Menu

Historical Evidences

సిద్ధాంతి గారు చెప్పిన{వ్రాసిన} విధముగానే జరిగిన విషయములు చదవండి … 

శ్రీ మన్మధ నామ సంవత్సర నవ నాయక ఫలము

{ 2015 -2016}

రాజు :- శని

ప్రజల జీవనప్రమాణములు వ్రుద్దిగా ఉండుట, ప్రభుత్వముల మధ్య భేదములు, విదేశీ ప్రయాణములుతో సమర్ధ వతమైన పరిపాలన ఉండగలదు, సరిహద్దు లలో యుద్ధ వాతావరణము ఉండగలదు, వెండి,బంగారం,ధాన్యముల ధరలు పడిపోవుట, విదేశి మారకద్రవ్యములు పెరుగుట, ప్రజలు అధర్మ మార్గములో సంచరించుట, పంటల దిగుబడి ఉండును, విచిత్ర వృష్టి ఉండును.

మంత్రి :- కుజుడు

నగరములయందు అల్లర్లు, అగ్ని ప్రమాదములు, భూ ప్రకంపములు, ప్రపంచములో కొన్ని దేశాల మద్య యుద్ధ వాతావరణము, భార్య భర్తల మద్య విరోధములు, కంప్యుటర్, ఎలట్రానిక్, కొత్త వ్యపారములు, అభివృద్ద కరముగా ఉండును, వాహన ప్రమాదములు అధికము, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అనేకము వచ్చుటచే వారికీ మంచి సమయము.

సైన్యాధిపతి :- చంద్రుడు

ఆయుధ సంపత్తు పరుగుట,సరి హద్దు ప్రాంతములు పటిష్టముగా ఉండుట, దేశ సరిహద్దు తగాదాలు పెరుగును, పకృతి విపరీతములలొ సైన్యము సహకరించుట, మంచి వృష్టి, బాగుండును, భయానక సంఘటనలు ఉండగలవు, పల పర్స్రమాలు అభివృద్ధి చెందగలవు.

సస్యాధిపతి :- శుక్రుడు

వ్యవసాయమునకు మంచి సమయము, మెట్టలుబాగా పండును, నూతన పద్దతులతో కూడి ఉండును, తెలుపులు, బొబ్బర్లు, శెనగ, పొట్టి ధాన్యములు, ఔషద మొక్కలు బాగ ఉండును, స్త్రీ ఆధిపత్యము పెరుగును, మధు మేధవ్యాధి అధికముగా పెరుగును, రంగురాళ్ళ గిరాకి పెరుగును.

ధాన్యాధిపతి :- భుదుడు

అన్ని ధాన్యపు పంటలు బాగుండును, పెసర ధాన్యము బాగా పండును, అన్ని రకముల వ్యాపారములు అభివృద్ధిగా సాగును, దేశములో ఆహార ఉత్పత్తులు పెరుగును, ఆర్ధిక మాన్యము తగ్గుటే కాక షేర్ మార్కట్టు రికార్డు స్థాయి ఉండును, గాలి వర్శాభావములు అధికము.

అర్ఘాదిపతి :- చంద్రుడు

విశేష వర్షములు, ప్రకృతి వైపరిత్యములు అధికము, జన జీవనము స్తంభించును, అక్కడక్కడ జలప్రళయములు ఉండును, కొన్ని వ్యాపారములు ధాన్యధరలు అధికము పెరుగును కొన్ని పడిపోవును, దిగుమతులు తగ్గును.

మేఘాదిపతి :- చంద్రుడు

దేశము అంతా వర్ష భావము అధికము.విశేష వర్షముల వాళ్ళ ప్రజా జీవనమునకు ఇబ్బంది కలుగును, ఉత్తరాదిన అధిక ప్రమాదములు,తమిళనాడు, కేరళ తిర ప్రాంతములలో అధిక నష్టము ఉండును, పాడి పరిశ్రమ అభివృద్ధిగా ఉండును, ప్రజలు మానసికముగా ఇబ్బందులు ఎదుర్కోందురు, ప్రతి కుటుంబము లోను ఏదో ఒక సమస్యలు ఉండును, ధరలు పెరుగును.

రసాధిపతి :- రవి

కంటికి సంబదిత వ్యాధులు పెరుగును, పిడుగు బాట్లు, నెయ్యి, పంచదార, నూనె ధరలు పెరుగును, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలమద్య విభేదాలు ఇటువంటి వాటితో ప్రజలకు ఇబ్బంది కలుగును. ఉష్ట్నోగ్రత అధికముగా రికార్డుస్థాయిలో ఉండును, రక్షణ వ్యవస్థ సకాలములో సమస్యలను గుర్తించుట చే భారి ప్రమాదములు అరికట్టేదరు, విదేసములలో మన దెశ ఖ్యాతి పెరుగును.

నీరసాధిపథి :- శుక్రుడు

సుఘంధ ద్రవ్య వ్యాపార రంగము మంచి అభివృద్ధిగా ఉండును, మత్తు పానియముల ధరలు అధికమగును, పువ్వులు, పండ్లు ధరలు పెరుగును, ప్రజలు విలాస వంత జీవితము గడుపుదురు, కళాకారులకు మంచి సమయము, విదేశములలో ఉన్న ధనము బయటికి వచ్చును, మహిళలకు అన్ని విధములా బాగుండును.

మకర సంక్రాంతి, ఫలములు

ది. 15-01-2016 వ తేది ఉదయం 06 గం.36 ని.లకు రవి[సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును, కావున గురువారము అనగా 15-01-2016 వ తేది మకర సంక్రాంతి చెయవలయును.

మకర సంక్రాంతి పురుషుడు మిశ్ర నామము వరాహ [పంది] వాహనము

మిశ్ర నామం గోవులకు అరిష్టం, శంఖోదక స్త్నానం, ఆరోగ్యం మినుములు అక్షతలు మినుము ధాన్యం ధరలు అధికమగును,విచిత్ర్త వస్త్ర ధారణవల్ల ప్రజాసోవ్ఖ్యము, కుంకుమ గంధముచే యుద్ధ భయం, వకుల పుష్ప ధారణ వల్ల కీర్తి, వెండి ఆభరణ ధారణ వల్ల వెండి ధర తగ్గుట,రాగి పాత్ర వల్ల లోహ నాశనము, భక్ష్యములను భుజించుటవల్ల స్పోటక భయం, మామిడి పండ్లు తినుట వల్ల ప్రజాసౌఖ్యము, వరాహ వాహనము వల్ల మహిష నాశనము, ఖడ్గ ఆయుధముచే యుద్ధ భయం, పితచెత్రము చే పితవస్తు నాశనం, లజ్జచేస్ట వల్ల ప్రజా వృద్ధి, ఉత్తరదిక్కు ప్రయాణము వల్ల ఉత్తరాది రాష్ట్రములకు ఇబ్బందులు, ఊర్ద్వదిక్సితి వాళ్ళ రాజాదులకు శుభము.