Menu

Moola

మూల నక్షత్రము – గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 19వ నక్షత్రము. మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం, పురుష జాతి.

మూల నక్షత్రము మొదటి పాదము
మూల నక్షత్ర అధిపతి కేతువు. ఈ ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకుల మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఉద్యమాలలో వీరు ముందు ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికం. సైనిక పరమైన ఉద్యోగాలంటే వీరికి ఆసక్తి ఉంటుంది. పోలీస్ శాఖ కూడా వీరికి అనుకూలమే. అగ్ని, విద్యుత్, భూసంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ జాతకులకు అనుకూలిస్తాయి.

ఆరు సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్ర దశ  వస్తుంది. కనుక విద్యారంభం బాగానే ఉంటుంది. చదువు సమయంలోనే విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం ఉంది కాబట్టి, గట్టి ప్రయత్నంతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం.. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము రెండవ పాదము 

వీరు రాక్షసగుణ ప్రధానులు కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు.  అకర్షణీయంగా మాట్లాడగల నేర్పు ఉంటుంది. వీరికి కేతు గ్రహ ప్రభావం కారణంగా భక్తి  అధికంగా ఉంటుంది.  అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి  జలసంబందిత, పర్యాటక సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రకాశించగలరు. వీరు దత్తు పోగల అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 4 సంవత్సరాల వరకు కేతుదశ  ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు అంటే ఆసక్తి ఉంటుంది కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించాలి.. విజయం సాధించాలి. ఇక వీరు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలోనే వివాహం జరుగుతుంది. 47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం మొదలవుతుంది. అనంతరం వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము మూడవ పాదము
ఈ జాతకుల మీద బుధ  కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షస గుణ ప్రధానులు.. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధి కుశలతతో ప్రదర్శిస్తారు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం చేయడమంటే అధిక ఆసక్తి. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకులిస్తాయి. అకర్షణీయమైన వస్తు సేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి జల సంబంధిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈ జాతకులు చిన్న వయసు నంఉచే కళారంగంలో ప్రావీణ్యత సాధిస్తారు. అయితే వీరికి దత్తుపోగల అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరుల గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

మూడు సంవత్సరాల వరకు కేతు దశ ఉండే కారణంగా.. విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ మూడు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు వైపు మనసు మళ్లుతుంది. కాబట్టి  పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి. ఈ నక్షత్ర జాతకులు జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం అవుతుంది. 46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. ఆ తర్వాత వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.

మూల నక్షత్రము నాలుగవ పాదము 

ఈ జాతకుల మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. దీంతో పట్టుదల గత వ్యక్తులై ఉంటారు. వీరు తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరు తమ భావోద్వేగాలను మార్చి మార్చి ప్రదర్శిస్తారు. వీరికి భక్తి భావం ఎక్కువే. వీరికి శ్వేతవర్ణ వసువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుంచి కళారంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. వీరు దత్తుపోగల అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.

వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలపైకి దృష్టి మరలుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాల్సి ఉంటుంది. వీరు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ  రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సులభమవుతాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం కొన సాగుతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.

మూల నక్షత్రము గుణగణాలు – ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులు శక్తిమంతులై ఉంటారు. అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయి. దైవజ్ఞానము గలవారై ఉంటారు. భవిష్యత్ ను వాస్తవానికి దగ్గరగా ఊహించి చెప్పగలరు. అనర్గలముగా మాట్లాడే ప్రతిభా ఉంటుంది. ఏ విషయములనైనా విడ మరచి చెప్పగల నేర్పరులు. తాము నమ్మిన సిద్ధాంతములకు కట్టుబడి ఉంటారు. అన్యాయము, అక్రమాలను సహించలేరు. అయితే వీరు కాస్త గర్వం, అహంభావం కలవారు. వీరు తమ జీవితంలో రెండు లేక మూడు వృత్తులను చేపట్టగలరు. కుటుంబం, బంధువులు, స్నేహితుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉంటారు .అందరూ నీతిగా ఉండాలని కోరుకొంటారు.

పట్టుదలతో, స్వయంకృషితో జీవితంలో ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి వైపు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే ఈ జాతకుల లక్ష్యం. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు.

రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞం అవుతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. 60 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.