Menu

2017 samvatsara phalalu

హేమళంబి  నామ సంవత్సర నవ నాయక ఫలము

{ 2017 -2018}

 

రాజు :- బుధుడు 

బుధుడు రాజు అయినందువల్ల వ్యాపార లావాదేవీలు పెరుగును. రాజీకీయముగా ఒడిదుడుకులు పెరుగును. పెసలు,కందులు, తమలపాకులు ఇత్తడి, పత్తి, ద్రావకం, నల్లమందు, వెండి, బంగారం ధరలు పెరుగుట, వినోద కార్యక్రమాలు, సినిమా సంబంధిత వ్యాపారములు పెరుగును. వాయుపీడ వల్ల పంటలు పాడగును. ప్రజలలో అనారోగ్య సమస్యలు వల్ల వైద్య అవసరములు పెరుగుట పాలధరలు పెరుగును.   

మంత్రి :- శుక్రుడు 

శుక్రుడు మంత్రి అవ్వుట వలన దేశములో స్త్రీ, పురుషులకు విలాసవంత జీవితముపై మక్కువ కలుగును. పురుషులలో స్త్రీ లోలత్వము పెరుగును. అటవీ ప్రాంతముల వారికి కొన్ని ఇబ్బందులు ఉండగలవు. వర్ష భావము అధికము.  విదేశి వ్యాపారములు పెరుగుట, పరిపాలన అత్యంత యుక్తి  ప్రయుక్తులతో కూడుకొని ముందుకు సాగును, ప్రభుత్వము కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనును. పశువులకు హాని.       

సైన్యాధిపతి :- గురుడు  

  గురుడు సైన్యాధిపతి అగుట వల్ల దేశములో ప్రజలకు అనుకూల పాలన సాగును. రాజుల న్యాయ పాలన చేయుదురు. కొంత సుఖ పాలన ఉండగలదు. బ్రాహ్మణ, వైశ్య,క్షత్రియులకు సుఖము, శూద్రాది వర్ణములకు సామాన్య ఫలములు.   

సస్యాధిపతి :- చంద్రుడు 

చంద్రుడు సస్యాధిపతి అగుటచే బియ్యము,ఉప్పు తెలుపుధాన్యముల ధరలు పెరుగును. ప్రతి ఇంట మందుల వాడకము పెరుగును. మెట్ట పంటలు బాగుండును. మామిడి,నారింజయాది వృక్ష జాతుల ఫలములకు ధరలు బాగుండును.   

 ధాన్యాధిపతి :- శని 

శని ధాన్యాధిపతి అగుటచే నువ్వులు మినుములు ఇత్యాది నలుపుకు సంబంధిత ధాన్యములు ధరలు హెచ్చును. నల్ల రేగడి భూముల పంటలు బాగుండును. కొన్ని ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులలో వ్యతిరేకత ఉండగలదు.  

అర్ఘాదిపతి :- గురుడు 

 ప్రభుత్వము లో నూతన చట్టములు వచ్చును, పారిశ్రామిక రంగములో విశేష మార్పు అభివృద్ధి వుండ గలదు, యజ్ఞాది క్రతువులు పెరుగును. బ్రాహ్మణులకు శుభకార్యక్రమాది లాభములు ఉండగలవు. ద్రవోల్పనం తగ్గుటయే కాక వస్తువు విలువ పెరుగును.  

మేఘాదిపతి :- గురుడు 

గురుడు మేఘాధిపతి అగుటచే ధరలు తగ్గుట కొన్ని వస్తువులకు మాత్రమే ధరలు పెరుగుట ఉండగలదు. దేశము అంతా వర్ష భావము సరి సమానముగా ఉండగలదు. వ్యవసాయ అభివృద్ధి ఉండగలదు. 

రసాధిపతి :- కుజుడు 

కుజుడు రసాదిపతి అగుటచే బ్రాందీ, విస్కీ ఇటువంటి మత్తు పదార్థముల ధరలు పెరుగును. ఎరుపురంగు ధాన్యములకు ధర వచ్చును. రక్షణ వ్యవస్థ సకాలములో సమస్యలను గుర్తించుట చే భారి ప్రమాదములు అరికట్టేదరు, విదేశములలో మన దేశ ఖ్యాతి పెరుగును.  విదేశి ఎగుమతులు పెరుగుట విదేశములో కూడా  మన వస్తువులకు గిరాకి కలుగును. 

నీరసాధిపథి :-  రవి  

రవి నిరసాదిపతి అగుటచే బంగారము,వెండి, ధాతు లోహములకు ధరలు వచ్చును. పువ్వులు, పండ్లు ధరలు పెరుగును, మహిళలకు అన్ని విధములా బాగుండును. ప్రజలలో అంతః కలహములు ఉండును. నూతన విహంగ ఆశ్రమములు పెట్టుదురు, మాంసము, సీసం వంటి వాటి ధరలు తగ్గును. నవరత్నములు ధరలు పెరుగును. 

moudyami and adhikamaasam

 మూఢమి 

గురుమూఢమి :- ది . 12-10-2017 తేది ఆశ్వీయుజ శుద్ధ అష్టమీ గురువారం నుండి[పశ్చాదస్తమిత] గురు మౌడ్యమి ప్రారంభము అయ్యి  ది. 09-11-2017 తేది కార్తీక బహుళ సప్తమీ గురువారం నాడు [పశ్చాదుదిత]గురు మౌడ్యమి త్యాగము.  

తిరిగి ది. 28-11-2017 తేది మార్గశిర శుద్ధ దశమీ మంగళవారం నుండి [పశ్చాదస్తమిత]  శుక్ర మౌడ్యమి ప్రారంభము అయ్యి ది.19-02-2018మాఘ బహుళ పంచమీ సోమవారం [పశ్చాదుదిత] శుక్ర మౌడ్యమి త్యాగము. 

Puskaramulu and Grahanamulu

 

కావేరి నదికి  ఈ సంవత్సరము పుష్కరము 

శ్రీ హేమలంబి నామ సంవత్సరం భాద్రపద బహుళ సప్తమీ మంగళవారం అనగా ది. 12-09-2017 తేది ఉదయం 07గం. 02 నిమిషములకు గురుడు తులా రాశి ప్రవేశము కావున కావేరి నదికి పుష్కరములు ప్రారంభం. అప్పటి నుంచి పన్నెండు రోజులు పుష్కర దినములుగా అవుతాయి.

2017 – 2018 సంవత్సరము లో గ్రహణములు

1] ది. 07-08-2017 వ తేది శ్రవణ పూర్ణిమ సోమవారం మకర రాశి యందు కేతు గ్రస్త పాక్షిక చంద్ర  గ్రహణము.   స్పర్శ రాత్రి గం. 10-53 ని. నుండి రాత్రి గం. 2-57ని. లకు మోక్షం. 

శ్రవణ నక్షత్రము వారు ఈ గ్రహణమును చూడరాదు. 

2] ది . 31-01-2018 వ తేది మాఘ పూర్ణిమ బుధవారం గ్రస్తోదయ సంపూర్ణ చంద్ర గ్రహణం.  రాహుగ్రస్తము.  స్పర్శ సాయంత్రం గం. 05-19ని. నుండి రాత్రి గం.-42 ని.ల వరకు. 

పుష్యమి,ఆశ్రేష నక్షత్రము వారు చూడరాదు.  

కర్తరి 

డొల్లు [చిన్న]కర్తరి :- ది 04-05-2017 తేది వైశాఖ శుద్ధ నవమి గురువారం సాయంత్రం  గం. 05-13 ని.    నుంచి 

  

నిజ   [పెద్ద] కర్తరి :- ది .11-05-2017 వైశాఖ బహుళ పాడ్యమీ గురువారం మధ్యాహ్నం గం. 03-02 ని. నుండి నిజ కత్తిరి ప్రారంభము 

  ది. 28-05-2017 తేది జ్యేష్ఠ శుద్ధచతుర్థి ఆదివారం నాడు త్యాగము. 

 కర్తిరి సమయమున కర్ర మట్టి పనులు నిషిద్ధము. 

మకర సంక్రాంతి, ఫలములు

ది. 14-01-2018 వ తేది రాత్రి  07 గం.03 ని.లకు రవి[సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును, కావున

ఆదివారము అనగా 14-01-2018వ తేది మకర సంక్రాంతి చెయవలయును.

మకర సంక్రాంతి పురుషుడు ఘోర నామము  మహిష వాహనము. ఘోర  నామం, అగరు  స్నానం, సామాన్య వర్షం , ప్రియంగు అక్షతలుచే కొన్ని పంటలకు నష్టము, ధరలు అధికమగును,కంబళ వస్త్ర ధారణవల్ల రోగభయము, వాసా గంధ లే పముచే కొంత అశుభము,  నల్ల కలువ పుష్ప ధారణ వల్ల పూలధార హెచ్చు,ఫల నాశం,  పగడ ఆభరణ రత్న ధరలు అధికము, సత్తు పాత్ర  లో భోజనం చే రోగము , పెరుగు  భుజించుటవల్ల తేజో నాశము,   మహిష వాహనము చే వాహన ప్రమాదములు అధికము, తోమర శస్త్ర ధారణ వల్ల యుద్ధ బయము, మయూర చత్ర దారణచే మృత్యుభయము తొలగించును, వాయువ్య దిక్కు ప్రయాణము వల్ల వాయువ్య రాష్ట్రములకు ఇబ్బందులుకలుగును.