జ్యోతిష్యము
Luckey Numbers In Stars
అదృష్ట సంఖ్యలు
సంఖ్యా శాస్త్ర రిత్యా జన్మ లేక నామ నక్షత్రములకు సంబందించిన సంఖ్యలు
అశ్వని – మఖ – మూల = 7 
భరణి – పుబ్బ – పూర్వాషాడ = 6
కృత్తిక – ఉత్తర – ఉత్తరాషాడ = 1
రోహిణి – హస్త – శ్రవణం = 2 
మృగశిర –  చిత్త – ధనిష్ట = 9
ఆరుద్ర – స్వాతి  – శతబిషం = 4 
పునర్వసు – విశాఖ – పూర్వభాద్ర = 3
పుష్యమి – అనూరాధ -ఉత్తరాబాద్ర  = 8
ఆశ్లేష – జ్యాస్త – రేవతి = ౫
ఇవి జీవితాంతము ఒకటే ఉండును,  ఉదాహరణకు హరి పునర్వసు కావున విరి అదృష్ట సంఖ్య 3 ఈ విధముగా అదృష్ట సంఖ్య తెలుసుకోవచ్చు. 
        Janma Nakshathara Vrukshaalu
జన్మ నక్షత్ర వృక్షాలు
కొన్ని నక్షత్రాలకు కొన్ని వృక్షాలు మనస్సుకు ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అంద జేస్తాయి.
అస్వని కి అడ్డసరం, భరణి కి దేవదారు, కృత్తిక కి అత్తి, రోహిణి కి నేరేడు, మృగశిర కి చండ్ర, ఆరుద్ర కి రేల, పునర్వసు కి వెదురు, పుస్యమి కి పిప్పిలి, ఆశ్లేష కి నాగకేసరం, మఘ కి మర్రి, పుబ్బ కి మోదుగ, ఉత్తర కి జువ్వి, హస్త కి కుంకుడు, చిత్త కి తాడి, స్వాతి కి మద్ది, విశాఖ కి నాగకేసరం, అనూరాధ కి బొగడ, జేష్ట కి విప్ప, మూల కి పూర్వాషాడ కి నిమ్మ, ఉత్తరాషాడ కి పనస, శ్రవణం కి జిల్లేడు, ధనిష్ట కి జమ్మి, శతభిషం కి అరటి, పూర్వబాద్ర కి మామిడి, ఉత్తరబాద్ర కి వేప, రేవతి కి విప్ప.
ఈ వృక్షాలను పెంచుట మరియు పూజించుట,  వీటి ఫలములను ఆహారముగా తీసుకొనుట వల్ల శుభము .    
        



 
   
 







