జ్యోతిష్యము
వధూవరులకు పరస్పరం వైరం కలిగించే నక్షత్రాలు
వధూవరులకు పరస్పరం వైరం కలిగించే నక్షత్రాలు
అశ్వని-జ్వేష్ట, భరణి-అనూరాధ, కృత్తిక-వి శాఖ, రోహిణి-స్వాతి, ఆరుద్ర-శ్రవణం, పునర్వసు-ఉత్తరాషాఢ, పుష్యమి-పూర్వాషాఢ, ఆశ్లేష-మూల, మఘ-రేవతి, పూర్వఫల్గుణి-ఉత్తరాభాద్ర, ఉత్తర ఫల్గుణి-పూర్వాభద్ర, హస్త-శతభిషం నక్షత్ర సముదాయాలు వధూవరుల విషయంలో వైరం కలిగించే నక్షత్రాలు.
ఈ నక్షత్రాల జంతువుల విషయములో కూడా విరోధ జంతువులు అయిన ఆ ఇద్దరు ఎప్పుడూ గొడవప డతారు.
ద్విపాద నక్షత్రాలకు ‘చిత్ర, ధనిష్ట, మృగశిర పరస్పర వైరం కలిగి ఉంటాయి.
Mesham—Aries
మేషం-2017-18
అశ్వని 1,2,3,4. పాదములు
భరణి 1,2,3,4. పాదములు
కృత్తిక 1.వ పాదం వారికి
ఆదాయము – 5 వ్యయము – 5, రాజ పూజ్యము – 3 అవమానము – 1
గురుడు సెప్టెంబరు 12 వరకూ 6 ఇంట లోహ మూర్తిగాను తదుపరి రజితమూర్తిగాను, శని రజత మూర్తిగా 9 వ ఇంట రాహువు ఆగస్టు 17 వరకూ 5 వ ఇంటసువర్ణ మూర్తిగా, 11వ ఇంట కేతువుసువర్ణ మూర్తి గా తదుపరి 4వ యింట రాహువు, 10వ ఇంట కేతువు తామ్ర మూర్తులుగా సంచరించెదరు.
దీన్ని బట్టి ఫలితములు చూడగా ఈ రాశివారికి సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబ విరోధములు, కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే విజయం, పై అధికారులచే మాట పడటం, శతృవుల వల్ల ఇబ్బంది సూచిస్తున్నది. సెప్టెంబర్ 12 తదుపరి మంచిగా ఉండును.
ఉద్యోగస్థుల విషయమై చూడగా వారికి శుభఆశుభ ఫలితములు ఉండగలవు. కొంతమందికి దూరప్రాంతాలకు బదిలీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగములో ఉన్నవారికి శ్రమ, సెప్టెంబర్ 12 తదుపరి కొంచెం ప్రశాంతత ఏర్పడి, ఉద్యోగం పర్మినెంట్ అవుట జరుగలదు.
రాజకీయ రంగంలో ఉన్నవారికి చూడగా, ప్రథమార్థంలో అదినాయకత్వం నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ, తదుపరి వారి శ్రమని గుర్తించగలరు.
వ్యాపారస్తులకు చూడగా వైద్య, చేతి వృత్తుల వారికి శుభఫలితములు గోచరించుచున్నవి. పాడిపరిశ్రమలకు కూడా శుభఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యాపార లాభాలు ఉంటాయి.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చిన్న సినిమాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. నూతన నటీనటులకు ప్రొత్సాహం లభించగలదు.
ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం ఫలితాలు చూడగా వారు చదువుపై ఏకగ్రత పెంచుకున్నట్టయితే మంచి ర్యాంకులు పొందే అవకాశాలు ఉన్నాయి.
క్రీడారంగముల వారికి కూడా ఈ సంవత్సరం తగిన ఫలితములు ఉండగలవు.
వ్యవసాయ రంగముల వారికి చూడగా మొదటి పంటకన్నా, రెండవ పంట ఆశాజనకంగా ఉండగలదు. బ్యాంకుకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వపర సహాయం ఉండగలదు.
ఈ సంవత్సరం వీరు శని, రాహు కేతులకు శాంతి చేయించుకొనుట, రాహు కేతు యంత్రాలు ధరించుట శుభము.
.
యంత్రములకై సంప్రదించండి :- గోపి శర్మ సిద్ధాంతి సెల్ నెం .9866193557