Stras -Nakshathara yoni
జ్యోతిష భాగములో[నక్షత్ర] యోని వివరణ
యోని సంబందములు పరస్పరముగా అయిదు విధములుగా ఉండును. అవి. ౧.స్వవర్గ, ౨.మిత్ర, ౩. ఉదాసిన, ౪.శత్రు, ౫.మహా శత్రు
వరుడు మరియు కన్య నక్షత్రముల యోని ఒక్కటి అయిన లేదా నామ నక్షత్రముల యోని వేరుయినా వివాహమునకు శుభము. ఉదాసిన యోనిలు అయిన జీవితము సామాన్యముగా జరుగును. శత్రు యోని మంచిది కాదు. మహాసత్రుయోని వారి జీవితాలను పాడుచేయును.
అత్రి మహర్షి పురుష స్త్రీ యోనిలు ఒకటిగా వున్నా శుభము అని చెప్పివున్నారు.
యోని గుణాంకములు
౧. ఇరువురి నక్షత్రములు ఒకే యోని అయిన ౪. గుణములు
౨. మిత్ర యోని అయిన ౩ గుణములు.
౩. ఉదాసిన యోని అయిన ౨ గుణములు.
౪ . శత్రు యోని అయిన ౧. గుణము.
౫. మహా శత్రు అయిన ౦ గుణము వచ్చును.
ఇంతియేకాక కొన్ని యోని దోషములు కలుగనివి
౧. ఇరువురు రాశి అధిపతి మిత్రుడు అయిన ౨. భ కూటము సుద్ధి అయినా. ౩. నవమాదిపతి ఇరువురకు మిత్రుడు కానీ ఒకటయినా.౪.వశ్య శుద్ధి కలిగిననూ యోని కూత దోషము వర్తిం పదు.
VIVAAHAMUNAKU VAIRA NAKSHATHRAMULU
వివాహమునకు వైర నక్షత్రములు
అశ్వని కి జ్యేష్ట
భరణి కి అనూరాధ
కృత్తిక కు విశాఖ
రోహిణికి కి స్వాతి
ఆరుద్ర కి శ్రవణం
పునర్వసు కి ఉత్తరాషాడ
అశ్రేష కి మూల
మఘ కి రేవతి
పుబ్భ కి ఉత్తరాబాద్ర
ఉత్తర కి పూర్వాబాద్ర
హస్త కి శతభిషం
పై నక్షత్రములు ఒకదానికి ఒకటి వేధలు మరియు చిత్త, మృగశిర, ధనిష్ట లు ఒకదానికి ఒకటి అన్యోన్య వేదలగుట వల్ల వీటిని వదలి పెట్టి మిగతా నక్షత్రములలో కలిసిన మంచిది.
వివాహ విషయమునందు వధూ వరులకు [స్త్రీ పురుషులకు] ఇరువురకూ కుజదోషమున్న దోషము బంగమగును సప్తమాదిపతుల మిత్రత మరియు చంద్ర రాశియొక్క అడిపతుల మిత్రత పరిశిలించుట శుభము.
వర్ణాధిపులు వేదాధిపులు
బ్రాహ్మణులకు – గురు, సుక్రులు ఋగ్వేధులకు – గురువు
క్షత్రియులకు – రవి,కుజులు యజుర్వేధులకు -శుక్రుడు
వైశ్యులకు – చంద్రుడు సామవేధులకు – కుజుడు
శూద్రులకు – భుదుడు అధర్వణ వేదులకు – భుదుడు
అంత్య జాతులవారికి -శని
Leave a Reply
You must be logged in to post a comment.