Menu

did-you-know ?

Shakunaalu – Phalithaalu

శకునాలు - వాటి ఫలితాలు

శకునాలు – వాటి ఫలితాలు

మానవ ఆచారవ్యవహారాల విషయంలో, శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అయితే శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు. శుభ శకునాలు, అశుభ శకునాలు. ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకొని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని పూర్వ కాలం నుంచి ఆధునిక కాలం వరకు నమ్మకం ఉంది.

మంచి శకునం ఎదురు రావడం వలన, తలపెట్టినకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంద పురాతన కాలం నుంచి ఉన్న విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతోంది. శకునం విషయంలో చాలామంది తమ పెద్దల మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాల నిమిత్తమైనా.. శుభకార్యాల నిమిత్తమైనా బయలుదేరుతూ వున్నప్పుడు మంచి శకునం చూసుకుంటూ ఉండాల్సిందే. మంగళప్రదమైన ధ్వనులు … శుభప్రదమైన వస్తువులు ఎదురైనప్పుడు మంచి శకునాలుగా భావించి అడుగుబయటికి పెట్టాలి.

అలాగే కొన్ని శకునాలు కార్యహానిని కలిగించేవిగా చెప్పబడుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడుతూ వుండగా ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా, ఏదో ఒక కారణంగా ఎవరైనా ఏడుస్తూ ఎదురుగా పరిగెత్తుకు వచ్చినా అది కార్య హానిని కలిగించే శకునంగా చెప్పబడుతోంది. అందుకే అలాంటి శకునం ఎదురైనప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెప్పబడుతోంది.

శుభ శకునాలు
పెళ్ళి ఊరేగింపు, మంగళవాయిద్యములు, ఇద్దరు బ్రాహ్మణులు, దండధరుడగు శూద్రుడు, కన్య, ముతైదువు, పండ్లు, పువ్వులు, ఛత్రచామరములు, ఏనుగు, గుఱ్ఱము, పూర్ణకుంభము, చెఱుకు, పాలు, అన్నము, పెరుగు, ఆవు, బియ్యము, కల్లుకుండ, మాంసము, పొగలేని నిప్పు, తేనె, చలువ వస్త్రాలు, అక్షతలు, వీణ, మృదంగం, శంఖం, నల్లకోతి, భ్రమరము, తెల్లని వస్తువులు, కుక్క చెవి విదల్చుట, వధూవరులు, ఘంటానాదం, జయశబ్దము, మంగళ వస్తువులు, ఎదురుగా మృదువైన శీతల వాయువులు వీచుట లేదా వెనుక నుంచి ప్రయాణానికి అనువైన గాలులు వీచుట, తెల్లని వృషభము, అద్దం మొదలైనవి ఎదురుపడిన శుభప్రదం.

పశుపక్ష్యాదుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గ్రద్ద, ఆవు, జింక, ఉడుత, చిరుత వంటివి ఎడమ నుంచి కుడి వైపుగా వెళ్ళాయంటే వీటన్నిటిని శుభ శకునాలుగా గుర్తించవచ్చు.

అశుభ శకునాలు
ఏడుపు వినుట, అకాల వర్షము, ముక్కు చీదుట, బల్లిపడుట, వితంతువులు, జుట్టు విరబోసుకున్నవారు, జుట్టులేనివారు, ఒకే తుమ్ము, ఊక, కలహము, చెడుమాట, ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయబట్టలు కట్టినవారు, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, ముష్టివాడు, కుంటికుక్క, ముక్కులేనివాడు, గుడ్డివాడు, రోగి, కుంటివాడు, రజస్వల, గర్భిణీస్ర్తీ, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, ఆమేధ్యం, నువ్వులు, మినుములు, గొఱ్ఱెలు, నపుంసకులు, పిల్లి, పంది, దూది, మజ్జిగ, బూడిద, కురూపి, చెడు జంతువులు, ఆయుధమును ధరించినవాడు, విరోధి,  వెళ్ళవద్దని కోరుట, భోజనము చేయమని అడుగుట, సిద్ధవస్తువులు, జారుట, దెబ్బతగులుట, తొట్రుపడుట, మనసు కీడు శంకించుట, ఆరోగ్యము లేకుండుట, గుడ్లగూబ అరచుట.. వంటి పరిణామాలు ఎదురుపడినా ఇవన్నీ అశుభాలే.

అశుభ శకునాలు ఎదురైన వెంటనే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని 12 పర్యాయాలు నీళ్ళు పుకిలించి ఊయవలెను. తలపై నీరు చల్లుకొని.. కళ్ళు నీళ్ళతో తుడుచుకొని కూర్చుని కాసిన్ని నీళ్లు తాగి ఇష్టదైవంను ప్రార్థించి, తర్వాత మరొక శుభ శకునమును చూసుకొని ప్రయాణం చేయవలెను. ప్రయాణాలకు బయలుదేరునప్పుడు ‘ఎక్కడికి?’ అని గానీ, ‘ఎప్పుడు వస్తావు?’ అని గానీ, ‘నేనూ రానా?’ అని గానీ ఎవరూ అడుగరాదు. ప్రయాణమై వెళ్ళిన వెంటనే ఇల్లు కడుగుట, ఇల్లాలు తలస్నానం చేయుట దరిద్రానికి కారణాలు. అందుకే ఇలాంటి విషయాల్లో తగిన రీతిలో ఉండటమే మంచిది.

remedies for graha dosha

remedies for graha dosha

జాతక దోషాలు నివారణ ఎలా?

విశ్వంలోని ప్రతి జీవి తన గమ్యాన్ని తానే సాధించుకుంటుంది. కర్మ కొద్దీ కష్టాలు ప్రాప్తిస్తాయని తాను అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం మాత్రమే జీవితానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, దానిని ఏ విధంగా ఎదుర్కోవాలనే మానసిక సంసిద్ధతను జీవికి కల్గిస్తుంది. ఇటువంటి జ్ఞానం వ్యక్తి జీవితాన్ని గాని, తోటి వారిని గాని, దైవాన్ని గాని నిందించకుండా చేస్తుంది. వ్యక్తుల జీవితాలలో ఏ తప్పులు జరగనప్పటికీ, వారు ఎందుకు బాధలు పడతారో.. ఓ భగవత్ సంబంధమైన కర్మ సిద్ధాంతం మాత్రమే వివరిస్తుంది.

జాతకంలోని 12 భావాలలో ఎక్కడ లోపాలు లేవని, కొందరు పండితులు చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ప్రత్యేక గ్రహస్థితులు అనేక రకాలుగా ప్రతి వారి జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి.

పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలిత ప్రభావం ఉన్ననూ, అది జాతకులలో  అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితిగా ఉంటే మంచిదే. కాని ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితం. అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇలాంటి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితం.

పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. అయితే ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. వ్యక్తులు చేసే కార్యాకార్యాల ప్రభావం.. వారు మరణించిన తదుపరి సంతతికి ఫలితాలను చూపుతూనే ఉంటాయి. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తికి నలుగురు సంతానం ఉన్నారనుకుందాం, ఆ వ్యక్తి చనిపోయే లోపు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలను ఇవ్వకుండా మంచి భావంతో దాన ధర్మాలు చేసి కాలం చేశాడు. మరి ఈ దాన ధర్మాలు చేసిన వ్యక్తి చనిపోయిన తదుపరి… వారి సంతతిపై వారికున్న నలుగురు సంతానంపై అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని అనుకోవాలి. కాని ఈ నలుగురు సంతానంలో తమ చనిపోయిన తండ్రి చేసిన విశేష కార్యాల ప్రభావ ఫలితాలు.. తాను తన జాతకరీత్యా పొందే అవకాశము గల గ్రహస్థితి ఉన్నప్పుడే.. ఆ సంతతికి పూర్ణ ఫలాలు లభిస్తాయి.

అలా కాకుండా ఒక వ్యక్తి అందరినీ హింస పెడుతూ, దాన ధర్మాలు చేయకుండా, నేరాలు కుట్రలు కుతంత్రాలు, హత్యా రాజకీయాలు మొదలైనవాటిని ప్రేరేపిస్తూ కాలం చేశాడని అనుకుందాం. ఈ వ్యక్తికి కూడా నలుగురు సంతానం ఉన్నారనుకుందాం. మరి ఇప్పుడు ఈ దుర్మార్గపు లక్షణాలు గల వ్యక్తి చనిపోయిన తదుపరి.. వాటి ప్రభావ ఫలితాలు నలుగురు సంతతిపై ఉంటుందా ? ఒక్కోసారి ఈ నలుగురు సంతతిపై వాటి ఫలితాలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు లేక కొంతమందికే ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి కలిగిన సంతానం జన్మ జాతకాల ప్రకారం.. తమ చనిపోయిన తండ్రి చేసిన దుర్మార్గపు కార్యాల ప్రభావ ఫలితాలు సంతతికి ప్రాప్తించే గ్రహ స్థితి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.

ప్రారబ్ధం ప్రకారం ప్రతీది జరిగి తీరవలసినదే. అందుచేత జన్మ జాతకాలలో దృష్టముగాఉన్న (కనిపించే) గ్రహస్థితులు కాకుండా అదృష్టంగా (కనపడకుండా అంతర్లీనంగా ఉండే) గ్రహస్థితుల వలన ఫలితాలు జాతకులకు ఒక్కోసారి అనూహ్యంగా విజయావకాశాలు ఇస్తుంటాయి లేదా సమస్యాత్మకంగా ఉంటుంటాయి.

ప్రారబ్దమనేది 2 రకాలుగా ఉంటుంటుంది. ఒకటి దృష్ట ప్రారబ్ధం, రెండు అదృష్ట ప్రారబ్ధం. దృష్ట అంటే కనపడునది అని అర్ధము. దృష్ట ప్రారబ్దం వలన ఫలితాలు మంచిగాను, చెడుగాను వస్తుంటాయి. వాటిని జాతక పరంగా, గ్రహ సంచార స్థితుల రీత్యా తెలుసుకోవచ్చు.  అదృష్ట అంటే కనపడనిది అని అర్థము. ఇక్కడ అదృష్ట ప్రారబ్దం అంటే ఏదో విజయం వరించిందనే అర్థం కాదు. ఒక వ్యక్తి మంచి ఫలితాలను అనుభవిస్తుంటాడు. చెడు ఫలితాలను అనుభవిస్తుంటాడు. ఇట్టి ఫలితాలను వారి వారి జాతక చక్రాల ద్వారా ప్రత్యక్షంగా గమనించలేము. చాలా బాగా లోతుగా పరిశీలిస్తేనే గోచరమవుతుంది. వీటినే అంతర్లీన జాతక దోషాలలో గమనించవచ్చు.

దృష్ట ప్రారబ్దం అంటే జాతక చక్రాలలో పైకి కనపడే గ్రహ సంచార స్థితులను బట్టి అంశాలు ఇలా ఇలా ఉంటాయని… దీనితో పాటు పితరులు చేసిన కార్యాకార్యాలను బట్టి కూడా గ్రహస్థితులు ఉంటాయి గనుక, వాటి ఫలితాలు అలా జరగబోతున్నాయని… దానికి తగిన జాగ్రత్తలు ఫలాని విధంగా తీసుకుంటూ ఉండాలని, ఫలాని శాంతి క్రియలు జరుపుకోవాలని… చెప్తుంటారు.

అదృష్ట ప్రారబ్దం అంటే విజయం కాదు. గత జన్మలో చేసిన మంచి చెడు అంశాలను బట్టి, పితరులు చేసిన కార్యాకార్యాలను బట్టి కూడా గ్రహస్థితులు ఉంటాయి. గనుక వాటి ఫలితాలు ఒక్కోసారి ఆశ్చర్యకరమైన రీతిలో వ్యక్తులు ఊహించకుండానే విజయాలను పొందుతూ ఉంటారు. అదే రీతిలో ఊహించకుండానే అపజయాలను పొందుతుంటారు.

జాతక దోషాలకు ధాన్యాలు
ప్రతి గ్రహానికీ వాటికి సంబంధించిన ధాన్యాలున్నాయి. ఎవరికైనా జాతక చక్రంలో దోషాలేవైనా ఉన్నా, గ్రహ దోషాలవల్ల అనారోగ్యంపాలయినా, ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చేయడం లేదా, ఆవుకు తినిపించడం వల్ల మరియు జప తర్పణ హోమదికాలు చేయుట వల్ల  దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుంది అని అనేక జ్యోతిష గ్రధములు వివరించినవి.

రవి          –         గోధుమలు
చంద్రుడు  –        బియ్యం
కుజుడు     –         కందులు
బుధుడు   –         పెసలు
గురువు     –         శనగలు
శుక్రుడు     –        బొబ్బర్లు
శని            –         నువ్వులు
రాహువు    –        మినుములు
కేతువు     –         ఉలవలు