జ్యోతిష్యము
Makaram—Capricorn
 
            
            మకరం – 2017 – 18
ఉత్తరాషాడ.  2,3,4 పాదములు.
శ్రవణం.1,2,3,4.పాదములు.
ధనిష్ట. 1,2 పాదములు.
ఆదాయము – 11, వ్యయం – 5. రాజపూజ్యము – 2, అవమానం – 6.
ఈ సంవత్సరం వీరికి గురుడు 9వ ఇంట సెప్టెంబర్ 12 వరకు సువర్ణమూర్తిగాను, తదుపరి 12 ఇంట రజితమూర్తి. శని 12వ ఇంట సంవత్సరమంతా లోహమూర్తి. రాహువు 8వ ఇంట, కేతువు 2వ ఇంట, ఆగస్టు 17 వరకు రజితమూర్తులు. తదుపరి 7వ ఇంట రాహువు, 1వ ఇంట కేతువు సువర్ణమూర్తులుగా ఉందురు. ఈ రాశి వారికి కొద్దిపాటి శుభములు, అశుభములు కూడా గోచరిస్తున్నవి. ధనపరమైన చిక్కులు తొలగును. 
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అశుభఫలితములు గోచరిస్తున్నవి. పై అధికారులచే ఆగ్రహములు, స్థాన చలనం పొందే అవకాశం కలదు. 
వ్యాపారస్తుల విషయం చూస్తే.. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు నష్టపోయినప్పటికీ, మరికొన్ని వ్యాపారాలు అనుకూలించును.
పాడి పరిశ్రమ, పౌల్డ్రీ, వైద్య వృత్తుల వారికి మిశ్రమ ఫలితములు ఉన్నవి. 
వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా కొంత నిరాశను కలిగిస్తాయి. 
ఇక విద్యార్థుల విషయమై చూడగా, వారికి మంచి ఫలితములే ఉన్నాయి. కష్టపడి చదివితే ప్రథమ శ్రేణి లభించే అవకాశం కలదు.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి మంచి సమయముగానే చెప్పవచ్చు.
రాజకీయ నాయకులకు కేంద్ర ప్రభుత్వ పదవులు పొందే అవకాశం కలదు. 
వీరు ఈ సంవత్సరము శని, యంత్రములు ధరించుట వల్ల మంచి ఫలములు పొందు అవకాశమున్నది.
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
        Kumbha—Aquarius
 
            
            కుంభం – 2017 – 18
ధనిష్ట . 3,4 పాదములు,
శతభిషం.1,2,3,4.పాదములు.
పూర్వాబాద్ర. 1,2,3 పాదములు.
ఆదాయము – 11, వ్యయం.5. రాజపూజ్యము – 5, అవమానం – 6.
ఈ సంవత్సరం వీరికి గురుడు 8వ ఇంట సెప్టెంబర్ 12 వరకు తామ్రమూర్తిగాను, తదుపరి 9వ ఇంట లోహమూర్తి. శని 11వ ఇంట సంవత్సరమంతా సువర్ణమూర్తి. 7వ ఇంట రాహువు, 1వ ఇంట కేతువు ఆగస్టు 17 వరకు లోహమూర్తులుగాను తదుపరి 6 ఇంట రాహువు, 12వ ఇంట కేతువు రజితమూర్తులు. 
ఈ సంవత్సరం ఈ రాశివారి గురించి చూడగా వీరికి ఆరోగ్య,గౌరవభంగాలు, పితృసంబంధిత ఆస్తి లాభము, శతృపరాజయం సూచిస్తున్నది. 
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూడగా మంచి ఫలితములే గోచరించుచున్నవి. పై అధికారుల సహాయంతో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. 
వ్యాపారస్తులకు చూడగా సెప్టెంబర్ వరకు అంతబాగుండకపోయినా, తదుపరి భాగం పాడిపరిశ్రమలు, వైద్యవృత్తులవారికి మంచి ఫలితములే ఉన్నాయి. 
ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా లాభించగలవు.
విద్యార్థులకు అనుకూల కాలముగానే చెప్పవచ్చును. 
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి సెప్టెంబర్ తదుపరి బాగుండగలదు. 
రాజకీయ నాయకులకు గౌరవ భంగములతో కూడిన మిశ్రమ ఫలితములు ఉండగలవు. 
ఈ సంవత్సరం వీరు శని, కేతువులకు శాంతి చేయించినా శుభ ఫలితములు ఉండగలవు.
వీరు ఈ సంవత్సరము శని,కేతు యంత్రములు ధరించుట వల్ల  మంచి ఫలములు పొందు అవకాశమున్నది.                  
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***
        



 
   
 







