Menu

Bhakthi

Kaarthika Maasa Visistatha

Kartheeka-Maasam-Spl

కార్తిక మాసములో వచ్చే ప్రతి దినము అత్యంత పుణ్య ప్రదముగా చెప్పవచ్చు, ఈ మాసములో ప్రతిరోజూ తెల్ల వారుజామునే లేచి  తల మీదనుంచి స్నానం చేసి శుభ సంప్రదాయ కర దుస్తులు ధరించి  శివ దర్శనము కావించి ధూప దీప నైవేద్యములు సమర్పించి స్వామికి రుద్రాబిషేకం జరిపించిన చేసిన పాపాలుపోయి మోక్ష ప్రాప్తి కలుగును అని కార్తీక పురాణాది ఇతి హాసములు తెలుపుతున్నవి.
ఈ మాసమునందుః శ్రీ మహా విష్టువు  నదులలో, చెరువులలో, నూతి నీటి ల యందు నివాసము ఉండునని అందువల్ల ఈ ఈ ప్రాంతములలో స్నానము శుభము అని పెద్దల వచనము.
పాడ్యమి :- కార్తీక వ్రతం , విదియ :- భగినీ హస్త భోజనం , తదియ :- అమ్మవారి పూజ, చవితి :- నాగులచవితి , పంచమి :-  జ్ఞాన పంచమి నాగ పంచమి,  షష్టి :-  సుభ్రమణ్య ప్రీతిగా బ్రాహ్మణ బ్రహ్మచారి పూజ, సప్తమి :- సూర్యుని ప్రీతిగా  వస్త్ర దానం గోధుమ దానం, అష్టమి :- గోమాత పూజ  నవమి :- త్రిరాత్ర వ్రతం, దశమి :- యాజ్ఞవల్క జయంతి, ఏకాదశి :- మతత్రయ, భోధన ఏకాదశి, ద్వాదశి :- క్షీరాబ్ధి ద్వాదశి,  త్రయోదశి :-  సాలగ్రామ పూజ దానము,  చతుర్దశి :-  షాషాణ చతుర్దశి, పౌర్ణిమ :- జ్వాలా తోరణము పూజ, శివునికి అత్యంత ప్రితికర దినము.

బహుళ పాడ్యమి :- శాక దానము శుభం, విదియ :- చాతుర్మాస విదియ,అశూన్యశయనవ్రతం, తదియ :- తులసి పూజ, చవితి :-  గణపతికి గరిక పూజ, పంచమి :- అన్నదానము శుభము, షష్టి :-  సుబ్రహ్మణ్య పూజ, సప్తమి :- ఈశ్వరునికి జిల్లేడు పువ్వులతో పూజ, అష్టమి :- కాల భైరవునికి పూజ, నవమి :- రజిత, తామ్ర దానం, దశమి :- అన్న సమారాధన, ద్వాదశి :- స్వయంపాక దానము, త్రయోదశి :- నవగ్రహ పూజ, చర్తుర్దసి :- మాసశివరాత్రి శివునికి అభిషేకము పత్రిపూజ అత్యంత ప్రితికరము, అమావాస్య :- వాజసనేయీ అమావాస్య, పిత్రు దేవతలకు స్వయంపాక దానములు

Sravana maasam

Sravana maasam

sukravaaram mahaa lakshmi pooja valla lakshmi [dhanamu] chekooragaladu

శ్రావణమాసం

ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహా లక్ష్మి పూజకు ఉత్కృష్టమైన మాసం. శ్రావణ మా సంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు విశేషమైనవి. 

శ్రావణమాసం పునస్కరించుకొని శ్రీ భువనేశ్వరి ఫీఠం లో ప్రత్యక పూజలు జరుగును.

అందరికి ఇదే మా  ఆహ్వానము

           ఇట్లు

         భువనేశ్వరి ఫీఠం

వర్జ్జుల వారి వీది డోరు నెం. 6-1-17

      పెద్దాపురం -533437

  తూర్పు గోదావరి, ఆంద్ర  ప్రదేశ్

Nava Grahalu

Navagraha poojaa samayamulo patimcha valasina slokamulu

సూర్య గ్రహము :
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం

చంద్ర గ్రహం :
దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం

కుజ గ్రహం :

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ గ్రహం :

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం

సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం

గురు గ్రహం :

దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం

బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం

శుక్ర గ్రహం :
హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం

శని గ్రహం :
నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

రాహు గ్రహం :
అర్ధకాయం మహా వీరం చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం

కేతు గ్రహం :
ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం