Menu

వార ఫలములు

Vara-phalamulu – 26-03-2017 To 01-04-2017

Weekely Horoscope
A professional Astrologer

Gopi Sarma Siddhanthi

Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu AstrologyPredictions
aries

మీకు సంబందించని కొన్ని విషయములలో దూరముగా ఉండుట మంచిది, పెట్టుబడులు
కొన్ని నష్టపోఏ అవకాశము వున్నది, కొన్ని మార్పులు తప్పక చేయవలసి  వస్తుంది, మనస్సును
స్థిర పరచుకొనుట మంచిది.డబ్బు ఇబ్బంది వున్నా ప్పటికి అనుకొన్న కార్యక్రమములు ముందుకు సాగుతాయి, అప్పు చేయుట తప్పక పోవచ్చు, వ్యాపారము లభాలకై ప్రణాలికలు అన్వేషించుతారు, ఇంటికి సంబదించిన బ్యాంకు వ్యవహారాలు చిరాకు పరుస్తాయి. లక్ష్మి పూజ శుభము.

taurus

పిల్లల విషయములో ఖర్చులు పెరుగుతాయి, అనుకొన్న సమస్య రానేవస్తుంది, ఇంటిలో గొడవలు పెరుగుతాయి, మీ శ్రీమతి ఆరోగ్యవిషయములో జాగ్రత్త విహిమ్చుట మేలు, వారము చివరలో ఒక శుభ వార్త.  ఒక విషయము మరిచి పోవుట వల్లఇబ్బందికలుగవచ్చు, ఖర్చుకు తగ్గ ఆదాయము సమకూరుతుంది, వాహన ప్రమాదము ఉండవచ్చు జాగ్రత్త. రుద్రాభిషేకము చేయండి.

gemini

ఇంటిలోవారి ఆరోగ్యసమస్య పట్ల జాగ్రత్త  వహించండి, వ్యాపార వ్యవహారములు మిరే దగ్గర వుండి చూచుకొనుట మంచిది, భాగ స్వామిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి,శుభ కార్యక్రమము దగ్గరగుట వలన కొన్ని పనులు తొందరగా పూర్తి చేస్తారు, కొత్త వారితో ప్రయాణము మంచిదికాదు, మద్యవర్తిత్వము వహించు విషయములో తగు జాగ్రత్త వహించండి.ఒక వివాదము పరిష్కరించు కొంటారు.  శ్రీ సూక్త పారాయణ చేయండి.

cancer
పిల్లల నూతన విద్యా సంస్థల విషయాలలో మీ ఆలోచనలు పెరుగుతాయి, ఒక విషయములో మనస్సు కొంత ఆందోళన చెందుతుంది.ఇంటిలో విబేదాలు  పెరుగుతాయి మానసిక ప్రశాంతత కరువగుతుంది, దుస్వప్నాలు మీ మనసాంతిని కరువుచేస్థాయి, కొన్ని వస్తువులు ధనమునుపోగోట్టుకోనవచ్చు.కొన్ని ముఖ్యమైన పనులను మీ పై అధికారులు మీకు అప్పగించుతారు. సోమవారం సాయంత్ర సమయం లో శివాలయ దర్శనం మంచిది.
leo
ఆదాయము వ్రుద్దిచెండుతుంది, మీరు తీసుకొన్న నిర్ణయము తప్పుకాదని మీ వర్గము ఒప్పుకోంటుంది, కస్టపడి మీ వ్యవహారాలను ప్రణాలికలను అమలుపరుస్తారు, ఈ సందర్బముగా కొన్నివస్తువులు పోయే అవకాశముంది జాగ్రత్త. డబ్బు చేతికి అందుతుంది. ఇంటిలో శుభ కార్య ఆలోచనలు శుభాన్నిసూచిస్తాయి, నూతన పెట్టుబడుల విషయములో ఆచితూచి వ్యవహరించుట మంచిది, కొత్త వ్యక్తుల వల్ల మీ ఇంటిలో మీ పిల్లల విషయములో సమస్యలు రావచ్చు జాగ్రత్త. గణపతి పూజ శుభం.
virgo

మీ వారిని సంత్రుత్పి చెందించడానికి చాల ఇబ్బంది పడతారు, ధనము మంచినిరుల ఖర్చు పెట్టవలసి వస్తుంది, ఆదాయము పెరుగుతుంది, అనుకోని అవకాశములు కలసివస్తాయి, మిత్రుల రాకతో అనుకోని ఖర్చులు వుంటాయి, వ్యాపారము బాగా సాగుతుండడముతో డబ్బు ఇబ్బంది తగ్గుతుంది, సోమవారము కొంచెము శ్రమ పట్టుదల అవసరము. చెక్కులు విషయములో జాగ్రత్త అవసరము, ఆంజనేయ స్వామి వారికీ సిందూర పూజ చేయించుట శుభం.

libra

శుభ కార్య ప్రయత్నాలు ఒక కొలిక్కివచ్చి అనుకొన్న పని అవుతుంది, ఇంటిలోనివారికి బట్టలు వస్తువులు కొంటారు, మీ  ఆత్మీయుల రాక మీకు ఆనందాన్ని సమకూరుస్తుంది, డబ్బు ఇబ్బంది ఉన్నపటికీ అనుకొన్న పనులకు సర్దుబాటు చేసుకోగలరు,కొన్ని మంచిపనులకు శ్రీకారము చుడతారు. శ్రీమతి విషయములో మాటామాట పట్టిపులు కూడా పెరుగుతాయి, కోపాని తగ్గించుట మంచిది. 18 వ సర్గ సుందర కాండ పారాయణ మంచిది.

scorpion

ఈ  వారము ధనదాయము బాగుంటుంది,పట్టుదలతో ఎదుటవారిని మెప్పించి మిపనులు
పూర్తి చేసుకో గలుగుతారు, ఇంటిలోని పెద్ద వారి ఆరోగ్యము మందగించవచ్చు, బ్యాంకుకు సంబదించిన వ్యవహారాలలో జాగ్రత్త వహించండి, రాబడి పెరుగుతుంది, ఇంటిలోని వారి ఆప్యాయత ఆనందాన్ని ఇస్తుంది, పిల్లల చదువుకు సంబదించిన కార్యక్రమములు చురుకుగా సాగుతాయి. మొత్తము మీద ఈ వారము ప్రసాంతముగానే వుంటుంది. దక్షిణా మూర్తి ఆరాధన మంచిది.

sagittarius

మీకు  దూరముగా వున్నా వారు దగ్గరవుతారు, వ్యసనాలవల్ల నష్టము, డబ్బు అందక చిరాకులు పెరుగుతాయి, కొన్ని పనులకు మీ సహాయము బయటి వ్యక్తులకు అవసరమగుతుంది, కొన్ని విలువయిన వస్తువులు సేకరించుతారు. ఇంటిలో శుభకార్యక్రమ విషయాలు వివాహ సంరబాలు వుంటాయి, మద్య వర్తిత్వము వల్ల మీరు మాట పడే అవకాశము వుంది. నవగ్రహ ధ్యానము మంచిది.

capricorn

ధనము అధికముగా కర్చుచేస్తారు. బ్యాంకు పనులు వాయిదా వేయుట మంచిది, అనవసరపు విషయములు జోక్యము మంచిదికాదు, కొన్ని పనులు ఇతరులకు తెలియ కుండుట మంచిది. కాళీ లేకుండా కస్టపడినప్పటికీ పని ఒత్తిడి తగ్గదు, కొన్ని పనులు ఏక పక్షముగా సాగుతాయి, కుటుంబసబ్యుల విషయములో వారి ప్రవర్తన చిరాకును పెంచుతుంది. పిల్లల ఆరోగ్య విషయములో తగు శ్రద్ధ అవసరము. శివాభిషేకం చేయించండి.

aquarius
ఆరోగ్యవిషయములో జగ్రత్హ వహించడము మంచిది,ఇంటి లో భార్యాభర్తల మధ్య  గొడవ సద్దుమనుగుట వల్ల ఇద్దరిమద్య సఖ్యత నెలకొంటుతుంది, కొన్ని వ్యవహారాలు బెడిసికోట్ట వచ్చు జగ్రత్త.  అనవసరపు విషయాల జోలికి  పోకండి.ఖర్చులు పెరిగినప్పటికీ బందువులసహయము తో వాటిని పరిష్కరిస్తారు,శత్రువులపై విజయము ఆనదాన్ని ఇస్తుంది, గురువారపు ప్రయాణములో ఒక ఇబ్బంది ఉండవచ్చు, లక్ష్మి పూజ శుభము.
pisces

ఖర్చుకు తగ్గట్టే ఆదాయము ఉండటముతో సమస్య వుండదు, కొన్ని ఉపయోగకరమైన పెట్టుబడులు పెడతారు, బ్యాంకు పదకాల విషయములో ఆలోచనలు వుంటాయి, మీ పనివారి ప్రవర్తన మిమ్మలిని ఇబ్బంది పెడుతుంది. కొన్ని పనులు తెలివితేటలతో పూర్తిచేయగలుగుతారు, ఆరోగ్యము మందగించినప్పటికీ పనులను ఆపరు, భుదవారము మీ ఇంటిలోని సమస్య  తీర్చడానికి మీ మిత్రుల సహాయాని పొందవలసి రావచ్చు.అనుకొన్న విధముగా మిపనులు సాగడముతో మీ మనస్సు సంతోషం తో  నిండుతుంది, ఇస్తా దేవతా ఆరాధన శుభము.

———– చింతా గోపి శర్మ సిద్ధాంతి.