Menu

Kanya-Lagnam- Grahamulu

కన్య లగ్నము – ద్వాదశ గ్రహములు – ఫలితాలు

ఈ రాశికి బుధుడు అధిపతి. కన్యా రాశి స్వభావరీత్యా ‘ద్వి స్వభావ రాశి’. ఈ కార‌ణం వ‌ల్ల ఈ జాత‌కులు ఇరు వైపులా ఆలోచిస్తుంటారు. ప్ర‌తి విష‌యంలో లోతుగా పరిశీలిస్తుంటారు. అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. అంత తేలిగ్గా ఏ విష‌యాన్నీ వదలరు. ప్రతిదాన్నీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అనుమానించడం కూడా కన్యారాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తూ ఉంటారు.

మ‌హిళ‌లు అలయితే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. శారీరక అవసరాలు, కుటుంబ ప్రాధాన్యతలకు పెద్దపీట వేస్తారు. భౌతిక విషయాలమీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు పదేపదే ఆలోచిస్తారు. కార్యం ప్రారంభించాక మాత్రం పట్టువిడువకుండా పూర్తి చేస్తారు. సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ముందు జాగ్రత్త ఉంటుంది. కొన్నిసార్లు అతి జాగ్రత్త కూడా ఉంటుంది. స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్యం మీద దృష్టి నిలిపే త‌త్వం వీరిది.

సూర్యుడు 
కన్యాలగ్నానికి సూర్యుడు ద్వాదశాధిపతి. వ్యయాధిపతిగా సూర్యుడు కన్యా లగ్నానికి అకరక గ్రహం అవుతాడు. కన్యాలగ్నస్థ సూయుడి కారణంగా వ్యక్తి ప్రభావశాలిగా ఉంటాడు. లగ్నస్థ సూర్యుడు అందమైన, ప్రకాశవంతమైన శరీరం ఇస్తాడు. ఈ జాత‌కుల‌కు శ్వాస‌, దగ్గు, జలుబు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం క‌ల‌దు. లగ్నస్థ సూర్యుడి కారణంగా వీరికి విదేశీయానం ఉండే అవకాశం. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు. కార‌ణం వ‌ల్ల‌ వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. ఈ జాత‌కుల‌కు భాగస్వామ్యం అంత‌గా అనుకూలించదు. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం శ్రేయ‌ష్కారం.

చంద్రుడు
కన్యాలగ్నానికి చంద్రుడు ఏకాదసాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. ఈ జాత‌కుడు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాధిస్తారు. చంద్రుని స్థికారణంగా అస్థిర మనస్తత్వం ఉంటుంది. ల‌గ్నం నూడి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన మీనం మీద ప్రసరిస్తాడు కనుక గురువు ప్రభావం వ‌ల్ల‌ జీవిత భాగస్వామితో ప్రేమ పూరిత సహకారం అందుతుంది. వీరికి అకస్మాత్ లాభార్జ‌న ఉండే అవ‌కాశం. చంద్రుడికి పాపగ్రహ చేరిక దృష్టి ఉన్న కార‌ణంగా మంచి ఫలితము తక్కువగా ఉండును.

కుజుడు
కన్యా ల‌గ్నానికి కుజుడు తృతీయ, షష్టమాధిపతి.. కనుక కుజుడు కన్యాలగ్నానికి అకారక గ్రహంగా చెడు ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ కుజుడి కారణంగా క్రోధస్వభావం కలిగి ఉగ్రుడై ఉంటాడు. తల్లిదండ్రులతో అభిప్రాయబేధాలు ఉంటాయి. అయితే సోదరులతో సఖ్యత ఉంటుంది. లగ్నస్థ కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలిగే అవ‌కాశం. కుజుడు అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

బుధుడు
బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహముగా ఉంటాడు. లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక వ్యక్తి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగి ఉంటాడు. కన్యా లగ్నస్థ బుధుడు ఈ జాత‌కుడికి పరిపూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్గాయుష్షు ఇస్తాడు. వీరి ఆత్మబలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రగ‌తి సాధిస్తాడు. ఈ జాత‌కుడికి సమాజంలో గౌరవ మ‌ర్యాద‌లు లభిస్తాయి. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి నుంచి గుణసంపన్నుడైన జీవిత భాగస్వామి లభిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయంగా, ఆనందమయంగా ఉంటుంది. వీరికి భాగస్వామ్యం లాభిస్తుంది.

గురువు
కన్యాలగ్నానికి గురువు అకారక గ్రహం. కన్యాలగ్నానికి గురువు చతుర్ధ, సప్తమ స్థానాలకు అధిపతి. లగ్నస్థ గురువు కారణంగా వ్యక్తికి తండ్రి వలన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధుమిత్రులతో అభిప్రాయ బేధములు కలుగుతాయి. పుత్రుల నుంచి ఆదరణ, సహకారం లభిస్తుంది. పిత్రి సంపద వీరికి లభిస్తుంది. గురువు లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ స్థానముల మీద దృష్టిని సారిస్తాడు. కనుక దీర్ఘాయువు, పుత్ర సంతతి, ఖ్యాతి కలుగుతుంది. గురువు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న మంచి ఫలితాలు తగ్గుతాయి.

శుక్రుడు 
కన్యాలగ్నానికి శుక్రుడు ధనాధిపతిగా, నవమాధిపతిగా కారక గ్రహంగా శుభ ఫలితాలు ఇస్తాడు. మిత్ర స్థానంలో ఉన్న కన్యా లగ్నస్థ శుక్రుడు వ్యక్తిని ప్రగతి పధంలోకి తీసుకువెళ‌తాడు. లగ్నస్థ శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచి కలిగి ఉంటాడు. వీరికి ధార్మిక భావాలు ఎక్కువ‌. ఈ జాత‌కుడికి ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగం నుంచి సహాయ సహకారం లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన మీనం మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది.

శని 
కన్యాలగ్నానికి శని పంచమాధిపతిగా, షటమాధిపతిగా ఉండి త్రికోణాధిపత్య గ్రహంగా కారకమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని వ్యక్తిని బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యం ఇస్తాడు. వీరి పవారిక జీవితం అశాంతికరం. సంతానంతో సత్సంబంధాలు ఉండక పోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు.. దీని వల్ల సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అందం, ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

రాహువు  
కన్యాలగ్నమున ఉన్న రాహువు వ్యక్తికి పొడవైన, ఆరోగ్యవంతమైన శరీరం ఇస్తాడు. వీరిలో చతురత్వం స్వార్ధం ఉంటుంది. కనుక కార్యం ఎలాగైనా సాధించుకుంటారు. లగ్న నుంచి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు.. కనుక జీవిత భాస్వామితో కలహం అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం కలసి రాదు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉంటుంది.

కేతువు 
కన్యా లగ్నస్థ కేతువు వ్యక్తిని స్వార్ధ పూరితుడిని చేస్తుంది. గూఢాచారిగా సాఫల్యత సాధిస్తారు. ఈ జాత‌కుడికి వాత రోగం, నడుము నొప్పి కలిగే అవకాశం. లగ్నస్థ కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు.. దీనివ‌ల్ల జీవిత భాగస్వామికి రోగపీడను కలిగిస్తుంది. కేతువు శుభ గ్రహ దృష్టి చేరిక కలిగి ఉన్న వివాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.