేదరికమే అనుభవించవలసి ఉంటుంది. అర్హతకు తగిన గౌరవ, మర్యాదలు ఉండవు. అయితే ఇతర బాధలు ఉండవు. ఈ యోగముకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్నా గౌరవ మర్యాదలాకు భంగము వాటిల్లదు.

Shakunaalu – Phalithaalu

శకునాలు - వాటి ఫలితాలు

శకునాలు – వాటి ఫలితాలు

మానవ ఆచారవ్యవహారాల విషయంలో, శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అయితే శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు. శుభ శకునాలు, అశుభ శకునాలు. ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకొని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని పూర్వ కాలం నుంచి ఆధునిక కాలం వరకు నమ్మకం ఉంది.

మంచి శకునం ఎదురు రావడం వలన, తలపెట్టినకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంద పురాతన కాలం నుంచి ఉన్న విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతోంది. శకునం విషయంలో చాలామంది తమ పెద్దల మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాల నిమిత్తమైనా.. శుభకార్యాల నిమిత్తమైనా బయలుదేరుతూ వున్నప్పుడు మంచి శకునం చూసుకుంటూ ఉండాల్సిందే. మంగళప్రదమైన ధ్వనులు … శుభప్రదమైన వస్తువులు ఎదురైనప్పుడు మంచి శకునాలుగా భావించి అడుగుబయటికి పెట్టాలి.

అలాగే కొన్ని శకునాలు కార్యహానిని కలిగించేవిగా చెప్పబడుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడుతూ వుండగా ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా, ఏదో ఒక కారణంగా ఎవరైనా ఏడుస్తూ ఎదురుగా పరిగెత్తుకు వచ్చినా అది కార్య హానిని కలిగించే శకునంగా చెప్పబడుతోంది. అందుకే అలాంటి శకునం ఎదురైనప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెప్పబడుతోంది.

శుభ శకునాలు
పెళ్ళి ఊరేగింపు, మంగళవాయిద్యములు, ఇద్దరు బ్రాహ్మణులు, దండధరుడగు శూద్రుడు, కన్య, ముతైదువు, పండ్లు, పువ్వులు, ఛత్రచామరములు, ఏనుగు, గుఱ్ఱము, పూర్ణకుంభము, చెఱుకు, పాలు, అన్నము, పెరుగు, ఆవు, బియ్యము, కల్లుకుండ, మాంసము, పొగలేని నిప్పు, తేనె, చలువ వస్త్రాలు, అక్షతలు, వీణ, మృదంగం, శంఖం, నల్లకోతి, భ్రమరము, తెల్లని వస్తువులు, కుక్క చెవి విదల్చుట, వధూవరులు, ఘంటానాదం, జయశబ్దము, మంగళ వస్తువులు, ఎదురుగా మృదువైన శీతల వాయువులు వీచుట లేదా వెనుక నుంచి ప్రయాణానికి అనువైన గాలులు వీచుట, తెల్లని వృషభము, అద్దం మొదలైనవి ఎదురుపడిన శుభప్రదం.

పశుపక్ష్యాదుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గ్రద్ద, ఆవు, జింక, ఉడుత, చిరుత వంటివి ఎడమ నుంచి కుడి వైపుగా వెళ్ళాయంటే వీటన్నిటిని శుభ శకునాలుగా గుర్తించవచ్చు.

అశుభ శకునాలు
ఏడుపు వినుట, అకాల వర్షము, ముక్కు చీదుట, బల్లిపడుట, వితంతువులు, జుట్టు విరబోసుకున్నవారు, జుట్టులేనివారు, ఒకే తుమ్ము, ఊక, కలహము, చెడుమాట, ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయబట్టలు కట్టినవారు, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, ముష్టివాడు, కుంటికుక్క, ముక్కులేనివాడు, గుడ్డివాడు, రోగి, కుంటివాడు, రజస్వల, గర్భిణీస్ర్తీ, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, ఆమేధ్యం, నువ్వులు, మినుములు, గొఱ్ఱెలు, నపుంసకులు, పిల్లి, పంది, దూది, మజ్జిగ, బూడిద, కురూపి, చెడు జంతువులు, ఆయుధమును ధరించినవాడు, విరోధి,  వెళ్ళవద్దని కోరుట, భోజనము చేయమని అడుగుట, సిద్ధవస్తువులు, జారుట, దెబ్బతగులుట, తొట్రుపడుట, మనసు కీడు శంకించుట, ఆరోగ్యము లేకుండుట, గుడ్లగూబ అరచుట.. వంటి పరిణామాలు ఎదురుపడినా ఇవన్నీ అశుభాలే.

అశుభ శకునాలు ఎదురైన వెంటనే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని 12 పర్యాయాలు నీళ్ళు పుకిలించి ఊయవలెను. తలపై నీరు చల్లుకొని.. కళ్ళు నీళ్ళతో తుడుచుకొని కూర్చుని కాసిన్ని నీళ్లు తాగి ఇష్టదైవంను ప్రార్థించి, తర్వాత మరొక శుభ శకునమును చూసుకొని ప్రయాణం చేయవలెను. ప్రయాణాలకు బయలుదేరునప్పుడు ‘ఎక్కడికి?’ అని గానీ, ‘ఎప్పుడు వస్తావు?’ అని గానీ, ‘నేనూ రానా?’ అని గానీ ఎవరూ అడుగరాదు. ప్రయాణమై వెళ్ళిన వెంటనే ఇల్లు కడుగుట, ఇల్లాలు తలస్నానం చేయుట దరిద్రానికి కారణాలు. అందుకే ఇలాంటి విషయాల్లో తగిన రీతిలో ఉండటమే మంచిది.

remedies for graha dosha

remedies for graha dosha

జాతక దోషాలు నివారణ ఎలా?

విశ్వంలోని ప్రతి జీవి తన గమ్యాన్ని తానే సాధించుకుంటుంది. కర్మ కొద్దీ కష్టాలు ప్రాప్తిస్తాయని తాను అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం మాత్రమే జీవితానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, దానిని ఏ విధంగా ఎదుర్కోవాలనే మానసిక సంసిద్ధతను జీవికి కల్గిస్తుంది. ఇటువంటి జ్ఞానం వ్యక్తి జీవితాన్ని గాని, తోటి వారిని గాని, దైవాన్ని గాని నిందించకుండా చేస్తుంది. వ్యక్తుల జీవితాలలో ఏ తప్పులు జరగనప్పటికీ, వారు ఎందుకు బాధలు పడతారో.. ఓ భగవత్ సంబంధమైన కర్మ సిద్ధాంతం మాత్రమే వివరిస్తుంది.

జాతకంలోని 12 భావాలలో ఎక్కడ లోపాలు లేవని, కొందరు పండితులు చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ప్రత్యేక గ్రహస్థితులు అనేక రకాలుగా ప్రతి వారి జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి.

పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలిత ప్రభావం ఉన్ననూ, అది జాతకులలో  అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితిగా ఉంటే మంచిదే. కాని ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితం. అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇలాంటి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితం.

పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. అయితే ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. వ్యక్తులు చేసే కార్యాకార్యాల ప్రభావం.. వారు మరణించిన తదుపరి సంతతికి ఫలితాలను చూపుతూనే ఉంటాయి. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తికి నలుగురు సంతానం ఉన్నారనుకుందాం, ఆ వ్యక్తి చనిపోయే లోపు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలను ఇవ్వకుండా మంచి భావంతో దాన ధర్మాలు చేసి కాలం చేశాడు. మరి ఈ దాన ధర్మాలు చేసిన వ్యక్తి చనిపోయిన తదుపరి… వారి సంతతిపై వారికున్న నలుగురు సంతానంపై అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని అనుకోవాలి. కాని ఈ నలుగురు సంతానంలో తమ చనిపోయిన తండ్రి చేసిన విశేష కార్యాల ప్రభావ ఫలితాలు.. తాను తన జాతకరీత్యా పొందే అవకాశము గల గ్రహస్థితి ఉన్నప్పుడే.. ఆ సంతతికి పూర్ణ ఫలాలు లభిస్తాయి.

అలా కాకుండా ఒక వ్యక్తి అందరినీ హింస పెడుతూ, దాన ధర్మాలు చేయకుండా, నేరాలు కుట్రలు కుతంత్రాలు, హత్యా రాజకీయాలు మొదలైనవాటిని ప్రేరేపిస్తూ కాలం చేశాడని అనుకుందాం. ఈ వ్యక్తికి కూడా నలుగురు సంతానం ఉన్నారనుకుందాం. మరి ఇప్పుడు ఈ దుర్మార్గపు లక్షణాలు గల వ్యక్తి చనిపోయిన తదుపరి.. వాటి ప్రభావ ఫలితాలు నలుగురు సంతతిపై ఉంటుందా ? ఒక్కోసారి ఈ నలుగురు సంతతిపై వాటి ఫలితాలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు లేక కొంతమందికే ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి కలిగిన సంతానం జన్మ జాతకాల ప్రకారం.. తమ చనిపోయిన తండ్రి చేసిన దుర్మార్గపు కార్యాల ప్రభావ ఫలితాలు సంతతికి ప్రాప్తించే గ్రహ స్థితి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.

ప్రారబ్ధం ప్రకారం ప్రతీది జరిగి తీరవలసినదే. అందుచేత జన్మ జాతకాలలో దృష్టముగాఉన్న (కనిపించే) గ్రహస్థితులు కాకుండా అదృష్టంగా (కనపడకుండా అంతర్లీనంగా ఉండే) గ్రహస్థితుల వలన ఫలితాలు జాతకులకు ఒక్కోసారి అనూహ్యంగా విజయావకాశాలు ఇస్తుంటాయి లేదా సమస్యాత్మకంగా ఉంటుంటాయి.

ప్రారబ్దమనేది 2 రకాలుగా ఉంటుంటుంది. ఒకటి దృష్ట ప్రారబ్ధం, రెండు అదృష్ట ప్రారబ్ధం. దృష్ట అంటే కనపడునది అని అర్ధము. దృష్ట ప్రారబ్దం వలన ఫలితాలు మంచిగాను, చెడుగాను వస్తుంటాయి. వాటిని జాతక పరంగా, గ్రహ సంచార స్థితుల రీత్యా తెలుసుకోవచ్చు.  అదృష్ట అంటే కనపడనిది అని అర్థము. ఇక్కడ అదృష్ట ప్రారబ్దం అంటే ఏదో విజయం వరించిందనే అర్థం కాదు. ఒక వ్యక్తి మంచి ఫలితాలను అనుభవిస్తుంటాడు. చెడు ఫలితాలను అనుభవిస్తుంటాడు. ఇట్టి ఫలితాలను వారి వారి జాతక చక్రాల ద్వారా ప్రత్యక్షంగా గమనించలేము. చాలా బాగా లోతుగా పరిశీలిస్తేనే గోచరమవుతుంది. వీటినే అంతర్లీన జాతక దోషాలలో గమనించవచ్చు.

దృష్ట ప్రారబ్దం అంటే జాతక చక్రాలలో పైకి కనపడే గ్రహ సంచార స్థితులను బట్టి అంశాలు ఇలా ఇలా ఉంటాయని… దీనితో పాటు పితరులు చేసిన కార్యాకార్యాలను బట్టి కూడా గ్రహస్థితులు ఉంటాయి గనుక, వాటి ఫలితాలు అలా జరగబోతున్నాయని… దానికి తగిన జాగ్రత్తలు ఫలాని విధంగా తీసుకుంటూ ఉండాలని, ఫలాని శాంతి క్రియలు జరుపుకోవాలని… చెప్తుంటారు.

అదృష్ట ప్రారబ్దం అంటే విజయం కాదు. గత జన్మలో చేసిన మంచి చెడు అంశాలను బట్టి, పితరులు చేసిన కార్యాకార్యాలను బట్టి కూడా గ్రహస్థితులు ఉంటాయి. గనుక వాటి ఫలితాలు ఒక్కోసారి ఆశ్చర్యకరమైన రీతిలో వ్యక్తులు ఊహించకుండానే విజయాలను పొందుతూ ఉంటారు. అదే రీతిలో ఊహించకుండానే అపజయాలను పొందుతుంటారు.

జాతక దోషాలకు ధాన్యాలు
ప్రతి గ్రహానికీ వాటికి సంబంధించిన ధాన్యాలున్నాయి. ఎవరికైనా జాతక చక్రంలో దోషాలేవైనా ఉన్నా, గ్రహ దోషాలవల్ల అనారోగ్యంపాలయినా, ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చేయడం లేదా, ఆవుకు తినిపించడం వల్ల మరియు జప తర్పణ హోమదికాలు చేయుట వల్ల  దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుంది అని అనేక జ్యోతిష గ్రధములు వివరించినవి.

రవి          –         గోధుమలు
చంద్రుడు  –        బియ్యం
కుజుడు     –         కందులు
బుధుడు   –         పెసలు
గురువు     –         శనగలు
శుక్రుడు     –        బొబ్బర్లు
శని            –         నువ్వులు
రాహువు    –        మినుములు
కేతువు     –         ఉలవలు

Jaathaka Dosham

Jaathaka Dosham

జాతక దోషాలు ఎలా ఉంటాయి?

మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ.. వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు. జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

రాశిచక్రంలో కంటికి కనపడే దోషాలను దృష్ట దోషాలు అంటారు. కంటికి కనపడని దోషాలను అదృష్ట దోషాలు అంటారు. ఈ దోషాలు పితరుల నుంచి సంక్రమిస్తుంటాయి. ఈ పరంపరలో అదృష్ట దోషాలు మొదటి భాగాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

ఓ వ్యక్తి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా కనిపించకపోయినప్పటికీ.. తొలి వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు. అయితే, ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది..? ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు. ఆ దోషాన్ని ఇచ్చే గ్రహ స్థితులు, జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపి ఉంటుంది.

కొందరికి ఇంటి నిండా ధనం ఉన్నా.. తెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ, తనివితీరా భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంటుంది.

ఇంక కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ధన సంపద ఎంత ఉన్నప్పటికీ, సదరు కుటుంబంలో అధికులకు వివాహం కాకుండా వుండటం లేదా సంతానం కలగకుండా ఉండిపోవటం కనిపిస్తుంది. అంతేకాదు నయం చేయలేని వ్యాధులు కూడా వెంటాడుతాయి. అంగవైకల్యంతో బాధ పడటం గానీ, వంశ పారంపర్యంగా వస్తున్నదన్నట్లుగా కనుచూపు తగ్గిపోవటం, చిన్న వయసులోనే బట్టతల రావడం, మూగవారుగా ఉండిపోవటం గాని, కేసుల్లో చిక్కుకోవడం… ఇలా ఎన్నో అనర్ధాలు ఎదురవుతుంటాయి.

ఈ సమస్యలు ఏ దోషాల వలన వస్తాయన్నది చాలా స్పష్టంగా పరిశీలించాల్సి ఉంటుంది. అవి జాతకాలలో అంతర్లీనంగా ఉంటుంటాయి కనుక వాటి గురించి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష్య తాళపత్రాల గ్రంధాల్లో స్పష్టమవుతాయి. అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను తెలుసుకొని, వాటి పరిహారాలను క్రమబద్దంగా, శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే.. మనకు పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది.

ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే.. జీవితం సంతోషమయంగా ఉంటుంది. అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే, ఫలితాలు సజావుగా ఉండవు.

వ్యాధి ఒకటి ఉంటే దానికి సంబంధం లేని మాత్ర ఇంకొకటి వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. అలాగే జాతక దోషాలకు ఏదో ఒక రీతిలో పరిహారాలు చేయడం వల్ల కూడా ఎలాంటి శుభ ఫలితం ఉండదు. జాతక చక్రం ప్రకారం ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను విసర్జించడం తగదు. నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక, తేలికపాటి అంశంతోనే చాలా మంది తూతూ మంత్రంగా చేయి దులుపుకుంటున్నారు. ఈ కారణం వల్లే నిత్యంసమస్యలు, మానసిక వత్తిడులు, చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయి.

జాతక చక్రంలోని 12 భావాలలో కనపడని దోష స్థితులు వేరు వేరు రకాలుగా కనపడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ, దోష పరిహారం కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటుండాలి. మరికొన్ని దోషాలకు ఉపశమనంగా చేసే పరిహారాలు కొంతకాలం వరకే ఆచరించాల్సి ఉంటుంది. మరికొన్ని దోషాలకు అతి దీర్ఘ కాలం పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి.