Menu

Dhanssu– Lagnam- Grahamulu

ధను లగ్నము – లగ్నస్థ గ్రహములు – ఫలితాలు  

ధను లగ్నం యొక్క అధిప‌తి గురువు. ఈ లగ్నములో జ‌న్మించిన వారికి మాన‌వీయ విలువ‌లు ఉంటాయి.  ఇతరుల పట్ల దయాబావము కలిగి ఉంటారు. వీరు శివుని పట్ల  నమ్మకం కలిగి భాగ్యశాలిగా ఉండెదరు. ఈ లగ్నంలో మీరు జన్మించ‌డం వ‌ల్ల‌ లగ్నములో స్థితిలో వున్న గ్రహాలు ఏ విధమైన ప్రభావములను చూపుతాయో ఇప్పుడు చూద్దాం.

సూర్యుడు 
ధను లగ్నం యొక్క కుండలిలో సూర్యుడు భాగ్యాదిపతి కాగలడు. ఇది యది లగ్నంలో విరాజితమ‌వ్వ‌డం వ‌ల్ల‌ వ్యక్తికి అందమైన శరీరం కలుగుతుంది. జ్ఞానము, బుద్ది, ఆత్మబలమును ప్రదానించును. ఈ జాత‌కుడి మాటలు ప్రభావంతంగాను, ఆకర్షణీయముగాను ఉంటాయి. వ్యాపారం లేదా ఉద్యోగం రెండూ వీరికి క‌లిసి వ‌స్తాయి. రాయుట‌, చదువుట ఇంకా భౌతిక కార్యములలో లోపప్రియతను పొందగలరు. చిత్ర కళ లేదా శిల్పకళలలో వీరికి అభిరుచి ఉంటుంది. లగ్నస్థ సూర్యుని సప్తమ భావములో బుధుని యొక్క రాశి మిథునమును చూస్తున్నాడు. సూర్యుని దృష్టి ఫలితం వ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి బాగుండును. భాగ్యాదిపతి సూర్యుడు ప్రభుత్వ రంగం నుంచి లాభంను కలిగించును. జీవిత భాగ‌స్వామి, సంతాన సుఖం లభించగలదు.

చంద్రుడు 
చంద్రుడు ధను లగ్నము గల కుండలిలో అష్టమాదిపతిగా ఉండ‌టం వ‌ల్ల మంచి ఫలితాలను ఇచ్చును. యది చంద్రుడు లగ్నము స్థితిలో ఉండ‌టం వ‌ల్ల‌ వ్యక్తి యొక్క మనస్సు స్ధిరత్వము లేకుండా ఉండును. అనుసందానాత్మక పనులలో వీరి అభిరుచి ఉండగలదు. లగ్నస్థ చంద్రుని కారణంగా వ్యక్తి ఆరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చును. వ్యక్తి ప్రయాణాల‌ పట్ల ఆసక్తి గ‌లవాడై ఉండును. కళలతో కూడిన విభిన్న రంగములలో, లేఖనములో వీరికి అభిరుచి అధికంగా ఉండును. చంద్రుని దృష్టి సప్తమ భావములోని సింహరాశిపై పడుతుండ‌టం వ‌ల్ల‌, మిత్ర రాశి కారణంగా అందమైన, సమ్యోగముగల జీవిత బాగస్వామి లభించవ‌చ్చు. సంతాన సుఖం కాస్త‌ ఆలస్యముగా కలుగుతుంది.

కుజుడు  
కుజుడు ధను లగ్నం యొక్క కుండలిలో పంచమాదిపతి, దశమాదిపతిగా ఉండి శుభ కారక గ్రహంగా ఉండును.  కుజుడు వీరిని పరిశ్రమిగా ఉండును. వ్యక్తి తన పరిశ్రమ, శ్రద్ద వల్ల ధనంను ఆర్జిస్తారు. విపరీత లింగం పట్ల ఆసక్తి కలుగుతుంది. కుజుడు గురువు యొక్క ధనురాశిలో ఉండుట వలన శిక్షామార్గములో అవరోధాలను కలిగించును. ప్రథ‌మస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ బావమును చూస్తున్నాడు. ఈ దృష్టి కారణంగా గృహస్థ జీవితంలో భార్యాభర్తల మధ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌వచ్చును. చిన్నచిన్న వివాదాలు కూడా మొద‌ల‌వుతాయి.

బుధుడు  
బుధుడు ధను లగ్నము గల కుండలిలో సప్తమ, దశమ 2 కేంద్రముల అధిప‌తి కాగలడు. 2 కేంద్రముల అధిప‌తిగా ఉండ‌టం వ‌ల్ల‌ ఈ గ్రహం అకారక గ్రహం కాగలడు. కాని బుధుడు లగ్నస్థుడుగా ఉండ‌టం వ‌ల్ల వ్యక్తికి అందమైన, నిరోగములతో కూడిన శరీరం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి స్నేహమును, సమ్యోగమును ప్రధానించును. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ‌ల‌ నుంచి లాభం, గౌరవమును ప్రదానించును. మెట్టింటి నుంచి వీరికి సమయానుకూలంగా లాభమును ప్రదానించును. బుధుడు సప్తమ భావములో స్థితిలో వున్న స్వరాశిని చూస్తున్నాడు. ఈ కార‌ణం వ‌ల్ల అందమైన, సమ్యోగము గల జీవిత భాగస్వామి లభించే అవ‌కాశం. మిత్రుల నుంచి భాగస్వామ్యుల నుంచి లాభాలు క‌లుగును. ఇక వ్యాపారములో లాభములు కలుగును. ఆర్ధిక స్థితి బలంగా ఉండును.

గురువు 
గురువు ధన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి, చతురాదిపతి కాగలడు. కుండలిలో యది గురువు స్వరాశి ధనురాశిలో లగ్నస్థముగా ఉండ‌టం వ‌ల్ల‌ వ్యక్తికి అందమైన, అరోగ్యకరమైన శరీరం ఉంటుంది. వ్యక్తి బుద్ధి జ్ఞానము కలిగి ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలను అందుకోగలరు. భూమి, భవనం, వాహనాల‌ను స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు. ప్రథ‌మ భావములో వున్న గురువు యొక్క పూర్ణ దృష్టి పంచమ భావములో మేష రాశిలో సప్తమలో మిథునముపై, నవమ భావములో సింహరాశిపై ఉండును. గురువు యొక్క దృష్టి ఫలితం వ‌ల్ల‌ వ్యక్తి సాహసం, దయాస్వభావము కలిగి ఉండును. జీవిత భాగస్వామి నుంచి, సంతానం నుంచి ఆనందాలు అందుకోగ‌ల‌రు. జీవితంలో ఐశ్వర్యం, సుఖంతో పరిపూర్ణంగా ఉండును. ఉద్యోగం, వ్యాపారాల్లో సఫలత లభించగలదు. శత్రు భయము ఉండగలదు.. కాని వారు ఈ జాత‌కుల‌కు హాని కలిగించలేరు.

శుక్రుడు  
ధను లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు అకారక, అశుభ గ్రహం కాగలదు. ఇది ఈ లగ్నం యొక్క కుండలిలో 6వ, 11వ భావములకు అధిప‌తిగా ఉండును. శుక్రుడు ధను లగ్నములో లగ్నస్థముగా ఉండుట వ‌ల్ల‌ వ్యక్తి చూడడానికి అందంగా ఉంటాడు. కాని శుక్రుడు షష్టమాదిపతిగా ఉండుట వ‌ల్ల వ్యక్తికి అరోగ్య సంబంధ‌ సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చును. శుక్రుడు ఏకాదశాదిపతిగా ఉండ‌టం వ‌ల్ల‌ ఆర్ధిక స్థితి బాగుపడును. రాజకీయ క్షేత్రముల నుంచి లాభాన్ని ప్రధానించును. శుక్రుని ప్రభావం కారణముగా వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించుటకు అవకాశాలు ప్రభాలముగా ఉన్నాయి. సంగీతం, కళల యందు ఆసక్తి అధికముగా ఉండును. శుక్రుడు సప్తమ భావములో మిత్ర గ్రహమైన మిథునంపై పూర్ణ దృష్టి కల్గి ఉండును. ఫలితంగా వీరి జీవిత భాగస్వామి అందంగాను, సమ్యోగము గలవారుగాను ఉండును. గృహస్థ జీవితం సుఖమయంగా ఉండును.

శని  
శని ధను లగ్నము యొక్క కుండలిలో ద్వితీయ, తృతీయ భావము యొక్క అధిప‌తి కాగలడు. ఈ లగ్నంలో శని లగ్నస్థంలో ఉండ‌టం వ‌ల్ల వ్యక్తి సన్నగా ఉంటాడు. శని ప్రభావము కారణముగా వ్యక్తి నేత్ర రోగం వలన పీడించబడగలడు. వీరికి స్వతంత్రంగా ఏ నిర్ణయము తీసుకొవాల‌న్నా, కష్టంగా ఉండును. జీవితంలో ప్రగతి కొరకు ఇతరుల సమ్యోగము వీరు అధికముగా కోరుకుంటారు. ధనం భ‌ద్రపరచుటలో ప్రవృత్తి కలిగి ఉంటారు. ఇక ఈ జాత‌కుల‌కు అకస్మాత్తుగా లాభములు కలుగే అవ‌కాశాలు ఉన్నాయి. లగ్నస్థ శని తృతీయ భావంలో కుంభ రాశిని, సప్తమ భావంలో మిథున రాశిని, దశమ భావంలో బుధుని రాశి కన్యను చూస్తుండును. ఈ భావములలో శని యొక్క దృష్టి ఉండ‌టం వ‌ల్ల మిత్రుల నుంచి అపేక్షిత లాభం, సమ్యోగము లభించదు. భాగస్వాముల నుంచి ఆప‌ద క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో కష్టం యొక్క అనుభూతి కలుగుతుంది.

రాహువు 
ధను లగ్నం యొక్క కుండలిలో రాహువు లగ్నస్థంగా ఉండుట వ‌ల్ల ఈ జాత‌కుడు పొడుగుగా, అరోగ్యంగా ఉండును. వీరి బుద్ధి కూటనీతి కలదై ఉంటుంది. వారి పనిని ఏ విధంగానైనా చేపట్టే నేర్పు ఉంటుంది. స్వహితం వీరి సిద్దాంతం. రాహువు యొక్క దృష్టి కారణంగా సంతాన సుఖంలో బాధలు, జీవిత భాగస్వామి నుంచి సమ్యోగము లభించుటకు అవకాశాలు తక్కువగా ఉండును. జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా సమస్యలు ఏర్ప‌డ‌వ‌చ్చు.

కేతువు 
కేతువు యొక్క ఉప స్థితి ధను లగ్నం యొక్క కుండలిలో ప్రథ‌మ భావంలో ఉండుటం వ‌ల్ల‌ వ్యక్తి జాత‌కుడికి అనారోగ్యాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. నడుము, శరీర చేర్పులలో నొప్పి ఉండగలదు. ఆత్మబ‌లం లోపము కారణంగా ఏ విధమైన మహత్వపూరితమైన విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకొనుట కఠినంగా ఉండును.