Menu

Navaratnalu

Emerald

మ‌రక‌త‌ము (ప‌చ్చ) 

నవరత్నములలో ఒకటి మరకతము. పచ్చ అని తెలుగులో దీనికి వ్యావహారిక నామము గ‌ల‌దు. ఇంగ్లీష్ లో ‘ఎమరాల్డ్’ అంటారు. పచ్చని రంగును కలిగి ఉండ‌టం వ‌ల్ల‌ హరిన్మణి, పచ్చలు అన్న పేర్లు కూడా ఉన్నాయి. మరకతము య‌వ్వ‌నముగల నెమలి పిట్ట రంగును, నాచువలెను, గాజువలెను ప్రకాశించే గరికమొలక రీతిగాను, కోమలమగు పాలచెట్టు కొమ్మరంగునను, మంచి కాంతి గల రామ చిలుక రెక్కల చాయను, సుందరమియన్ దిరిశిన పువ్వురంగు వలె.. ఇలా ఈ 8 రంగులలో ప్రకాశించును.

జాతి ఎమరాల్డ్ బైరేల్ కుటుంబంలో గ్రీన్ వెరైటీ, అల్యూమినియం, బెరిలియం తాలుకూ సిలికేట్ తో ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారం, స్టెప్ కట్ అనే దాన్ని ఎమరాల్డ్ కి సాధారణంగా ఉపయోగిస్తారు. కటింగ్ ఆ విధంగా ఉన్నప్పుడే ఎమరాల్డ్ క్రిస్టల్ తాలూకు లోతు, అందమైన రంగు, ఫోకస్ చేయబడుతుంది. 1934 నుండి సింథటిక్ ఎమరాల్డ్ కూడా తయారు చేస్తున్నారు.

బుధుని ర‌త్నం ప‌చ్చ‌. మిథున‌. క‌న్యా రాశులు ల‌గ్నాలు, ఆశ్లేష‌, జ్యేష్ఠ‌, రేవ‌తి న‌క్ష‌త్రాలు, 5,14, 23 తేదీలు. మే 21 నుంచి జూన్ 21 మధ్య జ‌న్మించిన వారు ధ‌రించవ‌చ్చు. అలాగే ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 23 మ‌ధ్య జ‌న్మించిన వారు కూడా ప‌చ్చ‌ను ధ‌రించ‌వ‌చ్చు.

లోపాలు లేని జాతిపచ్చ సంపదను, ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని అందిస్తాయి. జాతిరత్నం జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు, ధరించిన వ్యక్తి చదువు పట్ల ఏకాగ్రత ఏర్పడేలా చేస్తుంది. విద్య‌కు, జ్ఞానానికి, వ్యాపారానికి, వైద్య వృత్తికి, జ్ఞాప‌క‌శ‌క్తికి, మాన‌సిక రోగ‌నివృత్తికి ఈ ర‌త్నం స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణ‌కోశానికి, న‌రాలు, మెద‌డుకు సంబంధించిన జ‌బ్బులు, హిస్టీరియా, మ‌తిభ్ర‌మ‌ణం, ప‌చ్చ కామెర్లు, క‌డుపునొప్పి, ర‌క్త‌పోటు మొద‌లైవి తొల‌గించి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని, స్నేహ‌సామ‌ర‌స్యాల‌ను పెంపొందిస్తుంది.

ఎమరాల్డ్ నుంచి ఆకుపచ్చ కిరణాలు బయటకు వెదజల్లబడతాయి. కాబట్టి ఆ రంగు మూత్రపిండాలు, ప్రేగుల మీద, కాలేయం మీద పనిచేసి ఆరోగ్యస్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాక శ్వాస ప్రక్రియ సరిగా జరగడం, ఏకాగ్రత కలగడం, ఇన్ సోమ్నియా, డీసెంట్రీ, డయేరియా, ఆస్తమా, అల్సర్ వ్యాధుల నుంచి దూరం కావడం జరుగుతుంది.

బంగారం లేదా, వెండిలో జాతిపచ్చను పొదిగి బుధవారం ధరించాలి. కుడి చేతి చిటికెన వ్రేలికి ధరించాలి.