Menu

Tula-Lagnam- Grahamulu

తుల లగ్నము –  గ్రహములు – ఫలితాలు

తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. ఈ లగ్నములో జన్మించిన వ్యక్తి అందముగా, ఆక‌ర్ష‌ణీయంగా వుండును. సూర్యుడు, ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు కారక గ్రహ ఫలితాన్ని ఇస్తాడు. గురువు అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు.

సూర్యుడు 
తుల లగ్నము కుండలిలో సూర్యుడు ఏకాదశ బావము యొక్క అధిప‌తిగా ఉండ‌టం వ‌ల్ల‌ అకారక గ్రహము కాగలడు. శత్రు రాశి లగ్నములో కూర్చొని వున్న సూర్యుడు వ్యక్తికి నేత్ర సంబంధ‌మైన స‌మ‌స్య‌లు సృష్టించును. ఆర్థిక వ‌న‌రుల‌లో లోపమును తీసుకువచ్చును. లగ్నములో సూర్యునితో పాప గ్రహముల యుతి లేదా దృష్టి కలిగి ఉండ‌టం వ‌ల్ల‌ వ్యక్తి ఉగ్ర, క్రోదస్వబావము కలవారై ఉంటారు. ప్రథ‌మ భావములో స్థితిలో ఉన్న సూర్యుడు వారి సప్తమ దృష్టి ద్వారా సప్తమ భావములో స్థితిలో వున్న మేష రాశిని చూస్తున్నాడు. సూర్యుని యొక్క దృష్టి కుజునిపై ఉండుట కారణంగా వ్యక్తి సాహసము, పరాక్రమము కలవాడై ఉండును. వీరి వివాహం విల్లంభములతో కూడినదై ఉండును.

చంద్రుడు  
చంద్రుడు తుల లగ్నము గల కుండలిలో లగ్నస్థుడుగా వుండుట వల్ల‌ వ్యక్తి బాల్య ద‌శ‌లో సంఘర్షణతో కూడి కాస్త కఠినంగా ఉండును. యువావస్త, వృద్దావస్త సుఖమయంగాను, ఆనందమయంగాను కొనసాగును. చంద్రుడు వీరిని గుణవంతునిగా చేయును. వీరి మనస్సు కల్పనాశీలత, అస్తిరత్వంతో కూడినదై ఉండును. కన్యా లగ్నము యొక్క కుండలిలో చంద్రుడు యది లగ్నస్థముగా వుండిన ఎడల తల్లితో స్నేహపూరితమైన సంబంధాలు కలిగి వుండుటకు అవకాశములు తక్కువ. ఈ లగ్నములలో చంద్రుడు దశమాదిపతిగా ఉండి అశుభ కారకుడు కాగలడు. సప్తమ భావములో దీని దృష్టి వుండుట వలన జీవిత భాగస్వామి క్రోది, సాహసి, మహత్వకాంక్ష గ‌లవారై వుండెదరు. లగ్నస్థ చంద్రుడు యది శుభగ్రహములతో యుతి లేదా దృష్టి కలిగి ఉన్న ఎడల సప్తమ భావముతో సంబంధిత ఉత్తమ ఫలితాల‌ను పొందగలరు.

కుజుడు
తుల లగ్నము గల కుండలిలో కుజుడు ద్వితీయ, సప్తమ భావము యొక్క అధిప‌తి కాగలడు. ప్రథ‌మ భావములో స్థితిలో వున్న కుజుడు వ్యక్తిని ద్వితీయాదిపతుడుగా వుండుట వల్ల‌ ఆర్ధిక లాభములను కలిగించును. వ్యాపార, వర్తకములలో మంచి లాభ‌పేక్ష క‌లుగును. స్వతంత్రంగా పని చేపట్టుట వల్ల‌ వీరికి లాభములు కలుగును. భాగస్వామ్యంలో నష్టము కలిగే అవకాశాలున్నాయి. లగ్నస్థ కుజుడు వారి పూర్ణ ధృష్టితో చతుర్ధ, సప్తమ, అష్టమ బావములను చూస్తున్నాడు. సుఖ భావములో కుజునితో దృష్టి కలిగి వుండుట కారణముగా సోదరుల నుంచి అపేక్షిత సమ్యోగము లభించకపోవచ్చు. పూర్ణ భౌతిక సుఖం లభించుటకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితములో కష్టములను ఎదుర్కొవాల్సి వచ్చును. అష్టమ భావము పీడించబడి వుండుట వలన కుజుని దశావదిలో అరోగ్య సంబంధ‌మైన సమస్యలను ఎదుర్కొవాల్సి రావ‌చ్చు.

బుధుడు 
తుల లగ్నము కుండలిలో బుధుడు నవమాదిపతి, ద్వాదశాదిపతి. ఇది ఈ లగ్నములో కారక గ్రహముగా పాత్రను నిర్వహించును. లగ్నస్తుడుగా ఉండి ఇది వ్యక్తికి నవమ మరియు దశమ భావముల ఫలితాలను ఇచ్చును. ఇది వ్యక్తిని ధార్మిక, బుద్దివంతునిగా చేయును.  ప్రభుత్వం, ప్రభుత్వతంత్రముద్వారా వీరికి సమ్యోగం, సమ్మానం ప్రాప్తి చెందగలదు. జన్మ స్థలమునకు దూరముగా వీరి భాగ్యము వికసించును. వీరికి తల్లిదండ్రుల ప్రేమ, సమ్యోగము లభించగలదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ భావమును చూస్తున్నాడు. దీంతో వైవాహిక జీవితం సుఖమయంగా ఉండును. సంతానం, జీవిత బాగస్వామి వల్ల‌ సమ్యోగము లభించగలదు. లగ్నస్థ బుధుడు పాప గ్రహములతో పీడించబడి ఉండ‌టం వ‌ల్ల ధనం, సుఖం, కుటుంబ‌ జీవితములో స‌మస్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు.

గురువు 
తుల లగ్నము గల కుండలిలో గురువు అకారక గ్రహము అవుతాడు. ఇది తృతీయ, షష్టమ భావము యొక్క అధిప‌తి కాగలడు. గురువు యది కుండలిలో లగ్నస్థంగా ఉండ‌టం వ‌ల్ల‌ ఇది వీరిని ఆత్మవిశ్వాసంతో పరిపూరితం చేయును. వీరిని సాహసిగా చేయును. ఈ జాత‌కులు త‌మ‌ బుద్ధి కుశలతో జీవితంలో ధనము, మాన సమ్మానములను పొందుతారు. లగ్నములో కూర్చొని ఉన్న గురువు పంచమ, సప్తమ, నవమ భావమును చూస్తున్నాడు. పంచమ భావములో గురువు యొక్క దృష్టి ఈ లగ్నములో సంతాన కారకుడుగా ఉండును. ఇది మీకు భౌతిక క్షమత, ఉచ్చ శిక్షను ప్రధానించును. సోదరుల నుంచి సమ్యోగం లభించగలదు. జీవిత భాగస్వామి నుంచి సమ్యోగ పూరితమైన,  ప్రేమపూరితమైన సంబంధాలు ప్రధానించును. మాతృ పక్షం నుంచి లాభములను కలిగించును.

శుక్రుడు

తుల లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు లగ్నాదిపతి, అష్టమాదిపతి అవుతాడు. ఈ లగ్నములో ఇది కారక గ్రహం యొక్క భూమికత్వమును నిర్వహించును. ప్రథ‌మ భావములో శుక్రుని యొక్క స్థితి కారణముగా వ్యక్తి చురుకుగా, ఆత్మవిశ్వాసముతో పరిపూరితంగాను ఉండును. శుక్రుని శుభ ప్రభావం కారణంగా వ్యక్తి సామాన్యంగా అరోగ్యంగాను, నిరోగస్తునిగా ఉండెదరు. సౌందర్యముపై ఆకర్షత కలిగి వుండెదరు. సంగీతము మరియు కళల యందు అభిరుచి కలిగి ఉండెదరు. సప్తమ భావంలో శుక్రుని పూర్ణ దృష్టి ఉండ‌టం వ‌ల్ల‌ వ్యక్తికి అనేక ప్రేమ ప్రసంసనలు వుండును. ఈ విషయం కారణముగా జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు కూడా కలుగును. విలాసములకు సంబంధ‌మైన వస్తువులపై ధనాన్ని ఖర్చు చేయడ‌మంటే వీరు ఇష్ట‌ప‌డ‌తారు.

శని 
తుల లగ్నం యొక్క కుండలిలో శని చతురాధిపతి, పంచమాధిపతిగా ఉండి కేంద్రం, త్రికోణ భావములకు అధిప‌తిగా ఉండును. ఈ రెండు భావముల అధిప‌తిగా ఉండుట వల్ల‌ శని ప్రముఖ కారక గ్రహంగా ఉండును. ఈ లగ్నంలో శని లగ్నస్థుడుగా వుండుట వల్ల‌ తల్లిదండ్రుల నుంచి స్నేహ సమ్యోగము ప్రాప్తించగలదు. విద్య యొక్క స్థితి బాగుండును. వృత్తి విజ్ఞాన సంబందమైన శిక్షలో వీరికి విషేశకరమైన సఫలత లభించగలదు. శని తన యొక్క పూర్ణ ధృష్టి కారణముగా తృతీయ, సప్తమ, దశమ భావములను చూస్తున్నాడు. అందు వల్ల‌ వీరిలో దయ, కరుణ స్వభావం అధికంగా ఉండును. శని వీరిని ధనవంతునిగా చేయుటతో పాటు భూమి, వాహన సుఖంను కూడా ప్రధానించును. బంధుమిత్రులతో వివాదాలు, మతబేధ‌ములకు అవకాశములు వున్నవి.

రాహువు  
వీరి జన్మము తుల లగ్నములో జరిగింది. లగ్న భావములో రాహువు కూర్చొని వున్నాడు. దీంతో వీరు అరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి రావచ్చును. రాహువు అంతర్ముకి స్వభావముకలవారుగా చేయును. దానికారణము ఏపనిని చేపట్టదలచిన ఆ పని పూర్తిఅయ్యే వరకు ఎవరితోనూ చెప్పరు. పని జరుగుటకు ముందు దేనిగురించి మాట్లాడినా ఆ పని జరుగుటలో సమస్యలు ఎదురుకాగలవు. లగ్నములో కూర్చొని వున్న రాహువు పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. రాహువు యొక్క దృష్టి వలన శిక్షలో మధ్య‌లో విడువ వలసి అవసరమును, జీవిత భాగస్వామితో, సంతానంతో సమ్యోగము లేకుండుట, భాగ్య హాని కలుగజేయును.

కేతువు  
కేతువు తుల లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా పంచమ, సప్తమ, నవమ బావమును చూస్తున్నాడు. లగ్నములో కూర్చొని ఉన్న కేతువు వ్యక్తిని పరిశ్రమి, సాహసిగా చేయును. సాహసము, పరిశ్రమ కారణముగా వ్యక్తి కఠినమైన పనులను కూడా పూర్తిచేయ శక్తి కలవాడై వుండును. ఇతరుల ధనముపై వీరి దృష్టి వుండును. శిక్షలో కేతువు బాదకముగా వుండును. సాదారణముగా వీరిలో ధార్మిక భావనలు అధికముగా వుండును. మనస్సులో అనవసర భ‌యాలు ఉండును. పందెలు, జూదములలో ధనము అనవసరముగా ఖర్చుకాగలదు.