Jyothishyam- Vasthu
జ్యోతిష్యం-వాస్తు కలిస్తే సంపూర్ణ జీవితం..!
మానవుడి జీవితంపై పంచ భూతాల, ప్రకృతి శక్తుల ప్రభావం ఉంటుంది. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మనిషి జీవితంలో జ్యోతిష్యం.. వాస్తు రెండిటి ప్రభావం కలిసి ఉంటుంది. ఇందులో జ్యోతిష్యం శారీరక అంగాలలో కన్ను అయితే.. వాస్తు దృష్టిలాంటిది.
జ్యోతిష్య శాస్త్రం మనిషికి మూడోనేత్రం లాంటిది. జ్యోతిష శాస్త్రంలో 1. సిద్ధాంత, 2. సంహిత, 3. హోర, 4, శకున 5. ప్రశ్న విభాగాలుగా ఉన్నాయి. అందుకే జ్యోతిష్యశాస్త్రాన్ని పంచ స్కందత్రయమని అన్నారు. ఇందులో ప్రతి విభాగానికి ఓ ప్రత్యేకత ఉంది. సకల మంత్రములలోనూ గాయత్రి ఎంత ప్రధానమో.. సకల శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యత అంత గొప్పగా చెప్పగలగాలి. ఇందులో ముఖ్యంగా సిద్ధాంత భాగాన్ని పరిశీలిస్తే.. గణిత, ఖగోళ శాస్త్రాల గురించి చెప్పారు. హోరా భాగాన్ని చూస్తే జనన సమయ నిర్ధారణ, జాతక నిర్మాణము, షోడశ వర్గులు సాధన చేసే విధానం ప్రతివారికి ఉపయోగపడే వివిధ రాజయోగాలు, పూర్వ జన్మ విశేషాలు ఉన్నాయి. సంహిత భాగాన్ని పరిశీలిస్తే.. అందులో మనకి వాస్తుకు సంబంధించిన అనేక విషయాలు కనబడతాయి. దేవాలయ, తటాక, ఆరామ, గ్రామ, గృహ, శిల్ప వాస్తులన్నీ అందులోనే కనబడతాయి. అంతేగాక జలార్గళం, వివిధ రత్నాలు, పశు సాముద్రికం, అంగ సాముద్రికం వంటి అంశాలను గమనించవచ్చు.
జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగాన్ని తీసుకున్నట్లయితే ‘సంహిత’ అనగా కూర్చబడేది, పేర్చబడేది అని అర్థం. అనేక రకాల అంశాలను కలిపి ఇందులో పేర్చి మనకి అందించారు. జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగంలోని ఒక భాగమే వాస్తుశాస్త్రం. అంటే జ్యోతిష్య శాస్త్రంలోని ఒక భాగమే వాస్తు శాస్త్రమని అందరూ అర్థం చేసుకోవాలి.
నివాస గృహం అనేది ప్రకృతి శక్తులను స్వేచ్ఛగా ఆహ్వానించేదిగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. పంచభూతాల గమనం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం అందరికీ తెలియదు. దానికొక శాస్త్రం ఉంది. అదే వాస్తు శాస్త్రం. గృహ నిర్మాణానికి సలహాలు, ఇంటిలో మార్పులు చేర్పులపై సూచనలు ఇచ్చేవారే వాస్తు నిపుణులు.
దశలను చెప్పేది జ్యోతిష్య శాస్త్రం, దిశలను సూచించేది వాస్తు శాస్త్రం. ‘దశ బాగుంటే, దిశ బాగుంటుంది’ అన్న నానుడి అందరికీ తెలిసిందే. అంటే జ్యోతిష్యం ప్రకారం నడుస్తున్న దశలు బాగున్నప్పుడే మనం ఉంటున్న దిశలు (వాస్తుప్రకారం) బాగుంటాయి అన్నది అర్థవంతమైన సంగతే కదా!
దశలు, దిశలు సరిచేసుకున్నప్పుడే వ్యక్తి జీవితం బాగుంటున్నది నిర్వివాదాంశం. కుటుంబానికి వాస్తు, జ్యోతిష్యం రెండూ రెం డు కన్నులే గాని ‘కేవలం వాస్తే ప్రధానం.. కాదు.. కాదు.. జ్యోతిష్యమే ప్రధానం’ అని అనుకోకూడదు. వ్యక్తి జీవిత చక్రంలో వున్న సమస్యలను సరిగా విశ్లేషించి నడుస్తున్న దశలు, అంతర్ధశలు, గోచార ఫలితాలు గమనించి ఎలాం టి ప్రతిబంధకాలని అతను ఎదుర్కొంటున్నాడో గమనించి దానికి తగ్గ రెమెడీస్ (పరిహార క్రియలు.. అనగా జపం, దానం, శాంతి, హోమం, రత్నధారణ మొదలగునవి) పాటించి.. ఆ ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడగలిగిన తరువాతే ప్రశాంతత వస్తుంది. 50 శాతంకు పైగా జాతక ప్రభావం మనిషిపై ఉంటుంది. ఇంక మిగిలిన వాస్తును సరిచేసుకోవాలి.
ఎలాంటి ఇంట్లో ఉండాలి..? ఏ ముఖ ద్వారం ఉండాలి..? ఇలా ఇల్లంతా… లోపల, బయట కూడా వాస్తు ప్రకారం ఉందా..? వీధి శూలలు, వెన్ను శూలలు లేవుకదా..? చుట్టూ సక్రమమైన ప్రహారీ ఉందా? అంతేగాక ఇంట్లో వస్తువులన్నీ వాస్తు ప్రకారం అమి రాతయా లేదా?అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే వ్యక్తి పైన జాతకం ప్రభావం దాదాపు జాతకం 60 శాతం ఉంటే, వాస్తు 40 శాతం ఉంటుంది. రెండూ సరిగ్గా ఉండాలి. ఏది సరిగ్గా లేకపోయినా దాని ప్రభావం ఆ వ్యక్తిపైన ఉండి తీరుతుంది. అంతేకాదు మనకి నడుస్తున్న దశలు సరిగ్గా లేనప్పుడు మనం ఉండే గృహం కూడా వాస్తు సరిగ్గా లేనిదే అవుతుంది.
కనుక.. వ్యక్తి జాతకాన్ని ముందుగా పరిశీ లించి అతను ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించి అట్టి వ్యక్తి ఎలాంటి రూములో, ఎలాంటి ద్వారము, ఎలాంటి సమస్యలున్న ఇంట్లో ఉంటున్నాడో చెప్పగలుగుతున్నాము. అంటే జ్యోతిష్య శాస్త్రంను బట్టే ప్రధానంగా మనం గ్రహించి చెబుతున్నా ము. అప్పుడు ఆ దశలను బట్టి పరిహార ప్రక్రియలు వ్యక్తి పాటించి 60 శాతం ఊరట చెందాక, ఆ ద్వారానికి, ఇంటికి గాని ఉన్న సమస్యను కూడా వాస్తు ప్రకారం సరి చేస్తే పూర్తి స్థాయి మంచి ఫలితాన్ని అతను అనుభవించగలడు. కేవలం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టేసి అందులో వ్యక్తిని ఉంచితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ వ్యక్తికి నడుస్తున్న దశలు ఎంత అధ్వాన్నంగా ఉన్నా మామూలుగా మారిపోలేడు కదా? లేని రాజయోగాలు రావు కదా.. అలా అని జ్యోతిష్యం ప్రకారం రెమెడీస్ పాటించి వాస్తు బాగుండని ఇంట్లో ఉంటే ఫలితాలు సగమే ఉంటాయన్న విషయం మరిచిపోకూడదు.
ఎవరైనా సరే జ్యోతిష్యం ప్రకారం నడిచే దశలు, గోచారాన్ని ముందుగా చూపించుకొని అసలు ఆ వ్యక్తి జీవితంలో అతను ఆశిస్తున్నవి అనగా సంసారం, పిల్లలు, ఆయుష్షు, ఆరోగ్యం, ఉద్యోగం.. ఇత్యాది విషయాలు ఉన్నాయా? ఉంటే అవి రాకుండా ప్రతిబంధకాలు ఏం వుంటున్నాయి? అవి సరిచే యగలమా? జ్యోతిష్య పరంగానూ, పరిహారక్రియలను ప్రయోగించి అన్ని అంశాలను పరిశీలించుకోవాలి. ఆ తర్వాత వాస్తు పరంగా ఇల్లు ఉందా..? లేక ఇల్లు మారటానికైనా, మార్చటానికైనా తగిన బలాన్ని సాదించుకోవటానికి ఏం చేయాలి? జోతిష్యపరంగా అని ఆలోచించాలి? ఆ రకంగా జ్యోతిష్య, వాస్తు సమ్మేళనాన్ని ఉపయోగించి జీవితాన్ని బాగుచేసుకోవాలి.
జ్యోతిష్య శాస్తప్రరంగా మనకి లేని ను దుటిరా తను వాస్తు బాగున్న ఇంటిలో ఉండి పొందలేం. వాస్తు బాగుండని ప్రదేశంలో నివసిస్తున్నా.. జ్యోతిష్యపరంగా రావాల్సిన యోగాలని ఎలాంటి ఎలాంటి అడ్డంకులు, ప్రతిబంధకాలు లేకుండా సాధించలేం. రెండూ కావాలి. రెండింటిలోనూ లోపాలను పరిహారక్రియల ద్వారా సరిచేసుకోవాలి. కేవలం జ్యోతిష్యం చాలు. వాస్తు లేదు అనుకోవద్దు. అలాగే వాస్తు మాత్రమే జీవితాన్ని మారుస్తుంది, జ్యోతిష్యం అనవసరం అనుకోవద్దు. ముఖ్యంగా జ్యోతిష్యంలో ‘జన్మ కుండలిలోని లోపాలను పరిహార క్రియలు పాటించి సరిచేస్తే బుర్రకి స్థిరస్థ్వం చేయాలనే సంకల్పం ఏర్పడితేనే వాస్తు ప్రకారం ఆలోచిద్దామనే అభిప్రాయం ఏర్పడుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తి జాతకం బాగున్నంత కాలం వాస్తు ప్రభావం అంతగా బయట కనపడదు. జాతకం బాగులేనప్పుడే వాస్తు ప్రభావం అమితంగా కనపడుతుంది. దశ బాగుంటే దిశ బాగుంటనేది దీనర్ధం. అనారోగ్యం (జలుబు) తో ఉన్న వ్యక్తి వర్షంలో వెళుతున్నప్పుడు ‘గొడుగు’ యొక్క అండతో కాపాడబడతాడు. అనారోగ్యం ఉండడం (జాతకం బాగోని వ్యక్తి) జ్యోతిష్యం అయితే గొడుగు అనేది వాస్తు శాస్త్రం. అంటే జాత కం బాగుండకపోతే ‘సమస్య జటిలమవుతుంది’ అని దీని సారాంశం. అందుకే వ్యక్తికి జాతకం + వాస్తు = జీవితం. అన్నది అతి ముఖ్యమైన విషయం ఏదో ఒకటే చూడరాదు. రెండూ సరిచూసుకొని జీవితాన్ని సక్రమమార్గంలో పెట్టుకోవాలి.
ఎవరైనా సరే జాతకంలో వున్న దోషాలను ముందుగా పరిహార ప్రక్రియల ద్వారా సంపూర్ణంగా సరిదిద్దుకోవాలి. అలాగే వాస్తు దోషాలు సరి చేసుకోవాలి.
అందుకే జ్యోతిష్యశాస్త్రాన్నే ప్రదానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ‘అప్రత్యక్షాణి శాస్త్రాణి వివాదన్తేషు కేవలం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్క యాత్ర సాక్షి ణా’ సూర్యచంద్రుల సాక్షిగా ఈ శాస్త్రం ప్రత్యక్ష ఫలితాలందిస్తుందని భావం. ‘యధాశిభా మ యూరాణాం నాగానాం మణయో యథ తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిష్యం మూర్ధ నిస్తతం’ (ఋగ్జేతిహం)నెమళ్ళకు పింఛములాగా, పాము
లకు తలపై నుంచే మణిలాగా వేదాంగ శాస్త్రాలన్నింటిలోనూ జ్యోతిష్య శాస్త్రం అఖండమైనది.‘వేదచక్షసా…’ వేదపురుషునికి కన్నులాంటిది.