Menu

Monthly Archives: January 2013

Mesham—Aries

Aries

  మేషం-2017-18

అశ్వని 1,2,3,4. పాదములు
భరణి 1,2,3,4. పాదములు
కృత్తిక 1.వ పాదం వారికి
ఆదాయము – 5 వ్యయము – 5, రాజ పూజ్యము – 3 అవమానము – 1
 
గురుడు సెప్టెంబరు 12 వరకూ 6 ఇంట లోహ మూర్తిగాను తదుపరి రజితమూర్తిగాను, శని రజత మూర్తిగా 9 వ ఇంట రాహువు ఆగస్టు 17 వరకూ 5 వ ఇంటసువర్ణ మూర్తిగా, 11వ ఇంట కేతువుసువర్ణ మూర్తి గా తదుపరి 4వ యింట రాహువు, 10వ ఇంట కేతువు తామ్ర మూర్తులుగా సంచరించెదరు. 
దీన్ని బ‌ట్టి ఫ‌లిత‌ములు చూడ‌గా ఈ రాశివారికి సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్థంలో కుటుంబ విరోధ‌ములు, కొన్ని కార్య‌క్ర‌మాల్లో మాత్ర‌మే విజ‌యం, పై అధికారుల‌చే మాట ప‌డ‌టం, శ‌తృవుల వ‌ల్ల ఇబ్బంది సూచిస్తున్న‌ది. సెప్టెంబ‌ర్ 12 త‌దుప‌రి మంచిగా ఉండును.
 
ఉద్యోగస్థుల విషయమై చూడగా వారికి శుభఆశుభ ఫ‌లిత‌ములు ఉండ‌గ‌ల‌వు. కొంత‌మందికి దూర‌ప్రాంతాల‌కు బ‌దిలీలు, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగములో ఉన్న‌వారికి శ్ర‌మ, సెప్టెంబ‌ర్ 12 త‌దుప‌రి కొంచెం ప్రశాంతత ఏర్పడి, ఉద్యోగం పర్మినెంట్ అవుట జరుగలదు. 
 
రాజకీయ రంగంలో ఉన్నవారికి చూడగా, ప్రథమార్థంలో అదినాయ‌క‌త్వం నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్ప‌డిన‌ప్ప‌టికీ, త‌దుప‌రి వారి శ్ర‌మ‌ని గుర్తించ‌గ‌ల‌రు. 
 
వ్యాపార‌స్తుల‌కు చూడ‌గా వైద్య, చేతి వృత్తుల వారికి శుభ‌ఫ‌లిత‌ములు గోచ‌రించుచున్న‌వి. పాడిప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా శుభ‌ఫ‌లితాలు ఉన్నాయి. ఈ సంవ‌త్స‌రం వ్యాపార లాభాలు ఉంటాయి.  
 
సినిమా, టీవీ, నాట‌క రంగ‌ముల వారికి ఈ సంవ‌త్స‌రం మిశ్ర‌మ ఫ‌లితాలు ఉన్నాయి. చిన్న సినిమాలు ఆర్థికంగా నిల‌దొక్కుకుంటాయి. నూత‌న న‌టీన‌టుల‌కు ప్రొత్సాహం ల‌భించ‌గ‌ల‌దు. 
 
 
ఇక విద్యార్థుల‌కు ఈ సంవ‌త్స‌రం ఫ‌లితాలు చూడ‌గా వారు చదువుపై ఏక‌గ్ర‌త పెంచుకున్న‌ట్ట‌యితే మంచి ర్యాంకులు పొందే అవ‌కాశాలు ఉన్నాయి. 
 
క్రీడారంగ‌ముల వారికి కూడా ఈ సంవ‌త్స‌రం త‌గిన ఫ‌లిత‌ములు ఉండ‌గ‌ల‌వు.
వ్య‌వ‌సాయ రంగ‌ముల వారికి చూడ‌గా మొద‌టి పంట‌క‌న్నా, రెండ‌వ పంట ఆశాజ‌న‌కంగా ఉండ‌గ‌ల‌దు. బ్యాంకుకు సంబంధించిన స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వప‌ర స‌హాయం ఉండ‌గ‌ల‌దు. 
 
ఈ సంవ‌త్స‌రం వీరు శ‌ని, రాహు కేతుల‌కు శాంతి చేయించుకొనుట, రాహు కేతు యంత్రాలు ధ‌రించుట శుభ‌ము.
  .
 
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557

Vrishabham—Taurus

taurus

వృషభం – 2017-18

కృత్తిక 2,3,4. పాదములు.
 
రోహిణి 1,2,3,4.పాదములు.
 
మృగశిర 1,2.పాదములు.
 
ఆదాయము – 14 వ్యయము – 11 రాజపూజ్యం – 6 అవమానం – 1
 
గురుడు సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు 5వ ఇంట తామ్ర‌మూర్తిగాను, త‌దుప‌రి 6 ఇంట సువ‌ర్ణ‌మూర్తి, శ‌ని 8 ఇంట సంవ‌త్స‌ర‌మంతా లోహ‌మూర్తిగా వ‌ర్తించును. 4వ ఇంట రాహువు, ప‌ద‌వ ఇంట కేతువు ఆగ‌స్టు 17 వ‌ర‌కు ర‌జితమూర్తిగాను, త‌దుప‌రి మూడ‌వ ఇంట రాహువు, తొమ్మిద‌వ ఇంట కేతువు రజిత‌మూర్తిగాను ఉందురు.
 
ఈ రాశివారికి ద్వితీయార్థంలో గురుడు కొన్ని శుభ‌ఫ‌ల‌ములు ఇచ్చును. అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా సూచించుచున్న‌వి. 
ఉద్యోగ‌స్తుల విష‌య‌మై చూడ‌గా, వారికి కొంచెం క‌ష్ట‌కాల‌ముగానే ఉండును. పై అధికారుల నుంచి ఒత్తిడి, శ్ర‌మ అధికంగా ఉండును.
రాజ‌కీయనాయ‌కుల విష‌య‌మై చూడ‌గా, వారికి ప్ర‌జ‌ల్లో గుర్తింపు ల‌భించును. ప‌ద‌వులు పొందే అవ‌కాశాలు క‌ల‌వు. 
వ్యాపార‌స్తుల విష‌య‌మై చూడ‌గా, వైద్య, చేతి వృత్తులు, ఫౌల్ట్రీ ఫారం వ్యాపార‌స్తుల‌కు కొంచెం ఇబ్బందిక‌ర‌మైన‌టువంటి ప‌రిస్థితులు ఉండ‌గ‌ల‌వు.
సినిమా,టీవీ,నాట‌క‌రంగ‌ముల వారికి శ్ర‌మ‌ప‌డ్డా ఆర్థిక‌ప‌ర‌మైన లాభాలు గోచ‌రించ‌వు. 
ఇక క్రీడాకారుల విష‌య‌మై చూడాగా కొంత‌మందికే గుర్తింపు ల‌భించును.
విద్యార్థుల విష‌య‌మై చూడగా, ప్ర‌థ‌మ‌శ్రేణి ఉత్తీర్ణ‌త పొంద‌టం చాలా క‌ష్టం. శ్ర‌మ‌, ఏక‌గ్ర‌త లోపించును. 
వ్య‌వ‌సాయ రంగం వారికి చూడ‌గా రెండు పంట‌లు కూడా ఆశించిన ఫ‌లితాలు ఉండ‌వు. అప్పులు చేసే అవకాశం ఉన్న‌ది. ఈ సంవ‌త్స‌రం ఈ రాశివారు గురు, శ‌ని శాంతులు చేయించుకొనుట మంచిది.
 గురు యంత్రం ధ‌రించుట శుభం.
                     యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557

Mithunam—Gemini

gemini

మిధునం – 2017-2018 

మృగశిర 3,4,పాదములు.
 
ఆరుద్ర 1,2,3,4.పాదములు.
 
పునర్వసు 1,2,3.పాదములు.
 
ఆదాయము – 2 వ్యయం – 11 , రాజపూజ్యం – 2 అవమానం – 4
 
                గురుడు 4వ ఇంట సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు సువ‌ర్ణ‌మూర్తి, త‌దుప‌రి సంవ‌త్స‌ర‌మంతా 5వ ఇంట లోహ‌మూర్తిగాను, శ‌ని 7వ ఇంట సంవ‌త్స‌ర‌మంతా తామ్ర‌మూర్తిగాను, 3వ ఇంట‌ రాహువు, 9 ఇంట కేతువు ఆగ‌స్టు 17 వ‌ర‌కు లోహమూర్తులుగాను, త‌దుప‌రి 2వ ఇంట రాహువు, 8వ ఇంట కేతువు సువ‌ర్ణ‌మూర్తులుగా సంచ‌రించును. 
 
ఈ సంవ‌త్స‌రం ఉద్యోగ‌స్తుల విష‌య‌మై చూడ‌గా వీరు ధ‌న‌ప‌ర‌మైన చిక్కుల్లో ఉన్న‌ప్ప‌టికీ, వాటిని తొల‌గించుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుదురు. పేరు ప్ర‌ఖ్యాత‌లు పెరుగును. స్త్రీ, పురుషుల‌కు వివాహ‌యోగం సూచిస్తున్న‌ది. ఉద్యోగ‌స్తుల విష‌య‌మై చూడ‌గా, కోరిన చోట‌కు ట్రాన్స్‌ప‌ర్‌లు, పై అధికారుల‌చే గుర్తింపు ల‌భించును.
 
రాజ‌కీయ నాయ‌కుల విష‌య‌మై చూడ‌గా, ప్ర‌భుత్వ రంగంలో ముఖ్య‌మైన పాత్ర వ‌హించుచుదురు. ప్ర‌జ‌ల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ది. 
 
వ్యాపారుల విష‌య‌మై చూడ‌గా, చేతివృత్తులు, వైద్యం, ఫౌల్ట్రీఫారం వ్యాపారుల‌తో పాటు మిగిలిన వ్యాపారుల‌కు కూడా లాభ‌క‌రంగానే ఉండ‌గ‌ల‌దు.
 
సినిమా, టీవీ, నాట‌క‌రంగ‌ముల వారికి శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లిత‌ము ఉండ‌గ‌ల‌దు. 
క్రీడాకారుల విష‌య‌మై చూడగా వారికి త‌గిన గుర్తింపు ల‌భించుట‌యే కాకుండా ఆ రంగంలో స్థిర‌ప‌డుట జ‌రుగ‌గ‌ల‌దు. 
ఇక వ్య‌వ‌సాయ రంగంలోని వారికి చూడ‌గా అనుకూల వాతావ‌ర‌ణ‌మే క‌న‌బ‌డుతున్న‌ది. ప్ర‌భుత్వ ప‌ర‌మైన రాయితీలు ల‌భించే అవ‌కాశం ఉన్న‌ది.
విద్యార్థుల‌కు క‌ష్టానికి త‌గిన ఫ‌లిత‌ము ఉండ‌గ‌ల‌దు. విద్య‌యందు శ్ర‌ద్ధ‌పెట్టిన ప్ర‌థ‌మ శ్రేణి ఉత్తీర్ణ‌త పొందే అవ‌కాశం ఉంది. 
ఈ సంవ‌త్స‌రం వీరు గురుడుకు శాంతి  చేయించుట శుభం.                                   
 
విరు నరఘోష యంత్రము ధరించిన మంచి పలముకలుగును.
 
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***

Karkatakam—Cancer

cancer

కర్కాటకం-2017-2018 

పునర్వసు 4.పాదము.
 
పుష్యమి 1,2,3,4.పాదములు.
 
ఆశ్లేష 1,2,3,4.పాదములు.
 
ఆదాయం – 11, వ్యయం – 8, రాజపూజ్యం – 5, అవమానం – 4.
ఈ రాశివారికి గురుడు మూడ‌వ ఇంట సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు ర‌జిత‌మూర్తిగాను, త‌దుప‌రి 4వ ఇంట సువ‌ర్ణ‌మూర్తిగాను వ‌ర్తించును. శ‌ని 6వ ఇంట సంవ‌త్స‌ర‌మంతా కూడా సువ‌ర్ణ‌మూర్తి. రాహువు 2 ఇంట, కేతువు 8వ ఇంట ఆగ‌స్టు 17 వ‌ర‌కు తామ్ర‌మూర్తి, త‌దుప‌రి 1వ ఇంట రాహువు, 7వ ఇంట కేతువు లోహ‌మూర్తులుగా ఉందురు. 
ఈ సంవ‌త్స‌రం వీరు మాతృ-పుత్ర పర ఇబ్బందులు, బాధ‌లు, మ‌తిమ‌రుపు, భ‌యం, భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌స్య‌ల‌తోను ఈ సంవ‌త్స‌రం ఉండును. 
 
 
ఉద్యోగ‌స్తుల విష‌య‌మై చూడ‌గా, స్థాన చ‌ల‌న, పై అధికారుల నుంచి ఇబ్బందులు, ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉండును.
 రాజ‌కీయ నాయ‌కుల‌కు శుభఆశుభ ఫ‌ల‌ములు గోచ‌రించుచున్న‌వి. కొంత అనుకూల వాతావ‌ర‌ణం లేదు.
వ్యాపారుల విష‌య‌మై చూడ‌గా, వ్యాపార‌మునందు క‌ష్ట‌ప‌డినా, లాభ‌ములు ఉండ‌వు. ఫౌల్ట్రీఫారం, వైద్య రంగంలో వారికి కొద్దిపాటి లాభ‌ము మాత్ర‌మే ఉన్న‌ది. 
సినిమా, టీవీ, నాట‌క‌రంగంలో వారికి మిశ్ర‌మ ఫ‌లితాలు గోచ‌రించుచున్న‌వి. క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ స‌రైన ఫ‌లిత‌ములు అంద‌వు. 
క్రీడారంగ‌ముల వారికి సామాన్య‌ఫ‌లితాలు మాత్ర‌మే ఉన్నాయి. విద్యార్థుల‌కు క‌ష్టప‌డి చ‌దివిన‌నూ త‌గు ఉత్తీర్ణ‌త శాతం ఉండ‌దు. 
ఈ సంవ‌త్స‌రం ఈ రాశివారు గురున‌కు, రాహు-కేతువుల‌కు శాంతి చేయించినా శుభ‌ము. వీరు గురు యంత్రం ధ‌రించుట మంచిది.
                             
 
 
 
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***

Simham—Leo

leo

సింహం 2016 – 17

మఖ.1,2,3,4.పాదములు.

పుబ్బ.1,2,3,4.పాదములు.

ఉత్తర.1.పాదము.

ఆదాయం – 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3.

                             

ఆగస్టు 11, 2016 వరకు గురుడు ఒకటవ ఇంట సువర్ణమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా రెండో ఇంట లోహమూర్తిగా సంచరించును. జనవరి 26, 2017 వరకు శని నాలుగవ ఇంట తామ్రమూర్తి, తదుపరి ఐదవ ఇంట రజితమూర్తిగా సంచరించును. రాహువు ఒకట ఇంట, కేతువు ఏడవ ఇంట రజితమూర్తులు.

ఈ సంవత్సరం అధికమైన దేహశ్రమ, నేత్రపీడ, మానసికంగా బాధలతోనూ, అపనిందలతోనూ ఉందురు. ఊహించని సంఘటనలు జరుగును. కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి బంధుమిత్రుల సహాయం తప్పకపోవచ్చును. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.

ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన సమయం. దూర ప్రాంత బదిలీలు వెళ్లుట, పై అధికారులచే మాట పడుట, సస్పెండు అవుట జరగవచ్చును. అనారోగ్యం వల్లగాని, లేదా పై అధికారుల ఒత్తిడి వల్లకాని, వీఆర్ఎస్ తీసుకోవాలన్న కోరిక కలుగును. నిరుద్యోగులకు కూడా అంత ఆశాజనకంగా లేదు.

రాజకీయ నాయకులకు గురు, శనిల బలం లేకపోవడం వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గును. అంతేగాక కొన్ని నింద ఆరోపణలు ఎదుర్కొనవలసి వచ్చును. పదవులు కూడా పొందే అవకాశం కలగదు. ఉన్న పదవులకు కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చును.

వ్యాపారస్తులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుదురు. కొన్ని రకముల వ్యాపారములు మాత్రమే బాగుండును. నూతన కాంట్రాక్టులు చేయువారికి ఆ పనులు అనుకూలించవు. ప్రభుత్వ కాంట్రాక్టులకు బిల్లులు తొందరగా అవ్వవు. రియల్ ఎస్టేట్ వారికి బాగానే వుండును.

సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం కొన్ని విజయాలు కలిగిననూ, సరైన గుర్తింపు లభించదు. వచ్చే అవకాశాలు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడుదురు. అవార్డులు, రివార్డులు లభించడం కూడా చాలా కష్టమగును.

విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షకాలమా అన్నట్టుగా ఉండును. చదువుకన్నా, చెడు వ్యసనములపై దృష్టి పెరుగును. తక్కువ మార్కులతో ఉత్తీర్ణత, ఎంట్రాన్స్ పరీక్షల్లో ర్యాంకులు పొందలేకపోవుట. అనుకున్న చోట్ల సీట్లు రాకుండా ఇబ్బందులు పడుదురు.

ఈ సంవత్సరం వ్యవసాయ రంగం వారికి రెండో పంట మాత్రమే లాభించును. అప్పుల బాధలతో ఇబ్బందులు తప్పకపోవచ్చును. కౌలుదార్లకు కూడా అనుకున్నంత లాభము ఉండకపోవచ్చు. పౌల్డ్రీ రంగము, చేపలు, రొయ్యల చెరువులు నష్టములో ఉండును.

ఈ సంవత్సరం గురు, శనికి శాంతి చేయించుకోవలెను. శని యంత్రం ధరించుకోవలెను.

Kanya—Virgo

virgo

 

కన్య -2016-17

ఉత్తర.2,3,4. పాదములు.

హస్త.1,2,3,4.పాదములు.

చిత్త.1,2. పాదములు.

ఆదాయము – 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6.

ఆగస్టు 11, 2016 వరకు గురుడు పన్నెండవ ఇంట తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా ఒకటవ ఇంట తామ్రమూర్తిగాను సంచరించును. జనవరి 26, 2017 వరకు శని మూడవ ఇంట సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరమంతా నాలుగవ ఇంట లోహమూర్తిగాను, రాహు పన్నెండవ ఇంట, కేతువు ఆరో ఇంట సువర్ణమూర్తులు.

ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు కలవు. ధనవ్యయం, గృహానికి సంబంధించిన మార్పులు, వ్యసనములు, అపనిందలు, భార్యభర్తల మధ్య పట్టింపులు, ఆదాయ సమస్యలు ఉండును.

కొంత మంది ఉద్యోగస్థులు ఏసీబీ దాడులు ఎదుర్కొందురు. ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్యం. పై అధికారుల వల్ల రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోవుట, పని ఒత్తిడి పెరుగుట ఉండగలదు. నిరుద్యోగులకు అనుకున్నంత అవకాశములు కలిసి రాకపోవచ్చును.

రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలమైనప్పటికీ ఏదో సమస్య ఎదురుకావచ్చు. ప్రజల్లో గుర్తింపు తగ్గదు. ఆలస్యముగానైనా పదవి లభించగలదు.

ఈ సంవత్సరం వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితములు కలవు. కిరాణ వ్యాపారములు బాగుండగలవు. ఫైనాన్స్ వ్యాపారములు, రియల్ ఎస్టేట్, జాయింట్ వ్యాపారములు నష్టంలో నడుచును.

సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం గుర్తింపు అంతగా లభించదు. నూతన నటీనటులకు కూడా అవకాశములు అంతంగా మాత్రమే ఉండును. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అగును. ప్రభుత్వ గుర్తింపు లభించక అవార్డులు కూడా రావు.

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమఫలితాలు ఉంటాయి. చదువుపై శ్రద్దతగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టిపడును. గురు బలం లేకపోవటంచే అనుకున్న మార్కులు రాక ఉత్తీర్ణత శాతం తగ్గును. ఎంట్రాన్స్ పరీక్షల యందు కూడా ఫలితములు బాగుండవు. అనుకున్న చోట సీటు పొందలేకపోవచ్చు.

ఈ సంవత్సరం వ్యవసాయం రంగం వారికి.. మొదటి పంట నష్టం, రెండవ పంట సామాన్యముగా ఉండును. కౌలుదార్లు ఆర్థికంగా నష్టపోదురు. ఫౌల్డ్రీ, రొయ్యలు, చేపల చెరువుల వాళ్లకి అతి సామాన్య లాభములు ఉండును.

ఈ సంవత్సరం వీరు గురువుకు, రాహువుకు శాంతులు చేయించవలెను. గురు, రాహు యంత్రములు ధరించడం మంచిది.

Tula—Libra

libra
తుల 2017-18
 
చిత్త.3,4.పాదములు.
స్వాతి.1,2,3,4,.పాదములు.
విశాఖ.1,2,3. పాదములు.
 
ఆదాయము – 14, వ్యయం – 11  రాజపూజ్యము – 7, అవమానం – 7.
గురుడు 12వ ఇంట సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు ర‌జిత‌మూర్తిగాను, త‌దుప‌రి 1వ ఇంట లోహ‌మూర్తిగాను వ‌ర్తించును. శ‌ని మూడ‌వ ఇంట సంవ‌త్స‌ర‌మంతా తామ్ర‌మూర్తి. 11వ ఇంట రాహువు, 5వ ఇంట కేతువు ఆగ‌స్టు 17 వ‌ర‌కు లోహ‌మూర్తులు. 10 ఇంట రాహువు, 4వ ఇంట కేతువు త‌దుప‌రి ర‌జితామూర్తిగా వ‌ర్తించును. ఈ సంవ‌త్స‌రం వీరికి అనారోగ్యం, ధ‌నలాభ‌ము, పుణ్య‌క్షేత్ర ద‌ర్శ‌నం, ఉన్న‌త ప‌ద‌వీలాభ‌ము క‌లుగును. కొన్ని ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్నాయి. 
 
ఉద్యోగ‌స్తుల విష‌యం చూడ‌గా స్థాన చ‌ల‌నం, పై అధికారుల‌చే ప‌ని ఒత్తిడి ఉండ‌గ‌ల‌దు. 
వ్యాపార‌స్తుల విష‌య‌మై చూడ‌గా, సామాన్య ఫ‌లిత‌ములు గోచ‌రించుచున్న‌వి. ఆదాయం కూడా అంతంత‌మాత్ర‌మే క‌న‌బ‌డుచున్న‌ది. పాడిప‌రిశ్ర‌మ‌లు, పౌల్ట్రీ, వైద్య‌రంగంల వారికి పెద్ద‌గా ఆదాయ లాభ‌ములు లేక‌పోవ‌చ్చు.  
ఇక విద్యార్థుల‌కు అతిశ్ర‌మ మీద విజ‌యం పొందే అవ‌కాశం ఉంది. 
సినిమా, టీవీ, నాట‌క రంగంలో వారికి మిశ్ర‌మ ఫ‌లితాలు గోచ‌రిస్తున్నాయి. 
ఈ సంవ‌త్స‌రం వీరు గురు, శ‌ని ల‌కు శాంతి చేయించుకొనుట శుభము. 
      శని ప్రబావము తగ్గుటకై శని యంత్రము ధరించిన మంచి ఫలములు పొందు అవకాశమున్నది
                               
 
 
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
 
***

Vrishchika—Scorpio

scorpio
 వృశ్చికం – 2017-18
 
విశాఖ 4 పాదము,
 
అనూరాధ 1,2,3,4.పాదములు.
 
జేష్ట 1,2,3,4. పాదములు.
 
ఆదాయము -5, వ్యయం.5. రాజపూజ్యము -3, అవమానం – 3.
ఈ సంవ‌త్స‌రం గురుడు 11వ ఇంట సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు సువ‌ర్ణ‌మూర్తిగాను, త‌దుప‌రి 12వ ఇంట తామ్ర‌మూర్తిగా సంచ‌రించును. శ‌ని రెండ‌వ ఇంట సంవ‌త్స‌ర‌మంతా ర‌జితామూర్తి. 10వ ఇంట రాహువు, 4వ ఇంట కేతువు ఆగ‌స్టు 17 వ‌ర‌కు సువ‌ర్ణ‌మూర్తులు. త‌దుప‌రి 9వ ఇంట రాహువు, 3వ ఇంట కేతువు లోహమూర్తులు. ఈ సంవ‌త్స‌రం ఈ రాశివారికి స్థాన చ‌ల‌నం, ధ‌న‌లాభం, పుత్ర‌ప‌ర సుఖ‌ము ఇటువంటి మిశ్ర‌మ ఫ‌లితాల‌తో కూడుకుని ఉంది.
 
ఉద్యోగ‌స్తుల‌కు స్థాన చ‌ల‌నం, ధ‌న న‌ష్టం సూచిస్తున్న‌ది. పై అధికారుల‌ ఆగ్ర‌హానికి గురి అయ్యే అవ‌కాశం ఉంది. 
వ్యాపార‌స్తుల‌కు కొద్దిపాటి ఆదాయం మాత్ర‌మే సూచిస్తున్న‌ది. పాడి ప‌రిశ్ర‌మ‌లు, పౌల్డ్రీ, వైద్య వృత్తుల వారికి సామాన్య ఫ‌లితాలే సూచిస్తున్నాయి.
ఇక విద్యార్థులు క‌ష్ట‌ప‌డి చ‌దివిన‌ప్ప‌టికీ ప్ర‌థ‌మ‌శ్రేణి వ‌చ్చుట క‌ష్టం. 
సినిమా, టీవీ, నాట‌క రంగంల వారికి విజ‌యం సాధించ‌న‌ప్ప‌టికీ లాభ‌ములు వ‌చ్చుట క‌ష్టం. 
ఈ రాశివారికి ఏళ్ల‌నాటి శ‌ని ప్ర‌భావం అధికంగా ఉంది. 
కావున వీరు శ‌నిత్ర‌యోద‌శి నాడు తైలాభిషేకం చేయించుట మంచిది. 
శ‌నిగ్ర‌హ యంత్రం ధ‌రించుట మంచిది. 
 
             శని ప్రబావము తగ్గుటకై శని యంత్రము ధరించిన మంచి ఫలములు పొందు అవకాశమున్నది
 
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
***

Dhanussu—Sagittarius

sagittarius

ధనస్సు – 2017 – 18
 
మూల. ,2,3,4 పాదములు.
 
పూర్వాషాడ.1,2,3,4.పాదములు.
 
ఉత్తరాషాడ 1. పాదము.
 
ఆదాయము – 8, వ్యయం.11. రాజపూజ్యము – 6, అవమానం – 3. 
 
 ఈ సంవ‌త్స‌రం వీరికి గురుడు 10వ ఇంట సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు లోహ‌మూర్తిగాను, త‌దుప‌రి 11వ ఇంట సువ‌ర్ణ‌మూర్తిగాను ఉండును. శ‌ని ఒక‌ట‌వ ఇంట సంవ‌త్స‌ర‌మంతాను సువ‌ర్ణ‌మూర్తి. రాహువు 9వ ఇంట, కేతువు 3వ ఇంట ఆగ‌స్టు 17 వ‌ర‌కు తామ్ర‌మూర్తి. త‌దుప‌రి 8వ ఇంటికి రాహువు, 2వ ఇంట కేతువు తామ్ర‌మూర్తులు. ఈ సంవ‌త్స‌రంలో వీరికి కార్య‌సిద్ధి లాభ‌ము, ఆరోగ్య భంగ‌ములు, ధ‌న‌వ్య‌య‌ము కూడా సూచిస్తున్న‌ది. రాహువు వ‌ల‌న పుత్ర‌సంబంధిత సుఖ‌ము, కేతువు వ‌ల్ల స‌హోద‌ర క‌ల‌హ‌ము సూచిస్తున్న‌ది. 
 
ఉద్యోగ‌స్తుల‌కు కొద్దిపాటి శుభ‌ఫ‌లిత‌ములు గోచ‌రిస్తున్నాయి. పై అధికారుల‌చే మెప్పుపొందే అవ‌కాశం ఉంది. 
వ్యాపారుల‌కు ప్ర‌థ‌మార్థం బాగుండి, చివ‌రికి కొంత న‌ష్టాలు చ‌విచూసే అవ‌కాశాలు రావ‌చ్చు. పాడిప‌రిశ్ర‌మ‌లు, పౌల్డ్రీ, వైద్య వృత్తుల వారు కొద్ది పాటు లాభ‌ములే స‌రిపెట్టుకోవాల్సి రావ‌చ్చు.
వ్య‌వ‌సాయ‌దారుల‌కు మొద‌టి పంట క‌న్నా, రెండ‌వ పంట అనుకూలం. 
ఇక విద్యార్థుల విష‌యం చూడ‌గా, వారికి మంచి ఫ‌లిత‌ములే సూచిస్తున్నాయి. కొంత మంది ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది.
సినిమా, టీవీ, నాట‌క రంగ‌ముల వారికి సంవ‌త్స‌రం మ‌ధ్య నుంచి బాగుండును. 
రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌నూ కొంత అనుకూలంగానే ఉండును. 
ఈ రాశి వారికి శ‌ని శాంతి చేయించుకున్నా శుభ‌ఫ‌లితాలు పొంద‌గ‌ల‌రు. 
 
వీరు ఈ సంవత్సరము శని, యంత్రములు ధరించుట వల్ల  మంచి ఫలములు పొందు అవకాశమున్నది.
 
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557
 ***

Makaram—Capricorn

Makaram-capricorn
మకరం – 2017 – 18
 
ఉత్తరాషాడ.  2,3,4 పాదములు.
 
శ్రవణం.1,2,3,4.పాదములు.
 
ధనిష్ట. 1,2 పాదములు.
 
ఆదాయము – 11, వ్యయం – 5. రాజపూజ్యము – 2, అవమానం – 6.
ఈ సంవ‌త్స‌రం వీరికి గురుడు 9వ ఇంట సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు సువ‌ర్ణ‌మూర్తిగాను, త‌దుప‌రి 12 ఇంట ర‌జిత‌మూర్తి. శ‌ని 12వ ఇంట సంవ‌త్స‌ర‌మంతా లోహ‌మూర్తి. రాహువు 8వ ఇంట, కేతువు 2వ ఇంట‌, ఆగ‌స్టు 17 వ‌ర‌కు ర‌జిత‌మూర్తులు. త‌దుప‌రి 7వ ఇంట రాహువు, 1వ ఇంట కేతువు సువ‌ర్ణ‌మూర్తులుగా ఉందురు. ఈ రాశి వారికి కొద్దిపాటి శుభ‌ములు, అశుభ‌ములు కూడా గోచ‌రిస్తున్న‌వి. ధ‌న‌ప‌ర‌మైన చిక్కులు తొల‌గును. 
 
ఈ సంవ‌త్స‌రం ఉద్యోగ‌స్తుల‌కు అశుభ‌ఫ‌లిత‌ములు గోచ‌రిస్తున్న‌వి. పై అధికారుల‌చే ఆగ్ర‌హ‌ములు, స్థాన చ‌ల‌నం పొందే అవకాశం క‌ల‌దు. 
వ్యాపార‌స్తుల విష‌యం చూస్తే.. ఫైనాన్స్, రియ‌ల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు న‌ష్ట‌పోయిన‌ప్ప‌టికీ, మ‌రికొన్ని వ్యాపారాలు అనుకూలించును.
పాడి ప‌రిశ్ర‌మ‌, పౌల్డ్రీ, వైద్య వృత్తుల వారికి మిశ్ర‌మ ఫ‌లితములు ఉన్న‌వి. 
వ్య‌వ‌సాయ‌దారుల‌కు రెండు పంట‌లు కూడా కొంత నిరాశ‌ను క‌లిగిస్తాయి. 
ఇక విద్యార్థుల విష‌య‌మై చూడ‌గా, వారికి మంచి ఫ‌లిత‌ములే ఉన్నాయి. క‌ష్ట‌ప‌డి చ‌దివితే ప్ర‌థ‌మ శ్రేణి ల‌భించే అవకాశం క‌ల‌దు.
సినిమా, టీవీ, నాట‌క రంగ‌ముల వారికి మంచి స‌మ‌య‌ముగానే చెప్ప‌వ‌చ్చు.
రాజ‌కీయ నాయ‌కుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప‌ద‌వులు పొందే అవ‌కాశం క‌ల‌దు. 
                
 
 
 
వీరు ఈ సంవత్సరము శని, యంత్రములు ధరించుట వల్ల  మంచి ఫలములు పొందు అవకాశమున్నది.

 
యంత్రములకై  సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557