Menu

did-you-know ?

Kartheeka-Maasam

Kaarthika Masam

కార్తిక మాస విశిష్టత

కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీకమాసంలో సూర్యుడు తులాసంక్రమణలో ప్రవేశించగానే గంగానది తో సరి సమానంగా సమస్త జలాలు విష్ణుమయం కావడంతో కార్తిక స్నానం చేసినవారు పుణ్యప్రదులు కావడమే కాకుండా, వాపీ కూప, నదీ స్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని వసిష్ఠ మహర్షి వివరణ. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికర మైనది. కార్తిక మాసములో వచ్చే ప్రతి దినము అత్యంత పుణ్య ప్రదముగా చెప్పవచ్చు, ఈ మాసములో ప్రతిరోజూ తెల్ల వారుజామునే లేచి  తల మీదనుంచి స్నానం చేసి శుభ సంప్రదాయ కరమైన దుస్తులు ధరించి శివ దర్శనము కావించి ధూప దీప నైవేద్యములు సమర్పించి స్వామికి రుద్రాబిషేకం జరిపించిన చేసిన పాపాలుపోయి మోక్ష ప్రాప్తి కలుగును అని కార్తీక పురాణాది ఇతి హాసములు తెలుపుతున్నవి. ఈ మాసంలో వస్తద్రానం, హిరణ్యదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు, యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి, సౌభాగ్యాలు కలుగుతాయి.కార్త్తిక శుద్ధ పౌర్ణమినాడు కేదారేశ్వర వ్రతమాచరిస్తే సమస్త సౌభాగ్యములు కలుగునని వ్రతరాజము తెలుపుతున్నది, శుక్ల దశమి నాడు ”యాజ్న్య వల్క్య జయంతి ”శుక్ల ఏకాదశి మహా పర్వ దినం ఉప వాసాలు రాత్రి దాకా వుండి శివుడిని దర్శించి చంద్ర దర్శనం తదుపరి భోజనం చేస్తారు,  ఆలాయా ల లో ఆకాశ దీపాలు పెడతారు, కార్తీక మాసం లో అమావాశ్య నాడు  ”పోలి”ని స్వర్గానికి పంపుటతో కార్తిక మాసము పూర్తికా గలదు.
ఈ మాసమునందుః శ్రీ మహా విష్టువు  నదులలో, చెరువులలో, నూతి నీటి ల యందు నివాసము ఉండునని అందువల్ల ఈ ఈ ప్రాంతములలోస్నానమాచరించి శుచియై,పొడిబట్టలు ధరించి దీపారాధన చేయుట వల్ల సమస్త పాపాలు తోలగునని,  దీప దానము, శుక్ల ద్వాదశి ని ”చిలుకు ద్వాదశి లేక క్షీరాబ్ధి ద్వాదశి ”అంటారు సాయంకాలం ఉసిరి చెట్టు క్రింద తులసి చెట్టు వద్ద పూజలు చేస్తారు, ఉసిరి చెట్టుకు పూజ చేసి దాని క్రింద భోజనము చేయుట శుభకరము అని పురాణాల వివరణ.

  భువనేశ్వరి పీఠంలో కార్తిక మాస ప్రత్యేక పూజలు

రుద్రాభిషేకము , లక్ష పత్రి పూజ, మహా లింగార్చన, సహస్ర లింగార్చన, పార్ధివ లింగార్చన, జ్యోతిర్లింగార్చన,ఉమాకేదారేశ్వర వ్రతం, శివ కల్యాణములు జరుగును. ఈ కార్తిక మాసమును పునస్కరించుకొని భువనేశ్వరి పీఠంలో కార్తిక మాస ప్రత్యేక పూజలు అత్యంత వైభవముగా జరుగును ఈ పూజలలో పాలుగొను భక్తులు సంప్రదించు నెం :-9866193557

Vinaayaka Chathurdhi

ganpathi

ganpathi

వినాయక చవితి శుభాకాంక్షలు

వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నమ్ కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! గణపతి ఉద్భవించిన రోజుగా పురాణముల ద్వారా తెలియుచున్నది. సర్వ గణ నాయకుడిని ఈ రోజు అర్చించిన సర్వ శుభ సౌభాగ్యములు, కార్యసిద్ధి, కేతుగణ దోష నివారణ, అపనిందలు తోలగుటయే కాక అనేక శుభములను స్వామి ప్రసాదించగలడు. ప్రత్యేకముగా వినాయకచవితి రోజున  21 (ఏక వింశతి) రకాల ఆకులతోచేస్తే సకల శుభాలు కలుగుతాయి. 1. మాచీ పత్రం:- చేమంతి జాతికి చెందినది. 2. దూర్వా పత్రం:- గరిక గడ్డి 3. అపామార్గ పత్రం:- ఉత్తరేణి. 4. బృహతీ పత్రం:- ములక. 5. దుత్తూర పత్రం:- ఉమ్మెత్త. 6. తులసీ పత్రం:- తులసి. 7. బిల్వ పత్రం:- మారేడు ఆకు. 8. బదరీ పత్రం:- రేగు. 9. చూత పత్రం:- మామిడి ఆకు. 10. కరవీర పత్రం:- గన్నేరు. 11. మరువక పత్రం:- ధవనం. 12. శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకు. 13. విష్ణుక్రాంత పత్రం:- విష్ణుక్రాంత. 14. సింధువార పత్రం:- వావిలి ఆకు. 15. అశ్వత్థ పత్రం:- రావి ఆకు. 16. దాడిమీ పత్రం:- దానిమ్మ ఆకు. 17. జాజి పత్రం:- సన్నజాజి. 18. అర్జున పత్రం:- మద్దిచెట్టు ఆకు. 19. దేవదారు పత్రం:- దేవదారు ఆకు. 20. గండలీ పత్రం:- లతాదూర్వా. 21. అర్క పత్రం:- జిల్లేడు ఆకు. అందరు ఈ పత్రములతో స్వామిని అర్చించి శుభాన్ని పొందండి గం గణపతయే నమః