Menu

Planets to get good luck

planets to get good luck

గ్రహాల అనుగ్రహం పొందాలంటే..

మానవుల జీవితాలపై గ్రహాల ప్రభావం ఉంటుందని మనం తెలుసుకున్నాం. గ్రహాలన్నీ అనుకూలిస్తే గనక జీవితం సుఖమయంగా ఉంటుంది. అవే గ్రహాలు ప్రతికూలిస్తే దుఃఖమయంగా ఉటుందని చెప్పవచ్చు. నిజానికి ఈ పరిణామాలు, పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి. మనం పుట్టిన సమయంలో గ్రహాల తీరునుబట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది అంటారు. అందుకే జాతక చక్రాలు భూమిపై ఆయా గ్రహాల ప్రసరణ వంటి వివరాల ఆధారంగానే భవిష్యత్‌ను అంచనా వేస్తారు.

గ్రహాల శుభ దృష్టి ఉంటే శుభసూచకం అని, ప్రతికూల దృష్టి ఉంటే అశుభం అని భావిస్తారు. ప్రతికూల దృష్టిగల సందర్భాలలో ఆయా గ్రహాల ప్రీతికోసం జపాలు, తర్పణాలు, హోమాలు చేయడంతో పాటుగా గ్రహ సంబంధిత క్షేత్రాలను దర్శించడం జరుగుతోంది.

దోషం, గండం వంటి వాటిని అంచనా వేయడంతో పాటు చేపట్టాల్సిన పూజాధికాల్ని జోష్యులు సూచిస్తారు. నక్షత్ర బలాన్నిబట్టి నామకరణం కూడా చేయడం ఆనవాయితీ. ఈ విషయాలకంటే ప్రదానమైన విషయం మరొకటి ఉంటుంది. పుట్టిన నక్షత్రం, రాశి ఆధారంగా స్వభావం, సహజ లక్షణాలు, పరిస్థితుల్ని అంచనా వేసుకోవడం, వాటినిబట్టి చేసే గణనలు, అంచనాలు కచ్చితంగా ఉండడమే కాకుండా రెమెడీస్‌కూడా సూటిగా ఉంటాయి.

పరిస్థితులు, మనస్తత్వాలు, కష్టాలు, నష్టాలు అన్నీ గ్రహాలను బట్టే ఉంటాయి కాబట్టి.. గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహారాధన చేస్తాం. ఈ పూజలు, అర్చనలు, దానాల సంగతి అలా ఉంచితే అంతకంటే తేలికైన మార్గం ఒకటి ఉంది.

ఒక్కో వారానికీ ఒక్కో గ్రహం అధిపతి
ఆదివారం – సూర్యుడు,
సోమవారం – చంద్రుడు,
మంగళవారం – కుజుడు,
బుధవారం – బుధుడు
గురువారం – బృహస్పతి
శుక్రవారం – శుక్రుడు
శనివారం – శని

అయితే, గ్రహాల అనుగ్రహం పొందేందుకు, ఆయా వారాల్లో మన దుస్తుల రంగులు ఇలా ఉండేలా చూసుకోవాలి.

ఆదివారం – ఎరుపు
సోమవారం – తెలుపు
మంగళవారం – నారింజ రంగు
బుధవారం – ఆకుపచ్చ
గురువారం – పసుపుపచ్చ
శుక్రవారం – తెలుపు
శనివారం – నీలం లేదా నలుపు రంగు

గ్రహాలకు ఇష్టమైన రంగులను ఉపయోగించడంవల్ల, గ్రహాలూ మనపట్ల ఆకర్షితమై అనుకూలంగా ఉంటాయని, అనుకున్న పనులు ఎలాంటి విఘ్నాలూ లేకుండా సవ్యంగా జరుగుతాయని శాస్త్రం చెబుతోంది.
అయితే ఇవి అన్నియు కూడా జ్యోతిష్కులను సంప్రదింఛి చేయుట మంచిది.

జ్యోతిష్యం – ఆరోగ్యం
గ్రహాల దుష్ట కిరణాల ప్రభావం వల్ల మానవుడిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతాయి. గ్రహాల మంచి కిరణాల ద్వారా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి అనేది జ్యోతిర్వైద్య సిద్ధాంతం.

చంద్రుడు
కాల్షియంకు ముత్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సుకు చంద్రుడు ఆది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షియం తగ్గినప్పుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉంది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తుంది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇస్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని శాస్త్రం చెబుతోంది.

కుజుడు
ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జకు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే. కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపు పై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుంది. ఎములలోని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ శాస్త్రవెత్తల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. కుజుడికి ధాన్యమైన కంది పప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తవెత్తల కృషి ఫలితం.

బుధుడు
బుధుడు నరాలకు సంబంధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.

గురుడు
గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్‌ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.

శుక్రుడు
ఇక శుక్ర గ్రహం సౌందర్యానికీ కారణమవుతుంది. శుక్రుడు నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుంచే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.

శని
చర్మంలోని మాలిన్యాలను వెలువరించే శక్తికి శని అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతి. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమ కూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.

ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశ్లేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎక్కువగా పండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. సప్త గ్రహాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే అందం, ఆరోగ్యం మన చెంత ఉన్నట్టే.