Menu

Simham-Lagnam- Grahamulu

సింహ లగ్న‌ము – గ్రహములు – ఫలితాలు

సింహ లగ్నము జ‌న్మించిన‌ వారు అందంగాను, అరోగ్యముగాను వుంటారు. వీరు మహత్వకాంక్ష కలిగి మొండి స్వభావం కలిగి వుంటారు. ఈ జాత‌కులు ఎంత సాహసం గ‌లవారో అంతే ఆత్మవిశ్వాసం గ‌లవారు కూడా. వీరిలో సాహసం, ఆత్మవిశ్వాసము, మొండిప‌ట్టుద‌ల‌ అధికంగా ఉండును. రాజనీతిలో వీరికి అభిరుచి వుండును. ఈ లగ్నం గల కుండలిలో ప్రథ‌మ భావములో స్థితిలో వున్న గ్రహాలు ఏ విధ‌మైన‌ ఫలితాల‌ను ఇస్తుందో చూద్దాం.

సూర్యుడు 
సింహ లగ్నములో సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. సింహ ల‌గ్నంలో సూర్యుడున్న స్వత్షానమున ఉండ‌టం వ‌ల్ల ఈ జాత‌కుడికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత కలిగించును. సింహ లగ్నస్థ సూర్యుని కారణంగా గా వ్యక్తి విద్యాంసుడిగా, గుణవంతుడుగా ఉంటాడు. వీరి కార్యశూరత ప్రతిభ కారణం వ‌ల్ల‌ సన్మానాలను అందుకుంటారు. వీరు ఏ కార్యమైనా మనస్పూర్తిగా చేపడతారు. పరాక్రమం, ఉదార స్వభావం గ‌ల వారు. ఇతరులకు సహకరించే గుణం ఉంటుంది. అంతేకాదు, పరాక్రమం కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం అయిన శత్రస్థానం కుంభం మీద దృష్టిని సారిస్తాడు. ఈ కార‌ణం వ‌ల్ల‌ వైవాహిక జీవితం బాగుంటుంది. మిత్రుల నుంచి, భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు అంత‌గా ల‌భించ‌వు.

చంద్రుడు
సింహ లగ్నానికి చంద్రుడు వ్యయస్థానాధిపతిగా అకారక గ్రహమై చెడు ఫ‌లితాల‌ను ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అధైర్య మనస్థత్వాన్ని, నిలకడ లేని జీవితాన్ని ఇస్తాడు. నిస్వార్ధంగా ఇతరులకు సహకరిస్తారు. ఇక ఈ జాత‌కుల‌కు తల్లిదండ్రుల నుంచి సహాయసహారాలు అందుతాయి. రాజకీయాలలో సఫలత సాధిస్తారు. చంద్రుడు లగ్నస్థంలో ఉండి సప్తమ స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు. ఈ కార‌ణం వ‌ల్ల‌ వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు. చంద్రుడికి పాప గ్రహ చేరిక, దృష్టి ఉంటే చెడు ఫలితాలు తగ్గుతాయి.

కుజుడు 
సింహ లగ్నానికి కుజుడు చతుర్ధాధిపతి, నవమభావాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ కార‌ణం వ‌ల్ల‌ కారక గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ కుజుడు పరిపూర్ణ ఆత్మవిశ్వాసం, సాహసం, నిర్భయత్వం ఇస్తాడు. వీరికి అనేక విధముల ధనాగమనం ఉంటుంది. లగ్నస్థ కుజుడు చతుర్ధ స్థానమైన మీద , సప్తమ అష్టమ స్థానముల మీద దృష్టి సారిస్తాడు. కనుక తల్లితో విబేధాలు, జీవితభాగ‌స్వామితో అభిప్రాయబేధాలు ఉంటాయి. మిత్రుల సహాయసహకారాలు లోపించే అవ‌కాశం. శత్రు పీడ పొంచి ఉండే అవ‌కాశం.

బుధుడు
సింహ లగ్నస్థ బుధుడు ద్వితీయ, ఏకాదశ స్థానాధిపత్యం వహిస్తాడు. ఈ కార‌ణం వ‌ల్ల‌ ఈ లగ్ననముకు బుధుడు ధన కారకుడు. లగ్నస్థ బుధుడు అధిక ధనాదాయాన్ని ఇస్తాడు. వీరికి కళారంగ సంబంధాలు ఉంటాయి. వీరికి శత్రు భయం అధికం. బుధుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మిత్ర స్థానం గ‌ల కుంభం మీద దృష్టి సారిస్తాడు. ఈ కార‌ణం వ‌ల్ల ఈ జాత‌కుల‌కు జీవిత భాగస్వామి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. కాని జీవితభాగస్వామి సహాయసహకారాలు వీరికి అందదు. సంతాన సుఖం తక్కువ. బుధుడు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలను ఇస్తాడు.

గురువు
సింహ లగ్నానికి గురువు పంచమ, అష్టమాధిపధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపత్యం కారణం వ‌ల్ల‌ గురువు కారక గ్రహమై మంచి ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ఇస్తాడు. బుద్ధి కుశలత, జ్ఞానం, వీరి సొత్తు. దయా స్వభావం కలిగి ఉంటారు. ధనం భ‌ద్ర‌పరచే నేర్ప‌రిత‌నం ఉంటుంది. బుద్ధికుశలత, జ్ఞానం వీరిని ఉన్నత పదవులను అధిరోహింపజేస్తుంది. ఉద్యోగవ్యాపారాలు రెండింటిలో వీరికి సాఫల్యత లభిస్తుంది. సంఘంలో గౌరవమర్యాదలు ఉంటాయి. గురువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుంచి, పంచమ దృష్టి కారణంగా పుత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మిత్రుల, భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అదృష్టం వీరిని వెన్నంటి ఉంటుంద‌ని చెప్ప‌వచ్చు.

శుక్రుడు
శుక్రుడు సింహ లగ్నానికి తృతీయ, దశమాధిపతి. సింహ లగ్న శుక్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. లగ్నస్థ శుక్రుడి కారణంగా అందమైన శరీరం కలిగి ఉంటారు. వీరికి భౌతిక సుఖాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. మెట్టింటి నుంచి సమయానుకూల సహాయం లభిస్తుంది. పూర్ణ దృష్టితో శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ధనమును అనవసరంగా అదుపు లేకుండా ఖ‌ర్చు చేస్తారు. వివాహేతర సంబంధాలకు ధన వ్యయం చేస్తారు. సప్తమ భావంలో ఉన్న శుభ గ్రహం శుభుల చేరిక సంబంధాలు కల్గి ఉన్న జీవిత బాగస్వామికి విశ్వాసపాత్రులుగా ఉంటారు.

శని
సింహ లగ్నానికి శని అష్టమ, సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. సింహ లగ్నస్థ శని అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తుంది. సింహ లగ్నస్థ శని వ్యక్తిని సమాజ విరోధ కార్యాలకు ప్రోత్సహిస్తుంది. లగ్నస్థ శని వీరికి అపకీర్తిని, కపట స్వభావాన్ని కలిగిస్తుంది. లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా కనిష్ట సోదరుల సహకారం అందదు. సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి కష్టాలు ఎదురుకావ‌చ్చు. వీరి కపట వృత్తి కారణంగా మిత్రుల నుంచి సహకారం అందదు. వీరికి పేరాశ అధికం. లగ్నస్థ శని శుభ గ్రహ చేరిక శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న చెడు ఫలితాలు తగ్గవచ్చు.

రాహువు 
సింహ లగ్నస్థ రాహువు చెడు ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ రాహువు ఈ జాత‌కుడి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని క్షీణింపచేస్తుంది. దీంతో సొంత నిర్ణయం చేసుకునే శక్తి లోపిస్తుంది. వీరు సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికి శ్రమించవలసి వస్తుంది. వీరికి మంత్ర తంత్రములు గుప్త విద్యల అందు ఆసక్తి అధికం. లగ్నస్థ రాహువు వల్ల‌ వీరు రాజనీతిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. రాహువు సప్తమ దృష్టి కారణంగా మిత్రుల నుండి భాస్వాముల నుంచి విశేష సహాయ సహకారం లభించదు. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు.

కేతువు
శత్రు రాశి అయిన సింహరాశిలో ఉన్న కేతువు చెడు ఫలితాలను ఇస్తాడు. సింహ లగ్నస్థ కేతువు అనారోగ్యం కలిగిస్తాడు. కేతు దశాకాలంలో వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవ‌కాశం. ఈ జాత‌కుల‌కు తల్లిదండ్రుల మీద అధికమైన ప్రేమాభిమానాలు ఉండవు. ఎల్ల వేళలా మానసిక చింత వీరిని బాధిస్తుంది. సప్తమ భావం మీద కేతువు దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. జీవిత భాగ‌స్వామికి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదురు కావ‌చ్చు.