Dhanussu—Sagittarius
ధనస్సు – 2016-17
మూల. ,2,3,4 పాదములు.
పూర్వాషాడ.1,2,3,4.పాదములు.
ఉత్తరాషాడ 1. పాదము.
ఆదాయము – 5, వ్యయం.14, రాజపూజ్యము -4, అవమానం -2.
ఆగస్టు 11, 2016 వరకు గురుడు తొమ్మిదవ ఇంట తామ్రమూర్తిగాను, తదుపరి పదవ ఇంట లోహమూర్తి. జనవరి 26, 2017 వరకు శని పన్నెండవ ఇంట తామ్రమూర్తిగాను తదుపరి ఒకటవ ఇంట సువర్ణమూర్తిగాను, రాహువు తొమ్మిదవ ఇంట, కేతువు మూడవ ఇంట తామ్రమూర్తులు.
ఈ రాశి వారికి శని ప్రభావం తక్కువగానే ఉండును. వీరికి సంఘంలో గౌరవం పెరుగును. కొన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారిపోతుంటాయి. జనంలో మంచి పలుకుబడి వస్తుంది. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. బంధువల వలన ధన నష్టం సూచించుచున్నది. కొన్ని ఇబ్బందికర విషయాలు కూడా ఉండవచ్చు.
ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఆదాయం వచ్చినప్పటికీ కుటుంబ సమస్యల వల్ల ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ప్రమోషన్స్ ఉన్నా.. దూరపు బదిలీల వల్ల మానసిక ఇబ్బంది ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు కలిసివస్తాయి.
ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పలుకుబడి ఉండగలదు. అధిష్టానం వద్ద కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ధనం ఖర్చు పెరుగుతుంది. ఎన్నికల్లో విజయం లభిస్తుంది.
ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ధనాదయం బాగున్నప్పటికీ ఆదాయపు పన్నువారి వలన ఇబ్బందులకు గురి కావచ్చు. నూతన కాంట్రాక్టుల వారికి, షేర్ మార్కెట్ లకు, భాగస్వామ్య వ్యాపారాలు చేయువారికి మిశ్రమ ఫలితములు కలవు. సరుకులు నిల్వ చేయువారికి లాభం ఉండగలదు.
సినిమా, టీవీ, నాటక రంగముల వారికి ఈ సంవత్సరం మంచి పేరు ప్రఖ్యాతలు విజయాలతో కూడుకొని ఉండును. నూతన నటీనటులకు, గాయకులకు మంచి సమయం. ఖర్చు పెరిగినప్పటికీ ఆదాయం బాగుండటం వల్ల ఇబ్బంది ఉండదు. అవార్డులు కూడా అందుకునే అవకాశం ఉంది.
విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలే ఉన్నాయి. మంచి ఉత్తీర్ణత శాతం. మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది. ఎంట్రాన్స్ పరీక్షలు రాయువారికి కోరుకున్న చోట మంచి సీటు లభించగలదు. విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి.
ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా, రెండో పంట బాగా పండి మంచి ధనలాభం పొందుదురు. పూర్వపు బాకీలు తీర్చేస్తారు. కౌలుదారులకు కూడా మంచి సమయం. చేపలు, రొయ్యలు, పౌల్డ్రీ రంగములు కూడా అభివృద్దికరంగానే ఉండును.
ఈ సంవత్సరం వీరు, కుజునికి, శనికి శాంతి చేయించినా శుభం. శని యంత్రం ధరించుట శుభము.









Leave a Reply
You must be logged in to post a comment.